
వైద్యవిద్యార్థిని సుస్మిత సురక్షితం
స్నేహితునితో వెళ్లిందని నిర్ధారణ
కడప అర్బన్: కడప రిమ్స్ హౌస్‌సర్జన్ కొత్తూరు సుస్మిత కిడ్నాప్ కాలేదని తేలింది. శుక్రవారం రాత్రి సుస్మిత కిడ్నాప్ అయ్యిందనే సమాచారంతో రిమ్స్ అధ్యాపకులు, సహచర విద్యార్థులు, పోలీసులు ఒక్కసారిగా ఉత్కంఠకు లోనయ్యారు. ఓఎస్‌డి రాహుల్‌దేవ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు గాలి స్తుండగా ఆమె క్షేమంగా ఉన్నదనే సమాచారం అందడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కడప శివార్లలోని రిమ్స్‌లో హౌస్‌సర్జన్ విద్యార్థులు సుస్మిత, సాధనారెడ్డిలు 19వ తేదీ రాత్రి 7 గంటలకు హాస్టల్ నుంచి అనుమతి తీసుకుని ఆటోలో నగరానికి వచ్చారు.
సుస్మితను బ్యూటీపార్లర్ వద్ద వదిలి సాధనారెడ్డి షాపింగ్ కోసం వెళ్లింది. గంట తర్వాత ఫోన్ చేయగా ఆటోలో ఎవరో తీసుకెళ్తున్నారని చె ప్పడంతో సాధనారెడ్డి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు బృం దాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టా యి.
ఈ నేపథ్యంలో స్నేహితుడు ఉదయ్‌తో కలిసి తాను హైదరాబాద్‌లో ఉన్నట్లు శనివారం ఉదయం 7 గంటలకు సుస్మిత తన తల్లిదండ్రులు, సోదరునికి ఫోన్ ద్వారా తెలిపింది. హైదరాబాద్ వెళ్లిన పోలీసు బృందం సుస్మిత, ఆమె తల్లిదండ్రులు, ఆమె స్నేహితుడు ఉదయ్‌తో కలిసి కడపకు బయలు దేరారు. సుస్మి త అతన్ని వివాహం చేసుకునేందుకు సాధనారెడ్డితో కలిసి ఈ నాటకానికి తెరతీసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.