Narayana swami
-
100 రోజుల పాలనపై నారాయణ స్వామి రియాక్షన్
-
చంద్రబాబు నరరూప రాక్షసుడు...సీఎం జగన్ దాడిపై నారాయణ స్వామి రియాక్షన్...
-
చిన్నశేషునిపై బద్రీనారాయణుడు
చంద్రగిరి(తిరుపతి జిల్లా): శ్రీవారి దేవేరి శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన శుక్రవారం రాత్రి చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో వెన్నముద్ద చేతబట్టిన కృష్ణుడి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామునే మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో నేత్రపర్వంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిపారు. సాయంత్రం ఆస్థాన మండపంలో వేడుకగా ఊంజల్‌సేవ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వేంచేపుగా వాహన మండపానికి తీసుకొచ్చి చిన్నశేష వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర వజ్రవైడూర్య ఆభరణాలతో అమ్మవారిని బద్రీనారాయణుడిగా అలంకరించారు. రాత్రి ఏడు గంటలకు మంగళ వాయిద్యం, భజన బృందాలు, భక్తుల కోలాటాలు, జియ్యర్ స్వాముల దివ్యప్రబంధ పారాయణం, వేదపండితుల వేదపారాయణం నడుమ అమ్మవారు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. కాగా, బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువ్రస్తాల సమర్పణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు జేఈవో వీరబ్రహ్మం స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రారి్థంచినట్టు తెలిపారు -
‘అందుకే ఎన్నికల బహిష్కరణ డ్రామా’
సాక్షి, చిత్తూరు: నీచ రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు అని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల బహిష్కరణ చంద్రబాబు పిరికితనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు నిర్ణయంతో టీడీపీలో ఎవరూ మిగలరని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ధాటికి చంద్రబాబు పారిపోయారని ఎద్దేవా చేశారు. తిరుపతి ఉపఎన్నికలో టీడీపీకి డిపాజిట్ కూడా రాదని మంత్రి కొడాలి నాని అన్నారు. టీడీపీ సైకిల్‌కు పంక్చర్.. టీడీపీ సైకిల్‌కు పంక్చర్ అయిందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పారిపోతున్నారన్నారు. నవరత్నాలతో వైఎస్ జగన్.. ప్రజలకు మేలు చేస్తున్నారని పేర్కొన్నారు. మాలమదిగలను ఐక్యం చేసిన ఘనత సీఎం జగన్‌దని నారాయణస్వామి అన్నారు. బాబుకు ఓటమి భయం.. గుంటూరు: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. తెర వెనుక చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఒక్కటేనన్నారు. డిపాజిట్లు రావని తెలిసే ఎన్నికల బహిష్కరణ డ్రామా ఆడుతున్నారని మోపిదేవి దుయ్యబట్టారు. టీడీపీని భూస్థాపితం చేశారు.. వైఎస్సార్ జిల్లా: ఎన్నికలంటే చంద్రబాబుకు భయం పట్టుకుందని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. టీడీపీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరన్నారు. చంద్రబాబు టీడీపీని భూస్థాపితం చేశారని కొరముట్ల శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. చదవండి: టీడీపీలో కాకరేపుతోన్న తిరుగుబాటు నేతల తీరు భక్తుల అనుమతిపై టీటీడీ కీలక నిర్ణయం.. -
కిరణ్ బేడికి బై బై.. తమిళిసైకి బాధ్యతలు
సాక్షి చెన్నై/న్యూఢిల్లీ: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కీలక పరిణామాలు సంభవించాయి. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్రం పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారని తెలిపింది. మరొకరిని నియమించే వరకు ఆ బాధ్యతలు తమిళిసై నిర్వర్తిస్తారు. సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. మేలో జరగనున్న ఎన్నికల్లో కిరణ్ బేడీపై వ్యతిరేకతను ప్రతిపక్షాలు ప్రధాన ప్రచారాంశంగా మలుచుకోరాదనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత నెలలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన ఎ.నమశ్శివాయం ప్రధాన డిమాండ్లలో కిరణ్ బేడీ తొలగింపు ఒకటని సమాచారం. నారాయణ స్వామి ఏమంటున్నారు? మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడీ 2016 మేలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి నారాయణ స్వామి ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె పనితీరు అప్రజాస్వామికంగా ఉందంటూ నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు. 2019లో, తిరిగి గత నెలలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికార నివాసం ఎదుట నారాయణ స్వామి ధర్నాకు కూడా దిగారు. సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ..‘మా ఎమ్మెల్యే మల్లాడి నారాయణ స్వామిని కిరణ్ బేడీ పలుమార్లు వేధింపులకు గురి చేశారు. దీనిపై రాష్ట్రపతి కోవింద్‌కు కూడా ఫిర్యాదు చేశాం. రోజువారీ పరిపాలనా వ్యవహారాల్లోనూ కిరణ్ బేడీ జోక్యం చేసుకుంటున్నారు. సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’అని చెప్పారు. తన ప్రభుత్వానికి ఇప్పటికీ మెజారిటీ ఉందని సీఎం నారాయణ స్వామి ఎన్డీటీవీతో అన్నారు. కృష్ణారావు, కుమార్ల రాజీనామాలను ఆమోదించలేదనీ, అవి ఇంకా స్పీకర్ పరిశీలనలోనే ఉన్నాయన్నారు. నేడు రాహుల్ రాక బలం కోల్పోవడంతో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సీఎం నారాయణస్వామి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో మొత్తం 30 స్థానాలకు గాను 2016 ఎన్నికల్లో 15 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ముగ్గురు డీఎంకే ఎమ్మెల్యేలు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మిత్రపక్షాలుగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డుతున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనవేలును ఆ పదవి నుంచి పార్టీ తొలగించింది. ఇటీవల మంత్రి నమశ్శివాయం, ఎమ్మెల్యే దీపా యన్దన్ సైతం రాజీనామా చేశారు. కొన్ని రోజుల క్రితం మంత్రి పదవికి రాజీనామా చేసిన మల్లాడి కృష్ణారావు ఈనెల 15న ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్‌కుమార్ మంగళవారం తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు అందజేశారు. స్పీకర్‌ను కలుపుకుని అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 10కి పడింది. మూడు డీఎంకే, ఒక స్వతంత్ర అభ్యర్థులను కలుపుకున్నా 14కి పరిమితం కాగలదు. ప్రతిపక్షంలో ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3తో కలుపుకుని మొత్తం 14 సభ్యుల బలం ఉంటుంది. అధికార, ప్రతిపక్షాలకు సమబలం ఏర్పడడంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఒక ఎమ్మెల్యేకు బీజేపీ గాలం వేస్తే మ్యాజిక్ ఫిగర్ 15 స్థానాలతో అధికారంలోకి రాగలదు. ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిన నేపథ్యంలో పుదుచ్చేరి చేరుకున్న రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ దినేష్ గుండూరావుతో నారాయణస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు సమాలోచనలు జరిపారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్నందున మంత్రివర్గమే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
‘మద్యం ధరల తగ్గింపునకు కారణం అదే’
సాక్షి, విజయవాడ : దశలవారీ మద్య నిషేధంలో భాగంగానే ధరలను క్రమబద్దీకరించామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. కొందరు పేదలు శానిటైజర్లు తాగి చనిపోవడం చాలా బాధాకరమని, అందుకే చీప్ లిక్కర్‌పై ధరలను తగ్గించామని పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 43 వేల బెల్ట్ షాపులు తొలగించామని, ఇప్పటికే 33 శాతం మద్యం షాపులు, బార్లను తగ్గించామని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దశల వారిగా మద్య నిషేధానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే చంద్రబాబు, టీడీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ కేంద్రాల్లో అక్రమ మద్యం అమ్ముతూ పట్టుబడిన విషయాన్ని ఉపముఖ్యమంత్రి గుర్తుచేశారు. (ఇంగ్లిష్ లేకుంటే మీ ముందు ఇలా మాట్లాడగలిగేవాడినా?) దాదాపు 80 శాతం మంది టీడీపీ నేతలు అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న సంగతి వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ హయాంలో మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచినట్లే ఇప్పుడు కూడా చంద్రబాబు అలాగే వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారిందన్నారు. కానీ, సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని ఏర్పాటు చేశారని నారాయణ స్వామి వెల్లడించారు. దీని ద్వారా మూడు నెలల్లో 36 వేల కేసులుపెట్టి 46 వేల మందిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. (తొలుత ఉత్తర్వులు.. ఆపై సవరణ) -
లేకపోతే అమెరికాను మించిపోతాము
సాక్షి, చిత్తూరు : జిల్లాలో నిన్నటి వరకు ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు ఉండిందని, కొత్తగా మరో ఐదుగురికి పాజిటివ్ రావటంతో ఆ సంఖ్య ఆరుకు చేరిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. పాజిటివ్ కేసులలో ఢిల్లీ, చెన్నై నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారని, క్వారంటైన్లో ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా బాధితుల కోసం డాక్టర్లు 24 గంటలు పని చేస్తున్నారని చెప్పారు. పోలీసులు కూడా బార్డర్లు లాక్ చెయ్యాలని సూచించారు. జిల్లాలో ఎవరూకూడా తప్పించుకుని తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వాలంటీర్లు కూడా కొత్త వ్యక్తులు ఊర్లోకి వస్తే వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. మారోమారు కరోనాపై టాస్క్ ఫోర్స్ మీటింగ్ నిర్వహిస్తామని చెప్పారు. లేకపోతే అమెరికాను మించిపోతాము కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు సహకరించాలని, లేకపోతే అమెరికాను మించిపోతామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హెచ్చరించారు. మైనారిటీలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇండియాలో తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని, నేడు ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయిందని తెలిపారు. కరోనా వైరస్‌కి మెడిసిన్ లేదని, స్వీయ నియంత్రణే మార్గమని చెప్పారు. అన్ని మతాల వారు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. -
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అధికార వికేంద్రీకరణ
-
వైఎస్సార్ సీఎం అయ్యాకే సీమకు గుర్తింపు
సాక్షి, చిత్తూరు : దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాకే రాయలసీమకు గుర్తింపు వచ్చిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నారావారిపల్లెలో జరిగిన ప్రజాసదస్సులో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఏనాడూ రాయలసీమను పట్టించుకోలేదని అన్నారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. అధికార వికేంద్రీకరణ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఇందుకు నారావారిపల్లెకు వచ్చిన జనమే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అధికార వికేంద్రీకరణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అధికార వికేంద్రీకరణ జరిగిందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం నారావారిపల్లెలో జరిగిన ప్రజాసదస్సులో ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. నిపుణుల కమిటీ సూచన మేరకే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అందుకే చంద్రబాబును ఓడించి కుప్పంకు పంపారు నారావారిపల్లె చాలా మంచిదని, అందుకే చంద్రబాబునాయుడిని ఓడించి కుప్పానికి పంపారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఆదివారం నారావారిపల్లెలో జరిగిన ప్రజాసదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం బాగుండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు ప్రతి కుటుంబం సీఎం జగన్‌ను దేవుడిలా భావిస్తున్నారని అన్నారు. -
చంద్రబాబును ఓడించేందుకు డిప్యూటీ సీఎం : పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అవసరానికి మించి రెట్టింపు స్థాయిలో ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి వెల్లడించారు. శనివారం స్థానికంగా మీడియాతో మాట్లాడిన ఆయన సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు, డీజీపీ స్థాయి అధికారితో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకున్నామని వివరించారు. రాష్ట్రంలో ఖనిజ సంపదను కొల్లగొట్టి ఇసుకను అమ్ముకున్న చరిత్ర చంద్రబాబు, లోకేశ్, ఆ పార్టీ శాసనసభ్యులదని విమర్శించారు. చంద్రబాబు ఉపయోగిస్తున్న భాష సంస్కారహీనంగా, అభ్యంతరంగా ఉందని ఆక్షేపించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడించేందుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఇంచార్జ్‌గా నియమించబోతున్నామని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా సొంత జిల్లా కుప్పంలో మెజార్టీ సాధించలేని చంద్రబాబు రాష్ట్రంలో పార్టీని ఏమేరకు నడిపిస్తారో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. -
చంద్రబాబు గుణగణాలు అందరికీ తెలుసు
-
ఆద్యంతం ఉత్కంఠభరితంగా..
సాక్షి, గన్నవరం: జాతీయస్థాయి ఎడ్లబండి లాగుడు, ఆవుల అందాల పోటీలను కృష్ణా జిల్లా గన్నవరంలో ఎన్టీఆర్ పశువైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో మంగళవారం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు ఆళ్ల నాని, రంగనాథరాజు ప్రారంభించారు. నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వరంలో ఐదు రోజులు పాటు పోటీలు జరగనున్నాయి. తొలిరోజు పదిహేడు జతల ఒంగోలు జాతి బసవన్నలు కాలు దువ్వాయి. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ పోటీల్లో తమ యజమానిని, ఊరిని ప్రథమస్థానంలో నిలిపేందుకు పోటీలు పడ్డాయి. ఈ పోటీలకు దేశం నలుమూలల నుంచి 150 జతల ఎడ్లు తరలి రానున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి ఎండ్లబండ లాగుడు పోటీలను తిలకించారు. ఈ పోటీలు 13 వ తేదీ వరుకు జరుగుతాయి. పోటీల్లో గెలుపొందిన ఎడ్ల జతలకు రూ.20 లక్షలకు పైగా నగదు బహుమతులు ఇవ్వనున్నారు. -
‘బాబు వచ్చారు.. బురద రాజకీయం చేసి వెళ్లారు’
సాక్షి, విజయవాడ: వరద ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి భరోసా ఇచ్చారు. కృష్ణలంక ముంపు ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. తమ కష్టాలను వరద బాధితులు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రికి వెళ్లబోసుకున్నారు. నాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందరికీ రేషన్ కార్డులిస్తే.. చంద్రబాబు వాటిని రద్దు చేశారని డిప్యూటీ సీఎం వద్ద బాధితులు వాపోయారు. ఇళ్లు ముంపుకి గురై ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు వచ్చి బురద రాజకీయం చేసి వెళ్లారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో లేకపోయినా ఇళ్ల పట్టాలు ఇస్తానని చంద్రబాబు చెప్పడం పట్ల బాధితులు విస్మయం వ్యక్తం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మించి ముంపు నుంచి కాపాడాలని డిప్యూటీ సీఎంకు బాధితులు విన్నవించారు. డ్వాక్రా మహిళలను టీడీపీ నట్టేట ముంచింది.. 14వ డివిజన్ భూపేష్ గుప్తా నగర్ ప్రాంతంలో పర్యటించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి డ్వాక్రా మహిళలు తమ గోడును చెప్పుకున్నారు. టీడీపీ హయాంలో ఇల్లు ఇస్తామని చెప్పి..ఇప్పటి వరకు కేటాయించలేదని డిప్యూటీ సీఎం వద్ద డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో స్థలాలు ఇస్తామని చెప్పి డీడీలు కట్టమన్నారని.. చాలా మంది రూ.50 వేలు వరకు కట్టినా.. నేటికీ పట్టించుకోలేదన్నారు. ఇల్లు కేటాయిస్తారనే ఆశతో ఐదు రూపాయలకు వడ్డీకి తెచ్చి డబ్బులు కట్టామన్నారు. ప్లాట్ నెంబర్లు కేటాయించామని చెప్పారని.. అక్కడికి వెళ్ళిచూస్తే ఎటువంటి ప్లాట్ నెంబర్లు లేవని వాపోయారు. డ్వాక్రా మహిళలను టీడీపీ నట్టేట ముంచిందన్నారు. తమకు న్యాయం జరిపించాలని కోరారు. చంద్రబాబును నిలదీయండి.. ఓట్లు కోసం చంద్రబాబు పేదలను మోసం చేశారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఆ భూములు ఎక్కడ ఉన్నాయో.. ఎక్కడ ఇల్లు కట్టి ఇస్తామని చెప్పారో.. డ్వాక్రా మహిళలే చంద్రబాబును నిలదీయాలన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేస్తామన్నారు. -
పరిశ్రమలను ఆదుకుంటాం : గౌతమ్ రెడ్డి
సాక్షి, తిరుపతి : రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే వారికి అన్ని వసతులు కల్పించి, పరిశ్రమల అభివృద్ధికి అన్ని విధాలా దోహదపడతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. తిరుపతి ఎస్వీయూ సెనేట్ హాల్లో శుక్రవారం జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, పరిశ్రమల ఏర్పాటులో ఎలాంటి అవినీతి అక్రమాలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డిజిటల్‌తో పాటు ఐటీబీసీ కంపెనీని మంత్రి ప్రారంభించారు. ఈ సదస్సులో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఏపీఐసీసీ చైర్మన్ రోజా, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎంతటి వారైనా..ఏడుకు తలొంచాల్సిందే..
సాక్షి, నెల్లిమర్ల: నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడోసారి సెంటిమెంట్ బలంగా ఉంది. ఆరుసార్లు ఓటమి లేకుండా వరుసగా ఎమ్మెల్యేలుగా గెలిచిన రాజకీయ ఉద్ధండులు సైతం ఏడోసారి ఓటమి చవిచూశారు. 2009లో చేపట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటివరకు సతివాడ, భోగాపురం నియోజకవర్గాలుండేవి. సతివాడ నియోజకవర్గంలో సీనియర్ నేత, ప్రస్తుత వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స సాంబశివరాజు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1967 నుంచి 1994 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి తిరుగులేని విజయం సాధించారు. అయితే 1994లో ఏడోసారి ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆయన టీడీపీ అభ్యర్థి పొట్నూరు సూర్యనారాయణ చేతిలో మొట్టమొదటి సారిగా ఓటమి చూశారు. అనంతరం 1999, 2004 లోనూ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. అలాగే భోగాపురం నియోజకవర్గంలో తిరుగులేని నేతగా పేరున్న పతివాడ నారాయణస్వామి నాయుడుకు కూడా ఏడు సెంటిమెంట్ తగిలింది. ఆ నియోజకవర్గంలో 1983 నుంచి 2009 వరకు ఆయన వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ ఓడిపోలేదు. అయితే 2009లో నెల్లిమర్ల నియోజకవర్గం కొత్తగా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి ఏడోసారి బరిలో దిగిన పతివాడ అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఇప్పటి వైఎస్సార్సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడి చేతిలో ఓడిపోయారు. అనంతరం 2014 ఎన్నికల్లో పతివాడ కూడా గెలుపొందారు. దీంతో నియోజకవర్గంలో ఏడు సెంటిమెంటు బాగా పనిచేసిందని ఓటర్లు ఇప్పటికీ చర్చించుకుంటారు. మంత్రులుగా.. ప్రోటెం స్పీకర్లుగా పనిచేసిన నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన ఇద్దరు రాజకీయ ఉద్ధండులు ఏడోసారి ఓడిపోవడం నిజంగానే ’సెంటిమెంటేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
మైనింగ్ సూత్రధారి మంత్రి సోదరుడే ?
సాక్షి, గుంటూరు: గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెం వద్ద మట్టి దోపిడీకి నారాయణస్వామి అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నారాయణస్వామి ఎవరు? అనే దానిపై ఆరా తీస్తే ఆయన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు వరుసకు సోదరుడవుతాడంటూ సొంత పార్టీ నేతలే చెవులు కొరక్కుంటున్నారు. మంత్రి కనుసన్నల్లోనే తన బంధువులు, జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రావెల కిషోర్‌బాబు చేసిన వ్యాఖ్యలు రెండు రోజులుగా టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదంతా కనుసన్నల్లోనే.. అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం మంత్రికి చెప్పినా పట్టించుకోవడం లేదంటూ రావెల చేసిన వ్యాఖ్యలతో ఇదంతా మంత్రి కనుసన్నల్లోనే జరుగుతుందనే అనుమానాలకు బలం చేకూర్చింది. రావెల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ప్రత్తిపాటి తన పేరు చెప్పుకుని కొందరు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించడం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారుల్లో చలనం ఏదీ? మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరు చెప్పుకొని నారాయణ స్వామి అనే వ్యక్తి మరికొందరితో కలిసి అటవీ భూములు, పోరంబోకు భూములు అనే తేడా లేకుండా మట్టిని అక్రమంగా అమ్ముకుంటూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ జేబుల్లో వేసుకుంటున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. అధికార టీడీపీ నేతలు చేస్తున్న అక్రమ మైనింగ్ వద్దకు వెళ్లి రెండు పొక్లెయిన్లు, రెండు లారీలను అధికారులకు పట్టించినప్పటికీ వారిలో చలనం లేకపోవడం చూస్తుంటే అధికార పార్టీ ముఖ్య నేతల ఒత్తిడి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మట్టి దోపిడీకి పాల్పడుతున్న నారాయణస్వామి మంత్రి పుల్లారావుకు వరుసకు సోదరుడు అవుతాడనే దానిపై ఇప్పుడు టీడీపీలో తీవ్ర చర్చ నడుస్తుంది. సొంత బంధువుతోపాటు, తన అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నప్పటికీ తనకేమీ తెలియదని మంత్రి పుల్లారావు బుకాయిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మంత్రి అండతోనే మట్టి దోపిడీ అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే అడ్డు పడుతున్నా లెక్కచేయకుండా మట్టి దోపిడీ చేస్తున్నారంటే మంత్రి అండలేనిదే ఈ స్థాయిలో రెచ్చిపోతారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎవరూ దీని జోలికి వెళ్లకపోవడం చూస్తుంటే రావెల కిషోర్‌బాబు చేసిన వ్యాఖ్యలు వాస్తవాలేనని అర్ధమవుతుంది. నిజంగా మంత్రికి అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఎటువంటి సంబంధం లేకపోతే సొంత పార్టీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నట్లు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న నారాయణస్వామితోపాటు, మరికొందరు టీడీపీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిపోయి మాటలకే పరిమితం అవడం అనుమానాలకు తావిస్తుంది. అంతేకాకుండా అక్రమ మైనింగ్ జరుగుతున్నా పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ సొంతపార్టీ నేతలనే ప్రశ్నిస్తున్నారు. మైనింగ్ ఏడీ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే రావెల డిమాండ్ చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. -
ఒకే వేదికపై ఆ ఇద్దరు
సాక్షి, చెన్నై : ఆరు నెలల అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ఒకే వేదిక మీదకు వచ్చారు. ఇకనైనా వివాదాల్ని వీడి పుదుచ్చేరి ప్రగతికి ఈ ఇద్దరు సమిష్టిగా పనిచేస్తారన్న ఎదురుచూపులు పెరిగాయి. పుదుచ్చేరిలో నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో కిరణ్, ఆమె ప్రయత్నాల్ని తిప్పికొట్టే విధంగా సీఎం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కాలం నెట్టుకు వచ్చారు. తమ పథకాల్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, ప్రజల్ని పాలకులు రెచ్చగొట్టిన సందర్భాలు అనేకం. కిరణ్ అడ్డుకునే విధంగా ఆమె పర్యటనల్లో ప్రజల్లో వ్యతిరేకత సాగడం ఇందుకు నిదర్శనం. ఆరు నెలలుగా ఈ ఇద్దరి మధ్య సాగుతూ వచ్చిన సమరం, తాజాగా సమసినట్టేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఆరు నెలలుగా సీఎం నిర్ణయాల్ని గవర్నర్, గవర్నర్ నిర్ణయాల్ని సీఎంవ్యతిరేకించడం, అడ్డు పడడం వంటి చర్యలు సాగాయి. అలాగే, ప్రభుత్వ వేడుకల్లో ఈ ఇద్దరు ఒకే వేదిక మీదకు సైతం రాలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలో, బుధవారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలోనూ ఈ ఇద్దరు ఒకే వేదిక మీద ప్రత్యక్షం కావడం విశేషం. ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఇకనైనా సమసినట్టేనా అన్న ప్రశ్న బయలు దేరింది. వేదిక మీద ఈ ఇద్దరు అందర్నీ ఆకర్షించే రీతిలో కనిపించడంతో, ఇక సమష్టిగా పుదుచ్చేరి ప్రగతికి శ్రమిస్తారా లేదా, విభేదాలతో కాలం మరింతగా నెట్టుకు వస్తారా అన్నది వేచి చూడాల్సిందే. -
చంద్రబాబు పెద్ద నటుడు: పాండిచ్చేరి సీఎం
తూర్పుగోదావరి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద నటుడని పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోలవరం మహాపాదయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఏపీకి చెందిన కాంగ్రెస్ అగ్రనాయకులు పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సభలో నారాయణస్వామి మాట్లాడుతూ..చంద్రబాబుకు పబ్లిసిటీ పైనే పిచ్చి అని, ఏపీలో అదే విధమైన పరిపాలన సాగుతోందని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మోదీ ప్రభుత్వం నుంచి బయటకొచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సవాల్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఏపీ ప్రజల జీవనాడి అని, పోలవరానికి ప్రాణం పోసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని ఘంటా పధంగా చెప్పారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని అభివర్ణించారు. ప్రత్యేక హోదాలాగే పోలవరాన్ని చంద్రబాబు నాయుడు కేంద్రానికి తాకట్టు పెడతారనే అనుమానం ఉందన్నారు. టీడీపీ ఎంపీలు వేడుకుంటే గానీ ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ చంద్రబాబుకు దక్కలేదని విమర్శించారు. చంద్రబాబు గతంలోలాగ ప్రధాని మోదీతో రహస్య భేటీలు జరిపితే కుదరదన్నారు. ఈ పాదయాత్రకు మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, జీవీ హర్షకుమార్లు మద్ధతు తెలిపారు. మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం నుంచి పోలవరం మహా పాదయాత్ర ప్రారంభం కానుంది. నాలుగు రోజుల్లో 47 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. పోలవరం త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఈ నెల పదో తేదీన పోలవరంలో సామూహిక సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు. మొదటి రోజు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి పశ్చిగోదావరి జిల్లా కొవ్వూరు వరకు 12.4 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. -
చంద్రబాబుకి ఎప్పటికీ బుద్దిరాదు
-
'చంద్రబాబుకు ఎప్పటికీ బుద్ధిరాదు'
తిరుపతి: తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిన చంద్రబాబు నాయుడు ఇపుడు అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు మంగళవారం తిరుపతిలో మాట్లాడుతూ చంద్రబాబు బుద్ధిఇంకా మారలేదన్నారు. ప్రకాశం, కర్నూలు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వందల కోట్లు వెదజల్లుతూ..ప్రతిపక్ష పార్టీ సభ్యలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం డబ్బుల ద్వారానే ఎమ్మెల్సీ పదువులను గెలవాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారన్నారు. బాబుకి ఎప్పటికీ బుధ్దిరాదని, ఆయన విధానం అంతేనని విమర్శించారు. ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్సీ స్ధానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీ నేతలు వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ సభ్యులను ప్రలోభపెట్టి నెల్లూరులోని ఓ హోటల్ లో దాచిపెట్టిన సంగతి తెలిసిందే. ఒక్కో ఎంపీటీసీ కి రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ముందుస్తుగా రూ. 50 వేలు ముట్టజెప్పారు. -
29న వైఎస్ఆర్ సీపీ జిల్లా స్థాయి సమావేశం
తిరుపతి రూరల్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని ఈనెల 29న తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధనెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ప్రజా సేవాదల్ రాష్ట్ర అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి ఆదివారం కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ 29వ తేదీ ఉదయం 10 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రసాద్‌రాజు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు చెప్పారు. వీరితో పాటు పార్టీ జిల్లా పరిశీలకులు జంగా కృష్ణమూర్తి, తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, రవీంద్రారెడ్డి అతిథులుగా హాజరౌతారన్నారు. జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సింగిల్ విండో అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పార్టీ ప్రతిష్టకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధవరావు, తిరుపతి రూరల్ ఎంపీపీ అనురాధామునస్వామి, లోకనాథరెడ్డి, మాధవరెడ్డి, మునీశ్వరరెడ్డి, హేమశంకర్రెడ్డి పాల్గొన్నారు. -
నిర్ణీత గడువులోగా అవినీతి కేసుల విచారణ!
రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం న్యూఢిల్లీ: నిర్ణీత గడువులోగా అవినీతి కేసుల విచారణను పూర్తిచేయడం తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లును ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అవినీతి నిరోధక సవరణ బిల్లు-2013ను సిబ్బంది శాఖ సహాయ మంత్రి నారాయణస్వామి ప్రవేశపెట్టారు. దీని ప్రకారం మంత్రులు సహా ప్రభుత్వాధికారులపై తగిన కోర్టులో ఫిర్యాదు చేసినట్లయితేనే ప్రభుత్వం వారి విచారణకు అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది. అవినీతి ఆరోపణలున్న ప్రభుత్వాధికారులపై విచారణకు అనుమతించే విషయాన్ని ప్రభుత్వం లేదా సంబంధిత యంత్రాంగం మూడు నెలల్లో తేల్చి చెప్పాల్సి ఉంటుంది. అటార్నీ జనరల్ లేదా అడ్వొకేట్ జనరల్‌తో సంప్రదింపుల తర్వాత ఈ గడువును గరిష్టంగా మరో నెలరోజులు పొడిగించొచ్చు. అవినీతి కేసులకు సంబంధించి ప్రభుత్వాధికారులపై విచారణకు సంబంధిత శాఖకు చెందిన మంత్రి అనుమతి ఇస్తారు. అవినీతి ఆరోపణలున్న మంత్రులపై విచారణకు ప్రధాని అనుమతి ఇస్తారు. 2జీ కేసులో మాజీ మంత్రి రాజాపై విచారణకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని 16 నెలలు గడిచినా, ప్రధాని కార్యాలయం స్పందించలేదంటూ సుబ్రమణ్య స్వామి పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు ఈ అంశంపై ప్రభుత్వానికి అక్షింతలు వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బిల్లును ముందుకు తెచ్చింది.