ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు దుర్మరణం, స్నేహితుడిని కాపాడబోయి | Australia Two Telugu students drown at Millaa Millaa Falls | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు దుర్మరణం, స్నేహితుడిని కాపాడబోయి

Published Thu, Jul 18 2024 12:40 PM | Last Updated on Thu, Jul 18 2024 2:32 PM

Australia Two Telugu students drown at Millaa Millaa Falls

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది.  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు  ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. కెయిర్న్స్ సమీపంలోని ప్రముఖ స్విమ్మింగ్ స్పాట్‌ మిల్లా మిల్లా జలపాతం వద్ద ఘటన జరిగింది.

బాధితులను బాపట్ల జిల్లాకు చెందిన చైతన్య ముప్పరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన సూర్యతేజ బొబ్బగా గుర్తించారు. వీరిద్దరూ మరో స్నేహితుడితో కలిసి  ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుతున్నారు.  ముగ్గురూ మంగళవారం మిల్లా మిల్ వాటర్ ఫాల్స్ చూసేందుకు స్నేహితుడితో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో కాలుజారి ఒకరు జలపాతంలో పడిపోవడంతో మునిగిపోతున్న స్నేహితుడిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితుడు ఒడ్డుకు చేరుకున్నాడు. చైతన్య, సూర్యతేజ  అకాల మరణం వారి కుటుంబాల్లో పెను విషాదం నింపింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement