తిరుపతిలో బిజిలీ బంద్‌ | YSRCP State Secretary Bhumana Karunakar Reddy Under The Bajille Bandu | Sakshi
Sakshi News home page

తిరుపతిలో బిజిలీ బంద్‌

Published Wed, Apr 25 2018 10:02 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YSRCP  State Secretary Bhumana Karunakar Reddy Under The  Bajille Bandu - Sakshi

తిరుపతిలో ర్యాలీ నిర్వహిస్తున్న భూమన కరుణాకరరెడ్డి, చలసాని శ్రీనివాస్, వివిధ పార్టీల నేతలు తిరుపతిలో ర్యాలీ నిర్వహిస్తున్న భూమన కరుణాకరరెడ్డి, చలసాని శ్రీనివాస్, వివిధ పార్టీల నేతలు

తిరుపతి కల్చరల్‌ : ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ, వామపక్షాలు, జనసేన, ప్రజాసంఘాల నేతలు మంగళవారం రాత్రి తిరుపతిలో బిజిలీ బంద్‌ చేశారు. పార్టీ జెండాలు చేతపట్టి ర్యాలీగా ఆర్టీసీ బస్టాండ్‌ వద్దనున్న అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రత్యేక హోదా కోసం తమనేత జగన్‌మోహన్‌రెడ్డి పోరాటాలు సాగించారన్నారు. ప్రత్యేక హోదా పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించారన్నారు. దాని అవసరాన్ని అగ్రభాగాన నిలిపారన్నా రు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారమే లక్ష్యంగా ప్రత్యేక హోదాను విస్మరించారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన వారిని జైళ్లకు పంపిన ఘనత చంద్రబాబుదేనన్నారు. హోదా మోసంలో చంద్రబాబు మొదటి ముద్దాయి అయితే, ప్రధాని మోదీ రెండవ ముద్దాయిగా నిలిచారన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆంధ్ర ప్రజానీకం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు. పోరాటాలు ఉధృతం చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ దగాకోరు మాటలతో మ భ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.

ప్రజా తిరుగుబాటుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బిజిలీ బంద్‌లో భాగంగా  రాత్రి 7నుంచి 7.30 గంటల వరకు విద్యు త్‌ బంద్‌ చేయించి నిరసన వ్యక్తం చేశారు. అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు టి.రాజేంద్ర, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్‌ కే.బాబు, ముద్రనారాయణ, ఆంజనేయులు, టి.రా జేంద్ర, ప్రసాద్, శివ, ఇమామ్, సాయికుమారి, కుసు మ, వనతి, పునీత, సీపీఐ నాయకులు చిన్నం పెంచలయ్య, విశ్వనాథ్, రాధాకృష్ణ, ఎన్‌డీ.రవి, జయలక్ష్మి, నదియా, సీపీఎం నాయకులు టి.సుబ్రమణ్యం, గు రుప్రసాద్, జయచంద్ర, నాగరాజ, సాయిలక్ష్మి, లక్ష్మి, హేమలత, మోహన్‌నాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి, ఏఐ ఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, జనసేన నేతలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement