న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్‌పై విడుదలవడంతో కొత్త వాదనకు తెరలేచింది. సిసోడియాను మళ్లీ డిప్యూటీ సీఎంగా నియమిస్తారని ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్)వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా లిక్కర్ కేసులో జైలులో ఉండడంతో సిసోడియా డిప్యూటీ సీఎంగా ఉంటేనే ఇటు పాలనాపరంగా అటు రాజకీయంగా పార్టీకి బలం చేకూరుతుందని ఆప్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను త్వరలోనే మళ్లీ డిప్యూటీ సీఎంగా నియమించి కీలకమైన ఆర్థిక, విద్యా శాఖలు కేటాయిస్తారని చెబుతున్నారు.
గతేడాది ఫిబ్రవరిలో అరెస్టయిన తర్వాత సిసోడియా తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్న సిసోడియాకు శుక్రవారం(ఆగస్టు 9) సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం సాయంత్రమే ఆయన జైలు నుంచి విడుదలై సీఎం కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను కలిశారు.ప్రస్తుతం సిసోడియా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment