అనంతగిరి: విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని సరియా వాటర్‌ఫాల్స్‌లో ఇద్దరు యువకులు ఆదివారం గల్లంతయ్యారు. ఈ సంఘటన అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. గాజువాక ప్రాంతానికి చెందిన పది మంది విహారయాత్రలో భాగంగా సరియా వాటర్ ఫాల్స్‌కు వెళ్లారు.
జలకాలాడేందుకు దిగగా ఇద్దరు గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.