తిరుపతి నడిబొడ్డులో ఉంటున్న స్కావెంజర్స్ కాలనీ వాసులకు చంద్రబాబు నాయుడు సర్కార్ తీవ్ర ద్రోహం చేస్తోందని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ సీపీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్కావెంజర్స్ కాలనీలో ఉంటున్న వారంతా నిరుపేద గిరిజనులు, పారిశుద్ద్య కార్మికులని, వారు అనారోగ్యాలతో బాధపడుతున్నారని తెలిపారు.