తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిన చంద్రబాబు నాయుడు ఇపుడు అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు మంగళవారం తిరుపతిలో మాట్లాడుతూ చంద్రబాబు బుద్ది ఇంకా మారలేదన్నారు.