సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కవ్వాల్సిన అవసరం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో నిబద్ధత కలిగిన నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనన్నారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కరుు ఉంటే చేయని తప్పుకు 16 నెలలు జైలు జీవితాన్ని ఎందుకు గడుపుతారని ప్రశ్నించారు. ఆయన మొదటి నుంచి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారన్నారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంటులో తొలిసారిగా ప్లకార్డు పట్టుకుని వెల్‌లోకి దూసుకుపోరుున విషయూన్ని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆమరణ దీక్ష, షర్మిల బస్సు యాత్ర చేపట్టారని,,చెప్పుకొచ్చారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచే నిరాహారదీక్ష చేశారన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీడబ్ల్యూసీ నిర్ణయూనికి ముందే ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చివుండేది కాదన్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యరాగాన్ని అందుకున్నారని ఎద్దేవాచేశారు. ఆయన రోజుకోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందన్నారు. అక్టోబర్ 2న అన్ని నియోజకవర్గాల్లో నిరాహారదీక్షలు చేపడతామన్నారు. కాంగ్రెస్‌తో పోస్ట్ అలయన్సూ ఉండదని తెలిపారు. విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయూలని సూచించారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ ఉదయకుమార్, పార్టీ నాయకుడు వై.సురేష్ పాల్గొన్నారు.
కుమ్మక్కవ్వాల్సిన అవసరం లేదు
Published Mon, Sep 30 2013 3:03 AM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM
Advertisement
Advertisement