
సాక్షి, సదాశివనగర్ : సంగారెడ్డి జిల్లా సదాశివనగర్ వద్ద సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్-2 డిపోకు చెందిన బస్సు-టాటా ఏస్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 15మంది ప్రయాణికులు గాయపడ్డారు. మృతులు పుల్కల గ్రామానికి చెందినవారు. సంఘటనా స్థలంలో ఓ మహిళ, పురుషుడు చనిపోగా, మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా అనుభవం లేని డ్రైవర్లు బస్సులు నడిపిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
తాత్కాలిక ఉద్యోగులతో ప్రభుత్వం బస్సులను నడిపిస్తున్నా.. అనుభవరాహిత్యం వల్ల పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో రెండు బస్సులు ఢీకొన్న సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అలాగే నల్లగొండ జిల్లాలో ఓ అద్దె బస్సు డ్రైవర్ ...అతివేగంగా ప్రయాణికుడి కాలుపై నుంచి బస్సు పోనించాడు. ఇక ఆదివారం హయత్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్తున హకీంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఓ కారు, బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి గాయాలు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment