సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అవసరానికి మించి రెట్టింపు స్థాయిలో ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి వెల్లడించారు. శనివారం స్థానికంగా మీడియాతో మాట్లాడిన ఆయన సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు, డీజీపీ స్థాయి అధికారితో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకున్నామని వివరించారు. రాష్ట్రంలో ఖనిజ సంపదను కొల్లగొట్టి ఇసుకను అమ్ముకున్న చరిత్ర చంద్రబాబు, లోకేశ్, ఆ పార్టీ శాసనసభ్యులదని విమర్శించారు.
చంద్రబాబు ఉపయోగిస్తున్న భాష సంస్కారహీనంగా, అభ్యంతరంగా ఉందని ఆక్షేపించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడించేందుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఇంచార్జ్‌గా నియమించబోతున్నామని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా సొంత జిల్లా కుప్పంలో మెజార్టీ సాధించలేని చంద్రబాబు రాష్ట్రంలో పార్టీని ఏమేరకు నడిపిస్తారో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment