700 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం!
తిరుపతి: కృష్ణాష్టమి వేడుకల్లో టీటీడీకి, హథిరాంజీ మఠానికి మధ్య మళ్లీ గొడవ మొదలైంది. 700 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న సంప్రదాయానికి టీటీడీ ఎగనామం పెట్టిందని మఠం వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణాష్టమి రోజు ఊరేగింపుగా వచ్చే ఉత్సవమూర్తులను మఠానికి తీసుకురావడం ఆనవాయితీ అని తెలిపారు. అయితే ఈ కృష్ణాష్టమి రోజున ఉత్సవమూర్తులను మఠానికి తీసుకెళ్లకుండానే టీటీడీ అధికారులు వెళ్లారని వారు తెలిపారు. ఈ సంఘటనపై కోర్టుకు వెళతామని మఠం వారు చెప్పారు.