
సాక్షి, చిత్తూరు : తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ రెండు కీలక ప్రాజెక్టులను దక్కించుకుంది. వాటిలో ఒకటి పాడి పరిశ్రమ, రెండోది కోళ్లు, పక్షల ద్వారా సంభవించే వ్యాధుల మీద పరిశోధనలు. దేశంలో మొదటి సారిగా ఈ రెండు పరిశోధనలు జరుగుతున్నాయని ఎస్వీ వెటర్నరీ యూనివర్సీటీ వీసీ పద్మనాభ రెడ్డి వెల్లడించారు.
పాడి పరిశ్రమ పరిశోధనలో లండన్‌కు చెందిన రాయల్ వెటర్నరీ కళాశాల భాగస్వామ్యం ఉందన్నారు. పాల సేకరణ నుంచి పాల ఉత్పత్తుల వరకు సంక్రమించే వ్యాధుల మీద పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. మూడేళ్ల పాటు ఈ పరిశోధనలు జరుగుతాయని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తే దాదాపు మూడు కోట్ల రూపాయలు ఎస్వీ వెటర్నరీ వర్సీటీకి దక్కుతాయని పద్మనాభ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment