bhumana karunakar reddy protest
-
‘స్కావెంజర్స్ కాలనీ వాసులకు బాబు సర్కార్ ద్రోహం చేస్తోంది’
-
తిరుపతిలో బిజిలీ బంద్
తిరుపతి కల్చరల్ : ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ, వామపక్షాలు, జనసేన, ప్రజాసంఘాల నేతలు మంగళవారం రాత్రి తిరుపతిలో బిజిలీ బంద్ చేశారు. పార్టీ జెండాలు చేతపట్టి ర్యాలీగా ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రత్యేక హోదా కోసం తమనేత జగన్మోహన్రెడ్డి పోరాటాలు సాగించారన్నారు. ప్రత్యేక హోదా పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించారన్నారు. దాని అవసరాన్ని అగ్రభాగాన నిలిపారన్నా రు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారమే లక్ష్యంగా ప్రత్యేక హోదాను విస్మరించారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన వారిని జైళ్లకు పంపిన ఘనత చంద్రబాబుదేనన్నారు. హోదా మోసంలో చంద్రబాబు మొదటి ముద్దాయి అయితే, ప్రధాని మోదీ రెండవ ముద్దాయిగా నిలిచారన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రజానీకం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు. పోరాటాలు ఉధృతం చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ దగాకోరు మాటలతో మ భ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజా తిరుగుబాటుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బిజిలీ బంద్లో భాగంగా రాత్రి 7నుంచి 7.30 గంటల వరకు విద్యు త్ బంద్ చేయించి నిరసన వ్యక్తం చేశారు. అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు టి.రాజేంద్ర, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్ కే.బాబు, ముద్రనారాయణ, ఆంజనేయులు, టి.రా జేంద్ర, ప్రసాద్, శివ, ఇమామ్, సాయికుమారి, కుసు మ, వనతి, పునీత, సీపీఐ నాయకులు చిన్నం పెంచలయ్య, విశ్వనాథ్, రాధాకృష్ణ, ఎన్డీ.రవి, జయలక్ష్మి, నదియా, సీపీఎం నాయకులు టి.సుబ్రమణ్యం, గు రుప్రసాద్, జయచంద్ర, నాగరాజ, సాయిలక్ష్మి, లక్ష్మి, హేమలత, మోహన్నాయుడు, చంద్రశేఖర్రెడ్డి, ఏఐ ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, జనసేన నేతలు పాల్గొన్నారు. -
నోట్ల రద్దులో శాస్త్రీయత లేదంటూ భూమన నిరసన
తిరుపతి : పెద్ద నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయం తీసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పెద్ద నోట్ల రద్దు, చిన్ననోట్ల కొరతను నిరసిస్తూ ఆయన మంగళవారం తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. కేంద్రం సదుద్దేశంతో నిర్ణయం తీసుకున్నా... అందులో శాస్త్రీయత లేదని అన్నారు. ప్రజల ఇబ్బందులపై తాము స్పందించాల్సి వచ్చిందని, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం మంచిదే అయినప్పటికీ జనాల ఊపిరి తీసేశారని భూమన వ్యాఖ్యానించారు. డబ్బుల కోసం సామాన్యులు నడిరోడ్డుపై పడిగాపులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తిప్పలు గుర్తించకుండా ....తాను వదిలిన బాణం నల్లకుబేరుల గుండెల్లో దిగి వాళ్లు నిద్రపోవడం లేదంటూ ప్రభుత్వం ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఓట్లు వేసి గెలిపించినవారు ...నోట్ల కోసం వీధుల్లోకి వచ్చారని భూమన అన్నారు. పెద్ద నోట్ల రద్దు అంటూ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8న భారత జాతికి వెల్లడిస్తే...మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం మూడు నెలల ముందే సమాచారం అందిందని భూమన విమర్శించారు. సీఎం,ఆయన అనుయాయులు ఈ మూడు నెలల్లో ఏపీ రాజధాని అమరావతి చుట్టుపక్కల భూములను కొని, లక్షల కోట్ల రూపాయిల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. దీనికి సమాధానం ఎవరు చెబుతారని భూమన ప్రశ్నించారు. మరోవైపు భూమన నిరసన దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో భూమన అరెస్ట్ను నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న భూమనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.