peddireddi ramacandra Reddy
-
చంద్రబాబును ఓడించేందుకు డిప్యూటీ సీఎం : పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అవసరానికి మించి రెట్టింపు స్థాయిలో ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి వెల్లడించారు. శనివారం స్థానికంగా మీడియాతో మాట్లాడిన ఆయన సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు, డీజీపీ స్థాయి అధికారితో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకున్నామని వివరించారు. రాష్ట్రంలో ఖనిజ సంపదను కొల్లగొట్టి ఇసుకను అమ్ముకున్న చరిత్ర చంద్రబాబు, లోకేశ్, ఆ పార్టీ శాసనసభ్యులదని విమర్శించారు. చంద్రబాబు ఉపయోగిస్తున్న భాష సంస్కారహీనంగా, అభ్యంతరంగా ఉందని ఆక్షేపించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడించేందుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఇంచార్జ్‌గా నియమించబోతున్నామని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా సొంత జిల్లా కుప్పంలో మెజార్టీ సాధించలేని చంద్రబాబు రాష్ట్రంలో పార్టీని ఏమేరకు నడిపిస్తారో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. -
‘నీరు – చెట్టు’ అక్రమాలపై విజిలెన్స్ విచారణ
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయాంలో ‘నీరు – చెట్టు’ పథకం పేరుతో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో దర్యాప్తు జరిపించి దోషులపై రెవెన్యూ రికవరీ(ఆర్.ఆర్.) చట్టాన్ని ప్రయోగిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. టీడీపీ పాలనలో నీరు–చెట్టు, ఉపాధి హామీ పథకాల్లో భారీ అవకతవకలు జరిగాయని, పనులు చేయకుండానే బిల్లులు కాజేశారని వైఎస్సార్సీపీ సభ్యులు మేరుగ నాగార్జున, కాటసాని రాంభూపాల్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. ‘ఉపాధి హామీ, నీరు – చెట్టు నిధులను చంద్రబాబు సర్కారు పక్కదోవ పట్టించింది. రూ. 22,472 కోట్లకుపైగా విలువైన పనులను చేసినట్లు చూపించి జన్మభూమి కమిటీల ద్వారా దోచుకున్నారు. డ్వామాను తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థగా మార్చారు. నీరు – చెట్టు టీడీపీ నేతలకు ఉపాధి హామీ పథకంలా మారింది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఉపాధి హామీ కింద చేసిన పనులనే నీరు – చెట్టు కింద కూడా చూపించి బిల్లులు పొందారు. వేసిన కట్టకే మట్టి వేసినట్లు, తవ్విని గుంతనే తవ్వినట్లు రెండుసార్లు బిల్లులు కాజేశారు. పనులు చేయకుండా తప్పుడు రికార్డులు సృష్టించారు’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్‌తో దర్యాప్తు జరిపిస్తామని, హౌస్ కమిటీ అవసరం లేదని చెప్పారు. తన సొంత జిల్లా చిత్తూరులో నీరు–చెట్టులో అవినీతిని స్వయంగా చూశానని వెల్లడించారు. రూ.10 బుష్ కట్టర్ రూ.100కు కొన్నట్లుంది.. గ్రామ పంచాయతీల్లో పొడి, తడి చెత్తలను సేకరించడానికి వినియోగించే ప్లాస్టిక్ బకెట్ల (బిన్ల) కొనుగోలులో చోటు చేసుకున్న భారీ అవినీతిపై విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ సభ్యుడు సాయిప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. రూ. 20 – 30కి లభించే చెత్త డబ్బాలను రూ. 55 – 60 చొప్పున కొనుగోలు చేసి సగం డబ్బులు తినేశారని చెప్పారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానం ఇస్తూ.. ‘గత ప్రభుత్వ హయాంలో ఒక్కో జిల్లాలో ఒక్కో రేటుకు ప్లాస్టిక్ చెత్త డబ్బాలను కొనుగోలు చేశారు. అవి రూ. 25 లోపే దొరుకుతాయని అందరికీ తెలుసు. గ్రామ పంచాయతీల కోసం కొనుగోలు చేసిన వాటిల్లో కూడా నాణ్యత లేదు. ఇందులో భారీ దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. మేమూ వ్యవసాయం చేశాం. ఈ విషయం మాజీ సీఎం చంద్రబాబుకు కూడా తెలుసు. రూ.10కి దొరికే బుష్ కట్టర్ రూ.వందకు కొన్నట్లుగా ఉంది. స్ప్రేయర్లు కూడా భారీ రేటుకు కొనుగోలు చేశారు. మొత్తం రూ. 67 కోట్లకుపైగా ఖర్చు చేశారు (ఈ సందర్భంగా ప్లాస్టిక్ బిన్లను ఎక్కడెక్కడ ఎంత ధరకు కొన్నారో గణాంకాలను పెద్దిరెడ్డి వివరించారు). ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్‌తో విచారణ జరిపిస్తాం’ అని మంత్రి తెలిపారు. తమ శాఖలో టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఇలాంటి అక్రమాలు భారీగా బయటకు వచ్చేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. -
బాబు మోసాలపై నిలదీయాలి
పుంగనూరు: ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నిలదీయాలని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొలిసారిగా పుంగనూరు మండలంలోని గ్రామాల్లో పర్యటనకు శ్రీకారం చుట్టారు. మండలంలోని జౌకొత్తూరులో పర్యటన ప్రారంభించారు. ఈ సందర్భంగా అలజనేరు గ్రామంలో జరిగిన సమావేశంలో పెద్దిరెడ్డి ప్రసంగించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డిని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రకాల రైతుల రుణాలను, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామనీ, వెయ్యిరూపాయల పింఛన్లు మంజూరు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంచేసి రెండు నెలలు కావస్తున్నా, బాబు మాయమాటలతో, కమిటీల పేరుతో రోజుకొక ప్రకటన ఇస్తూ ప్రజల ను మోసగిస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టిన వెంటనే ఉచిత కరెంటు ఇచ్చారని, రైతుల రుణాలు తీర్చారని గుర్తుచేశారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలుపరిచేందుకు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల తరువాత ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన మోసపూరిత ప్రకటనలను ప్రజలు నమ్మి తెలుగుదేశానికి ఓట్లు వేశారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై ప్రజలు చైతన్యవంతులుకావాలని కోరారు. నియోజకవర్గంలో సర్పంచ్ నుంచి ఎంపీ వరకు అధికారం తమదేనని, ఇందులో విమర్శలకు తావులేదన్నారు. సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, వైస్‌ఎంపీపీ రామచంద్రారెడ్డి, సర్పంచ్‌లు రెడ్డెప్ప, నాగిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, మాజీ ఎంపీటీసీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, రామసముద్రం సింగిల్‌విండో అధ్యక్షుడు కేశవరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పర్యటనకు అన్నిశాఖల అధికారులు హాజరయ్యారు. కానీ పోలీసు అధికారులు, సిబ్బంది ఎవరూ హాజరుకాలేదు. చిన్నారులకు అభివాదం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండల పర్యటనలో భాగంగా కురప్పల్లెకు వెళ్లారు. అక్కడ చిన్నారులు ‘‘ఎమ్మెల్యేసార్ ..’’ అంటూ నమస్కారం చేయగా.. ఎమ్మెల్యే ‘‘వెరీగుడ్’’ అంటూ చిరునవ్వుతో ప్రతినమస్కారం చేయడం పలువురిని ఆకట్టుకుంది. -
కుమ్మక్కవ్వాల్సిన అవసరం లేదు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కవ్వాల్సిన అవసరం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో నిబద్ధత కలిగిన నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఒక్కరేనన్నారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కరుు ఉంటే చేయని తప్పుకు 16 నెలలు జైలు జీవితాన్ని ఎందుకు గడుపుతారని ప్రశ్నించారు. ఆయన మొదటి నుంచి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంటులో తొలిసారిగా ప్లకార్డు పట్టుకుని వెల్‌లోకి దూసుకుపోరుున విషయూన్ని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆమరణ దీక్ష, షర్మిల బస్సు యాత్ర చేపట్టారని,,చెప్పుకొచ్చారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి జైలు నుంచే నిరాహారదీక్ష చేశారన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీడబ్ల్యూసీ నిర్ణయూనికి ముందే ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చివుండేది కాదన్నారు. జగన్మోహన్రెడ్డి జైలు నుంచి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యరాగాన్ని అందుకున్నారని ఎద్దేవాచేశారు. ఆయన రోజుకోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందన్నారు. అక్టోబర్ 2న అన్ని నియోజకవర్గాల్లో నిరాహారదీక్షలు చేపడతామన్నారు. కాంగ్రెస్‌తో పోస్ట్ అలయన్సూ ఉండదని తెలిపారు. విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయూలని సూచించారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ ఉదయకుమార్, పార్టీ నాయకుడు వై.సురేష్ పాల్గొన్నారు.