తూర్పుగోదావరి: కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామం పక్కనే ఉన్న సముద్రంలో స్నానానికి వెళ్లిన పిక్కి రాము(8) అనే బాలుడు గల్లంతయ్యాడు. బాలుడి కోసం గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు.