
ఫైల్ ఫోటో
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని గుంటూరు లాం ఫాం పరిశోధన స్థానంలో అరుదైన దేశీయ జాతి అయిన పుంగనూరు గో జాతిపై పరిశోధనలు జరగనున్నాయి. ఈ జాతి అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.69.32 కోట్లతో మిషన్ పుంగనూరు ప్రాజెక్ట్‌కు అనుమతులిచ్చిన సంగతి తెల్సిందే. లాం ఫాం శాస్త్రవేత్తలు చేపట్టే ఈ పరిశోధనలకు శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ సాంకేతిక సహకారం అందించనుంది.
చదవండి: Polavaram Project: పోలవరం పనులు భేష్
లాం ఫాంలో ఇప్పటికే ఒంగోలు జాతిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇన్‌విట్రో ఫెర్టిలిటీ టెక్నాలజీ (ఐవీఎఫ్) ద్వారా పిండమార్పిడి పరిశోధనలు చేస్తున్నారు. పుంగనూరు జాతి అభివృద్ధికి నిర్వహించే పరిశోధనల్లో పిండాలు, ఆవుల అండాలను సేకరించి భద్రపరిచే ప్రక్రియ (స్టాండర్‌డైజేషన్) కోసం ఎక్కువ పునరుత్పత్తి సామర్థ్యం కల్గిన 10 మేలు జాతి ఆవులను గుర్తించి గుంటూరుకు తరలిస్తున్నారు. ఇప్పటికే 6 పశువులను పంపామని, మరో 4 పశువులను పరీక్షల అనంతరం పంపుతామని వర్సిటీ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి తెలిపారు.
చదవండి: అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు
Comments
Please login to add a commentAdd a comment