మనం చేసే ప్రయాణాల్లో ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపాన వస్తాయో గ్రహించడం కష్టమే. అయితే కొందరు ఈ ప్రమాదాల బారిన పడగా.. మరికొందరు మాత్రం తృటిలో వీటి నుంచి తప్పించుకుని హమ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకుంటారు. ఇటీవల ఓ ప్రయాణీకులతో నిండుగా ఉన్న బస్సు వైపు ఏనుగు కోపంగా దూసుకువస్తుంది అయితే చివరికి ప్యాసింజర్లకు హానికలిగించకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. మనం జంతువులను హాని కలిగించకపోతే అవి కూడా మనకు ఎటువంటి హాని కలిగించవు. ఈ విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మాటను రుజువు చేసిందో ఘటన. ఓ వీడియోలో బస్ నిండుగా ప్రయాణికులతో రోడ్డుపై వెళ్తుంటుంది. అడవి ప్రాంతంలోకి వెళ్లగానే అకస్మాత్తుగా రోడ్డు పై ఓ ఏనుగు కనిపిస్తుంది. డ్రైవర్ కంగారు పడక... బస్సును రోడ్డు పక్కకు ఆపుతాడు.
అంతలో ఆ ఏనుగు కోపంగా బస్సు వైపు దూసుకువచ్చింది. దీంతో బస్సులోని ప్రయాణికులంతా ఇదే చివరి రోజని అనుకుంటున్నారు. అయితే అదృష్టవశాత్తు ఆ ఏనుగు బస్సుకు లేదా ప్రయాణీకులకు ఎలాంటి హాని తలపెట్టకుండా వెళ్లడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఏనుగు తమ పక్క నుంచి వెళుతుండగా బస్ డ్రైవర్‌తో పాటు ప్రయాణీకులు మౌనంగా ఉంటూ దాన్ని ప్రశాంతంగా వెళ్లనిచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. భయపడకండి.. ఆ ఏనుగు బస్‌లో ప్రయాణీకులను చెక్ చేయడానికి వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు.
When the tusker decided to check out passengers in the bus, everyone led by the bus driver displayed nerves of steel, a great sense of calm and understanding and everything went off well. Video - in Karnataka. Shared by a friend. #coexistence #peopleforelephants pic.twitter.com/OJG4uPRvoi
— Supriya Sahu IAS (@supriyasahuias) July 24, 2023
Comments
Please login to add a commentAdd a comment