హైదరాబాద్, న్యూస్‌లైన్: వెటర్నరీ, హార్టీకల్చర్ కోర్సుల పాలిటెక్నిక్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని పది పశు సంవర్ధక, ఒక మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలోని మొత్తం 235 సీట్ల భర్తీకోసం ఈ ప్రక్రియ చేపట్టినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ సుధాకర్‌రెడ్డి బుధవారం తెలిపారు. అయితే, ప్రస్తుత సీమాంధ్ర ఉద్యమం నేపథ్యంలో అన్ని జిల్లాల వారికీ హైదరాబాద్‌లోని పాత వెటర్నరీ కళాశాలలో కౌన్సెలింగ్ చేపడుతున్నట్టు పేర్కొన్నారు.
హార్టికల్చర్ వర్సిటీలో..
డాక్టర్.వైఎస్సార్.హార్టీకల్చర్ వర్సిటీ పరిధిలోని 130 సీట్లకు ఈ నెల 12న(ఒక్కరోజే) కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ బీ శ్రీనివాసులు తెలిపారు. రాష్ర్ట వ్యాప్తంగా 5 కళాశాలల్లో ఉన్న సీట్లకు పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్న గూడెంలోని వర్సిటీ పాలనా భవనంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.
12 నుంచి పాలిటెక్నిక్ కౌన్సెలింగ్
Published Thu, Sep 5 2013 2:07 AM | Last Updated on Tue, Sep 18 2018 7:45 PM
Advertisement
Advertisement