SRI VENKATESWARA VETERINARY UNIVERSITY
-
టీ–17 పందులు సూపర్.. నెలకు లక్షకు పైగా నికరాదాయం!
తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించే సీమ పందుల పెంపకంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న పందుల పరిశోధనా కేంద్రం ఎస్వీవీయూ టీ–17 రకం సీమ పందుల జాతిని అభివృద్ధి చేసింది. శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ ఈ జాతి పందులను పెంచుతున్న రైతులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. యువ రైతులు సైతం ఆసక్తి చూపుతుండటం విశేషం. పంది మాంసాన్ని ‘పోర్క్’ అంటారు. కండ (హమ్), వారు (బాకన్), సాసెజ్, నగ్గెట్స్, ప్యాట్టీస్, పోర్క్ పచ్చడి, బ్యాంబూ పోర్క్ల రూపంలో సీమ పంది ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు. వీటిలో మాంసకృత్తులు, విటమిన్లతో పాటు ఓలిక్ లినోలిక్ ఫాటీయాసిడ్స్ అధికంగా ఉంటాయి. పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులకు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి సీమ పంది మాంసం ఉత్పత్తులు ఉపయోగపడతాయని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. పందుల పెంపకాన్ని లాభదాయకం చేయడంతో పాటు కొత్త పంది రకాల అభివృద్ధికి తిరుపతిలోని పరిశోధనా కేంద్రం గడిచిన ఐదు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. స్థానికంగా లభ్యమయ్యే వివిధ వ్యవసాయ ఉప ఉత్పత్తులను 10–15 శాతం వరకు పందుల దాణా తయారీకి వినియోగించి ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. పందులకు సంక్రమించే మేంజ్ అనే చర్మ వ్యాధికి డోరోమెక్టిన్ అనే ఔషధాన్ని కనిపెట్టారు. 20 శాతం మంది పోర్క్ తింటున్నారు దేశంలో 9 లక్షల మిలియన్ల పందులుంటే, ఆంధ్రప్రదేశ్‌లో 92 వేలున్నాయి. దేశంలో 22 శాతం మంది, రాష్ట్రంలో 11 శాతం మంది పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ మాంసాహారుల్లో పంది మాంసం తినే వారి సంఖ్య 18–20 శాతం ఉన్నారని అంచనా. ఏటా రూ.18 కోట్ల విలువైన 894 టన్నుల పంది మాంసం ఉత్పత్తులు మన దేశం నుంచి వియత్నాం, కాంగో, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతవుతున్నాయి. ఒక పంది... 80 పిల్లలు... ఐదేళ్ల క్రితం విదేశీ జాతి పందులతో దేశవాళీ పందులను సంకరపరిచి ఎస్వీవీయూ టీ–17 (75 శాతం లార్జ్‌వైట్ యార్క్‌షైరు, 25 శాతం దేశవాళీ పంది) అనే కొత్త పంది జాతిని అభివృద్ధి చేశారు. వాడుకలో సీమ పందిగా పిలిచే వీటి పెంపకంపై రైతులు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. జీవిత కాలంలో ఈతకు 8 చొప్పున 10 ఈతల్లో 80 పిల్లలను పెడుతుంది. పుట్టినప్పుడు 1.12 కేజీలుండే ఈ పంది పిల్ల వధించే సమయానికి 85 కేజీల వరకు బరువు పెరుగుతుంది. పది ఆడ, ఒక మగ పందిని కలిపి ఒక యూనిట్‌గా వ్యవహరిస్తారు. కేంద్రం నుంచి అభివృద్ధి చేసిన పందులకు సంబంధించి 400 యూనిట్లను రైతులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఏపీలో రైతుల దగ్గర 20 వేల పైగా ఈ రకం పందులు పెరుగుతున్నాయి. ఒక యూనిట్ దేశవాళీ పందుల పెంపకం ద్వారా సగటున ఏటా రూ. 3–3.5 లక్షల ఆదాయం వస్తుంటే, ఈ రకం సీమ పందుల పెంపకం ద్వారా రూ. 6–7 లక్షల ఆదాయం వస్తుంది. మాంసం రూపంలో అమ్మితే రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి నెలకు రూ. లక్షకు పైగా నికరాదాయం నేనో సాప్ట్వేర్ ఉద్యోగిని. రెండేళ్లుగా పశుపోషణ చేస్తున్నా. గతేడాది తిరుపతి పందుల పరిశోధనా కేంద్రం నుంచి 15 పిల్లలతో పాటు 5 పెద్ద పందులను కొని పెంపకం చేపట్టా. హాస్టళ్లు, హోటళ్ల నుంచి సేకరించే పదార్థాలను పందులకు మేపుతున్నాం. చూడి/పాలిచ్చే పందులకు విడిగా దాణా పెడతున్నా. నెలకు రూ. 49,400 ఖర్చవుతోంది. మాంసం ద్వారా రూ.1.40 లక్షలు, పంది పిల్లల అమ్మకం ద్వారా రూ.13,500 ఆదాయం వస్తోంది. ఖర్చులు పోను నెలకు రూ.లక్షకు పైగా నికరాదాయం వస్తోంది. పందుల పెంపకం లాభదాయకంగా ఉంది. – సుంకర రామకృష్ణ, నూజివీడు, ఎన్టీఆర్ జిల్లా మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తే... నేనో సాప్ట్వేర్ ఉద్యోగిని. పందుల పెంపకంపై ఆసక్తితో తిరుపతి పరిశోధనా కేంద్రంలో శిక్షణ పొందాను. ఈ పరిశ్రమ ఎంతో లాభసాటిగా ఉందని గ్రహించాను. త్వరలో పందుల పెంపకం యూనిట్ పెడుతున్నా. మార్కెటింగ్‌పై మరింత అవగాహన కల్పిస్తే యువత ఆసక్తి కనపరుస్తారు. –జి.మహేష్, గాజులమండ్యం, తిరుపతి జిల్లా పొరుగు రాష్ట్రాల రైతుల ఆసక్తి శాస్త్రీయ పద్ధతుల్లో సీమ పందుల పెంపకంపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాం. ఎస్వీవీయూ టీ–17 జాతి పందులకు మంచి డిమాండ్ ఉంది. పొరుగు రాష్ట్రాల రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పెంపకంలో మెళకువలతో పాటు వీటికి సంక్రమించే వ్యాధులను గుర్తించి తగిన చికిత్స, నివారణా చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పంది మాంసం ఉత్పత్తుల్లో ఉండే పోషక విలువలపై వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ కే.సర్జన్‌రావు (99890 51549), పరిశోధనా సంచాలకులు, ఎస్వీవీయూ, తిరుపతి రైతులకు నిరంతర శిక్షణ తిరుపతిలో పందుల పరిశోధనా కేంద్రం ఏర్పాటై 50 ఏళ్లవుతోంది. తాజాగా విడుదల చేసిన ఎస్వీవీయూ టీ–17 రకం పంది జాతికి మంచి డిమాండ్ ఉంది. దేశవాళీ పందులతో పోల్చుకుంటే రెట్టింపు ఆదాయం వస్తుంది. వీటి పెంపకంపై ఆసక్తి గల యువతకు, రైతులకు ఏడాది పొడవునా శిక్షణ ఇస్తున్నాం. –డాక్టర్ ఎం.కళ్యాణ్ చక్రవర్తి (94405 28060), సీనియర్ శాస్త్రవేత్త, అఖిల భారత పందుల పరిశోధనా కేంద్రం, తిరుపతి -
తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత
యూనివర్సిటీ క్యాంపస్(చిత్తూరు జిల్లా)/విజయపురిసౌత్(మాచర్ల): తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఓ చిరుత శనివారం తెల్లవారు జామున రోడ్డు దాటుకుని పొదల్లోకి వెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గురువారం రాత్రి వర్సిటీ సమాచార కేంద్రం వద్ద ఉన్న ప్రహరీపై చిరుత కూర్చుని ఉండడాన్ని సెక్యూరిటీ సిబ్బంది వీడియో తీసిన విషయం విదితమే. చిరుత సంచరిస్తుందనే సమాచారంతో వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. నెల రోజులుగా తిష్ట! శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీలో గత నెల రోజులుగా చిరుత తిష్ట వేసినట్లు తెలుస్తోంది. వర్సిటీ చుట్టూ ఎతైన ప్రహరీ గోడ ఉంది. అయితే రైల్వే క్రాసింగ్ సమీపంలో ఒకటి, వ్యవసాయ కళాశాల వైపు మరో ద్వారం ఉన్నాయి. అర్థరాత్రి సమయంలో ఎవరూ లేని సమయంలో వర్సిటీకి వచ్చి ఉండవచ్చని.. చుట్టూ ప్రహరీ ఉండడం వల్ల తిరిగి వెళ్లలేకపోయిందని వర్సిటీ ఉద్యోగులు భావిస్తున్నారు. కాగా వర్సిటీలో నీటి కుంటలు, దట్టమైన పొదలు ఉండడం వల్ల అక్కడ తలదాచుకుని ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. చింతలతండాలో పెద్ద పులి? గుంటూరు జిల్లా మాచర్ల మండలం చింతలతండా పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తుందనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. వారం రోజులు గడుస్తున్నా పులి జాడ తెలియకపోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంపై విజయపురిసౌత్ సెక్షన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఖాజా రహంతుల్లాను వివరణ కోరగా.. చింతలతండా శివారులోని పంట పొలాల్లో పెద్ద పులి అడుగుజాడలు కనిపించాయన్నారు. చింతలతండా నుంచి అనుపులోని లిఫ్ట్ ఇరిగేషన్ జాక్వెల్ ప్రాంతంలోని సిద్దలదరి వరకు 34 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. పెద్దపులి తిరిగి అడవిలోకి వెళ్లి ఉండవచ్చని రహంతుల్లా అన్నారు. -
AP: పుంగనూరు ఆవులపై పరిశోధనలు
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని గుంటూరు లాం ఫాం పరిశోధన స్థానంలో అరుదైన దేశీయ జాతి అయిన పుంగనూరు గో జాతిపై పరిశోధనలు జరగనున్నాయి. ఈ జాతి అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.69.32 కోట్లతో మిషన్ పుంగనూరు ప్రాజెక్ట్‌కు అనుమతులిచ్చిన సంగతి తెల్సిందే. లాం ఫాం శాస్త్రవేత్తలు చేపట్టే ఈ పరిశోధనలకు శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ సాంకేతిక సహకారం అందించనుంది. చదవండి: Polavaram Project: పోలవరం పనులు భేష్ లాం ఫాంలో ఇప్పటికే ఒంగోలు జాతిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇన్విట్రో ఫెర్టిలిటీ టెక్నాలజీ (ఐవీఎఫ్) ద్వారా పిండమార్పిడి పరిశోధనలు చేస్తున్నారు. పుంగనూరు జాతి అభివృద్ధికి నిర్వహించే పరిశోధనల్లో పిండాలు, ఆవుల అండాలను సేకరించి భద్రపరిచే ప్రక్రియ (స్టాండర్డైజేషన్) కోసం ఎక్కువ పునరుత్పత్తి సామర్థ్యం కల్గిన 10 మేలు జాతి ఆవులను గుర్తించి గుంటూరుకు తరలిస్తున్నారు. ఇప్పటికే 6 పశువులను పంపామని, మరో 4 పశువులను పరీక్షల అనంతరం పంపుతామని వర్సిటీ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి తెలిపారు. చదవండి: అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు -
తిరుపతి ఎస్వీవీయూలో ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ(ఎస్వీవీయూ).. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 15 ► జిల్లాల వారీగా ఖాళీలు: శ్రీకాకుళం–01, విజయనగరం–01, విశాఖపట్నం–01, తూర్పుగోదావరి–01, పశ్చిమగోదావరి–02, కృష్ణా–01, గుంటూరు–01, ప్రకాశం–01, నెల్లూరు–02, చిత్తూరు–01, కడప–01, కర్నూలు–01, అనంతపురం–01. ► అర్హత: మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా (డీఎంఎల్టీ) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.06.2021 ► వెబ్సైట్: www.svvu.edu.in మరిన్ని నోటిఫికేషన్లు: ఏపీలో గ్రామ/వార్డ్ సచివాలయ వలంటీర్ ఉద్యోగాలు వెస్టర్న్ రైల్వేలో 3591 అప్రెంటిస్ ఖాళీలు సీఎస్ఐఆర్–ఎస్ఈఆర్సీలో టెక్నీషియన్ల ఖాళీలు -
ఎస్వీ వెటర్నరీ వర్సిటీకి కీలక ప్రాజెక్టులు
సాక్షి, చిత్తూరు : తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ రెండు కీలక ప్రాజెక్టులను దక్కించుకుంది. వాటిలో ఒకటి పాడి పరిశ్రమ, రెండోది కోళ్లు, పక్షల ద్వారా సంభవించే వ్యాధుల మీద పరిశోధనలు. దేశంలో మొదటి సారిగా ఈ రెండు పరిశోధనలు జరుగుతున్నాయని ఎస్వీ వెటర్నరీ యూనివర్సీటీ వీసీ పద్మనాభ రెడ్డి వెల్లడించారు. పాడి పరిశ్రమ పరిశోధనలో లండన్‌కు చెందిన రాయల్ వెటర్నరీ కళాశాల భాగస్వామ్యం ఉందన్నారు. పాల సేకరణ నుంచి పాల ఉత్పత్తుల వరకు సంక్రమించే వ్యాధుల మీద పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. మూడేళ్ల పాటు ఈ పరిశోధనలు జరుగుతాయని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తే దాదాపు మూడు కోట్ల రూపాయలు ఎస్వీ వెటర్నరీ వర్సీటీకి దక్కుతాయని పద్మనాభ రెడ్డి తెలిపారు. -
బాబు పీఏ కోసం నిబంధనలు తుంగలో తొక్కి..!
సాక్షి, తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీలో ఒక అధికారి అంతా తానై వ్యవహరిస్తున్నారు. వీసీ హరిబాబు హయాంలో పలు విమర్శలు మూటకట్టుకున్న ఆయన ఇప్పుడు వీసీ పదవీ కాలంలో ఆయన తీసుకుంటున్న చర్యలు సరికొత్త వివాదాలకు దారి తీస్తున్నాయి. వెటర్నరీ వర్సిటీ పరిపాలన భవనంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఆయనపై విమర్శలు, ఆరోపణలు రావడంతో అప్పట్లో వీసీ హరిబాబు ఆయనను ముత్తుకూరులో మత్య్స కళాశాలకు బదిలీ చేశారు. అయితే టీడీపీలో తనకున్న పలుకుబడితో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పీఏగా డిప్యుటేషన్‌పై వెళ్లారు. మూడేళ్ల కాలం డిప్యుటేషన్‌పై వెళ్లిన ఆ అధికారిని.. రిజిస్ట్రార్ నిబంధనలకు వ్యతిరేకంగా వెటర్నరీ పరిపాలన భవనంలోకి కీలక పోస్టులోకి బదిలీపై తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతే కాకుండా మాజీ వీసీ హయాంలో తన దొడ్డిదారి ప్రయత్నాలను అడ్డుకుంటూ వచ్చిన కొందరు ఉద్యోగులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేశారనే ప్రచారంలోకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధం వర్సిటీలో బదిలీలు, ఉద్యోగోన్నతులు.. ఇలా ఏవి చేయాలన్నా దిగువ స్థాయి ఉద్యోగి నుంచి ఫైల్ రూపొందించి ఉన్నతాధికారులకు చేరాలి. అయితే ఒక అధికారి తన కార్యాలయంలోనే ఫైల్ రూపొందించి ఇన్చార్జ్ వీసీ అప్రూవల్ కోసం పెట్టినట్లు సమాచారం. ఇన్చార్జ్ వీసీ అన్ని అంశాలు పరిశీలించే పరిస్థితి లేకపోవడంతో సదరు అధికారి పక్కా స్కెచ్ వేసినట్లు వర్సిటీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో దొడ్డిదారి బదిలీలకు తెరతీశారనే విమర్శలు వినవస్తున్నాయి. అలాగే, ఇటీవ ల బదిలీలు, ఉద్యోగోన్నతులు కల్పించిన ఆచా ర్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వీసీకి గవర్నర్ చీవాట్లు పెట్టడం విదితమే. పరీక్షలు నిర్వహించకనే ప్రమోట్! వెటర్నరీ వర్సిటీలో బీవీఎస్సీ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాక తదుపరి ఏడాదిలోకి ప్రమోట్ చేస్తారు. అయితే కరోనా సాకుగా చూపి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కరోనా ప్రభావం ముగిసి సాధారణ పరిస్థితి వచ్చాక పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పై తరగతికి ప్రమోట్ అయిన విద్యార్థి ఒకవేళ ఫెయిల్ అయితే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ ప్రతిపాదనను కొందరు వర్సిటీ అధికారులు వ్యతిరేకించినట్లు సమాచారం. చదవండి: ‘నిరర్థక’ నిర్ణయం టీడీపీ హయాంలోనే చంద్రబాబు పీఏ కోసం నిబంధనలకు పాతర వెటర్నరీ వర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఒక అధికారి గత ఏడాది జూలై 15న చంద్రబాబు పీఏగా నియమితులయ్యా రు. చంద్రబాబు వద్ద పనిచేస్తున్న సదరు అధికారికి 2011లో జారీ చేసిన జీఓ నంబర్ 522 ఆధారంగా వెటర్నరీ వర్సిటీ వేతనం చెల్లిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ వీసీ లేకపోవడంతో టీడీపీ సానుభూతిపరులు తమ పనులు చక్కబెట్టుకోవడం కోసం ఆగమేఘాల మీద వెటర్నరీ పరిపాలన భవనంలో కీలక పదవిలోకి తీసుకొచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇన్చార్జ్ వీసీ, ప్రభుత్వం పూర్తి స్థాయి దృష్టి సారిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
ఇది కొత్త పంది.. పేరు తిరుపతి వరాహ
నూతన రకాన్ని రూపొందించిన తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ యూనివర్సిటీ క్యాంపస్: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నూతన పంది రకాన్ని రూపొందించింది. దీనికి ‘తిరుపతి వరాహ’ అనే పేరు పెట్టింది. వెటర్నరీ యూనివర్సిటీలో శనివారం జరిగే కార్యక్రమంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి ( ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జేకే జీనా విడుదల చేయనున్నారు. వీసీ ప్రొఫెసర్ వై.హరిబాబు దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తిరుపతి వెటర్నరీ కళాశాల పరిధిలో ఆలిండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ పిగ్స్‌లో 1971 నుంచి పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపారు. 1971 నుంచి 80 వరకూ లార్జ్ యార్క్‌షైర్ పిగ్స్ ( సీమ పందులు)పై, 1981 నుంచి 87 వరకూ దేశీయ పందుల (నాటు పందులు)పై పరిశోధనలు చేసినట్లు చెప్పారు. అనంతరం 1987 నుంచి 2007 వరకూ సీమ పందులు, నాటు పందులను సంకరీకరించి నూతన రకాన్ని రూపొందించినట్లు చెప్పారు. అప్పటి నుంచి 21 తరాలకు ఈ రకాన్ని పరిశీలించామని, ప్రతి తరంలో పంది పిల్లల్లో ఏర్పడిన అవలక్షణాలను సరిచేస్తూ పరిశోధనలు చేసినట్లు చెప్పారు. 21 తరాల తర్వాత ఎలాంటి అవలక్షణాలూ లేని రకం లభించిందన్నారు. దీంతో ఈ రకాన్ని రైతులకు, పందుల పెంపకందార్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఈ రకంలో 75 శాతం సీమ పందుల లక్షణాలు, 25 శాతం నాటు పందుల లక్షణాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం తమ వద్ద 224 పందులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఆనిమల్ జెనటిక్ రీసెర్చ్( ఎన్బీఏజీఆర్) ప్రతినిధులు శనివారం ఈ రకాన్ని రిజిస్టర్ చేసుకుంటారని, రిజిస్టర్ చేయడం అంటే పేటెంట్ పొందడంవంటిదని వివరించారు. కార్యక్రమంలో పరిశోధన డైరెక్టర్ ప్రొఫెసర్ రాఘవరావు, పందుల పరిశోధన సంస్థ ఇన్చార్జ్ ప్రొఫెసర్ జే.సురేశ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గంగరాజు, ఫిజియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ రాంబాబునాయక్ పాల్గొన్నారు. -
నేటి నుంచి తిరుపతిలో సీఏల సదస్సు
- హాజరు కానున్న 2,500 మంది ప్రతినిధులు - రూ.50 లక్షలతో వేదిక నిర్మాణం ప్రారంభించనున్న మంత్రి గంటా యూనివర్సిటీక్యాంపస్: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ మైదానంలో మంగళవారం నుంచి రెండ్రోజులపాటు సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ (ఎస్‌ఐఆర్‌సీ) 48వ ప్రాంతీయ చార్టర్డ్ అకౌంటెంట్ల సదస్సు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని ఇన్స్టిట్యూట్ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సుకు 2,500 మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ హాజరు కానున్నారు. కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభిస్తారు. ఐసీఐఏ అధ్యక్షులు ఎం.దేవరాజరెడ్డి, కార్యదర్శి జామన్ కె.జార్జ్ హాజరవుతారు. బుధవారం నిర్వహించే ముగింపు సమావేశానికి రాష్ట్ర ఎన్నికల అధికారి ఎన్.రమేష్‌కుమార్ హాజరవుతారు. సదస్సుకు 2,500 మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ హాజరవుతున్నందున ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ సంస్థలు 30 బిజినెస్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారుు. ఎస్‌ఐఆర్‌సీ చైర్మన్ ఫల్గుణ కుమార్, తిరుపతి చాప్టర్ చైర్మన్ రఘురామిరెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఈ సదస్సులో సీఏల వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు అవసరమైన చర్యలపై చర్చిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన సీఏలు హాజరవుతారన్నారు. ఇటీవల చేపట్టిన పెద్దనోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలపై చర్చించనున్నారన్నారు. 2017 మే నుంచి అమలులోకి రానున్న రియల్ ఎస్టేట్ యాక్ట్ 2016పై కూడా అవగాహన కల్పిస్తామన్నారు. -
తిరుపతి వెటర్నరీ వర్సిటీలో అస్తవ్యస్త పాలన
-
400 గ్రామాల దత్తతకు ఎస్వీవీయూ శ్రీకారం
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 400 గ్రామాలు దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని పాలకమండలి నిర్ణయించింది. యూనివర్సిటీ పాలకమండలి సమావేశం శనివారం జరిగింది. ఇన్చార్జ్ వీసీ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 30 అంశాలపై చర్చ సాగింది. సమావేశ వివరాలను వీసీ మన్మోహన్ సింగ్ మీడియాకు వివరించారు. యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయించామన్నారు. కర్నూలు జిల్లా బన్వాసిలో వెటర్నరీ పాలటెక్నిక్, గొర్రెల పరిశోధన స్థానం ఏర్పాటుకు పాలకమండలి ఆమోదించిందన్నారు. పాలిటెక్నిక్‌కు రూ.6 కోట్లు మంజూరు చేయాలని తీర్మానించామని చెప్పారు. ఒంగోలు జాతి పశువులపై పరిశోధనకు రూ. 3 కోట్లు, పుంగనూరు జాతి పశువులపై పరిశోధనకు రూ. 1.5 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. యూనివర్సిటీలో ఖాళీగా వున్న అధికారుల పోస్టుల భర్తీకి సెలక్షన్ కమిటి ఏర్పాటు చేసేందకు కమిటి ఆమోదం తెలిపిందన్నారు. అనంతపురం జిల్లా సిద్ధరామాపురంలో వెటర్నరి యూనివర్సిటీ పరిధిలోని 525 ఎకరాల్లో గడ్డి క్షేత్రాల అభివృద్ధికి పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి నెల మొదటి శనివారం పశుసంవర్ధక దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ..వర్సిటీలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పెట్టాలని భావిస్తున్నామన్నారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ పశు వైద్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తగు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఒంగోలు, పుంగునూరు జాతి అభివృద్ధికి పరిశోధనలు వేగవంతం చేయాలని నిర్ణయించామన్నారు. -
‘పుంగనూరు జాతి’ పునరుత్పత్తి
తిరుపతి, పలమనేరు కేంద్రంగా పిండమార్పిడి ప్రయోగం ప్రాజెక్టుకు రూ.1.3 కోట్లు అవసరం కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్న వర్సిటీ అధికారులు అరుదైన పుంగనూరు రకం పశువుల పునరుత్పత్తికి శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అధికారులు శ్రీకారం చుట్టారు. తిరుపతి, పలమనేరు ప్రాంతాలను పరిశోధనలకు కేంద్రంగా నిర్ణయించారు. రాష్ట్రంలో పుంగనూరు, ఒంగోలు జాతి పశువులను దేశ సంపదగా భావిస్తారు. వెటర్నరీ యూనివ ర్సిటీ : పుంగనూరు జాతి ఆవుల పునరు త్పత్తికి శ్రీకారం చుట్టారు. ఉన్న వనరులను అంది పుచుకుంటూ అందరిచేతా శభాష్ అనిపిం చుకుంటున్నారు తిరుపతిలోని వెటర్నరీ యూనివర్సిటీ అధికారులు. అంతరించి పోతున్న వాటిల్లో పుంగూరు పశువుల జాతి మొదటి స్థానంలో ఉంది. వీటి పునరుత్పత్తికి ఇప్పటి వరకు వెటర్నరీ వర్సిటీ పెద్దగా చర్యలు చేపట్టలేదు. పలమనేరు సమీపంలోని క్యాటిల్ ఫారం వద్ద పరిశోధన కేంద్ర ఏర్పాటు చేశారు. ఇక్కడ 91 పుంగనూరు జాతి పశువులు మాత్రమే ఉన్నాయి. వీటిలో కూడా పునరుత్పత్తికి కేవలం 25 పశువులు మాత్రమే యోగ్యమైనవి. క్యాటిల్ఫాంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. పుంగనూరు జాతి పశువులు అంతరించిపోతున్న నేపథ్యంలో వెరట్నరీ వర్సిటీపై పలువిమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వెటర్నరీ డీన్ డాక్టర్ చంద్రశేఖర్‌రావు, ఇతర అధికారులు పుంగనూరు జాతి పశువుల పునరుత్పత్తికి శ్రీకారం చుట్టారు. ఇందుకు కావాల్సిన పరికరాలు, పిండమార్పిడికి అవసరమయ్యే పశువు లు, పరిశోధకులు, గైనకాలజిస్ట్, ఇతర సిబ్బంది వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తిరుపతి వెటర్నరీ కళాశాలలో ల్యాబ్ అందుబాటులో ఉన్నా ఇక్కడ పుంగనూరు రకం పశువులు, ఇతర సిబ్బంది లేరు. పలమనేరు ల్యాబ్‌లో పిండమార్పిడికి అవసరమయ్యే ఇతర జాతి పశువులు, గైనకాలజిస్ట్, శాస్త్రవేత్త అవసరమని గుర్తించారు. ఇందుకోసం రెండు ప్రాంతాల్లో పరిశోధనలు జరగాలంటే రూ.1.3 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు నివేదికను సి ద్ధం చేశారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే పరిశోధనలు ప్రారంభమవుతాయని డీన్ ఆఫ్ వెటర్నరీ డాక్టర్ చంద్రశేఖర్‌రావు తెలిపారు. మేలైన పుంగనూరు జాతి పుంగనూరు జాతి పశువులను దేశ సంపదగా భావిస్తారు. అంతరించి పోతున్న 32 రకాల దేశవాళీ రకాల్లో ఈ జాతి మొదటి స్థానంలో ఉంది. 85-95 సెంటీ మీటర్ల ఎత్తు, 125- 210 కిలోల బరువు ఉండడం వీటి ప్రత్యేకత. తెలుపు, ఎరుపు, గోధుమ రంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. విదేశీయులూ పుంగనూరు జాతి పశువుల కోసం ఎగబడుతుంటారు. అన్నిరకాల వాతావరణ పరిస్థితులను ఈ పశువులు తట్టుకుని నిలబడగలవు. తక్కువ పోషణతో ఎక్కువ లాభాలు ఇవ్వడం వీటి ప్రత్యేకత. -
ప్రొ.జయశంకర్ వర్సిటీ ఏర్పాటు
పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం కూడా.. ఆచార్య ఎన్జీ రంగా, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీలను విభజిస్తూ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలను విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీని విభజించి ‘ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ’గా నామకరణం చేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ విభజన చేసినట్లు పేర్కొంది. ఈ విభజన అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ నోడల్ ఆఫీసర్/రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు ఇచ్చారు. జయశంకర్ యూనివర్సిటీ ప్రస్తుతం ఉన్న క్యాంపస్‌లోనే కొనసాగుతుందని స్పష్టంచేశారు. కొత్త వర్సిటీకి చట్టం రూపొందించే వరకు ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీ చట్టం-1963 ప్రకారమే కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. అలాగే మాజీ ప్రధాని పీవీ పేరుమీద ‘పీవీ నరసింహారావు తెలంగాణ రాష్ట్ర వెటర్నరీ, యానిమల్, ఫిషరీస్ సెన్సైస్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నోడల్ ఆఫీసర్/పశుసంవర్థకశాఖ డెరైక్టర్‌ను ఆదేశించింది. తిరుపతిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీని విభజించి దీన్ని ఏర్పాటు చేసింది. విభజన తర్వాత తెలంగాణ వెటర్నరీ వర్సిటీ రాజేంద్రనగర్‌లోని ప్రస్తుత క్యాంపస్‌లోనే ఉంటుందని పేర్కొంది. పోస్టుల విభజన..: వ్యవసాయ, వెటర్నరీ యూనివర్సిటీలను విభజిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆయా వర్సిటీల్లో ఉన్న పోస్టులను 58:42 నిష్పత్తి ప్రకారం విభజిస్తామని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రవీణ్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియంతా కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల ప్రకారమే ఉంటుందని స్పష్టంచేశారు. -
అడ్మిషన్స్, జాబ్స్ అలర్ట్స్
శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కోర్సులు: పశుసంవర్థక పాలిటెక్నిక్ డిప్లొమా మత్స్య శాస్త్ర పాలిటెక్నిక్ డిప్లొమా అర్హతలు: 6 పాయింట్స్ గ్రేడ్‌తో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలో కనీసం నాలుగేళ్లు చదివి ఉండాలి. వయసు: 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21 వెబ్సైట్: www.svvu.edu.in ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పోస్టులు: ఆఫీసర్(స్కేల్-3) జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఐటీ ఆఫీసర్ చార్టెడ్ అకౌంటెంట్ మార్కెటింగ్ ఆఫీసర్ అగ్రికల్చరల్ ఆఫీసర్ అర్హతలు: సంబంధిత విభాగంలో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ/పీజీ ఉండాలి. ఐబీపీఎస్ నిర్వహించిన ఆర్ఆర్బీస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్షలో అర్హత సాధించాలి. ఆఫీసర్ (స్కేల్-1) అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఐబీపీఎస్ సెప్టెంబరు 2013లో నిర్వహించిన ఆర్ఆర్బీస్ కామన్ రిటెన్ టెస్ట్‌లో అర్హత సాధించాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 16 వెబ్సైట్: http://ibpsregistration.nic.in/ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 20 వెబ్సైట్: http://ibps.sifyitest.com/ -
ప్రవేశాలు
డిప్లొమా కోర్స్ ఇన్ ఫార్మసీ సాంకేతిక విద్యాశాఖ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు: డిప్లొమా కోర్స్ ఇన్ ఫార్మసీ(డి.పార్మసీ) వ్యవధి: రెండేళ్లు అర్హతలు: రెగ్యులర్ పద్ధతిలో ఇంటర్ (బైపీసీ/ఎంపీసీ) ఉత్తీర్ణత. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 15 వెబ్సైట్: http://dteap.nic.in/ జిందాల్ గ్లోబల్ వర్సిటీ ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీహెచ్డీ ప్రోగ్రామ్ విభాగాలు: స్కూల్ ఆఫ్ బిజినెస్, లా, గవర్నమెంట్ అండ్ పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ అఫైర్స్. అర్హతలు: 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 15 వెబ్సైట్: www.jgu.edu.in శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పశుసంవర్థక పాలిటెక్నిక్ డిప్లొమా కాలపరిమితి: రెండేళ్లు క్యాంపస్‌లు: పలమనేరు, గరివిడి, వెంకటరామన్నగూడెం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రాపూర్, సిద్ధిపేట, రామచంద్రాపురం, మామనూరు. మత్స్యశాస్త్ర పాలిటెక్నిక్ డిప్లొమా కాలపరిమితి: రెండేళ్లు క్యాంపస్: భావదేవరాలపల్లి అర్హతలు: 6 పాయింట్స్ గ్రేడ్‌తో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలో కనీసం నాలుగేళ్లు చదివి ఉండాలి. వయసు: 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21 వెబ్సైట్: www.svvu.edu.in -
కెరీర్ కౌన్సెలింగ్
నేను డెయిరీ రంగంలో ఉపాధిని కోరుకుంటున్నాను. డెయిరీ రంగంలో ఉన్న కోర్సులు, అర్హతలతోపాటు కెరీర్ ఏ విధంగా ఉంటుందో వివరించండి? పాల ఉత్పత్తిలో మనదేశం ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఎన్నో డెయిరీలు ఉన్నాయి. దీంతో డెయిరీ రంగంలో నిపుణులైన మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే డెయిరీ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టారు. ఈ కోర్సులో మిల్క్ ప్రాసెసింగ్, స్టోరేజీ, ప్యాకేజింగ్, రవాణా, పంపిణీ వంటి అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. డెయిరీ కోర్సులు: డిప్లొమా స్థాయిలో డెయిరీ టెక్నాలజీ, ఫుడ్ అండ్ డెయిరీ టెక్నాలజీ ఉన్నాయి. ఎంఎస్సీలో డెయిరీ కెమిస్ట్రీ/ టెక్నాలజీ, డెయిరీ ఇంజనీరింగ్, డెయిరీ మైక్రో బయాలజీ, డెయిరీ సైన్స్ కోర్సులూ, బీటెక్‌లో డెయిరీ టెక్నాలజీ, ఎంటెక్‌లో డెయిరీ కెమిస్రీ ్ట/టెక్నాలజీ, డెయిరీ మైక్రోబయాలజీ, పీహెచ్డీ లో డెయిరీ కెమిస్ట్రీ, డెయిరీ మైక్రో బయాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో ప్రవేశానికి ఇంటర్మీడియెట్ (10+2) బైపీసీలో ఉత్తీర్ణత సాధించాలి. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ(బీఈ/బీటెక్)లో ఉత్తీర్ణులై ఉండాలి. కెరీర్: డెయిరీ కోర్సులు చేసినవారికి ఉపాధి అవకాశాలకు కొదవలేదు. ఐస్‌క్రీమ్ యూనిట్లు, క్వాలిటీ కంట్రోల్ యూనిట్లు డెయిరీ టెక్నాలజిస్టులను నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మేనేజర్, ఎడ్యుకేషనిస్టు, డెయిరీ టెక్నాలజిస్టు, మైక్రో బయాలజిస్టు, న్యూట్రీషనిస్టు, డెయిరీ సైంటిస్టు, ఇండస్ట్రీ సూపర్వైజర్, డెయిరీ మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టుల్లో స్థిరపడొచ్చు. సొంత డెయిరీ ఫామ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ.6 వేల నుంచి రూ.12 వరకు ఆర్జించొచ్చు. తర్వాత అనుభవం ఆధారంగా నెలకు రూ.15 వేలకు పైగా వేతనం పొందొచ్చు. డెయిరీ కోర్సులను అందిస్తున్న సంస్థలు నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్: www.ndri.res.in ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ- ఆనంద్ వెబ్సైట్: www.aau.in ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయ వెబ్సైట్: www.igau.edu.in కర్ణాటక వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీస్ యూనివర్సిటీ-బీదర్ వెబ్సైట్: www.kvafsu.kar.nic.in మన రాష్ట్రంలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ - తిరుపతి డెయిరీ టెక్నాలజీలో బీటెక్, ఎంటెక్; ఎంఎస్సీలో డెయిరీంగ్ కోర్సులను అందిస్తోంది. వెబ్సైట్: www.svuu.edu.in -
ఉద్యోగానికి గ్యారెంటీ వెటర్నరీ సైన్స్
శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీని ఏర్పాటు లక్ష్యం? పశువైద్య విద్యలో నాణ్యత పెంచి, తద్వారా పశుగణాభివృద్ధిలో పురోగతి సాధించాలనే లక్ష్యంతో 2005 లో నాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. అత్యుత్తమ ప్రమాణాలతో వెటర్నరీ కోర్సులను అందించడంతో పాటు పరిశోధన ఫలితాలను, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం.. పశుగణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం.. డెయిరీ టెక్నాలజీ, ఫిషరీ రంగాన్ని అభివృద్ధి చేయడం.. శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ప్రధాన లక్ష్యాలు. ఆ లక్ష్య సాధనలో ఆశాజనకంగా ముందుకు సాగుతున్నాం. దాంతోపాటు పశుసంవర్థ్ధక శాఖ క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. పాలిటెక్నిక్ వెటర్నరీలో ప్రవేశానికి అర్హతలేమిటి? ఈ కోర్సును అందిస్తున్న కళాశాలలేవి? శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 10 యానిమల్ హజ్బెండరీ పాలిటెక్నిక్ కాలేజీలు; ఒక ఫిషరీ పాలిటెక్నిక్ ఉన్నాయి. యానిమల్ హజ్బెండరీ పాలిటెక్నిక్ కాలేజీల్లో.. ఒక్కోదానిలో 20 చొప్పున మొత్తం 200 సీట్లు ఉన్నాయి. డిప్లొమా ఇన్ యానిమల్ హజ్బెండరీ కోర్సులో చేరడానికి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కుల ప్రాతిపదికన ప్రవేశం కల్పిస్తారు. కోర్సు కాలవ్యవధి రెండు సంవత్సరాలు. కోర్సులో భాగంగా విద్యార్థులకు సబ్జెక్టు థియరీతోపాటు ప్రాక్టికల్ పరిజ్ఞానం కూడా కల్పిస్తారు. విద్యార్థులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తాం. ఫిషరీ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్ని సీట్లున్నాయి? అర్హతలు, ప్రవేశ ప్రక్రియ వివరాలు తెలపండి? వీటి సంఖ్యను పెంచే అవకాశం ఉందా? కృష్ణా జిల్లాలోని భావదేవరపల్లిలో మాత్రమే ఫిషరీ సైన్స్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇందులో 30 సీట్లు ఉన్నాయి. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థుల నుంచి డిమాండ్ పెరిగితే సీట్ల సంఖ్యను పెంచుతాం. వెటర్నరీ, ఫిషరీ సైన్స్‌లో డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ కోర్సులు చేసేందుకు అవకాశముంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలను దక్కించుకోవచ్చు. ఫిషరీ సైన్స్‌లో పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆక్వారంగంలో, ప్రైవేట్ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ (బీవీఎస్సీ) కోర్సును అందించే కళాశాలలు ఎన్ని ఉన్నాయి? ఈ కోర్సులో ప్రవేశానికి అర్హతలు ఏమిటి? మన రాష్ట్రంలో తిరుపతి, రాజేంద్రనగర్ (హైదరాబాద్), గన్నవరం (కృష్ణా జిల్లా), ప్రొద్దుటూరు (వైఎస్ఆర్ జిల్లా), కోరుట్ల (కరీంనగర్ జిల్లా)లో వెటర్నరీ కళాశాలలున్నాయి. వీటిలో తిరుపతి, రాజేంద్రనగర్, గన్నవరం వెటర్నరీ కళాశాలల్లో ఒక్కోదాంట్లో 60 చొప్పున మొత్తం 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రొద్దుటూరు, కోరుట్లలోని కళాశాలల్లో సుమారు 30 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా అదనంగా 30 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఎన్ఆర్ఐ కోటాలో ఒక్కొక్క కళాశాలకు 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా బీవీఎస్సీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. బీవీఎస్సీ కోర్సులు పూర్తిచేసిన వారికి ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా అవకాశాలు ఏమిటి? బీవీఎస్సీ పూర్తిచేసి ఉద్యోగం లభించక ఖాళీగా ఉండే పరిస్థితి ఎంతమాత్రం లేదని చెప్పొచ్చు. బీవీఎస్సీ పూర్తిచేసిన వారికి వెంటనే పశుసంవర్థ్ధక శాఖలో ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత విద్యాపరంగా చూస్తే.. ఎంవీఎస్సీ, పీహెచ్డీ కోర్సులు చేయవచ్చు. బ్యాచిలర్ స్థాయిలో ఎన్ని ఫిషరీ కళాశాలలు ఉన్నాయి. ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయి? నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరులోని ఫిషరీ సైన్స్ కళాశాల మాత్రమే బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ కోర్సును అందిస్తుంది. ఇందులో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. డిమాండ్‌ను బట్టి సీట్ల సంఖ్య పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఫిషరీ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు మత్స్య శాఖలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే ప్రైవేటు కంపెనీల్లో కూడా అవకాశాలను దక్కించుకోవచ్చు. ఆసక్తి ఉంటే సంబంధిత విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. బీటెక్ డెయిరీ టెక్నాలజీ కోర్సు, కళాశాలల వివరాలు తెలపండి? బీటెక్ డెయిరీ టెక్నాలజీ కోర్సును తిరుపతి, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని డెయిరీ టెక్నాలజీ కళాశాలలు అందిస్తున్నాయి. ఒక్కో కళాశాలలో సుమారు 30 సీట్ల చొప్పున మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్ (ఎంపీసీ) ర్యాంక్ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. డెయిరీ, వెటర్నరీ, ఫిషరీలో పీజీ కోర్సులకు సంబంధించి ప్రవేశ ప్రక్రియ వివరాలు తెలపండి? వెటర్నరీకి సంబంధించి పీజీ కోర్సు.. ఎంవీఎస్సీని తిరుపతి, రాజేంద్రనగర్, గన్నవరంలోని వెటర్నరీ కళాశాలలు అందిస్తున్నాయి. ఈ మూడు కళాశాలల్లో కలిపి 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఆయా కాలేజీల్లో అడ్మిషన్ కల్పిస్తారు. అలాగే ఫిషరీ సైన్స్‌లో పీజీ కోర్సును ముత్తుకూరు (నెల్లూరు జిల్లా)లోని ఫిషరీ కళాశాల అందిస్తుంది. ఈ కోర్సుకు సంబంధించి 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. యూనివర్సిటీ పరిధిలో ఎన్ని పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి? వీటి స్థాపన ప్రధాన ఉద్దేశం ఏమిటి? తెలంగాణ ప్రాంతంలో నాలుగు, సీమాంధ్రలో తొమ్మిది పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. పరిశోధనలు నిర్వహించడం, అరుదైన పశు జాతులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవడం వీటి ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వెటర్నరీ కళాశాలలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) గుర్తింపు ఉందా? కళాశాలల సంఖ్యను పెంచే అవకాశం ఉందా? ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వెటర్నరీ కళాశాలలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) గుర్తింపు లభించింది. ప్రస్తుతానికి కళాశాలల సంఖ్య పెంచే ఆలోచన లేదు. పశు సంపదకు సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? వాటి ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? తెలంగాణలో ఒకటి, సీమాంధ్రలో ఒకటి కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. రైతులకు పశుపోషణలో శిక్షణ ఇవ్వడం, కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని పశుపోషణపై అవగాహన కల్పించడం వీటి ప్రధాన లక్ష్యాలు. వెటర్నరీ సైన్స్, ఫిషరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నారా? ఏ సంస్థలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి? వెటర్నరీ విద్యార్థులకు కోర్సు పూర్తికాగానే ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. గెజిటెడ్ హోదాలో ఉద్యోగంలో చేరుతున్నారు. అలాగే ఫిషరీసైన్స్, డెయిరీ టెక్నాలజీ విద్యార్థులకు కూడా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించడంలేదు. కొన్ని బ్యాంక్‌లు, ఇతర సంస్థలు సంబంధిత క్యాంపస్‌లను సందర్శించి తమకు కావాల్సిన విద్యార్థులను నియమించుకుంటున్నాయి. ప్రపంచంలో మన దేశం పాల ఉత్పత్తిలో, పశుసంపదలో అగ్రస్థానంలో ఉంది. ఈ స్థానాన్ని నిలుపుకునే క్రమంలో ఒంగోలు జాతి, ముర్రా జాతి గేదెలు మొదలైన వాటి సంరక్షణ కు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒంగోలు, ముర్రా జాతి పశు సంపదలు నశించి పోకుండా నాలుగు కేంద్రాల్లో ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టాం. గుంటూరు జిల్లాలోని లాంఫాం, పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి, ప్రకాశం జిల్లా చదలవాడ, కర్నూలు జిల్లాలోని మహానందిలో ఒంగోలు జాతి పశువుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆ జాతి నశించకుండా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే వెంకటరామన్నగూడెంలో ముర్రాజాతి పశువుల సంరక్షణకు సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పాం. పుంగనూరు జాతి పశువులు అంతరించకుండా.. పుంగనూరులో ఫాం ఏర్పాటుచేసి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. విదేశీ విశ్వవిద్యాలయాలు ఆయా ప్రాంతాల్లో అంతరించిపోతున్న పశుజాతుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. వెటర్నరీ యూనివర్సిటీ ఇలాంటి కార్యక్రమాలను చేపడుతుందా? రాష్ట్ర పశుసంవర్థక శాఖ సహాయంతో కృత్రిమ గర్భధారణ పద్ధతులను చేపడుతున్నాం. తద్వారా అరుదైన ఒంగోలు, పుంగనూరు జాతి పశువుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికీ మనదేశంలో ఎక్కువ మంది పశుపోషణ అంటే కోళ్లు, మేకలు, గొర్రెలు, కుందేళ్లు, గిన్నెకోళ్లు, ఆవులు, ఎద్దులు, గేదెలు, పందులు, చేపలు, రొయ్యల పెంపకంపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? పశుజాతి అభివృద్ధి కోసం వాటికి ఎటువంటి ఆహారం ఇవ్వాలి? అనే విషయంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విశ్వవిద్యాలయ విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా పశుపోషణపై రైతులకు శిక్షణ ఇస్తున్నాం. -ప్రొఫెసర్ పి.సుధాకర్ రెడ్డి, రిజిస్ట్రార్, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ. ప్రపంచంలోనే అత్యధిక పశు సంపద కలిగిన దేశంగా భారత్ గుర్తింపు సాధించింది. ప్రపంచ పశు జనాభాలో భారత్ వాటా 15 శాతం. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పశు పరిశ్రమ వాటా ఎనిమిది శాతం. దేశంలో వెటర్నరీ కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు: ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)- ఇజత్‌నగర్; సీసీఎస్ హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (హిసార్); బాంబే వెటర్నరీ సైన్స్ కాలేజ్ (ముంబై); ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ఆనంద్). బీవీఎస్సీ పూర్తిచేసి ఉద్యోగం లభించక ఖాళీగా ఉండే పరిస్థితి ఎంతమాత్రం లేదని చెప్పొచ్చు. ఇటు ప్రభుత్వ, అటు ైప్రైవేటు రంగంలోనూ మెరుగైన అవకాశాలుంటాయి. ఉన్నత విద్యాపరంగా చూస్తే.. ఎంవీఎస్సీ, పీహెచ్డీ కోర్సులు చేయవచ్చు. బి.హరిమల్లికార్జున రెడ్డి, న్యూస్‌లైన్, యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి) -
12 నుంచి పాలిటెక్నిక్ కౌన్సెలింగ్
హైదరాబాద్, న్యూస్‌లైన్: వెటర్నరీ, హార్టీకల్చర్ కోర్సుల పాలిటెక్నిక్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని పది పశు సంవర్ధక, ఒక మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలోని మొత్తం 235 సీట్ల భర్తీకోసం ఈ ప్రక్రియ చేపట్టినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ సుధాకర్‌రెడ్డి బుధవారం తెలిపారు. అయితే, ప్రస్తుత సీమాంధ్ర ఉద్యమం నేపథ్యంలో అన్ని జిల్లాల వారికీ హైదరాబాద్‌లోని పాత వెటర్నరీ కళాశాలలో కౌన్సెలింగ్ చేపడుతున్నట్టు పేర్కొన్నారు. హార్టికల్చర్ వర్సిటీలో.. డాక్టర్.వైఎస్సార్.హార్టీకల్చర్ వర్సిటీ పరిధిలోని 130 సీట్లకు ఈ నెల 12న(ఒక్కరోజే) కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ బీ శ్రీనివాసులు తెలిపారు. రాష్ర్ట వ్యాప్తంగా 5 కళాశాలల్లో ఉన్న సీట్లకు పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్న గూడెంలోని వర్సిటీ పాలనా భవనంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.