Bijili Bandh
-
బిజిలీ బంద్ విజయవంతం
చోడవరం : ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు ప్రజలను మోసం చేయడాన్ని నిరసిస్తూ అఖిల పక్షాలు బిజిలీ బంద్‌ను నిర్వహించాయి. మంగళవారం రాత్రి దుకాణాలు, ఇళ్లలో విద్యుత్ దీపాలు ఆర్పేసి అంతా నిరసన తెలిపారు. ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన ఈ రోజును టీడీపీ, బీజేపీలు ప్రజలను నయవంచన చేసిన దినంగా అఖిల పక్షాలు బిజిలీ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌లో భాగంగా రాత్రి 7గంటల నుంచి 7.30గంటల వరకు చోడవరం పట్టణంతోపాటు పలు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు, కిరాణా, వస్త్ర, కిల్లీ దుకాణాలు, ఇళ్లల్లో సైతం లైట్లు బంద్ చేశారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛంగా ఈ బిజిలీ బంద్‌లో పాల్గొని ప్రత్యేక హోదా కావాలని మద్దతు పలికాయి. íసీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ, జనసేన పార్టీల నాయకులు తమ పార్టీల జెండాలు చేతబట్టి రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. కొత్తూరు జంక్షన్ వద్ద ముక్తకంఠంతో బీజేపీ, టీడీపీపై ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు రాష్ట్ర ప్రజలను మోసంచేశారని సీపీఐ డివిజన్ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, íసీపీఎం జిల్లా నాయకుడు నాగిరెడ్డి సత్యనారాయణ, వైఎస్సార్సీపీ పట్టణ యూత్ అధ్యక్షుడు గూనూరు రామకృష్ణ, జనసేన నాయకుడు జెర్రిపోతుల రమణాజీ ధ్వజమెత్తారు. త్వరలోనే టీడీపీ, బీజేపీలకు ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు. ఈ బిజిలీ బంద్‌లో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆందోళనలో సీపీఐ నాయకులు నేమాల హరి, చిరికి కొండబాబు, నేమాల నర్సింగరావు, ఆబోతు శ్రీనువాసరావు, బొర్రా కనకరాజు, వైఎస్సార్సీపీ మండల యూత్ అధ్యక్షుడు బలిరెడ్డి హరీష్, పట్టణ రైతు విభాగం ప్రతినిధి లెక్కల వెంకట్రావు, జనసేన నాయకులు నాని, తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతిలో బిజిలీ బంద్
తిరుపతి కల్చరల్ : ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ, వామపక్షాలు, జనసేన, ప్రజాసంఘాల నేతలు మంగళవారం రాత్రి తిరుపతిలో బిజిలీ బంద్ చేశారు. పార్టీ జెండాలు చేతపట్టి ర్యాలీగా ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రత్యేక హోదా కోసం తమనేత జగన్మోహన్రెడ్డి పోరాటాలు సాగించారన్నారు. ప్రత్యేక హోదా పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించారన్నారు. దాని అవసరాన్ని అగ్రభాగాన నిలిపారన్నా రు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారమే లక్ష్యంగా ప్రత్యేక హోదాను విస్మరించారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన వారిని జైళ్లకు పంపిన ఘనత చంద్రబాబుదేనన్నారు. హోదా మోసంలో చంద్రబాబు మొదటి ముద్దాయి అయితే, ప్రధాని మోదీ రెండవ ముద్దాయిగా నిలిచారన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రజానీకం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు. పోరాటాలు ఉధృతం చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ దగాకోరు మాటలతో మ భ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజా తిరుగుబాటుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బిజిలీ బంద్‌లో భాగంగా రాత్రి 7నుంచి 7.30 గంటల వరకు విద్యు త్ బంద్ చేయించి నిరసన వ్యక్తం చేశారు. అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు టి.రాజేంద్ర, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్ కే.బాబు, ముద్రనారాయణ, ఆంజనేయులు, టి.రా జేంద్ర, ప్రసాద్, శివ, ఇమామ్, సాయికుమారి, కుసు మ, వనతి, పునీత, సీపీఐ నాయకులు చిన్నం పెంచలయ్య, విశ్వనాథ్, రాధాకృష్ణ, ఎన్డీ.రవి, జయలక్ష్మి, నదియా, సీపీఎం నాయకులు టి.సుబ్రమణ్యం, గు రుప్రసాద్, జయచంద్ర, నాగరాజ, సాయిలక్ష్మి, లక్ష్మి, హేమలత, మోహన్‌నాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి, ఏఐ ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, జనసేన నేతలు పాల్గొన్నారు. -
బిజిలీ బంద్
కడప కార్పొరేషన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు నిర్వహించిన బిజిలీ బంద్ జిల్లాలో విజయవంతమైంది. వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించడంతో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు బంద్‌లో పాల్గొని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకూ దీపాలు ఆర్పి వేసి నిరసన తెలిపారు. పులివెందులలోమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి పూల అంగళ్ల వరకూ ర్యాలీగా వెళ్లి లైట్లు ఆఫ్ చేసి బ్లాక్ డే నిర్వహించారు. రైల్వేకోడూరులోని వైఎస్ఆర్ సర్కిల్లో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులు ప్రదర్శించారు. కడపలో ఏడు రోడ్ల కూడలి వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో లైట్లు ఆర్పి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కరిముల్లా, నగర అధ్యక్షుడు షఫీ, నగర మహిళా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఈశ్వరయ్య, ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు నీలి శ్రీనివాసరావు, సత్తార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు సుధాకర్ రాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు. రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో దీపాలు ఆర్పి కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కమలాపురంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వీఎన్ పల్లిలో మండల అధ్యక్షుడు రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌లో విద్యుత్ ఆపివేసి నిరసన తెలిపారు. బద్వేల్లో పార్టీ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయంలో నల్లబ్యాడ్జీలు ధరించి లైట్లు ఆర్పి నిరసన తెలిపారు. పార్టీ నాయకులు సుందరరామిరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, గోపాలస్వామి పాల్గొన్నారు. రాజంపేటలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేట పాతబస్టాండులో లైట్లు ఆర్పివేసి నిరసన తెలిపారు. పట్టణ అధ్యక్షులు పోలా శ్రీనివాసులరెడ్డి, చొప్పాయల్లారెడ్డి పాల్గొన్నారు. -
హోదా కోరుతూ చేసిన బిజిలీ బంద్ విజయవంతం