పాలతో పూలబాట! | interest increasing on dairy industry to people | Sakshi
Sakshi News home page

పాలతో పూలబాట!

Published Sat, Nov 22 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

interest increasing on dairy industry to people

మొయినాబాద్ రూరల్: పాడి పరిశ్రమపై మండలంలోని రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనిపై ఎక్కువగా యువకులు దృష్టి సారిస్తున్నారు. పశుపోషణతో ఉపాధి పొందుతున్నారు. మండలంలోని కనకమామిడి, అజీజ్‌నగర్, కేతిరెడ్డిపల్లి, హిమాయత్‌నగర్, ఎన్కేపల్లి, నక్కలపల్లి, బాకారం, చిన్నమంగళారం తదితర గ్రామాల్లో రెండువేలకుపైగా పాడి పశువులున్నాయంటే ఈ రంగంపై రైతులు ఎంతగా మక్కువ చూపుతున్నారో అర్థమవుతోంది.

2013-2014 సంవత్సరంలో పశుక్రాంతి పథకంలో భాగంగా మినీ డెయిరీలను ఏర్పాటు చేసుకొనేందుకు ప్రభుత్వం ద్వారా 167 గేదెలను అందజేసింది. ఇందులో ఆయా బ్యాంకుల్లో రుణాలు తీసుకొని మినీ డెయిరీలను కొనసాగిస్తున్నారు. వ్యవసాయానికి తోడుగా పశుపోషణతో రైతులు లాభాల బాట పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement