ఖమ్మం: ఖమ్మం జిల్లాలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు ప్రమాదం త్రుటిలో తప్పింది. కొత్తగూడెం డిపోకు చెందిన బస్సు ఉదయం 6.30 గంటలకు ఇల్లెందు వెళ్లేందుకు బయలుదేరింది.
టేకులపల్లి మండలం బేతంపూజీ సమీపంలో బస్సుకు ఎదురుగా పశువులు అడ్డు వచ్చాయి. వాటిని తప్పించబోయే క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ వెంటనే బ్రేకులు వేయటంతో పెను ప్రమాదమే తప్పింది. బస్సులోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు.