తిరుపతిలోని సాగర్ హాస్పిటల్లో క్లిష్టమైన బెరియాట్రిక్ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు ఆస్పత్రి అధినేత, డాక్టర్ శశిశేఖర్ తెలిపారు. ఆయన చెప్పిన వివరాల మేరకు.. వైఎస్‌ఆర్ జిల్లా మైదుకూరుకు చెందిన షేక్ అబ్దుల్ గఫూర్(46) బెరి యాట్రిక్ వ్యాధికి గురయ్యాడు.
తిరుపతి కార్పొరేషన్: తిరుపతిలోని సాగర్ హాస్పిటల్లో క్లిష్టమైన బెరియాట్రిక్ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు ఆస్పత్రి అధినేత, డాక్టర్ శశిశేఖర్ తెలిపారు. ఆయన చెప్పిన వివరాల మేరకు.. వైఎస్‌ఆర్ జిల్లా మైదుకూరుకు చెందిన షేక్ అబ్దుల్ గఫూర్(46) బెరి యాట్రిక్ వ్యాధికి గురయ్యాడు.
బీపీ, షుగర్‌తో పాటు అధిక బరువు (ఉబకాయం)తో బాధపడుతున్నాడు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లినా రూ.లక్షల్లో ఫీజులు చెల్లించలేక వచ్చేశాడు. స్థానిక సాయిరాం వీధిలోని సాగర్ హాస్పిటల్లో ప్రముఖ లేపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శశి శేఖర్‌ను కలిశాడు. గఫూర్‌ను పరీక్షించిన డాక్టర్ అరుదైన శస్త్ర చికిత్స చేసేందుకు ముందుకొచ్చారు. ‘మిని గ్యాస్ట్రిక్స్ బైపాస్’ శస్త్రచికిత్స చేశారు. దీంతో బరువు 118 కేజీల నుంచి 100 కేజీల వరకు తగ్గిపోయాడు. షుగర్ 300 నుంచి 90కి, బీపీ సాధారణ స్థాయికి చేరుకుంది. రాయలసీమలోనే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయిలో ఈ తరహా శస్త్ర చికిత్స నిర్వహించడం ఇదే ప్రథమమని శశిశేఖర్ తెలిపా రు.