
తిరుపతి పాసింజర్‌కు తప్పిన ప్రమాదం
నిడదవోలు :నిడదవోలులో మంగళవారం వీచిన ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు నిప్పులు చెరిగాడు. సాయంత్రం ఈదురు గాలు లు, ఉరుములతో కూడిన వర్షం పడిం ది. ఈదురు గాలులకు రైల్వేస్టేషన్ సమీపంలోని దక్షిణ క్యాబిన్ వద్ద రైల్వే విద్యుత్ లైన్(ఓహెచ్‌ఈ)పై ప్రక్కనే ఉన్న కొబ్బరి చెట్టు పడిపోయింది. ఆ సమయంలో తిరుపతి-కాకినాడ పా సింజర్ నిడదవోలు స్టేషన్లోకి వస్తోంది. రైల్వే విద్యుత్ లైన్‌పై పడిన కొబ్బరి చెట్టును గమనించిన డ్రైవర్ అప్రమత్తపై వెంటనే రైలును నిలుపేశాడు.
దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్టేషన్ మేనేజర్ ఆకుల ప్రభాకరరావుకు డ్రైవర్ సమాచారం అందించగా ఆయన విజ యవాడలో రైల్వే పవర్ కంట్రోల్ విభాగం అధికారులకు విషయం చెప్పటంతో వారు విద్యుత్ నిలుపుదలకు అనుమతి ఇచ్చారు. రాజమండ్రి నుంచి ఓహెచ్‌ఈ సిబ్బంది నిడదవోలు వచ్చారు. రైల్వే విద్యుత్ లైనుకు సరఫరాను పావు గంట నిలిపివేసి విద్యుల్ లైన్‌పై పడిన కొబ్బరి చెట్టును తొలగించారు. ఈ ప్రమాదం కారణంగా తిరుపతి- కాకినాడ ప్యాసిం జర్‌ను సుమారు గంటపాటు నిడదవోలులో నిలిపివేయటంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విశాఖపట్నం వైపు వెళ్లే ఈస్టుకోస్టు ఎస్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లను రెండో లైన్ (ప్లాట్‌ఫాం రెండు) నుంచి పంపించారు.
భవనంపై పడిన తాటిచెట్టు
ఈదురు గాలులకు రైల్వే క్వార్టర్స్‌లో చెట్టు కూలిపోయి రొడ్డుపై పడింది. దీంతో ప్రయాణికలు ఇబ్బందులు పడ్డారు. జ్యోతి కాలనీలో పొలం గట్టున ఉన్న పెద్ద తాడిచెట్టు జవ్వాల కాంతమ్మకు చెందిన డాబాపై పడింది. డాబాకు ఆనుకుని ఉన్న మరుగుదొడ్డి కూలిపోయింది. ఆసమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈదురు గాలులకు అక్కడక్కడ విద్యుత్ తీగలు తెగి పడటంతో రెండు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.