
వరదయపాలెం, సత్యవేడు మండలాల్లో విస్తరించిన శ్రీసిటీ సెజ్ ఉన్న11 గ్రామాలను మినహాయించి, తుడా పరిధిలోకి కొత్తగా 3260 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి, అమరావతి: తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి మరో 13 మండలాలను కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరి మున్సిపాలిటీ సహా మరో 13 మండలాలను తుడా(టీయూడీఏ)లో విలీనం చేస్తూ పురపాలక శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వరదయపాలెం, సత్యవేడు మండలాల్లో విస్తరించిన శ్రీసిటీ సెజ్ ఉన్న11 గ్రామాలను మినహాయించి, తుడా పరిధిలోకి కొత్తగా 3260 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దీంతో తుడా పరిధి 4472 చదరపు కిలోమీటర్లకు చేరింది.(చదవండి: మహిళలూ..! మహరాణులూ..!!)