శుక్రవారం కిడ్నాప్‌కు గురైన వైద్య విద్యార్థిని సుస్మిత క్షేమంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఒక దేవాలయంలో తాను ఉన్నట్లు శనివారం ఉదయం తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. తాను ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు సమాచారం అందించింది. అయితే, శుక్రవారం రాత్రి అదే విద్యార్థిని తన స్నేహితురాలు సాధనరెడ్డికి ప్రమాదంలో ఉన్నానని, తనను ఎవరో కిడ్నాప్ చేశారని మెసేజ్ చేసిన విషయం తెలిసిందే.