రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న దృశ్యం
కడప కార్పొరేషన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు నిర్వహించిన బిజిలీ బంద్ జిల్లాలో విజయవంతమైంది. వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించడంతో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, శ్రేణులు బంద్‌లో పాల్గొని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకూ దీపాలు ఆర్పి వేసి నిరసన తెలిపారు. పులివెందులలోమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి పూల అంగళ్ల వరకూ ర్యాలీగా వెళ్లి లైట్లు ఆఫ్ చేసి బ్లాక్ డే నిర్వహించారు. రైల్వేకోడూరులోని వైఎస్‌ఆర్ సర్కిల్‌లో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులు ప్రదర్శించారు.
కడపలో ఏడు రోడ్ల కూడలి వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో లైట్లు ఆర్పి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కరిముల్లా, నగర అధ్యక్షుడు షఫీ, నగర మహిళా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఈశ్వరయ్య, ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు నీలి శ్రీనివాసరావు, సత్తార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు సుధాకర్ రాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు. రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో దీపాలు ఆర్పి కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కమలాపురంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వీఎన్ పల్లిలో మండల అధ్యక్షుడు రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌లో విద్యుత్ ఆపివేసి నిరసన తెలిపారు. బద్వేల్‌లో పార్టీ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయంలో నల్లబ్యాడ్జీలు ధరించి లైట్లు ఆర్పి నిరసన తెలిపారు. పార్టీ నాయకులు సుందరరామిరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, గోపాలస్వామి పాల్గొన్నారు. రాజంపేటలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేట పాతబస్టాండులో లైట్లు ఆర్పివేసి నిరసన తెలిపారు. పట్టణ అధ్యక్షులు పోలా శ్రీనివాసులరెడ్డి, చొప్పాయల్లారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment