Dairy industry
-
పాలు అందరికీ అందుతున్నాయా?
అధికారిక డేటా ప్రకారం, దేశంలో పాల ఉత్పత్తి 2021–22లో 221 మిలియన్ టన్నులు. భారతదేశపు పాల ఉత్పత్తి మెజా రిటీ బర్రెల నుండి లభిస్తుండగా, ఆవు పాల వాటా పెరుగుతోంది. 2021 నాటికి ఆవు పాల వాటా 48.2%. 2019లో విడుదల చేసిన 20వ పశుగణన ప్రకారం, ఆవులు బర్రెలు, పాలు ఇచ్చేవి వట్టి పోయినవి కలిపి, దేశంలో మొత్తం పాడి పశువులు 12.57 కోట్లు. మునుపటి గణనమీద ఇది 6% పెరుగు దల. పాలు ఇచ్చే పశువుల సంఖ్య వేరుగా లేదు. వట్టి పోయిన పశువుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా? పశువుల సంఖ్యలో పెరుగుదల ఎట్లా సాధ్యం? ప్రభుత్వం ఇస్తున్న లెక్కలకూ, క్షేత్ర పరిస్థితికీ మధ్య తేడా ఉన్నది. పలుచనవుతున్న పాలుదేశంలోని 110 బిలియన్ డాలర్ల పాడి పరిశ్రమలో డెయిరీ సహకార సంఘాలు, ప్రైవేట్ సంస్థలు, ‘అమూల్’, ‘మదర్ డెయిరీ’ వంటి ప్రభుత్వ సంస్థలతో కూడిన సంఘటిత రంగం వాటా కేవలం 30 బిలియన్ డాలర్లు. ఇది 30 శాతం కంటే తక్కువ. భారతదేశంలోని పాల ఉత్పత్తిలో సగానికి పైగా ప్రాసెస్ అవుతున్నది. అంటే నెయ్యి వగైరా వాటికి లేదా ఇతర ఉత్పత్తులలో ఒక ముడి పదార్థంగా వాడతారు. మిగిలిన 48% పాలుగా అమ్ముతున్నారు. నిత్యం పాలు వాడే హోటళ్ళు, స్వీట్ దుకాణాలలో పన్నీర్ కొరకు కూడా డిమాండ్ పెరుగుతోంది. పెద్ద హోటళ్ళు వాళ్ళకు అవసరమైన పాలను అధిక ధరకు కొని, వినియోగ దారుల నుంచి వసూలు చేయగలవు. దరిమిలా చిన్న హోటళ్ళు, చాయ్ దుకాణాలకు అంతగా పాలు దొరక కపోవచ్చు. లేదా ఆ ధర వాళ్ళు పెట్టలేరు. ముడి పాల కొరకు ఉన్న ఇటువంటి పోటీ గురించి, అంతర్గత డిమాండ్ గురించి, ఆ యా వినియోగ వర్గాలు చెల్లిస్తున్న ధరల గురించి విశ్లేషణలు లేవు. పోటీ పడలేని వ్యక్తులు, రంగాలు అసంఘటిత రంగంలోనే ఎక్కువ. పర్యవసానంగా, చాయ్ దుకాణాల చాయ్‌లో పాల ‘శాతం’ తగ్గుతున్నది. కొన్ని ఉత్పత్తులలో పాలు పలుచన అవుతున్నాయి.చిన్న పిల్లల ఎదుగుదలకు ముడి పాలు అవస రమని వైద్యులు, పోషకాహార నిపుణులు నిత్యం వల్లెవేస్తున్న తరుణంలో ‘అందరికీ పాలు’ దొరకక పోవడం అన్యాయమే. పేద వాడికి పాలు అందక పోవడం మన ఆహార వ్యవస్థలో ఉన్న తీవ్ర లోపం. ఈ లోపాన్ని సరిదిద్దే ప్రభుత్వ చర్యలు కావాలి. ఒక ఊర్లో ఉత్పత్తి అవుతున్న పాలు, ఇతర ఉత్పత్తులు అక్కడే, లేదా ఆ ప్రాంతంలోనే వినియోగం అయ్యే పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి.దిగుమతులతో దెబ్బతినే జీవనోపాధిఅమెరికా సహా వివిధ దేశాల నుంచి ఏటా రూ. 200–300 కోట్ల విలువైన పాల ఉత్పత్తులను మన దేశం దిగుమతి చేసుకుంటోంది. 2020లో భారత ప్రభుత్వం 10,000 టన్నుల స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ను దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. 2023 జన వరిలో, దేశంలోకి పాలు, క్రీమ్ దిగుమతులు మునుపటి సంవత్సరం కంటే వెయ్యి శాతం పైగా పెరిగి 4.87 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ దిగుమతులు ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ వంటి దేశాల నుండి వచ్చాయి.పాల ఉత్పత్తుల దిగుమతులను సరళీకృతం చేయా లని భారత్ మీద ఐరోపా కమ్యూనిటీ, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నుంచి ఒత్తిడి ఉన్నది. డెయిరీ ఉత్పత్తుల దిగుమతుల మీద సుంకాలు తగ్గించాలని వాణిజ్య ఒప్పందాలలో భాగంగా చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో భారతదేశం నుండి డెయిరీ దిగుమతులకు నిబంధనలు పెట్టి రష్యా, యూరప్, మెక్సికో, చైనా అనుమతించడం లేదు. డెయిరీ దిగుమతులపై 60–70% సుంకం విధిస్తున్న అమెరికా, భారతదేశం విధించే 30–60% సుంకాలను తగ్గించాలని కోరుతున్నది. ఇంకొక వైపు అమెరికా తన డెయిరీ రంగానికి సంవత్సరానికి 28 బిలియన్ డాలర్ల సబ్సి డీలను ఇస్తుంది. పాలు, పాల ఉత్పత్తుల దిగుమతులు పెరిగితే లక్షలాది మంది భారత చిన్న, సూక్ష్మ పాడి రైతుల జీవనోపాధి ఆగమైపోతుంది అనే ఆందోళన నెలకొంది.విధానాలు అనుకూలమేనా?ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం వాటా 22%. జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇది 5%. దాదాపు 7 కోట్ల మంది పాడి రైతులు ఉన్నారు. పాడి పరిశ్రమ జీవనోపాధులను, వాతావరణ మార్పులను, కులం, మతాలను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది. వినియోగదారులు వివిధ రకాలగా పాలకు ధర చెల్లిస్తున్నారు. పంటల మాదిరే పాడి రైతుకు ఆ వినియోగం నుంచి వస్తున్న డబ్బులో ఎంత శాతం చేరుతున్నది అనే ప్రశ్న ఉన్నది. బర్రె మీద, ఆవుల మీద పెట్టాల్సిన ఖర్చుకు తగినట్టు ముడి పాలకు ధర లేదనీ, ఇంకా ఆదాయం సంగతి దేవుడెరుగు అనీ పాడి రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు అనేకం ఉన్నాయి. అందులో అనేకం చిన్న పాడి రైతులు అందుకోలేరు. భారత పాడిపరిశ్రమలో సరళీకృత విధానం చిన్న రైతులకు ముప్పు కలిగిస్తుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. పాడి రైతులకు భూమి దొరికే అవకాశం తగ్గిపోతున్నది. పట్టణాలలో, పట్టణ శివార్లలో భూమి ధరలకు రియల్ ఎస్టేట్ వలన రెక్కలు రావడం వల్ల చిన్న పాడి రైతు మనగలిగే పరి స్థితులు లేవు.సగటు రైతు ఆదాయం రూ. 7,000 అని ప్రభుత్వం అంటున్నది. పశుపోషణ ఉంటే అదనపు ఆదాయం వస్తుంది. దేశంలోని రైతులు తమ మొత్తం పశుపోషణ ఆదాయంలో దాదాపు 67% పాడి ద్వారా సంపా దిస్తున్నారు. ఇంకా అనేక రకాల ఉపయోగం పాడి పశువులతో ఉంది. పర్యావరణం వినాశనం అవుతున్న తరుణంలో పశువుల వైవిధ్యం, ఆహారం, సుస్థిర జీవనం మీద దృష్టి పెట్టడం ముఖ్యం. పుడమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పశు పోషణ ఇంకా సమస్యాత్మకంగా మారుతున్నది. హైబ్రిడ్ జాతులతో, పాశ్చాత్య పశు పోషణ పద్ధతుల వల్ల కాలుష్యం పెరుగుతున్నది. అనారోగ్య పశువుల సంఖ్య పెరుగు తున్నది. శుభ్రత పాటించని ఆధునిక డెయిరీల వల్ల పశువుల వ్యాధులు మానవులకు సంక్రమిస్తున్నాయి. పశువులకు సరైన ఆహారం, జీవనం లేని కారణంగా వాటి పాలలో కూడా పోషకాలు ఉండటం లేదు. విషాలు, రసాయనాలు, యాంటీ బయాటిక్స్ వాటికి ఇవ్వడం వలన, వాటి పాల ద్వారా అవి మనుషులకు చేరుతున్నాయి.పశుపోషణలో సంప్రదాయ విజ్ఞానం, నైపుణ్యానికి చాలా విలువ ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాడి పశువులను ప్రకృతి వనరుగా పరిగణించాలి. ఈ సూత్రం ఆధారంగా విధానం తీసుకురావాలి. పథకాలు వాటి సుస్థిరతకు, విస్తృతికి ఉపయోగపడే విధంగా రూప కల్పన చెయ్యాలి. స్థానిక పాడి రైతులను స్థానిక మార్కె ట్లతో అనుసంధానం చెయ్యాలి. పాలు, పాల ఉత్పత్తులు గ్రామాలలో ప్రథమంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. పాడి రైతులకు ప్రతి ఏటా చట్టబద్ధంగా కనీస మద్దతు ధరను ప్రకటించి, అమలు చెయ్యాలి. పాల సహకార సంఘాల సంఖ్యను పెంచాలి. కేంద్రీకృత పాల మార్కెటింగ్ వ్యవస్థకు ఇచ్చే సబ్సిడీలు స్థానిక సహకార సంస్థలకు ఇవ్వాలి. భూమి వినియోగ విధానం రూపొందించి అందులో గడ్డి మైదానాలకు స్థానం కల్పించాలి. పశుగ్రాసానికి, దాణాకు సంబంధించి శాస్త్రీయ నిర్ణయాలు తీసుకోవాలి. పాడి రైతులకు భూమి ఇవ్వాలి. లేదా భూమి ఉన్న రైతుకు పాడి పశువులను అందజెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డివ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
యువత సంకల్పం అత్యంత బలమైంది
తిరుపతి ఎడ్యుకేషన్: నేటి యువతే రేపటి దేశం. యువతకు మించిన గొప్ప శక్తి లేదు. యువత సంకల్పం అన్నింటి కన్నా బలమైనదని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (ఎస్వీ వెటర్నిటీ వర్సిటీ) 12వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. చాన్సలర్ హోదాలో గవర్నర్ హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఆ యువత సరైన దిశలో గమ్యం వైపు పయనిస్తే బలమైన భారత్‌గా ఎదుగుతుందన్నారు.పశుపోషణ, పాడి పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పాల ఉత్పత్తిని పెంచడంలో, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. అమూల్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుని గ్రామీణ మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శ్రీవారి నైవేద్యాలకు, భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీతో పాటు అన్ని అవసరాలకు సేంద్రియ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయడం శుభసూచకమన్నారు. రైతులు సహజసిద్ధమైన ప్రకృతి వ్యవసాయాన్ని అవలంభించేలా వారిని ప్రోత్సహించేందుకు ఎద్దులు, ఆవులను విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే దేశీయ గోజాతులను రక్షించేందుకు టీటీడీ తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు.గురువుల మార్గనిర్దేశంలో క్రమశిక్షణతో విద్యనభ్యసించిన వెటర్నరీ విద్యార్థులు పశువైద్య నీతి సూత్రాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ దేశం గర్వించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఎస్వీ వెటర్నరి వర్సిటీ దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఏడాదికి ప్రకటించిన ర్యాంకింగ్‌లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుని 31వ స్థానంలో నిలవడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలను అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు 35 బంగారు పతకాలు, రెండు రజతం, ఒకరికి నగదు బహుమతిని అందించారు. కేరళ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎంఆర్ శశీంద్రనాథ్, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అరుణాచలం రవి పాల్గొన్నారు. -
ఆవు తల్లితో సమానం
వారణాసి: ఆవులు, గేదెలపై జోకులేస్తూ విపక్ష పార్టీలు.. పశుసంపదపై ఆధారపడ్డ ఎనిమిది కోట్ల మంది ప్రజానీకాన్ని అవమానపరుస్తున్నాయని ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన వారణాసిలో పాడి పరిశ్రమ సహా రూ.2,095 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తర్వాత జరిగిన బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగించారు. ‘ గోమాత మనకు మాతృ సమానురాలు. దేశానికే గర్వకారణమైన పశుసంపద(ఆవులు, గేదెలు..)పై ఆధారపడి దాదాపు ఎనిమిది కోట్ల జనాభా జీవనం కొనసాగిస్తోందనే విషయాన్ని విపక్షాలు మరిచాయి. ఆవులు, గేదెలు, ఆవు పేడపై జోకులేస్తూ విపక్ష పార్టీలు పాపం మూటగట్టుకుంటున్నాయి. వారు ఆవులపై ఎగతాళిగా మాట్లాడతారు. కానీ, మనకు గోమాత పూజనీయం’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘సమాజ్‌వాదీ పార్టీ పదకోశంలో మాఫియావాదీ, పరివార్‌వాదీ అనే పదాలుంటాయి. కానీ, మా డిక్షనరీలో ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ లాంటివే ఉంటాయి. కులం, మతం, వర్గం దృక్కోణంలోనే ఆలోచిస్తారు తప్ప ఉత్తరప్రదేశ్ అభివృద్ధి వారికి పట్టదు’ అని విమర్శించారు. ‘భావితరాల పరిరక్షణకు మళ్లీ సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంభించాల్సిందే’ అని మోదీ అన్నారు. గత పది రోజుల వ్యవధిలో మోదీ తన సొంత పార్లమెంట్ స్థానం వారణాసిలో పర్యటించడం ఇది రెండోసారి. కర్ఖియాన్‌లో నిర్మించే భారీ డైరీ ప్రాజెక్టు ‘బనాస్ డైరీ శంకుల్’కు మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. రూ.475 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసే ఈ డైరీ ప్రాజెక్టు ద్వారా రోజుకు 5 లక్షల లీటర్ల పాల దిగుబడి సాధ్యంకానుంది. -
ఇది ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల అదృష్టం
సాక్షి, అమరావతి: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా పాడి పరిశ్రమ సామర్థ్యాన్ని సరిగ్గా గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీలో సీఎంగా ఉండటం అక్కడి పాడి రైతుల అదృష్టమని అమూల్ ఎండి ఆర్ఎస్ సోధి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న పాలవెల్లువలో భాగంగా ఏపీ– అమూల్ పాలసేకరణను శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ పాడి రైతుల కష్టాలను స్వయంగా గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా అమూల్‌ను ఆహ్వానించడం సంతోషకరమని అన్నారు. భారతదేశంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఐదో స్థానంలో గుజరాత్ ఉందని వివరించారు. ఏపిలో రోజుకు 4.12 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని, వీటి విలువ ఏడాదికి రూ.7 వేల కోట్లు అని చెప్పారు. గుజరాత్లో ఏ విధంగా అమూల్ వల్ల పాడి రైతులకు మేలు జరిగిందో, ఏపీలో అలాగే మేలు జరుగుతోందని అన్నారు. అమూల్‌కు లాభాలు ముఖ్యం కాదు అమూల్ సంస్థకు రైతులే నిజమైన యజమానులని, ఇతర కార్పొరేట్, మల్టీనేషన్ కంపెనీల మాదిరిగా లాభాలను మాత్రమే ఆర్జించడం అమూల్ లక్ష్యం కాదని సోధి అన్నారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో అన్ని జిల్లాల్లోనూ మహిళా రైతుల భాగస్వామ్యంతో సహకార వ్యవస్థ ద్వారా పాల సేకరణ జరుగుతుందని వివరించారు. నాణ్యమైన పాలు, ఇతర ఉత్పత్తులను మార్కెట్లో ప్రజలకు చేరువ చేస్తామని చెప్పారు. ఇందుకోసం అమూల్ ఈ రంగంలో ఉన్న నైపుణ్యాలను రైతులకు పంచుతుందని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో నాణ్యమైన పాలు ఉత్పత్తి అవుతాయని, మార్కెట్లో ఈ పాలకు మంచి ఆదరణ ఉంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో పాడి రైతుల సహకార సంస్థ చేతుల్లోనే యాబై శాతం మార్కెట్ ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పాడి రైతుల కళ్లలో ఆనందం మహిళా రైతులు మాట్లాడిన భాష నాకు తెలియకపోయినా, వారి ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ ప్రారంభించాం. దేశంలోనే అమూల్‌కు ప్రజల్లో మంచి గుర్తింపు రావడానికి కారణం అమూల్ కొనసాగిస్తున్న నాణ్యతా ప్రమాణాలు. అలాగే పాడి రైతులకు మరింత మేలు చేయాలన్న లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాడిరైతులతో కలిసి అమూల్ నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు అందిస్తుంది. అమూల్ తో కలిసి పని చేసే రైతులకు ఎక్కువ లబ్ధి చేకూర్చడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. – పటేల్, సబర్ డెయిరీ ఎండీ -
వడివడిగా ‘అమూల్’ అడుగులు
సాక్షి, అమరావతి: అమూల్ (ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్) తన కార్యకలాపాలను మన రాష్ట్రంలోనూ ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మూడు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న ఆ సంస్థ గుజరాత్ నుంచి ఇక్కడి సహకార శాఖ అధికారులకు ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్ధితులను అధ్యయనం చేసి తొలిగా కంకిపాడు, ఒంగోలులో డెయిరీ ప్లాంట్లను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. రైతులకు మంచి ధర, ఆన్లైన్లో చెల్లింపులు, పశువులకు నాణ్యమైన మేత, చికిత్స అందించేలా వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయం తీసుకుంది. రైతు పరిస్థితులు గుర్తించి.. అమూల్‌కు చెందిన సాంకేతిక బృందం సోమవారం నుంచి శనివారం వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పాడి పరిశ్రమ స్థితిగతులను అధ్యయనం చేసింది. ఈ బృందంలో అమూల్ జీఎం హిమాన్షు పి.రాథోడ్, పశు వైద్యులు, పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ విభాగాలకు చెందిన 22 మంది నిపుణులు ఉన్నారు. వీరు మూడు బృందాలుగా ఏర్పడి.. మొదటి బృందం సాంకేతిక పరిస్థితులు, రెండో బృందం పాల సేకరణ, ధరలు, మూడో బృందం మార్కెటింగ్ పరిస్థితులను అధ్యయనం చేసింది. సహకార డెయిరీ ప్లాంట్లలోని యంత్ర పరికరాలు, వాటి సామర్థ్యం, అక్కడి పరిస్థితులను పరిశీలించింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సహకార డెయిరీ, కంకిపాడులోని డెయిరీ ప్లాంట్లను వెంటనే వినియోగించుకునే అవకాశాలు ఉండటంతో తొలిగా వాటిల్లో కార్యక్రమాలు ప్రారంభించాలని నిర్ణయించింది. కృష్ణాజిల్లా కంకిపాడులోని డెయిరీ ప్లాంట్ నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సులభంగా రవాణా చేసే అవకాశాలు ఉన్నాయని గుర్తించి దీనిని వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చింది. పాడి పరిశ్రమకు మంచి రోజులు రాష్ట్రంలోని పాడి పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయి. అమూల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఆ సంస్థకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పాలను విక్రయించే మహిళా సభ్యులకు మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. నగదు చెల్లింపులు, పశువులకు నాణ్యమైన దాణా, వైద్యం అందించడానికి అనువుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. – వాణీమోహన్, ఎండీ, పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య -
ఎస్వీ వెటర్నరీ వర్సిటీకి కీలక ప్రాజెక్టులు
సాక్షి, చిత్తూరు : తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ రెండు కీలక ప్రాజెక్టులను దక్కించుకుంది. వాటిలో ఒకటి పాడి పరిశ్రమ, రెండోది కోళ్లు, పక్షల ద్వారా సంభవించే వ్యాధుల మీద పరిశోధనలు. దేశంలో మొదటి సారిగా ఈ రెండు పరిశోధనలు జరుగుతున్నాయని ఎస్వీ వెటర్నరీ యూనివర్సీటీ వీసీ పద్మనాభ రెడ్డి వెల్లడించారు. పాడి పరిశ్రమ పరిశోధనలో లండన్‌కు చెందిన రాయల్ వెటర్నరీ కళాశాల భాగస్వామ్యం ఉందన్నారు. పాల సేకరణ నుంచి పాల ఉత్పత్తుల వరకు సంక్రమించే వ్యాధుల మీద పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. మూడేళ్ల పాటు ఈ పరిశోధనలు జరుగుతాయని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తే దాదాపు మూడు కోట్ల రూపాయలు ఎస్వీ వెటర్నరీ వర్సీటీకి దక్కుతాయని పద్మనాభ రెడ్డి తెలిపారు. -
పాడికి చేయూత
పాల్వంచరూరల్: కరోనా సంక్షోభం నుంచి పాడి పరిశ్రమను ఆదుకునేందుకే పాడి రైతులకు కేంద్ర ప్రభుత్వం అత్మ నిర్భర్ భారత్ పథకం ద్వారా రుణాలు అందిస్తోంది. ఈ రుణాల కోసం జిల్లా వ్యాప్తంగా 2,308 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో రైతుకు రూ.1.60 లక్షల చొప్పున రుణాలు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న విజయ డెయిరీలో పాలు పోసే రైతులు మాత్రమే ఈ రుణాలకు అర్హులు. లబ్ధిదారులకు రుణాలు అందేలా పశుసంవర్థక శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం అందిన రైతులు మేలు జాతి పశువుల కొనుగోలుతో పాటు దాణా, గడ్డి కోత యంత్రం తదితర అవసరాలకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి పూచీకత్తు లేకుండానే రుణాలు మంజూరు చేసే అధికారం బ్యాంకర్లకు ఉంది. ఈ రుణాలు ఏడాది లోపు చెల్లిస్తే మూడు నుంచి నాలుగు శాతం మాత్రమే వడ్డీ పడుతుందని, ఆలస్యం అయితే 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకర్లు చెబుతున్నారు. మండలాల వారీగా దరఖాస్తులిలా.. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం జిల్లాలోని ఆయా మండలాల నుంచి రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో దమ్మపేట మండలం నుంచి 341, దుమ్ముగూడెం నుంచి 16 మంది, గుండాల నుంచి 15, సుజాతనగర్ నుంచి 558, జూలూరుపాడు నుంచి 52, మణుగూరు నుంచి 13, ములకలపల్లి నుంచి 255, పాల్వంచ నుంచి 88, టేకులపల్లి నుంచి 3, ఇల్లెందు నుంచి 75, అన్నపురెడ్డిపల్లి నుంచి 312, చండ్రుగొండ నుంచి 25, చుంచుపల్లి నుంచి 85, అశ్వాపురం నుంచి 103, భద్రాచలం నుంచి 29, బూర్గంపాడు మండలం నుంచి 306 మంది, అశ్వారావుపేట నుంచి 32 మంది, దరఖాస్తు చేసుకున్నారు. ఏ బ్యాంకులో ఎంత మందికి.. పాడి రైతులకు ఇచ్చే రుణాల టార్గెట్‌ను బ్యాంకుల వారీగా విభజించారు. ఇందులో ఎస్బీఐ 864 మందికి, ఏపీజీవీబీ 716, యూనియన్ బ్యాంక్ 349, విజయబ్యాంక్ 219, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 14, డీసీసీ బ్యాంకు 130, సిండికేట్ బ్యాంకు 6, భద్రాద్రి బ్యాంక్ 3, ఐఓబీ 3, బ్యాంక్ ఆఫ్ బరోడా1, హెచ్డీఎఫ్సీ 1, ఐఓఎస్ బ్యాంక్ 1, కొటక్ బ్యాంకు ఒకరికి.. మొత్తం 2308 మందికి రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. పాడి రైతులు ఆర్థిక ప్రగతి సాధించవచ్చు పాడి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించింది. రుణాలు పొందిన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. జిల్లాలోని 13 బ్యాంకుల ద్వారా 2308 మంది లబ్ధిదారులకు రుణాలు ఇచ్చేలా టార్గెట్ విధించారు. మండలానికి 1000 మందిని ఎంపిక చేయాలని మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే జిల్లాలో బ్యాంకర్లు అందుకు అంగీకరించడం లేదు. – డాక్టర్ వేణుగోపాల్‌రావు, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి -
‘అమూల్’ శిక్షణా తరగతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాడిపరిశ్రమకు జవసత్వాలు కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్‌కు చెందిన అమూల్ (ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్)తో ఎంవోయూ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సంస్థ రాష్ట్రంలో తన కార్యక్రమాలను ప్రారంభించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తొలిదశలో 7వేల పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలను ఏర్పాటు చేయడానికి సహకార శాఖలోని డెప్యూటి రిజిస్ట్రార్లు, ఇతర ఉన్నతాధికారులను ఎంపిక చేసింది. వీరికి పాల ఉత్పత్తి, సేకరణ, మార్కెటింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు అమూల్ చర్యలు తీసుకుంటోంది. (ఇటు పాల వెల్లువ.. అటు మహిళా సాధికారత) ఎంపికైన అధికారులను రెండు, మూడు బృందాలుగా గుజరాత్‌లోని అమూల్ కేంద్రానికి శిక్షణకు పంపనుంది. పది నుంచి ఇరవై రోజులపాటు వీరంతా అక్కడ శిక్షణ పొందనున్నారు. అక్కడ శిక్షణ పొందిన అధికారులు ఒక్కో జిల్లాకు 15 పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలకు శిక్షణ ఇస్తారు. వీరంతా తమ పరిధిలోని మిగిలిన సభ్యులకు శిక్షణ ఇస్తారు. రెండు, మూడు నెలల వ్యవధిలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన 7వేల పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలకు శిక్షణ పూర్తి చేస్తారు. తొలుత శిక్షణ పొందిన 15 మహిళా సంఘాలకు ముఖాముఖి, మిగిలిన సభ్యులకు గుజరాత్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ నుంచి ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత అమూల్‌కు చెందిన ఉన్నతస్థాయి బృందం రాష్ట్రంలో పర్యటించి సహకార డెయిరీలు, ఉద్యోగులు, యాంత్రిక పరికరాలను పరిశీలిస్తుంది. రాష్ట్రంలోని పాడిపరిశ్రమ స్థితిగతులు, పశు సంపద, ప్రైవేట్ డెయిరీల కార్యక్రమాలను అధ్యయనం చేస్తుంది. భవిష్యత్‌లో చేపట్టనున్న కార్యక్రమాలపై వ్యూహరచనకు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించనుందని ఏపీ డీడీసీఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ వాణీమోహన్ తెలిపారు. -
పాడి పరిశ్రమకు మహర్దశ
రాష్ట్రంలోని పాడి రైతులకు మేలు జరగాలి. వారు ఉత్పత్తి చేస్తున్న పాలకు మంచి రేటు రావాలి. ధర విషయంలో రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండకూడదు. రైతులకు అదనపు ఆదాయాలు ఇవ్వాలి, మరోవైపు సహకార రంగం బలోపేతం కావాలి – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాడి పరిశ్రమకు మహర్దశ రానుంది. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందేలా, తద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక సహకార కంపెనీ ‘అమూల్’తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ఆ కంపెనీ అనుభవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, విస్తృతమైన మార్కెటింగ్‌ను వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రంలో సహకార రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు రైతులకు మంచి ధర వచ్చేలా చూడాలని ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధి, పాడి రైతుల సమస్యలు, పాల ఉత్పత్తులకు మంచి ధర కల్పించే అవకాశాలపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. జూలై 15లోగా అవగాహన ఒప్పందం.. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తిదారుల ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుపర్చడం, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించేలా, నాణ్యమైన పాల ఉత్పత్తులు జరిగేలా, వాటి ద్వారా రైతులకు సరైన ధర లభించేలా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు రూపొందించిన ప్రతిపాదనలను అధికారులు ఈ సందర్భంగా సీఎం ముందుంచారు. ► అమూల్‌తో జరిపిన చర్చలు, రాష్ట్రంలో పాడి పరిశ్రమపై ఆ కంపెనీ వెల్లడించిన విషయాలను వారు వివరించారు. పాల ఉత్పత్తుల రంగంలో దేశంలో అత్యుత్తమ సహకార సంస్థగా నిలిచిన అమూల్‌కు ఉన్న పేరు, సాంకేతిక పరిజ్ఞానం, విస్తృతమైన మార్కెటింగ్ రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతుందని, రైతులకూ మేలు జరుగుతుందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. సహకార చక్కెర ఫ్యాక్టరీలపై సమీక్ష.. ‘అమూల్’తో భాగస్వామ్యం ఎలా ఉండాలన్న దానిపై వారితో చర్చించి విధివిధానాలు ఖరారు చేయాలని,ఆ తర్వాత ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. జూలై 15లోగా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని అధికారులు.. సీఎంకు తెలిపారు. ► సహకార చక్కెర కర్మాగారాల్లో పరిస్థితులను అధికారులు ఈ సందర్భంగా సీఎంకి వివరించారు. పునరుద్ధరించాల్సిన కర్మాగారాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత మంత్రులు, అధికారులు కూర్చొని ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతిపాదనలు తయారయ్యాక.. మరోసారి దీనిపై కూర్చొని ఖరారు చేద్దామని ఆయన చెప్పారు. ► ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్ససత్యన్నారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. పాడి పరిశ్రమ రంగం పటిష్టం కావాలి: సీఎం ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పాడి పరిశ్రమలో అమూల్‌కు ఉన్న అనుభవం రాష్ట్రంలోని రైతులకు ఉపయోగపడాలని, పాడి పశువులకు వైద్యం, సంరక్షణ, నాణ్యమైన పాల ఉత్పత్తి, తద్వారా రైతులకు మంచి రేటు.. ఇలా అన్ని అంశాల్లోనూ పాడి పరిశ్రమ రంగం పటిష్టం కావాలని పేర్కొన్నారు. రైతుల్ని దోచుకునే పరిస్థితి ఎక్కడా ఉండకూడదన్నారు. అమూల్‌తో కలసి అడుగులు ముందుకేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
కరువు సీమలో.. పాలవెల్లువ
అనంతపురం రూరల్: ‘అనంత’ కరువుకు చిరునామా. తీవ్ర వర్షాభావంతో దుర్భిక్ష పరిస్థితుల్ని ఎదుర్కొన్న ప్రాంతం. ఏటా నష్టాలతో రైతులంతా కుదేలయ్యారు. చాలామంది పొట్టచేతబట్టుకుని వలస వెళ్లగా...అనంతపురం మండలం కట్టకిందపల్లి గ్రామ రైతులు మాత్రం ప్రత్యామ్నాయం ఆలోచించారు. పంటల సాగును పక్కనపెట్టి పాడిని నమ్ముకున్నారు. ఒకరిని చూసి మరొకరుగా ఊరంతా పశు పోషణపైనే ఆధారపడ్డారు. ఈ గ్రామంలో ప్రస్తుతం రోజుకు దాదాపు 5 వేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. అనంతపురం నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. గ్రామంలో దాదాపు 400 కుటుంబాలుండగా.. 1,300 మంది జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఏ ఇంట్లో చూసినా ఐదారు గేదెలు కనిపిస్తాయి. 353 కుటుంబాలు (90 శాతం మంది) ప్రత్యక్షంగా పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారి నుంచి పాలను సేకరించి నగరంలో విక్రయిస్తూ పరోక్షంగా పదుల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. అనంతపురం జిల్లా కట్టకిందపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు దంపతులు జనార్దనరెడ్డి, రాధ. గతంలో వ్యవసాయం చేసేవారు. తీవ్ర వర్షాభావం వల్ల పంట కోసం పెట్టిన పెట్టుబడులు సైతం రాక తీవ్ర అవస్థలు పడేవారు. ఈ పరిస్థితుల్లో పశువుల పెంపకంపై దృష్టి సారించారు. ఐదెకరాల పొలం ఉండటంతో ఎకరం విస్తీర్ణంలో గడ్డి పెంపకం చేపట్టి పశుపోషణ చేశారు. మొదట్లో ఒక గేదెతో ప్రారంభమైన వారి పాల వ్యాపారం.. ఇప్పుడు 8 గేదెలకు పెరిగింది. లీటరు పాలు రూ.50 చొప్పున రోజూ 70 లీటర్లు విక్రయిస్తున్నారు. ‘నెలకు దాదాపు రూ.లక్ష వరకు ఆదాయం వస్తోంది. ఖర్చులు పోను రూ.30 వేల వరకు మిగులుతోంది. పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాం’ అని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -జనార్దనరెడ్డి, రాధ మధుసూదన్‌రెడ్డి, రేణుక దంపతులు గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్ల ద్వారా నీరు రాక ఇదే గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డి, రేణుక దంపతులకు ఏం చేయాలో దిక్కుతోచలేదు. అప్పటికే గ్రామంలోని కొందరు పశు పోషణ చేపట్టి రాణిస్తుండటాన్ని చూసి వారూ అదే బాట పట్టారు. తొలుత 8 లీటర్ల పాలతో ప్రారంభమైన వారి వ్యాపారం నేడు 80 లీటర్లు విక్రయించే స్థాయికి చేరింది. ‘వ్యవసాయం చేస్తూనే పశు పోషణ చేపట్టి పాలను విక్రయిస్తున్నాం. పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటున్నాం’ అని మధుసూదన్‌రెడ్డి, రేణుక చెప్పారు. సహకార డెయిరీ ఏర్పాటుకు కృషి కట్టకిందిపల్లి రైతులను మరింత ప్రోత్సహించేందుకు స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. వరంగల్ జిల్లా ములకనూరు డెయిరీ తరహాలో రాప్తాడు నియోజకవర్గంలోను సహకార డెయిరీ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. త్వరలోనే సహకార డెయిరీ ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాల సభ్యులతో పాలను కొనుగోలు చేయించి పాలకు గిట్టుబాటు ధర కల్పించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పాడిపైనే ఆధారపడి జీవిస్తున్నాం పాడిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ప్రస్తుతం 5 గేదెలను పెంచుతున్నాం. పాలను విక్రయించి నెలకు రూ.30 వేల వరకు సంపాదిస్తున్నా. – గోపాల్‌రెడ్డి కట్టకిందపల్లి మా గ్రామంలోనే డెయిరీ ఏర్పాటు చేయాలి మా గ్రామంలోనే సహకార డెయిరీ ఏర్పాటు చేస్తే పాడి రైతులకు మేలు జరుగుతుంది. పశు వైద్యశాల నెలకొల్పడంతో దాణా పంపిణీ చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. – నాగలక్ష్మమ్మ, కట్టకిందపల్లి సహకారం అందిస్తాం పాడి రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలతో పాటు దాణా పంపిణీ చేయడానికి చర్యలు ప్రారంభించాం. గ్రామంలో పశు వైద్యశాల ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వం తీసుకెళతాం. – డాక్టర్ సన్యాసిరావు, జేడీ, పశు సంవర్ధక శాఖ -
నెత్తిన పాలు పోశారు..!
గతం అంధకారం ► చంద్రబాబు హయాంలో పతనావస్థలో డెయిరీలు ► 60వేల లీటర్ల నుంచి 4 వేల లీటర్లకు పడిపోయిన పాల సేకరణ ► ఐదేళ్లలో 33 బీఎంసీలు, 410 పాల సేకరణ కేంద్రాల మూత రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాడి రైతులకు చేయూత నిచ్చారు. లీటర్ పాలకు రూ.4 బోనస్ ప్రకటించి 2.90 లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. 5 వేల లీటర్ల సేకరణతో పతనావస్థకు చేరుకున్న ఏపీ డెయిరీకి జీవం పోశారు. కరువు జిల్లా ‘అనంత’లో క్షీర విప్లవానికి నాంది పలికారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని అసెంబ్లీ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారు. – అనంతపురం అగ్రికల్చర్ పాడి ఉన్న ఇంట సిరులు దొర్లునట. కవ్వమాడు ఇంట కరువే ఉండదట ఇది కంబదూరులోని ఏపీ డెయిరీ. గ్రామీణ ప్రాంత రైతులను పాడిపరిశ్రమలో ప్రోత్సహించేందుకు వైఎస్సార్ హయాంలో రూ.30లక్షలతో పాలశీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో చాలా మంది రైతులు కొత్తగా పాడిపరిశ్రమవైపు దృష్టి సారించారు. రోజూ 1500 లీటర్లకు పైగా పాలు డెయిరీకి వచ్చేవి. నిర్వహణ సరిగా లేకపోవడం.. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో 8 ఏళ్ల క్రితం డెయిరీ మూతపడింది. దీంతో రైతులు పాలను ఇతర ప్రాంతాలకు తీసుకుపోయి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ‘అనంత’.. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిన ప్రాంతం. తీవ్ర వర్షాభావంతో పంటలు పండక అప్పుల పాలవుతున్న రైతులు.. ప్రత్యామ్నాయంగా పాడితో కుటుంబాలను పోషించుకుంటున్నారు. అంతటి ప్రాధాన్యమున్న పాడి పరిశ్రమను గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ప్రైవేటును ప్రోత్సహిస్తూ ప్రభుత్వ డెయిరీకి పాడె కట్టారు. తన పాదయాత్రలో రైతుల కష్టాలు...ఏపీ డెయిరీ దుస్థితి స్వయంగా తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే పాడి రైతులుకు మేలు కలిగేలా లీటర్ పాలకు రూ.4 బోనస్ ఇస్తామని గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం ప్రకటన నేపథ్యంలో ఆరు నెలలకు రోజువారీ పాల సేకరణ 50 వేల లీటర్లు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీని వల్ల జిల్లా పాడి రైతులకు సంవత్సరానికి రూ.40 నుంచి రూ.50 కోట్లు మేర అదనపు ఆదాయం లభించనుందని అంచనా వేస్తున్నారు. వైఎస్సార్ హయాంలో పాల వెల్లువ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించారు. 50 శాతం రాయితీతో పశుక్రాంతి పథకం కింద మేలుజాతి ఆవులు, గేదెలు అందించి క్షీర విప్లవానికి నాంది పలికారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 42 బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లు (బీఎంసీ) పనిచేస్తుండగా... వాటి పరిధిలో 74 పాలరూట్లు, 540 వరకు పాల సేకరణ సెంటర్ల ద్వారా రోజుకు 70 వేల లీటర్లు పాల సేకరణ జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. సేకరించిన వేలాది లీటర్ల పాలను జిల్లాతో పాటు హైదరాబాద్‌కు రవాణా చేసి లాభాలబాట పట్టింది. కానీ... వైఎస్సార్ హఠాన్మరణం తర్వాత గద్దెనెక్కిన వారు పాడి పరిశ్రమను విస్మరించారు. ప్రోత్సాహకాన్ని సైతం క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. దీంతో రైతులు ప్రైవేట్‌ను డెయిరీలను ఆశ్రయించారు. ఫలితంగా ఏపీ డెయిరీ సంక్షోభంలో కూరుకుపోయింది. బాబు హయాంలో డెయిరీ పతనం చంద్రబాబు ప్రభుత్వం పాడిని రైతులను చిన్నచూపు చూసింది. ఇక అధికారుల అలసత్వం కారణంగా ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీ డెయిరీ) నష్టాల బాట పట్టింది. డెయిరీనే నమ్ముకున్న వేలాది మంది రైతులు హెరిటేట్, గాయత్రి, తిరుమల, దొడ్ల లాంటి ప్రైవేట్ డెయిరీల వైపునకు మళ్లారు. దీంతో డెయిరీకి పాలుపోసే రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోగా పాలసేకరణ కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో జిల్లాలోని 33 బీఎంసీలు, 56 పాలరూట్లు, 410 పాల సేకరణ కేంద్రాలు మూతబడ్డాయి. నష్టాల బాటే కానీ... ఇప్పుడు జిల్లాలో 9 బీఎంసీలు, 18 రూట్లు, 130 పాల సెంటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మడకశిర, గుడిబండ, అగళి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, రాయదుర్గంతో పాటు మరో రెండు కేంద్రాలు అరకొరగా పనిచేస్తున్నాయి. రోజువారీగా 750 మంది రైతుల నుంచి 5 వేల లీటర్ల మేర పాలు సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో నిర్వహణ భారం పెరిగిపోయి.. నెలకు రూ.10 లక్షలకు పైగా నష్టం వస్తున్నట్లు డెయిరీ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రోజువారీ పాల ఉత్పత్తి : 5 నుంచి 5.50 లక్షల లీటర్లు ప్రభుత్వ డెయిరీ పాల సామర్థ్యం : లక్ష లీటర్లు రోజూ ప్రభుత్వ డెయిరీకు వస్తున్న పాలు : 5 వేల లీటర్లు ప్రైవేట్ డెయిరీలు సేకరిస్తున్న పాలు : 1.90 లక్షల లీటర్లు చంద్రబాబు హయాంలో మూతబడిన కేంద్రాలు : 33 బీఎంసీలు, 401 పాలకేంద్రాలు లీటర్‌పై రూ.4 బోనస్ ఇస్తే కలిగే లాభం : రూ.50 కోట్లు (సంవత్సరానికి) చాలా సంతోషంగా ఉంది నేను అప్పులు చేసి మూడు పాడి ఆవులు కొన్నా. రోజూ 25 లీటర్ల పాలను ప్రభుత్వ డెయిరీకే పోస్తున్నా. గత ప్రభుత్వం పాలసేకరణ ధర తగ్గించడంతో నష్టపోయాను. పైగా చంద్రబాబు సర్కార్ పాడి రైతులకు బోనస్ కూడా ఇవ్వకపోవడంతో అప్పుల పాలయ్యాను. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే పాడి రైతులకు అండగా నిలిచారు. లీటర్ పాలకు రూ. 4 బోనస్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. దీంతో ఇటు పాడి రైతులతో పాటు పతనావస్థకు చేరిన ఏపీ డెయిరీకి మేలు జరుగుతుంది. – హనుమంతరెడ్డి, పాడి రైతు, గుడ్డంపల్లి,మడకశిర మండలం -
పాడి.. లాభాల దిగుబడి
ఉద్యోగస్తులమైతేనే అభివృద్ధి సాధ్యం అని చాలా మంది మహిళలు అనుకుంటారు... తమకు ఉద్యోగం చేసే పరిస్థితి లేదు కనుక.. ఇక జీవితం ఇంతే అని కొందరు భావిస్తుంటారు... అయితే చేయాలే గానీ ఎన్నో అవకాశాలు ఉన్నామని మరికొందరు నిరూపిస్తున్నారు... మూడో కోవకు చెందిన వారే మైలవరం మండల మహిళలు... పాడి పరిశ్రమను ఎంచుకుని కుటుంబాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్తున్నారు. మైలవరం : మండలంలోని మహిళలు ఆర్థిక స్వావలంబన కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారు. తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందడుగు వేస్తున్నారు. పాడి పరిశ్రమను ఎంపిక చేసుకొని తద్వారా లబ్ధి పొందుతున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. తమ జీవన మనుగడను అభివృద్ధి వైపు పయనింప చేయుటకు దాల్మియా సీయస్ఆర్, నాబార్డ్, ఏపీజీబీ దోహద పడుతున్నాయని వారు చెబుతున్నారు. దాదాపు 309 మంది మహిళలకు పాడి పరిశ్రమ ఏర్పాటు కోసం దాల్మియా సీయస్ఆర్.. బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించి పంపిణీ చేసింది. నవాబుపేట గ్రామానికి చెందిన 175 మంది మహిళలకు రూ.లక్ష చొప్పున, దుగ్గనపల్లి గ్రామంలోని 38 మందికి రూ.50 వేలు, తలమంచిపట్నంలోని 40 మందికి రూ.15 వేలు, చిన్నకొమెర్ల గ్రామానికి చెందిన 60 మందికి రూ.50 వేలు, పెద్దకొమెర్లలోని ఐదుగురికి 60 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. దీంతో మహిళలు పాడి గేదెలను కొని తద్వారా జీవన మనుగడ సాగిస్తున్నారు. ఇద్దరు పిల్లలను చదివిస్తున్నా పాడిగేదెలు పెట్టుకొని వచ్చే డబ్బుతో ఇద్దరు పిల్లలను చదివిస్తున్నా. దాల్మియా సీయస్ఆర్ సహకారంతో పాడి గేదెలను కొన్నాం. మేము బతుకుటకు ఓ దారిని చూపించిన దాల్మియా యాజమాన్యానికి ఎప్పు డూ రుణపడి ఉంటాం. మరికొన్ని రుణాలను ఇస్తే మరిన్ని గేదెలు కొని జీవనం సాగిస్తాం. – చీపాటి శాంతమ్మ, మహిళా రైతు, దుగ్గనపల్లె మహిళా సంఘాలుగా ఏర్పడ్డాం మా గ్రామంలో 34 మంది మహిళలం రైతు సంఘాలుగా ఏర్పడ్డాం. ఒక్కొక్క సంఘంలో ఐదుగురు మహిళా రైతులు ఉన్నారు. దాల్మియా సీయస్ఆర్ మహిళా సంఘాలకు పంపిణీ చేసిన ఆర్థిక సహకారంతో గేదెలను కొని తద్వారా జీవనం సాగిస్తున్నాం. – ఓబులమ్మ, మహిళా రైతు, నవాబుపేట జీవనోపాధుల పెంపుదలతోనే అభివృద్ధి ఆర్థిక సుస్థిరత్వం సాధించాలంటే జీవనోపాధుల పెంపుదల ద్వారానే సుసాధ్యం అవుతుంది. అందులో భాగంగానే దాల్మియా సీయస్ఆర్ ద్వారా మహిళలు, మహిళా సంఘాలకు పాడి పరిశ్రమలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాం. మహిళలు సంఘటితంగా పాడిపరిశ్రమ ఏర్పాటు కోసం సుముఖత చూపారు. ఆయా బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందేటట్లు కృషి చేశాం. భవిష్యత్తులో ఇంకొన్ని కార్యక్రమాలు చేపడుతాం. – రాజశేఖర్‌రాజు, దాల్మియా సీయస్ఆర్ విభాగాధిపతి -
రైతులు పీహెచ్‌డీలు చేయాలి
కుప్పం సభలో సీఎం చంద్రబాబు సాక్షి, చిత్తూరు: రైతులు, రైతు కూలీలు కూడా పీహెచ్‌డీలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘రైతులు, రైతు కూలీలు ముందు ఐదో తరగతి పరీక్ష రాయాలి... తర్వాత పదో తరగతి పరీక్ష రాయండి.. ఇంటర్మీడియట్, బీఏ, ఎమ్మే పరీక్షలు రాయాలి. మీరు చేసే పనిలోనే పీహెచ్‌డీలు చేయండి. పట్టు, పాడి పరిశ్రమలపై,, టమాటాపై పీహెచ్డీ చేయండి. దీనివల్ల మీకు నాలెడ్జ్ పెరుగుతుంది..’ అని సీఎం అన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో రెండోరోజు పర్యటనలో భాగంగా మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. పాడి పరిశ్రమకు, పండ్ల తోటలకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా ఇజ్రాయెల్ టెక్నాలజీని దేశానికి పరిచయం చేశానని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తర్వాతే గుజరాత్లో నరేంద్రమోదీ ఈ టెక్నాలజీతో అద్భుత ఫలితాలు సాధించారని చెప్పారు. నేను ఒక్క మాట చెబితే చాలు రాష్ట్రం అంతా ఫాలో (అనుసరిస్తోందని) అవుతోందని అన్నారు. 175 నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నానని, దీనిని ప్రజలందరూ గుర్తించాలని అన్నారు. నా తెలివితేటలు ఉపయోగించి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే నం.1 స్థానంలో నిలుపుతానని చెప్పారు. -
పాలడెయిరీ డీలర్లకూ తప్పని కరెన్సీ కష్టాలు
-
పాడి, మత్స్య పరిశ్రమల అభివృద్ధికి కృషి
► రైతులకు సకాలంలో పాల సేకరణ చెల్లింపులు, ఇన్సెంటివ్స్ ► జిల్లాలో 6 కోట్ల చేప పిల్లల పంపిణీ..ఫిష్ మార్కెట్ల ఏర్పాటు ► సమీక్ష సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ► సహకార సంఘాలకు భవనాలు : మంత్రి జూపల్లి మహబూబ్‌నగర్ వ్యవసాయం: రాష్ట్రంలో పాడి, మత్స్య పరిశ్రమల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, గతంలో ఎప్పుడూ లేనంతగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయిస్తూ పాడి, మత్స్య పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తోందని పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సోమవారం జెడ్పీ సమావేశమందిరంలో పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖ అధికారులు, కాపరులు, రైతులు, మత్స్యకారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. సకాలంలో డెయిరీ చెల్లింపులు.. కార్యక్రమంలో సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాల సేకరణ కేంద్రాలలో చెల్లింపులు, ఇన్సెంటివ్స్ను సకాలంలో అందజేస్తామని అన్నారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. 50 శాతం సబ్సిడీపై దాణాను పంపిణీ, ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 100 సంచార వైద్యశాలలు రానున్నయని, పశువైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ఎన్సీడీసీ పథకం కింద మూడో విడుత రూ.33 కోట్లను విడుదల చేస్తామన్నారు. గొర్రెల పెంపకానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 556,1016 జీఓలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని జెడ్పీసీఈ లక్ష్మినారాయణను ఆదేశించారు. అటవీశాఖ అధికారులతో మాట్లాడి అటవీశాఖ భూముల్లో గొర్రెలు మేపేందుకు అనుమతి ఇచ్చేలా చూడాలని సీఈఓను ఆదేశించారు.అనంతరం మత్స్యకారుల ఇబ్బందులపై మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు బాల్‌రాజు, నాయకులు సత్యయ్య మంత్రితో మాట్లాడారు. మంత్రి స్పందిస్తూ జిల్లాలో 6 కోట్ల చేప పిల్లల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తామని, చేపల మార్కెట్ల ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. వసూళ్లకు పాల్పడే గోపాలమిత్రల స్థానంలో కొత్తవారిని నియమిస్తామని హెచ్చరించారు. పాడి గణానాభివృద్ది సంస్థ అధికారు క్షేత్రస్థాయిలో పర్యటించాలని హెచ్చరించారు. సహకార సంఘాలకు భవనాలు.. అనంతరం రాష్ర్ట పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఉపాధి హామీలో పాడి, మత్స్య, గొర్రెల కాపారులు సహకార సంఘాల భవ నాన్ని నిర్మిస్తామని అన్నారు. కార్యక్రమంలో ప్ర ణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి,జెడ్పీ చెర్మైన్ బండారి భాస్కర్, ఎమ్మె ల్యేలు శ్రీనివాస్‌గౌడ్, అంజయ్యయాదవ్, రాజేందర్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ డెరైక్టరు వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, జేడీ ఎహెచ్ సుధాకర్, మత్స్యశాఖ ఏడీ ఖదీర్ అహ్మద్, మత్స్య జిల్లా సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ పర్సన్ ఇన్చార్జీ శ్రీనివాస్యావవ్తదితరులు పాల్గొన్నారు. -
పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి
లాలాపేట: రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన లాలాపేటలోని విజయ డెయిరీని సందర్శించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన స్టీమ్ బాయిలర్, గోడౌన్, సెంట్రల్ క్వాలిటీ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విజయ ఉత్పత్తులకు విశేష ఆదరణ ఉన్నందున మరిన్ని అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. పాడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పశుగ్రాసం కొరత లేకుండా చూస్తామన్నారు. ఇకపై సబ్‌కమిటీ మీటింగ్ డెయిరీలోనే నిర్వహిస్తామన్నారు. డెయిరీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎండీ నిర్మలను అభినందించారు -
కొత్త సవాళ్లు..
పత్యామ్నాయ ఉపాధిలో భాగంగా రైతులు పాడివైపు పరుగులు తీస్తున్నారు. ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం... ప్రభుత్వం ఇటీవలే విజయ డెయిరీ పాల ధరను లీటర్‌కు రూ.4 పెంచడం కూడా ఇందుకు ఊతమిస్తోంది. వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలవాల్సిన పశువైద్యం జిల్లాలో అధ్వానంగా మారింది. సిబ్బంది కొరతతో పలు కేంద్రాలు మూతపడ్డాయి. చాలాచోట్ల అటెండర్లే వైద్యం అందిస్తున్నారు. ఈ దశలో రైతులు కుంగిపోతున్నారు. ⇒ ‘మిల్క్ గ్రిడ్’కు సిబ్బంది కొరత ⇒ ఖాళీల భర్తీలో ఏళ్ల తరబడి నిర్లక్ష్యం ⇒ కునారిల్లుతున్న పశువైద్య కేంద్రాలు ⇒ చాలాచోట్ల అటెండర్లే దిక్కు ⇒ ఇప్పటికే కొన్ని మూత ⇒ పశువైద్యాన్ని మెరుగుపరిస్తేనే మేలు గజ్వేల్: వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం పాడి పోషణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించింది. విజయ డెయిరీ పాల ధరను లీటర్‌కు రూ.4కు పెంచడం, ‘మిల్క్‌గ్రిడ్’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టడం.. గజ్వేల్‌లో ఈ పథకానికి అంకురార్పణ జరగటంతో రైతుల్లో ఉత్సాహం రెట్టింపైంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలు కొరవడటం వారికి శాపంగా మారింది. మిల్క గ్రిడ్తోపాటు ఇతర పథకాల అవులుకు పశువైద్య కేంద్రాల్లో నెలకొన్న సవుస్యలు అవరోధంగా మారనున్నట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 106 పశువైద్యాధికారుల పోస్టులకు గాను ప్రస్తుతం 47 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 136 మంది డిప్లొమా హోల్డర్స్‌కు గాను 90 మంది, 236 మంది నాలుగో తరగతి ఉద్యోగులకు గాను 171 మందే పనిచేస్తున్నారు. ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి అంకురార్పణ జరిగిన గజ్వేల్ నియోజక వర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మొత్తం 12 మంది వైద్యాధికారులు పోస్టులకు గాను ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30 డిప్లొమా హోల్డర్స్‌కు గాను 18 పోస్టులు ఖాళీగా, 20 మంది నాలుగో తరగతి ఉద్యోగులకు 12 ఖాళీలున్నాయి. అధ్వానంగా కేంద్రాలు.. గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లితోపాటు మరికొన్ని పశువైద్య కేంద్రాలు మూతపడ్డాయి. నియోజక వర్గంలోని చాలా కేంద్రాలు అటెండర్లపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఈ దశలో ‘మిల్క్ గ్రిడ్’ ద్వారా విరివిగా పశువులను అందించి ‘పాలధారను’ పెంచాలనుకుంటుండగా రైతులు మాత్రం పశువైద్యంపై ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. ఇదిలావుంటే ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి కొత్త రూపు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రాబోతున్న పథకంలో దాణా, వైద్యం తదితర సౌకర్యాలు కల్పించనున్నామని రెండు రోజుల క్రితం గజ్వేల్‌లో పర్యటించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. -
మత్తులో పాడి
►పాడిపశువులకు దాణాగా బీరు వ్యర్థం ►పాలు పెరుగుతాయని దారుణం ►దుష్ఫలితాలకు అవకాశం ►మూగ జీవికి వేదన రోజుకు ఒక బంగారు గుడ్డు పెట్టే బాతును అత్యాశకు పోరుు చంపుకున్నట్లు... రాయచోటి ప్రాంతంలో కొందరు పశువులకు దాణాగా ప్రమాదకరమైన బీరు వ్యర్థాలను వాడుతున్నారు.. మూగజీవాలకు నరకం చూపెడుతున్నారు. కాసిన్ని పాల కోసం బీరు వ్యర్థాన్ని ఎరగా వాడి వాటి జీవిత కాలాన్ని హరిస్తున్నారు. పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోవడానికి కూడా కారణం అవుతున్నారు. కుటుంబ పోషణకు జీవితకాలం కొండంత అండగా నిలిచే పాడిపశువుల విలువ మరచి చేతులారా చంపుకుంటున్నారు. రాయచోటి టౌన్ : రాయచోటి పశు సంవర్ధ శాఖ పరిధిలో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ఎక్కువ. 25వేల మందికి పైగా పాడి రైతులు జీవనం సాగిస్తున్నారు. కొందరు స్వార్థపరులు చేసిన ప్రచార మాయలో పడిన రైతులు తమ జీవనాధారమైన పశువులకు విషపు దాణా పెడుతున్నారు. పాలు కొద్దిగా ఎక్కువ ఇస్తాయని ఆశపడి బీరుపొడిని తినిపించి తమకు తామే నష్టం కలుగజేసుకుంటున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దళారులు కాసులు పండించుకుంటున్నారు.40 కిలోల బరువున్న బీరు పొడిని రూ.330లకు పాడి రైతులకు అమ్ముతున్నారు. ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను బయటకు తీసుకెళ్లి పడేయాల్సిందిపోయి దాన్ని ఇలా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఊరి బయట వ్యాపారాలు ఈ బీరు పొడిని అధికారుల కళ్లు కప్పి అమ్మేస్తున్నారు. కేవలం పాడి రైతులకు మాత్రమే సమాచారం ఇచ్చి ఊరి పొలిమేర్లలోనే విక్రయిస్తున్నారు. అది కూడా గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడో తయారు చేసే వ్యర్థ పదార్థాలను తడి కూడా ఆరకుండా తీసుకొచ్చి రైతులకు కట్టబెడుతున్నారు. దాన్ని రైతులు తమ పాడి పశువులకు వేస్తున్నారు. ఆ పొడిని తడి ఆరక ముందే వేయడం వల్ల ప్రాంణాంతమనే విషయం వారికి తెలియడం లేదు. పచ్చిపొడితో ప్రాణాలకు ముప్పు పచ్చి పొడి(బీరు వ్యర్థం)లో కొన్ని రకాల ప్రాణాంతాక సూక్ష్మజీవులు నిల్వచేరతాయని, కంటికి కనిపించని ఫంగస్ తయారై అది పశువు కడులోకి చేరి జీర్ణవ్యవస్థపై దుష్ర్పభావం చూపిస్తుందని పశువైద్యాధికారులు అంటున్నారు. ఈ మత్తు పదార్థం తినడం వల్ల తాత్కాలికంగా పాలు ఎక్కువ ఇచ్చినా... ఉత్పత్తి త్వరగా తగ్గిపోతుందని పేర్కొంటున్నారు. అసాధారణంగా అధిక పాలను ఇవ్వడం వల్ల తన శరీరంలోని శక్తిని త్వరగా కల్పోయి పునరుత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతుంది. రెండు ఈతలు తరువాత చూడి నిలబడదని, ఒక వేళ చూడి నిలబడినా ఈనేలోపు దూడ మృతి చెందడమో... లేక మధ్యలో ఈసుకపోవడమో సంభవిస్తుందని సూచిస్తున్నారు. 15-16 సంవత్సరాలు జీవించాల్సిన పాడి పశువు కేవలం 7-8 సంవత్సరాలకే మరణిస్తారుు. పాడి పశువు జీవిత కాలంలో 8-10 దూడలను ఇచ్చే సామర్థ్యం నుంచి కేవలం రెండు లేదా మూడిటికే పరిమితమవుతుంది. బీరు పొడి తినిపిస్తే పశువుకు ప్రమాదం కడప అగ్రికల్చర్ : పశువులకు బీరు తయారు చేయగా వచ్చే వ్యర్థ పదార్థాన్ని రాయచోటి డివిజన్లో కొందరు అమ్ముతున్నారు. దాన్ని పశువులకు ఆహారంగా వాడితే దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలుతాయి. తడిగా ఉన్నది పెడితే మరింత ప్రమాదం. జీర్ణకోశ వ్యాధులు సంక్రమించి పశువు ఆయుస్సు తగ్గిపోయి మరణిస్తుంది. పాలు కూడా నాణ్యత కోల్పోయి దుర్గంధం వస్తాయి. అమ్మకానికి ఈ పాలు పనికి రాకుండా పోయే ప్రమాదముంది. పాడి పశువులకు ప్రకృతి సిద్ధమైన గడ్డి పోషక విలువున్న ఆహార పదార్థాలను మాత్రమే ఇవ్వాలి. - హేమంత్‌కుమార్, అసిస్టెంట్ డెరైక్టర్, జిల్లా పశుగణాభివృద్ధి శాఖ -
మేకలు బంధువుల ఇళ్లకు వెళ్లాయట!
రేగోడ్: పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు సర్కార్ ఇందిరాక్రాంతి పథం కింద అర్హులైన వారికి లక్షల రూపాయలు విడుదల చేసి మేకలు, బర్రెలను కొనుగోలు చేసుకోవాలని సూచిస్తే, అర్హులంతా తాము బర్రెలు, మేకలు కొనుగోలు చేశామని సర్కార్‌కు నివేదించారు. కానీ ఆడిటింగ్ అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లినప్పడు మాత్రం ఆ పశువులు కనిపించలేదు. పశువులు ఏమయ్యాయని ప్రశ్నిస్తే మా బంధువుల ఇళ్లకు వెళ్లాయనే సమాధానం చెప్పారని అధికారులు ప్రజాదర్బార్‌లో వివరించారు. శనివారం ఎంపీపీ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజాదర్బార్‌లో డీఆర్పీలు ఇలాంటి వింత కథలెన్నో వినిపించారు. 2009-10 సంవత్సరంలో వాటర్‌షెడ్ పథకంలో మంజూరైన రూ.6 కోట్లలో రూ.79 లక్షలు ఆయా పనులపై ఖర్చు చేయగా, ఈ పనులపై ఆడిట్ అధికారులు సర్వే చేసి గ్రామసభలు నిర్వహించారు. శనివారం స్థానిక ఎంపీపీ కార్యాలయ ఆవరణలో ఈజిఎస్ అడీషనల్ పీడీ అమరేశ్, జిల్లా విజిలెన్స్ అధికారి రాంరెడ్డి, పోగ్రాం మేనేజర్ వేణుగోపాల్‌రెడ్డి సమక్షంలో ఉదయం 11.30 గంటలకు నుంచి రాత్రి 8 వరకూ ఈ ప్రజాదర్బార్ కొనసాగింది. ఇందిరాక్రాంతి పథం ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు మేకలు, గొర్రెలు, బర్రెల కొనుగోళ్ల కోసం లక్షల రూపాయలు మంజూరు చేశారు. కానీ గొర్రెలు, బర్రెలు పొందిన వారి ఇళ్లవద్దకు వెళ్లగా, చాలా చోట్ల పశువులు కనిపించలేదని ఆడిట్ అధికారులు ప్రజా దర్బార్‌లో తెలిపారు. పశువులు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించగా, తమ బంధువుల ఇంటి వద్ద ఉన్నాయని పశువులు పొందిన వారు తెలిపారన్నారు. ఈ తతంగం చూస్తుంటే పశువులను కొనుగోలు చేయకుండానే నిధులు మాత్రం తీసుకున్నారనే విషయం బహిర్గతమైనట్లు వారు వెల్లడించారు. ఇక రాళ్లకట్టలు, చెక్‌డ్యాంలు, కుంటల పనుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు డీఆర్పీలు తెలిపారు. గతంలో ఉపాధిహామి పథకంలో చేపట్టిన పనులనే వాటర్‌షెడ్ పథకంలో చూపించినట్లు ప్రజాదర్బార్‌లో వెల్లడించారు. పలుచోట్ల పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత, జెడ్పీటీసీ రాంరెడ్డి, వాటర్‌షెడ్ పీఓ వీరన్న, ఈజీఎస్ ఏపీఓ జగన్ తదితరులు పాల్గొన్నారు. -
పాలతో పూలబాట!
మొయినాబాద్ రూరల్: పాడి పరిశ్రమపై మండలంలోని రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనిపై ఎక్కువగా యువకులు దృష్టి సారిస్తున్నారు. పశుపోషణతో ఉపాధి పొందుతున్నారు. మండలంలోని కనకమామిడి, అజీజ్‌నగర్, కేతిరెడ్డిపల్లి, హిమాయత్‌నగర్, ఎన్కేపల్లి, నక్కలపల్లి, బాకారం, చిన్నమంగళారం తదితర గ్రామాల్లో రెండువేలకుపైగా పాడి పశువులున్నాయంటే ఈ రంగంపై రైతులు ఎంతగా మక్కువ చూపుతున్నారో అర్థమవుతోంది. 2013-2014 సంవత్సరంలో పశుక్రాంతి పథకంలో భాగంగా మినీ డెయిరీలను ఏర్పాటు చేసుకొనేందుకు ప్రభుత్వం ద్వారా 167 గేదెలను అందజేసింది. ఇందులో ఆయా బ్యాంకుల్లో రుణాలు తీసుకొని మినీ డెయిరీలను కొనసాగిస్తున్నారు. వ్యవసాయానికి తోడుగా పశుపోషణతో రైతులు లాభాల బాట పడుతున్నారు. -
‘పాడిపై దృష్టి సారించాలి’
నందిపేట : సహకార సంఘాలు పాడిపై దృష్టి సారించి, లాభాలు ఆర్జించాలని జిల్లా సహకార అధికారి శ్రీహరి సూచించారు. గురువారం డొంకేశ్వర్ సొసైటీలో 61వ జాతీయ సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు సేవలందించడంతో పాటు వ్యాపారంలో నిజామాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాలో సహకార సంఘాల పనితీరు బాగుందన్నారు. సొసైటీలను మరింత లాభాల బాటలో నడిపించేందుకు పాలక వర్గాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా సొసైటీ పరిధిలోని గ్రామాలలో రైతుల నుంచి పాలను సేకరించడం, వే బ్రిడ్జిలను నెలకొల్పడంలాంటి వ్యాపారాలను చేపట్టాలన్నారు. వారానికోసారి ఆర్థిక లావాదేవీలను సరిచూసుకోవాలని సూచించారు. బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. అనంతరం వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో డివిజనల్ సహకార అధికారి మనోజ్ కుమార్, సొసైటీ చైర్మన్ భోజారెడ్డి, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, డెరైక్టర్లు సాయరెడ్డి, నరేందర్, రాజన్న, భూమేశ్, గంగారెడ్డి, సొసైటీ కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పాడికి తోడేదీ?
-
పాడికి తోడేదీ?
* ఆంధ్రప్రదేశ్‌లో డెయిరీ పరిశ్రమను దెబ్బతీస్తున్న అధికార పార్టీ * ప్రభుత్వ డెయిరీలకు ప్రోత్సాహకాలివ్వకుండా ఎగనామం.. సొంత డెయిరీలపైనే దృష్టి * తెలంగాణ, కర్ణాటకల్లో ప్రభుత్వ దన్ను * రూ. 4 ప్రోత్సాహం ప్రకటించిన తెలంగాణ * రాష్ట్ర రైతులను పట్టించుకోని ఏపీ సర్కారు సాక్షి, హైదరాబాద్: అదే తీరు. నాడూ... నేడూ... ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వానిది అదే వైఖరి. తమ చేతిలోని ప్రైవేటు సంస్థల కోసం ప్రభుత్వ సంస్థల్ని బొందపెట్టడం. అయితే వాటికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటం... లేదంటే తమ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించటం. చక్కెర కర్మాగారాల్ని పప్పుబెల్లాల్లా అమ్మేసినా... నూలు మిల్లుల్ని రియల్టీ భూముల కోసం నలిపేసినా... డెయిరీల్ని దారుణంగా చిదిమేసినా... అన్నిటా అదే మార్కు. ఇన్నాళ్ల తరవాత మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు మళ్లీ ఇపుడు అదే మార్కును కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తోంది. మెల్లగా ప్రభుత్వ డెయిరీ పరిశ్రమను చిదిమేసేలా వ్యవహరిస్తోంది. కావాలంటే మీరే చూడండి... రాష్ట్రంలో 50 లక్షల మందికి జీవనాధారంగా ఉన్న పాడి పరిశ్రమకు ప్రోత్సాహమే లేదు. వ్యవసాయం తరవాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న రంగంగా పాడి పరిశ్రమకున్న ప్రాధాన్యం దృష్ట్యా పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా... తమ చేతిలోని ప్రైవేటు సంస్థల కోసం టీడీపీ ప్రభుత్వం మాత్రం సాచివేత ధోరణినే కొనసాగిస్తోంది. ప్రభుత్వ డెయిరీలకు పాలు విక్రయిస్తున్న రైతులకు ప్రోత్సాహకంగా లీటరుకు రూ.4 ఇస్తామని చెబుతూ... పాల సేకరణ ధరను లీటరుకు రూ.4 మేర పెంచుతూ ఇటీవలే తెలంగాణ సర్కారు జీవో కూడా జారీ చేసింది. తెలంగాణ కన్నా దాదాపు 5 రెట్ల మంది ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా పాడి పరిశ్రమపై ఆధారపడి ఉన్నా... ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ స్పందించలేదు. కారణం... ఏపీ గనక ప్రభుత్వ డెయిరీల పాల సేకరణ ధర పెంచితే రైతులంతా ప్రభుత్వ రంగంలోని ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (ఏపీడీడీసీఎల్) సారథ్యంలోని డెయిరీలకే పాలు పోస్తారు. అపుడు చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ వంటి ప్రయివేటు డెయిరీలు కూడా పోటీ తట్టుకోవటానికి తప్పనిసరిగా పాల సేకరణ ధర పెంచాలి. అలా పెంచితే వాటికొచ్చే లాభాలు తగ్గుతాయి. అందుకే ప్రభుత్వ డెయిరీల పాల సేకరణ ధర పెంచకుండా... రైతులు తమను మాత్రమే ఆశ్రయించేలా చక్రం తిప్పుతున్నారు చంద్రబాబు. అదీ కథ. రాష్ట్రంలో సుమారు 90 లక్షల గేదెలు, 18 లక్షలకు పైగా సంకర జాతి ఆవులు, 55 లక్షల దేశవాళీ ఆవులున్నాయి. తీవ్రంగా పెరుగుతున్న పశుగ్రాసం ధర, నీటి కొరత, తవుడు, చెక్కల ధర వంటివి పాడి రైతుల్ని ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. రోజుకు సగటున దాదాపుగా 50 లక్షల లీటర్లు ఉత్పత్తి అవుతుండగా, అందులో ఏపీ డెయిరీ సేకరిస్తున్నది కేవలం 1.70 లక్షల లీటర్లు. మిగిలినదంతా ప్రయివేటు డెయిరీల చేతుల్లోకే వెళుతోంది. కారణం ఒక్కటే. సేకరణ ధర. ఉదాహరణకు హోల్ మిల్క్‌ను ఏపీ డెయిరీ రూ.55.50 ఇచ్చి సేకరిస్తుండగా ప్రయివేటు డెయిరీలు రూ.57 ఇచ్చి సేకరిస్తున్నాయి. సహజంగానే ప్రయివేటు డెయిరీల ధర ఎక్కువగా ఉంటోంది కనక రైతులు వాటినే ఆశ్రయిస్తున్నారు. నిజానికి సేకరణ ధర పెంచాల్సింది ప్రభుత్వమే. అయితే ప్రభుత్వ పెద్దల చేతుల్లోనే ప్రధాన ప్రయివేటు డెయిరీలుండటంతో వారు చాకచక్యంగా వ్యవహరిస్తూ తమ నేతృత్వంలోని ప్రయివేటు డెయిరీల సేకరణ ధరే కాస్త ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నారు. ఒకరకంగా ప్రభుత్వ డెయిరీల వంక ఏ రైతూ వెళ్లకుండా చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల ప్రభుత్వ డెయిరీలు కునారిల్లటమే కాదు. రైతులకూ గిట్టుబాటు ధర రావటం లేదు. రాష్ట్రంలో అత్యధిక శాతం పాలను సేకరిస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ కావటం ఇక్కడ గమనార్హం కూడా. రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను ప్రభుత్వ సహకార డెయిరీ కేవలం ఐదు జిల్లాల్లో మాత్రమే పాలను సేకరిస్తుండటం ఇక్కడ ప్రస్తావనార్హం. రూ.4 ప్రోత్సాహకంగా ప్రకటించిన తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం లీటరు పాలకు అదనంగా రూ.4ను ప్రోత్సాహకం ప్రకటించాక ప్రభుత్వ సమాఖ్య ద్వారా పాల ఉత్పత్తి పెరిగింది. గత పదిరోజుల్లోనే రోజుకు అదనంగా 40 వేల లీటర్ల పాల సేకరణ జరగటం విశేషం. పాల సేకరణలో లీటరుకు 4 రూపాయలు పెరగడంతో ప్రభుత్వ డెయిరీకి పాలు ఇవ్వడానికి రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా ప్రభుత్వ పాడి పరిశ్రమకు ప్రోత్సాహకాలను ప్రకటించి అమలు చేస్తోంది. ఏపీ రైతులకు ఎందుకివ్వరు? ఆంధ్రప్రదేశ్ పాడి రైతులు ఎప్పట్నుంచో ప్రభుత్వ ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రం నుంచి విడిపోయిన తెలంగాణ, పొరుగునున్న కర్ణాటక ప్రభుత్వాలు పాడి రైతుల్ని ప్రోత్సహిస్తుండగా.. ఎంతో ఆర్భాటంగా వ్యవసాయ మిషన్‌ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, కర్నూలు సమీప ప్రాంతాలతో పాటు ఉత్తర కోస్తా, రాయలసీమలో వాణిజ్య స్థాయిలో పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. ఏపీ డెయిరీ మరింతగా విస్తరించాలంటే ప్రభుత్వ చేయూత లేకుండా సాధ్యం కాదు. తెలంగాణ, కర్ణాటక మాదిరి రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ప్రకటిస్తే అటు ప్రైవేటు డెయిరీల ఆట కట్టించడంతో పాటు రైతులకూ ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవేటు డెయిరీల ఆధిపత్యానికి ముకుతాడు వేయాలంటే మరో ప్రత్యామ్నాయం లేదని వారు చెబుతున్నారు. ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యం.. ఏపీ డెయిరీ క్రమేణా నిర్వీర్యమవుతుండటం, సహకార రంగంలోని ఒకటి రెండు సంస్థలు మినహా మిగతావి దివాళా తీయడంతో ప్రస్తుతం ప్రైవేటు డెయిరీలే పాల ఉత్పత్తిదారుల భవిష్యత్తును శాసిస్తున్నాయి. పాల సేకరణ ధర పెంచాలన్నా, తగ్గించాలన్నా ఈ సంస్థలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. అందులోనూ ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్దలకు, వారి బంధువులకు సొంత డెయిరీలు ఉండడంతో పాల సేకరణ ధర పెంచేందుకు పాలకులు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. అన్నిటా తెలంగాణ కంటే తమదే అగ్రస్థానం అనే చంద్రబాబు పాల రైతులకు బోనస్ విషయంలో వెనుకాడటానికి ఇదే కారణమని రైతు సంఘాల నేతలంటున్నారు. కర్ణాటకలో మాదిరి ప్రైవేటు డెయిరీల ఆటకట్టించి, ప్రభుత్వ రంగ సంస్థను పటిష్టం చేయాలని టీడీపీ ప్రభుత్వం అనుకుంటే తక్షణమే రైతులకు బోనస్ ప్రకటించేదని పాడి పరిశ్రమకు సంబంధించిన పలువురు ప్రముఖులు చెబుతున్నారు. హెరిటేజ్ కోసం రైతుల్ని బలిచేయొద్దు తెలంగాణ ప్రభుత్వం మాదిరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాలరైతులకు నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించాలి. చంద్రబాబు గతంలో మాదిరి కాకుండా ఇప్పటికైనా ప్రభుత్వ రంగంలోని ఏపీడీడీసీఎల్ను, ఇతర సహకార సంస్థలను బతికించేలా చూడాలి. తన హెరిటేజ్ కోసం పాడి రైతుల్ని బలిపెట్టడం తగదు. ప్రైవేటు సంస్థల ఆగడాలు అరికట్టేలా, రైతు శ్రేయస్సును పట్టించుకునేలా ముఖ్యమంత్రి వ్యవహరించాలి. రూ.4 నగదు ప్రోత్సాహం అవసరం. అనివార్యం. - కేవీవీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రైవేటు డెయిరీల ఒత్తిడే కారణం ఏపీ ప్రభుత్వం పాల రైతును విస్మరిస్తోంది. సేకరణ ధర పెంచేందుకు వెనుకాడుతోంది. ప్రైవేటు డెయిరీల ఒత్తిడే దీనికి కారణం. లాభం వచ్చే పని ఏదైనా చేస్తామనేది రిలయెన్స్ నినాదం. ప్రస్తుతం హెరిటేజ్ విధానం కూడా అలాగే ఉంది. దీన్ని ప్రజలు తిరస్కరించాలి. పాల సేకరణ ధరలో రాజకీయ జోక్యాన్ని నివారించి సహకార రంగం బలపడేలా చూడాలి. ప్రభుత్వం మిగతా పంటలకు ఇచ్చినట్టే పాలకూ గిట్టుబాటు ధర కల్పించాలి. - నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు సంఘం నేత -
అంపశయ్యపై.. పశుపోషణ
పత్తాలేని వైద్యం..మూగజీవాల మృత్యువాత సాక్షి నెట్వర్క్: పచ్చని పల్లెలు.. పశు సంపద తగ్గిపోయి కళతప్పాయి. గ్రామాల్లో వ్యవసాయం తర్వాత పశుపోషణే ఎక్కువగా ఉపాధి కల్పిస్తున్న రంగం. కరువు కోరల్లో చిక్కి విలవిల్లాడకుండా రైతులను ఆదుకుంటున్నదీ పాడి పరిశ్రమే. కానీ, ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడంతో రాష్ట్రంలో పశుపోషణ అంపశయ్యపై యాతన పడుతోంది. తెలంగాణలోని 9 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్క కొత్త పథకమూ మొదలు కాకపోగా, పాతవేమో అటకెక్కాయి. ప్రస్తుతం పశువులకు గొర్రెలకు, కోళ్లకు వచ్చే సాధారణ వ్యాధులకు మాత్రమే చికిత్సచేస్తూ, వ్యాధి నిరోధక టీకాలు, మందులు ఇస్తున్నారు. అయితే, అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడటం, విధాన నిర్ణయాలింకా పట్టాలు ఎక్కకపోవడం కూడా ప్రభావం చూపిస్తోంది. కాగా, కేంద్రం ఇటీవల ‘నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర్రానికి రూ. 80 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ నిధుల్లో జిల్లాల వారీగా ఎవరి వాటా వారికందితే పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశముంది. అటకెక్కిన పథకాలు రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో అమలైన పథకాలన్నీ ఇపుడు ఊసే లేకుండాపోయాయి. కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన మేలుజాతి దూడల పెంపకానికి 75శాతం సబ్సిడీపై ఏడాదిపాటు దాణా సరఫరా చేసే ‘సునందిని’ పథకం పత్తాలేదు. ఇక, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో పూర్తిగా కేంద్రం నిధులతో సబ్సిడీపై రైతులకు పశువులను సరఫరా చేసేవారు. కానీ, ఈ పథకాల జాడే కనిపించడం లేదు. పశుక్రాంతి పథకంలో సైతం రెండు ఆవులు, లేదా రెండు గేదెలను ఆరునెలలకు ఒకటి చొప్పున రెండు విడతలుగా ఇచ్చే పథకం అటకెక్కింది. హైదరాబాద్‌కు పాలు.. ఎట్లా? రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నిత్యం 20 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతున్నట్లు లెక్కలు తీశారు. పశు పోషణ లేకపోవడంవల్ల పాల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. ఆలస్యంగా కళ్లు తెరిచిన ప్రభుత్వం నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో జిల్లా నుంచి 5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తిని సాధించాలని లక్ష్యాలు నిర్దేశించింది. కానీ, జిల్లాల్లో పశుపోషణ, పశువైద్యం విషయంపై మాత్రం దృష్టి సారించ లేదు. -
గాడి తప్పిన పాడి
సగానికి పడిపోయిన పాల ఉత్పత్తి పొలాల్లోనూ పశువులకు పచ్చగడ్డి కరవు పోషణ భారమై సంతలకు తరలిస్తున్న రైతులు పాలధర ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు కాని వైనం తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న పశుపోషకులు {పభుత్వం ఆదుకోకపోతే మరింత నష్టపోయే ప్రమాదంగ పాడిని నమ్మినవాడు.. భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ నష్టపోడు అనే పెద్దల నానుడి. కానీ రానురాను కాలం మారుతోంది. రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. కనుచూపు మేరలో చినుకు జాడ కనిపించ డం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పొలాల్లో పశువులు మేసేందుకు కూడా పచ్చగడ్డి కరువైంది. ఫలితంగా పాల ఉత్పత్తి సగానికి పైగా పడిపోయింది. ప్రభుత్వం నుంచి చేయూత కొరవడటంతో పాడి పరిశ్రమ కుదేలైంది. నూజెండ్ల: పంటలు లేని సమయాల్లో సాధారణంగా రైతులు వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఈ ఏడాది జిల్లాలో నెలకొన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులు పాడికి కూడా అనుకూలించక రైతులు నష్టాల బారిన పడుతున్నారు. లక్షలు వెచ్చించి గేదెలను కొనుగోలు చేసిన పాల ఉత్పత్తిదారుల ఇబ్బందులు చెప్పనలవి కావటం లేదు. పచ్చగడ్డి పెంచేందుకు నీరు లేదు. కొన్ని ప్రాంతాల్లో పచ్చిక బయళ్లు, పశుగ్రాసం కోసం సాగుచేసిన పంటలు ఎండిపోయాయి. ఎండుగడ్డి కొందామంటే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చేసేది లేక రైతులు గేదెలను పొలాల మీదకు వదిలేస్తున్నారు. పొలాల్లో కూడా గడ్డి దొరకక పశువులు అలమటిస్తున్నాయి. పోషణ భారమై సంతలకు తర లించాల్సి పరిస్థితులు దాపురించాయి. పాల ఉత్పత్తిలో నూజెండ్ల ప్రథమం.. నూజెండ్ల మండలానికి పాడి పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో అత్యధికంగా పాల ఉత్పత్తి ఇక్కడి నుంచే జరుగుతుంది. మండలంలో గేదెలు, ఆవులు కలపి 37,640వరకూ ఉన్నాయి. మండలంలో మూడు ప్రయివేటు డెయిరీలు నడుస్తున్నాయి. ఈ డెయిరీలు గతంలో ఇదే సీజన్లో రోజుకు 25 వేల లీటర్లు పాలను సేకరించేవి. అలాగే మరో ఐదు ప్రయివేటు డెయిరీలు 15 వేల లీటర్లకు పైగా పాలను సేకరించేవి. ఇవి కాక పలు గ్రామాల్లో సంగం డెయిరీ పాల సేకరణ కేంద్రాలూ ఉన్నాయి. మండలంలోని గాంధీనగరం, కంభపాడు, ములకలూరు, వి.అప్పాపురం, పమిడిపాడు తదితర గ్రామాల్లో పాడి పరిశ్రమ ఆధారంగా జీవించే వారు అధికం. మొత్తమ్మీద 30 వేల లీటర్లకు పైగా పాలను ఒక్క నూజెండ్ల మండలంలో ఉత్పత్తి చేస్తున్నారు. కానీ ఈ ఏడాది పాల ఉత్పత్తి సగానికి పడిపోయింది. ధర పెరిగినా గిట్టుబాటేది..? పాలధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఏమాత్రం గిట్టుబాటు కావటంలేదని ఉత్పత్తిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాదిలో 10 శాతం వెన్న ఉన్న పాల ధర రూ. 42 ఉండగా ఈ ఏడాది రూ. 50కి చేరింది. అయినా ఉత్పత్తి సగానికి పడిపోయిన పరిస్థితుల్లో పెరిగిన ఎండుగడ్డి, దాణా ధరలతో పోల్చితే గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రతకు మేతకూడా లభించక ఎనిమిది లీటర్ల పాలిచ్చే గేదెలు నాలుగు లీటర్లు కూడా ఇవ్వటం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం ఆదుకోకపోతే పశుపోషణకు స్వస్తి పలకడం మినహా చేసేది లేదని వాపోతున్నారు. మూగజీవాల ఆకలి కేకలు బెల్లంకొండ: వర్షాభావ పరిస్థితుల్లో గ్రాసం దొరక్క మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. వీటిని సంరక్షించలేక పెంపకందారులు అష్టకష్టాలు పడుతున్నారు. కనీసం దప్పిక తీర్చుకునేందుకు నీరు కూడా దొరక క జీవాలు మృత్యువాత పడుతున్నాయి. బెల్లంకొండ మండలంలో ఎనిమిది వేలకుపైగా ఆవులు, గేదెలు, 1.3 లక్షల వరకు గొర్రెలు, మేకలు ఉన్నట్టు పశుసంవర్థక శాఖ అధికారుల అంచనా. నాగిరెడ్డిపాలెం, వన్నాయపాలెం, నందిరాజుపాలెం, మన్నెసుల్తాన్‌పాలెం, పాపాయపాలెం, చండ్రాజుపాలెం, గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు ఆవులు, గేదెలు, జీవాలను పోషిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సమీపంలో పచ్చగడ్డి లభించక పోవడంతో రైతులు ఒకటి, రెండు పశువులను ఉంచుకొని మిగిలిన వాటిని కబేళాకు తరలిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారాలు అందటంలేదని, అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మూగజీవాలను కాపాడాలని పశుపోషకులు కోరుతున్నారు. పశుసంవర్ధక కేంద్రాల్లో జొన్న విత్తనాలు పంపిణీ చేస్తున్నారని, అసలే వర్షాలు లేక అల్లాడుతుంటే తాము ఈ విత్తనాలను ఏం చేసుకోవాలో అర్థం కావటం లేదని అధికారుల తీరును నిరసిస్తున్నారు.