► రైతులకు సకాలంలో పాల సేకరణ చెల్లింపులు, ఇన్సెంటివ్స్
► జిల్లాలో 6 కోట్ల చేప పిల్లల పంపిణీ..ఫిష్ మార్కెట్ల ఏర్పాటు
► సమీక్ష సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
► సహకార సంఘాలకు భవనాలు : మంత్రి జూపల్లి
మహబూబ్‌నగర్ వ్యవసాయం: రాష్ట్రంలో పాడి, మత్స్య పరిశ్రమల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, గతంలో ఎప్పుడూ లేనంతగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయిస్తూ పాడి, మత్స్య పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తోందని పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సోమవారం జెడ్పీ సమావేశమందిరంలో పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖ అధికారులు, కాపరులు, రైతులు, మత్స్యకారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు.
సకాలంలో డెయిరీ చెల్లింపులు..
కార్యక్రమంలో సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాల సేకరణ కేంద్రాలలో చెల్లింపులు, ఇన్సెంటివ్స్‌ను సకాలంలో అందజేస్తామని అన్నారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. 50 శాతం సబ్సిడీపై దాణాను పంపిణీ, ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 100 సంచార వైద్యశాలలు రానున్నయని, పశువైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ఎన్‌సీడీసీ పథకం కింద మూడో విడుత రూ.33 కోట్లను విడుదల చేస్తామన్నారు. గొర్రెల పెంపకానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 556,1016 జీఓలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని జెడ్పీసీఈ లక్ష్మినారాయణను ఆదేశించారు.
అటవీశాఖ అధికారులతో మాట్లాడి అటవీశాఖ భూముల్లో గొర్రెలు మేపేందుకు అనుమతి ఇచ్చేలా చూడాలని సీఈఓను ఆదేశించారు.అనంతరం మత్స్యకారుల ఇబ్బందులపై మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు బాల్‌రాజు, నాయకులు సత్యయ్య మంత్రితో మాట్లాడారు. మంత్రి స్పందిస్తూ జిల్లాలో 6 కోట్ల చేప పిల్లల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తామని, చేపల మార్కెట్ల ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. వసూళ్లకు పాల్పడే గోపాలమిత్రల స్థానంలో కొత్తవారిని నియమిస్తామని హెచ్చరించారు. పాడి గణానాభివృద్ది సంస్థ అధికారు క్షేత్రస్థాయిలో పర్యటించాలని హెచ్చరించారు.
సహకార సంఘాలకు భవనాలు..
అనంతరం రాష్ర్ట పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఉపాధి హామీలో పాడి, మత్స్య, గొర్రెల కాపారులు సహకార సంఘాల భవ నాన్ని నిర్మిస్తామని అన్నారు. కార్యక్రమంలో ప్ర ణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి,జెడ్పీ చెర్మైన్ బండారి భాస్కర్, ఎమ్మె ల్యేలు శ్రీనివాస్‌గౌడ్, అంజయ్యయాదవ్, రాజేందర్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ డెరైక్టరు వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, జేడీ ఎహెచ్ సుధాకర్, మత్స్యశాఖ ఏడీ ఖదీర్ అహ్మద్, మత్స్య జిల్లా సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ పర్సన్ ఇన్‌చార్జీ శ్రీనివాస్‌యావవ్‌తదితరులు పాల్గొన్నారు.
పాడి, మత్స్య పరిశ్రమల అభివృద్ధికి కృషి
Published Tue, Jun 7 2016 9:42 AM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM
Advertisement
Advertisement