అస్సాం వృద్ధుడు రాజమహేంద్రవరంలో అదృశ్యం
అస్సాం వృద్ధుడు రాజమహేంద్రవరంలో అదృశ్యం
Published Wed, Jul 27 2016 12:54 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
ఆచూకీ తెలిపిన వారికి రూ. 50 వేల బహుమతి
రాజమహేంద్రవరం క్రైం :
అస్సాంకు చెందిన గురుదర్‌దాస్ అనే వృద్ధుడు రాజమహేంద్రవరంలో రైలు నుంచి దిగి అదృశ్యమయ్యాడని అతడి కుమారుడు ప్రతాప్‌దాస్ తెలిపాడు. ఆ వృద్ధుడు మానసిక వైద్యం కోసం భార్య, ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్ బయలుదేరాడు. అస్సాం నుంచి హౌరా చేరుకున్న వారు అక్కడి నుంచి గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు పయనమయ్యారు. ట్రెయిన్ ఈ నెల 22న రాజమహేంద్రవరం రైల్వేస్టేçÙన్ చేరుకున్నాక, తాను టాయిలెట్‌కు వెళతానంటూ గురుదర్‌దాస్ రైలు నుంచి కిందకు దిగాడు. ఎంతకీ రాకపోవడంతో 10 నిముషాల అనంతరం తామిద్దరం రైలు దిగి చూడగా తండ్రి ఆచూకీ లభించలేదని ఇద్దరు కుమారులు తెలిపారు. తమ తండ్రి వయస్సు 68 సంవత్సరాలని, చామన ఛాయ రంగులో 5.2 అడుగుల ఎత్తు ఉంటాడని వారు తెలిపారు. అదృశ్యమైన రోజు క్రీమ్ కలర్ పంజాబీ, వైట్ దోటీ ధరించాడని వివరించారు. బెంగాలీ భాష మాట్లాడతాడని పేర్కొన్నారు. తమ తండ్రి ఆచూకీ తెలిసిన వారు సెల్ నంబర్లు 09401561412, 09401918476, 09435898626, 09401203138, వీటితో పాటు జీఆర్‌పీ సీఐ 09440627551 నంబరుకు సమాచారం అందించాలని కోరారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల బహుమతి ఇస్తామని పేర్కొన్నారు.
Advertisement
Advertisement