‘అందుకే ఎన్నికల బహిష్కరణ డ్రామా’ | Minister Kodali Nani Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

తిరుపతి ఉపఎన్నికలో టీడీపీకి డిపాజిట్‌ కూడా రాదు..

Published Sat, Apr 3 2021 8:11 PM | Last Updated on Sat, Apr 3 2021 9:21 PM

Minister Kodali Nani Comments On Chandrababu - Sakshi

సాక్షి, చిత్తూరు: నీచ రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు అని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల బహిష్కరణ చంద్రబాబు పిరికితనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు నిర్ణయంతో టీడీపీలో ఎవరూ మిగలరని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ ధాటికి చంద్రబాబు పారిపోయారని ఎద్దేవా చేశారు. తిరుపతి ఉపఎన్నికలో టీడీపీకి డిపాజిట్‌ కూడా రాదని మంత్రి కొడాలి నాని అన్నారు.

టీడీపీ సైకిల్‌కు పంక్చర్‌.. 
టీడీపీ సైకిల్‌కు పంక్చర్‌ అయిందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పారిపోతున్నారన్నారు. నవరత్నాలతో వైఎస్‌ జగన్‌.. ప్రజలకు మేలు చేస్తున్నారని పేర్కొన్నారు. మాలమదిగలను ఐక్యం చేసిన ఘనత సీఎం జగన్‌దని నారాయణస్వామి అన్నారు.

బాబుకు ఓటమి భయం..
గుంటూరు: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. తెర వెనుక చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఒక్కటేనన్నారు. డిపాజిట్లు రావని తెలిసే ఎన్నికల బహిష్కరణ డ్రామా ఆడుతున్నారని మోపిదేవి దుయ్యబట్టారు.

టీడీపీని భూస్థాపితం చేశారు..
వైఎస్సార్‌ జిల్లా: ఎన్నికలంటే చంద్రబాబుకు భయం పట్టుకుందని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. టీడీపీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరన్నారు. చంద్రబాబు టీడీపీని భూస్థాపితం చేశారని కొరముట్ల శ్రీనివాసులు వ్యాఖ్యానించారు.
చదవండి:
టీడీపీలో కాకరేపుతోన్న తిరుగుబాటు నేతల తీరు
భక్తుల అనుమతిపై టీటీడీ కీలక నిర్ణయం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement