పాలతో పూలబాట!
మొయినాబాద్ రూరల్: పాడి పరిశ్రమపై మండలంలోని రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనిపై ఎక్కువగా యువకులు దృష్టి సారిస్తున్నారు. పశుపోషణతో ఉపాధి పొందుతున్నారు. మండలంలోని కనకమామిడి, అజీజ్‌నగర్, కేతిరెడ్డిపల్లి, హిమాయత్‌నగర్, ఎన్కేపల్లి, నక్కలపల్లి, బాకారం, చిన్నమంగళారం తదితర గ్రామాల్లో రెండువేలకుపైగా పాడి పశువులున్నాయంటే ఈ రంగంపై రైతులు ఎంతగా మక్కువ చూపుతున్నారో అర్థమవుతోంది.
2013-2014 సంవత్సరంలో పశుక్రాంతి పథకంలో భాగంగా మినీ డెయిరీలను ఏర్పాటు చేసుకొనేందుకు ప్రభుత్వం ద్వారా 167 గేదెలను అందజేసింది. ఇందులో ఆయా బ్యాంకుల్లో రుణాలు తీసుకొని మినీ డెయిరీలను కొనసాగిస్తున్నారు. వ్యవసాయానికి తోడుగా పశుపోషణతో రైతులు లాభాల బాట పడుతున్నారు.