Samiakyandhra
-
సమైక్యం కోసం అలుపెరగని పోరు
నూజివీడు, న్యూస్‌లైన్ : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఒంటరిగానైనా అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక ప్రజా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే, నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తెలిపారు. పార్టీ పిలుపు మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక చిన్న గాంధీబొమ్మ సెంటర్లో గురువారం సమైక్య శంఖారావం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు గాను దేశంలోని అన్ని రాష్ట్రాలూ తిరిగి.. ఆయా రాష్ట్రాలలోని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులను కలిసి.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించి మద్దతు కూడగట్టిన నాయకుడు జగన్మోహన్రెడ్డి మాత్రమేనని చెప్పారు. లోక్‌సభలో కూడా సమైక్య వాణిని వినిపించిన ఏకైకవ్యక్తి జగనే అని గుర్తుచేశారు. తెలంగాణలో కేసీఆర్ కంపెనీ తప్ప ప్రజలెవ్వరూ తెలంగాణ కావాలని కోరడం లేదని తెలిపారు. విభజన ప్రక్రియకు ఆ ఇద్దరే కారణం... విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద జరపడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబే కారణమని విమర్శించారు. ముఖ్యమంత్రి సమైక్య ముసుగును తగిలించుకుని అన్ని రకాలుగా విభజన ప్రక్రియ జరగడానికి కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. రెండు కళ్ల సిద్ధాంతమంటూ కొంతకాలం గడిపిన చంద్రబాబు, ప్రస్తుతం సమన్యాయం అంటూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు. గత ఐదు నెలలుగా సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోందని చెప్పారు. మిగిలిన పార్టీల నాయకులు కూడా ఒకే తాటిపైకి వచ్చి సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దిగివస్తుందని తెలిపారు. తెలుగుజాతి విచ్ఛిన్నం అవుతున్నా నోరుమెదపకుండా మూలన కూర్చున్న చంద్రబాబు రాబోయే రోజులలో తెలుగుజాతి ద్రోహిగా మారడం ఖాయమన్నారు. విభజనతో సీమాంధ్రకు తీరని అన్యాయం... ఏఎంసీ మాజీ చైర్మన్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేశిరెడ్డి రాఘవరెడ్డి మాట్లాడుతూ విభజన వల్ల సీమాంధ్రలో సాగునీటి కొరత, ఉద్యోగాల కొరతతో పాటు వైద్య సదుపాయాల దృష్ట్యా కూడా తీరని అన్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబు నైజాన్ని చూసి ఊసరవెల్లే సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. నూజివీడు పట్టణ కన్వీనర్ బసవా భాస్కరరావు మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు వైఎస్సార్సీపీతో కలసి ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గుడిమెళ్ల రామస్వామి అధ్యక్షత వహించగా, సీనియర్ నాయకులు పల్లెర్లమూడి అభినేష్, లాంప్రసాదరావు, షేక్ మస్తాన్, ఆగిరిపల్లి మాజీ ఎంపీపీ నెర్సు పుల్లారావు, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు పిళ్లా చరణ్, మండల కన్వీనర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
సమైక్య రాష్ట్ర పరిరక్షణ...జగన్‌కే సాధ్యం
=పామర్రులో వైఎస్సార్సీపీ ధర్నా = దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మ దహనం సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పామర్రులో శనివారం ఉధృతంగా ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్, టీడీపీల తీరును దుయ్యబట్టారు. ఇప్పటికైనా సమైక్యాంధ్రను కాపాడుకోవడానికి కలసి రావాలని విజ్ఞప్తి చేశారు. పామర్రు, న్యూస్‌లైన్ : సమైక్య రాష్ట్ర పరిరక్షణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లనే సాధ్యమవుతుందని పార్టీ కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన తెలిపారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం పామర్రులో భారీ ర్యాలీ నిర్వహించారు. దిగ్గీ రాజా డౌన్ డౌన్.. సోనియా, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక నాలుగురోడ్ల కూడలిలో ధర్నా చేపట్టారు. కల్పన మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు జగన్మోహన్రెడ్డి దేశంలోని అన్ని రాష్ట్రాలూ తిరుగుతూ, ఆయా నాయకులకు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విభజన ప్రక్రియను వివరిస్తూ వారి మద్దతు కూడగడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర విభజన కోసం ఎన్నో కుళ్లు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు కళ్లు తెరిచి విభజన కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని అనడం దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందాన ఉందన్నారు. ఇప్పటికైనా రెండు పార్టీల ఎమ్మెల్యేలు పార్టీలను పక్కనబెట్టి సమైక్య రాష్ట్రం కోసం అసెంబ్లీలో ప్రతిఘటించాలని కోరారు. గత ఆరు నెలల నుంచి సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా మిగిలిన పార్టీలవారు మిన్నకుండటం వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించిందన్నారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ టీ బిల్లును తెచ్చి దాని ఆమోదం కోసం నేతలపై ఒత్తిడి తెస్తుండటాన్ని నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను నేతలు దహనం చేశారు. రెండు ప్రాంతాలనూ మోసగిస్తున్న చంద్రబాబు... పార్టీ పెనమలూరు సమన్వయకర్త పడమట సురేష్‌బాబు మాట్లాడుతూ ఊసరవెల్లి కన్నా ఎక్కువసార్లు రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఇటు తెలంగాణాలోనూ, సీమాంధ్ర ప్రాంతంలోనూ మద్దతు పలుకుతున్నట్లు నటిస్తూ రెండు ప్రాంతాల ప్రజలనూ మోసం చేస్తున్నారన్నారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ మాట్లాడుతూ నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని టీడీపీ నాయకుడు వర్ల రామయ్యను హెచ్చరించారు. సమైక్యం కోసం జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ఉద్యమాలను చూసి ఓర్వలేక, ప్రజలలో వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేక ఆయనపై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి సమైక్యవాదులు, మహిళల నుంచి ఎంతో స్పందన వస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పామర్రు సర్పంచ్, ఉప సర్పంచ్‌లు దేవర కొండ రోహిణి, ఆరేపల్లి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, బొబ్బా సురేష్, గంటా దేవదానం, ముత్తేవి ప్రసాద్, కిలారపు శ్రీనివాసరావు, సుబ్బయ్యదాసు, యజ్ఞనారాయణ, చాట్ల పున్నమ్మ తదితరులతో పాటు 200 మందికి పైగా కార్యకర్తలు పాల్గొన్నారు. -
గంటా శ్రీనివాసరావు డబుల్ గేమ్
=అంతర్జాతీయ క్రికెట్‌ను అడ్డుకుంటామని గంటా హెచ్చరికలు =సినీ తారల క్రికెట్ మ్యాచ్‌కు పచ్చజెండా =మంత్రి తీరుపై సొంత పార్టీలోనే పెదవి విరుపు ‘బోడి గుండుకు మోకాలికి ముడిపెట్టినట్లు’ అన్న సామెతను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ప్రపంచ క్రికెట్ పోటీలకు, రాష్ట్ర విభజనకు లింకు పెట్టి వీర ప్రగల్భాలు పలికిన ఆయన సినిమా తారల క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి హాజరవడం జిల్లా వాసులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విశాఖ జిల్లా సమైక్యాంధ్ర ఉద్యమ వీరుడిని తానేనని చూపించుకోవడానికి అడుగడుగునా తాపత్రయ పడుతున్న ఆయన క్రికెట్ మ్యాచ్‌ల విషయంలో తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంటే కేబినెట్ నుంచి తొలి రాజీనామా తనదే ఉంటుందని గతంలో మంత్రి గంటా శ్రీనివాసరావు గట్టిగా గర్జించారు. కారణాలేమైనా ఒట్టు తీసి గట్టున పెట్టారు. ఆమోదం పొందని రాజీనామా చేసిన ఆయన మంత్రిగా అధికార హోదా అనుభవిస్తున్నారు. సమైక్య ఉద్యమం నడుస్తున్న సమయంలోనే సీఎంను విశాఖకు రప్పించి ఫ్లై ఓవర్, తెలుగుతల్లి విగ్రహాల ప్రారంభం, బహిరంగ సభ నిర్వహించేందుకు గట్టిగానే ప్రయత్నించారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకే సీఎం పర్యటన ఏర్పాటు చేశారనే విమర్శలు వచ్చినా లెక్క పెట్టకుండా ముందడుగు వేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సీఎం వచ్చిన సందర్భంలో ఆయనతో పాటు అనకాపల్లి, యలమంచిలి నియోజక వర్గాల్లో పర్యటించారు. ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు వారిని పరామర్శించడం, ధైర్యం చెప్పడం ఏ మాత్రం తప్పు కాదు. దీనికి రాజకీయాలతోనో, మరే ఇతర సమస్యలతోనో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ కారణంగానే సీఎం, మంత్రుల వరద ప్రభావిత ప్రాంతాల పర్యటను ఎవరూ తప్పు పట్టలేదు. కానీ ఈ నెల 24న విశాఖలో జరిగే ఇండియా- వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ అడ్డుకుంటామని గంటా ప్రకటించారు. సమైక్య ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మ్యాచ్ నిర్వహించడం సరైంది కాదని, ఒక వేళ మ్యాచ్ జరిగితే సమైక్యవాదులు అడ్డుకుంటారని హెచ్చరికలు చేశారు. మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరుతూ బీసీసీఐకి లేఖ రాయాలని కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చారు. సమైక్య ఉద్యమానికి, క్రికెట్ మ్యాచ్‌కు సంబంధం ఏమిటని క్రీడాకారులే కాకుండా, జిల్లాలోని వివిధ వర్గాలకు చెందిన వారు విమర్శల బాణాలు వదిలారు. మంత్రి తీరుపై అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ క్రికెట్ మ్యాచ్‌ను అడ్డుకోవడం సరైంది కాదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. క్రీడాకారులు రౌండ్ టేబుల్ సమావేశం జరిపి మంత్రి తీరును తూర్పారబట్టారు. మంత్రి గంటాకు సమైక్య ఉద్యమం మీద చిత్తశుద్ధి నిజమే అయితే, సోమవారం నుంచి ప్రారంభమయ్యే రచ్చబండను ఎందుకు అడ్డుకోవడం లేదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రచ్చబండ కాంగ్రెస్‌కు ఓట్లు రాబట్టేందుకు ఉద్దేశించింది అయినందువల్లే మంత్రి దీనిపై నోరు మెదపక పోగా, సీఎంను కూడా ఆహ్వానించారనే విమర్శలు రేగుతున్నాయి. ఒక వైపు ఈ వివాదం నడుస్తుండగానే శనివారం హైదరాబాద్‌లో జరిగిన సినీ తారల క్రికెట్ పోటీలను దగ్గరుండి ప్రారంభింపజేశారు. ఈ మ్యాచ్ వచ్చే నెల 21న విశాఖలోనే నిర్వహిస్తారు. భారత్- వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్‌ను అడ్డుకుంటామని ప్రకటించిన మంత్రి... సినీ తారల క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి హాజరు కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సినీ తారల క్రికెట్ మ్యాచ్‌ను రద్దు చేయించడం మంత్రికి సులువైన విషయం. దీనికి పచ్చ జెండా ఊపి, బీసీసీఐ నిర్వహణలోని మ్యాచ్‌ను అడ్డుకుంటామని ప్రకటించడం వెనుక ఏ రాజకీయ పరమార్థం దాగి ఉందో అంతు చిక్కడం లేదు. క్రికెట్ మ్యాచ్ విషయంలో మంత్రి గంటా తన పరస్పర విరుద్ధ వైఖరిని ఏ విధంగా సమర్ధించుకుంటారు?, ఆయన చెప్పబోయే కారణం ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. -
సమైక్య దిగ్బంధం
=48 గంటల పాటు రహదారుల దిగ్బంధం విజయవంతం =స్తంభించిన రాకపోకలు =నిత్యావసరాలు, అంబులెన్సు,రైతులకు మినహాయింపు =రెండోరోజూ తిరుమలే శుడికి దిగ్బంధం సెగ =కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు =పలువురు నేతల అరెస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 48 గంటల రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. జిల్లా సరిహద్దుల్లో జాతీయ రహదారులపై కిలోమీటర్ల పొడవునా వాహనాలు బారులు తీరాయి. ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించింది. పార్టీ శ్రేణులు రహదారిపైనే వంటావార్పు చేపట్టాయి. సమైక్య భజనలు చేశాయి. సమైక్యాంధ్ర నినాదాలతో రహదారులు హోరెత్తాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజలు సైతం స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అత్యవసర సేవలకు, రైతుల వాహనాలకు ఆందోళనకారులు మినహాయింపు ఇచ్చి సహకరించారు. సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల రహదారుల దిగ్బంధం రెండో రోజూ విజయవంతమైంది. ఎక్కడి వా హనాలు అక్కడే నిలిచిపోయాయి. జిల్లా సరిహద్దుల్లో వాహనాలు కిలోమీటర్ల పొడవున వాహనాలు బారులు తీరాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వస్తున్న వాహనాలు గంటల తరబడి ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహం వద్ద పార్టీ నాయకులు వ ృత్తాకారంలో రోడ్డుపై బైఠాయించడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు బస్సులు దిగి నడుచుకుంటూ వచ్చారు. శ్రీకాళహస్తిలో ఏపీ సీడ్స్ సర్కిల్ నుంచి నె ల్లూరు జిల్లా వైపు నాలుగు కిలోమీటర్ల మేర వా హనాలు నిలిచిపోయాయి. తిరుపతి రోడ్డులో ల్యాంకో ఫ్యాక్టరీ వరకు మరో నాలుగు కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. సమైక్యాం ధ్రను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు కూ డా సహకరించారు. తిరుమలేశుడికి రెండోరోజూ దిగ్బంధం సెగ రహదారుల దిగ్బంధంతో రెండోరోజూ తిరుమలేశుడికి సెగ తప్పలేదు. తిరుమలకు వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. గురువారం నేత్రదర్శన సేవలో తమిళనాడు వాసులు ఎక్కువగా పాల్గొంటారు. నగరిలో రోడ్లను దిగ్బం ధించడంతో చెన్నై నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. తమిళనాడు సరిహద్దు ప్రాంతాల వర కు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికు లు రోడ్డు పక్కనే వంటావార్పు చేసుకున్నారు. వేలూరు నుంచి చిత్తూరు మీదుగా తిరుపతి చేరుకునే భక్తులూ రాలేకపోయారు. కుప్పం, మదనపల్లె, పీలేరు మీదుగా చింతామణి, బెంగళూరు లాంటి ప్రాంతాల నుంచి కర్ణాటక భక్తు లు రాలేదు. పలమనేరు, మదనపల్లె ప్రాం తా ల నుంచి తిరుపతికి వచ్చే రైతుల వాహనాలకు, అంబులెన్స్‌లకు మినహాయింపు ఇచ్చారు. పలువురు వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టు తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహం వద్ద రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు వరప్రసాదరావు, నగర కన్వీనరు పాలగిరి ప్రతాపరెడ్డి, స్థానిక నాయకుడు దొడ్డారెడ్డి సిద్దారెడ్డిని ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలంటూ పార్టీ నాయకుడు ఎస్కే.బా బు నాయకత్వంలో 200 మందికి పైగా కార్యకర్తలు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అరగంట తర్వాత నాయకులను విడుదల చేశారు. చిత్తూరులో చెన్నై-బెంగళూరు రహదారిని దిగ్బంధించిన పార్టీ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ , మైనారిటీ నాయకుడు సయ్యద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరులో ధర్నాలు, రాస్తారోకోలు, నాలుగు వేల నల్లజెం డాలు, వంద మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి నాయకత్వంలో రహదారులను దిగ్బంధిం చారు. వంద ఆకారంలో కూర్చొని నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో ఏపీ సీడ్స్ సర్కిల్ వద్ద పార్టీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి నాయకత్వంలో ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నాయకులు గుమ్మడి బాలకృష్ణయ్య, మిద్దెల హరి, కొట్టెడి మధుసూదన్, లోకేష్ పాల్గొన్నారు. నగరిలో పార్టీ సమన్వయకర్త ఆర్కే.రోజా ఆధ్వర్యంలో పుత్తూరు-నారాయణవనం రోడ్డును దిగ్బంధించారు. పార్టీ జి ల్లా కన్వీనర్ నారాయణస్వామి, లక్ష్మీపతి రాజు పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో నా రాయణవనం, పిచ్చాటూరు, కేవీబీపురం, వరదయ్యపాళె ం మండలాల్లో పార్టీ సమన్వయకర్త ఆదిమూలం నేతృత్వంలో రహదారులను దిగ్బంధించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి-చిత్తూరు రోడ్డులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో గుమ్మడికాయలకు విభజన ద్రోహుల బొమ్మలను అతికించి, ఉట్లోత్సవం నిర్వహించారు. రంగునీళ్లు చల్లుకుంటూ రహదారులను దిగ్బంధించారు. పీలేరు నియోజకవర్గ సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి పీలేరు-తిరుపతి రోడ్డుపై బైఠాయించారు. పల్లె సర్వీసు బస్సులను మినహాయించి మిగతా వా హనాలను అడ్డుకున్నారు. పుంగనూరులో మా జీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు బెంగళూరు, ఎంబీటీ, తిరుపతి, చింతామణి రోడ్లను దిగ్బంధించారు. పార్టీ నాయకు లు రెడ్డెప్ప, నాగరాజరెడ్డి, భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో చెట్లను నరికి రోడ్లపై వేశారు. ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. మదనపల్లెలోని మ ద్రాసు-బాంబే ట్రంక్ రోడ్డుపై మైనారిటీ నా యకుడు అక్తర్ అహ్మద్, ఎమ్మెల్సీ తిప్పారెడ్డి నేతృత్వంలో అమ్మచెరువు మిట్ట వద్ద వంటావార్పు నిర్వహించారు. కర్ణాటక సరిహద్దులోని చిత్తిలి గ్రామం వద్ద బెంగళూరు రహదారిలో పార్టీ సమన్వయకర్త షమీమ్ అస్లాం బైఠాయిం చారు. తిరుపతి రోడ్డులో మైనారిటీ నాయకుడు బాబ్జాన్ బైఠాయించి, వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వీరి కార్యక్రమాలను భగ్నం చేశారు. తంబళ్లపల్లె-ములకలచెరువు రోడ్డులో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సూచనల మేరకు పార్టీ కార్యకర్తలు రోడ్డును దిగ్బంధించారు. అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కుప్పం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి నాయకత్వంలో శాంతిపురం వద్ద రహదారిని దిగ్బంధించారు. కుప్పం, రామకుప్పంలో రోడ్ల ను దిగ్బంధించారు. పూతలపట్టులో జిల్లా అధికార ప్రతినిధి తలపులపల్లి బాబురెడ్డి నాయకత్వంలో రంగంపేట క్రాస్ వద్ద రోడ్డు దిగ్బంధం చేశారు. పార్టీ సమన్వయకర్తలు సునీల్‌కుమార్, పూర్ణం, రవిప్రసాద్, మండల కన్వీనర్ రాజరత్నంరెడ్డి పాల్గొన్నారు. -
సమైక్య ఉద్యమానికి ఊపిరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
-
6, 7 తేదీల్లో రోడ్ల దిగ్బంధం : భాను
జగ్గయ్యపేట అర్బన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 6, 7 తేదీల్లో 48 గంటలపాటు రహదారుల దిగ్బంధం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నియమించిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) సమావేశం ఏడో తేదీన జరుగుతున్నందున దానికి నిరసనగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేవిధంగా పోరాటాలను ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. సమైక్యాంధ్రప్రదేశ్‌ను బలపర్చేందుకు 6, 7 తేదీల్లో రహదారుల దిగ్బంధం, రోడ్లపైనే వంటావార్పు కార్యక్రమాలు పార్టీ పిలుపుమేరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 49 మండలాల్లో అన్నిచోట్ల ఈ కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సూచించారు. -
నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ చార్జీల పెంపు
=నేటి అర్ధరాత్రి నుంచి అమలు =జిల్లాపై రోజుకు రూ.10 లక్షల భారం =సిటీ బస్సు కనీస చార్జీ రూ.6 =హైదరాబాద్ ప్రయాణికులపై రూ.40 వడ్డన =బస్‌పాస్‌ల ధరలు యథాతథం =ప్రజలనెత్తిన సమైక్యాంధ్ర సమ్మె భారం ప్రజల నెత్తిన మరో గుదిబండ పడనుంది. ఇప్పటికే అన్నిరకాల ధరల భారంతో దిక్కుతోచని స్థితిలో ఉండగా, ఆర్టీసీకి చార్జీల వడ్డనకు సిద్ధమైంది. చార్జీల పెంపు ఫైలుపై సీఎం సంతకం చేయడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే ఇది అమలులోకి రానుంది. సాక్షి, విజయవాడ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రయాణికుల నడ్డివిరిచేందుకు సిద్ధమైంది. సమైక్యాంధ్ర ఉద్యమంతో కోట్ల రూపాయలు నష్టపోయిన ఆర్టీసీని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పుకొని ప్రజలపై చార్జీల మోత మోగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెంచుతున్న చార్జీల ఫైలుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సంతకం చేశారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి చార్జీలను పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. జిల్లావాసులపై రూ.10 లక్షల భారం ఆర్టీసీకి కృష్ణా రీజియన్‌లో 1,400 వరకు బస్సులు ఉన్నాయి. వాటి ద్వారా ప్రతిరోజు ఆర్టీసీకి రూ.కోటీ 20 లక్షల ఆదాయం వస్తుంది. ప్రస్తుత చార్జీలు పెంచడం వల్ల అది రూ.కోటీ 30 లక్షలకు చేరుతుంది. ప్రస్తుతం పెరిగిన చార్జీల నేపథ్యంలో రోజుకు రూ.10 లక్షల వరకు ఆదాయం పెరుగుతుందని అధికారులు లెక్కిస్తున్నారు. వారాంతపు, సెలవు రోజుల్లో ఈ ఆదాయం మరికొంత పెరిగే అవకాశం ఉంది. సమైక్యాంధ్ర బంద్ సందర్భంగా జిల్లాలో రూ.85 కోట్ల నష్టం వచ్చింది. ప్రస్తుతం పెరిగిన చార్జీల నేపథ్యంలో రెండేళ్లలో ఉద్యమం వల్ల వచ్చిన నష్టాన్ని పూరించవచ్చని అధికారులు భావిస్తున్నారు. బస్కెక్కిదిగితే రూ.6 చెల్లించాల్సిందే! సిటీ బస్సులో ఇప్పటివరకు కనీస చార్జీ రూ.5 ఉంది. కొత్త చార్జీలతో అది రెండు కిలోమీటర్లకు రూ.6కు చేరనుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్ కనీస చార్జీని రూ.6 నుంచి రూ.7కు, మెట్రో డీలక్స్ చార్జీ రూ.7 నుంచి రూ.8కి పెంచారు. ఈ విధంగా ప్రతి రెండు కిలోమీటర్లకు రూపాయి చొప్పున పెరుగుతూ పోతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్, డీలక్స్, ఇంద్ర, గరుడ బస్సుల చార్జీలు కూడా పెరగనున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సుకు కనీసం రూ.19 పెరగ్గా, గరుడ, గరుడ+ సర్వీసులకు రూ.40 చొప్పున చార్జీలు పెరుగుతున్నాయి. వెన్నెల బస్సుల చార్జీలు మాత్రం పెంచలేదు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గరుడ బస్సులో గతంలో రూ.377 చార్జీ వసూలు చేయగా మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ.417 చార్జీ వసూలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్ టిక్కెట్ తీసుకున్నవారి వద్ద అదనంగా చార్జీలు వసూలు చేయరు. సీజన్ టిక్కెట్ల చార్జీ రూ.650 నుంచి రూ.700కు పెరగనుంది. స్టూడెంట్ బస్‌పాస్ చార్జీలు యథాతథంగా ఉంటాయి. ఏడాది తరువాత పెరిగిన చార్జీలు ఆర్టీసీ చివరిగా 2012 సెప్టెంబర్‌లో చార్జీలను పెంచింది. అప్పటి నుంచి ప్రతి నెలా ఎంతో కొంత డీజిల్ చార్జీలు పెరుగుతున్నా చార్జీలు పెంచలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డీజిల్ ధర లీటరుకు రూ.7.50 పెరిగిందని, తప్పని పరిస్థితుల్లో ఆ భారం ప్రజలపై వేయాల్సి వస్తోందని అధికారులు సమర్థించుకుంటున్నారు. డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను ఎత్తివేస్తే ఆర్టీసికి నష్టాలు తగ్గి ఆ మేరకు ప్రజలపై భారం తగ్గించవచ్చని ఆర్టీసీ కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం కళ్లు తెరిచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రజలపై భారం తగ్గించాలని కోరుతున్నారు. -
శంఖారావం సభకు తరలిరండి
విశాఖపట్నం, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ నెల 26న వైఎస్సార్సీపీ తలపెట్టిన సమైక్య శంఖారావాన్ని విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. పార్టీలకతీతంగా నిర్వహించనున్న ఈ సభకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఈ సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్తున్నట్టు పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. పార్టీ రూరల్ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావుతో కలిసి పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25న సాయంత్రం విశాఖ నుంచి రెండు రైళ్లు, వంద బస్సులు, వంద కార్లలో తరలి వె ళ్తున్నట్టు ఆయన తెలిపారు. మరికొంతమంది స్వచ్ఛందంగా బయల్దేరుతున్నట్టు చెప్పారు. సమైక్య శంఖారావం సభకు జిల్లాలో ప్రతి నియోజక వర్గం నుంచి 5 వేల మందికి పైగా సమైక్యవాదులు తరలి వెళ్తున్నట్టు తెలిపారు. ఈ సభకు జిల్లా నుంచి పార్టీ కార్యకర్తలే కాకుండా, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో బయల్దేరుతున్నారన్నారు. ఈ సమావేశంలో ప్రచార కమిటీ కన్వీనర్ జి.రవిరెడ్డి, శంఖారావం విశాఖ పార్లమెంటరీ నియోజక వర్గ కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కంపా హనోకు, బీసీ సెల్ కన్వీనర్ పక్కి దివాకర్, ఐటీ కన్వీనర్ మధుసంపతి పాల్గొన్నారు. బైక్ ర్యాలీ వాయిదా : సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ ఆధ్వర్యంలో నగరంలో గురువారం నిర్వహించనున్న బైక్ ర్యాలీని భారీ వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. వర్షాలు తగ్గిన వెంటనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. -
ప్రభుత్వోద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, విశాఖపట్నం : సందర్శకులను ఆకట్టుకునేందుకు ఏపీ టూరిజం శాఖ విశ్వప్రయత్నాలు చేస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంతో పాటు గతంలో ఆ శాఖ సిబ్బందే ఆందోళనలకు దిగడంతో పర్యాటకశాఖ విపరీతంగా నష్టపోయింది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు సమైక్యాంధ్ర సమ్మె కాలంలోనే గదుల అద్దెలో 30 శాతం రాయితీ ప్రకటించి టూరిస్టులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఏపీటీడీసీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చందనాఖాన్ మరో ఉత్తర్వు జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీటీడీసీ పరిధిలో రెస్టారెంట్లు, హోటళ్లలో బసకు దిగితే 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించారు. నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఇలా ప్రకటించడం ఆ శాఖ చరిత్రలోనే మొదటిసారి అని సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబసభ్యులతో సంతోషంగా ఉండేందుకు వారాంతాల్లో 30 శాతం, మిగతా రోజుల్లో 50శాతం రాయితీపై సౌకర్యం పొందవచ్చని సిబ్బంది చెబుతున్నారు. ఏపీటీడీసీ పరిధిలో అరకు, రుషికొండ, యాత్రి నివాస్‌లలో త్రీస్టార్ స్థాయి సౌకర్యాలున్నాయి. ఉద్యోగులు తమ ప్రాజెక్టుల్ని సందర్శించే సమయంలో వారి గుర్తింపు కార్డుల్ని కచ్చితంగా చూపించాలన్నారు. వాస్తవానికి ఆగస్టు నుంచి టూరిస్టుల సీజన్ కొనసాగుతుంది. ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో రెండు నెలల పాటు గదులన్నీ ఖాళీగానే ఉండిపోయాయి. ఇతర ప్రాంతాలనుంచి రావాల్సిన సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వోద్యోగులకు రాయితీ ఇవ్వడం ద్వారా వ్యాపారాన్ని మరింత పెంచుకోవచ్చునని ఏపీటీడీసీ భావిస్తోంది. సిటీ టూర్లో థింసా : సందర్శకులకు సిటీ టూర్ ప్యాకేజీలో భాగంగా రుషికొండలోని నిత్యం మధ్యాహ్న భోజన సమయంలో థింసా నృత్యం ప్రదర్శించనున్నారు. గతంలో అరకు (ఆర్ఆర్ ప్యాకేజీ)తోపాటు రుషికొండ ప్రాజెక్టు వద్ద వారాంతాల్లో మాత్రమే ఈ ప్రదర్శన ఉండేది. దీనికి భారీగా స్పందన రావడంతో ఇక నుంచి సిటీ టూర్ ప్యాకేజీలో కూడా థింసా నృత్యం ప్రదర్శించనున్నట్టు ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ భీమశంకరరావు తెలిపారు. ఇందుకు ఎలాంటి అదనపు రుసుం వసూలు చేయడం లేదన్నారు. సీజన్లోనూ ఈ తరహా ఆఫర్ ఏపీటీడీసీ ప్రకటించడం గమనార్హం. -
రచ్చబండపెడదామా? మంత్రి, ఎమ్మెల్యేలతో సీఎం చర్చలు
విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి: సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి ఉద్యోగులు తప్పుకున్నందువల్ల రచ్చబండ కార్యక్రమం జరిపి ప్రజాగ్రహం తగ్గిద్దామని మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సూర్య నారాయణరాజుతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పిచ్చా పాటిగా చర్చించారు. శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుపాను బాధిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆదివారం సాయంత్రం 5 గంటలకు సీఎం విమానాశ్రయానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణానికి గంటన్నర సమయం ఉండడంతో వీఐపీ లాంజ్‌లోనే ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో వివిధ అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల్లో పార్టీ పట్ల ఆగ్రహం వ్యక్తమవుతున్న విషయం ఆయన అంగీకరించారని తెలిసింది. పరిస్థితులు కుదుట పడినందువల్ల వచ్చే నెల తొలి లేదా రెండో వారంలో జిల్లాలో రచ్చబండ కార్యక్రమం పెడదామా? అని ఆయన అడిగారు. ఇందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే రచ్చబండ జరిపేస్తే మంచిదని స్పందించగా, మిగిలిన వారు మౌనంగా కూర్చున్నారని సమాచారం. రచ్చబండలో పింఛన్లు, రేషన్ కార్డులు అందించడం వల్ల ప్రజల నుంచి సమైక్యాంధ్ర సెగ ఉండదని సీఎం చెబుతూ, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆరోఖ్యరాజ్‌కు సూచించారు. సమైక్యాంధ్రకు సంబంధించి కొందరు కేంద్ర మంత్రులు రకరకాలుగా మాట్లాడుతున్నా అసెంబ్లీ తీర్మానం అయ్యాక పార్టీ హై కమాండ్ మెత్తబడక తప్పదని ఎమ్మెల్యేలకు సీఎం ధైర్యం చెప్పినట్టు తెలిసింది. పై-లీన్ తుపాను వల్ల శారదా, తాండవ రిజర్వాయర్లకు నష్టం జరిగిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినప్పుడు, ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటని ఆయన ఆరా తీశారు. విశాఖ నగరానికి తాగునీటి సరఫరా ఎలా ఉందంటూ, నీటి కొరత గురించి కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతానికి తాగునీటి సమస్యేమీ లేదని అధికారులు సమాధానం ఇచ్చారని తెలిసింది. సీఎం పర్యటకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మశ్రీ హాజరు కాలేదు. కె.కోటపాడు మండలంలో సమైక్యాంధ్ర పాదయాత్రలో ఉన్నందువల్లే ఆయన సీఎం పర్యటనకు రాలేదని కాంగ్రెస్ నేతలు చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, ద్రోణంరాజు శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య, రమణమూర్తి రాజు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఉదయం సీఎంను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కలెక్టర్ ఆరోఖ్యరాజ్, జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సీఎంను కలిసి ఆయనకు వీడ్కోలు పలికారు. -
రచ్చబండపెడదామా?
=మంత్రి, ఎమ్మెల్యేలతో సీఎం చర్చలు =రేషన్ కార్డులు, పింఛన్ల పంపిణీతో సమైక్యాంధ్ర ఆగ్రహం చల్లార్చే వ్యూహం =ముఖ్యమంత్రి పర్యటనకు డీసీసీ అధ్యక్షుడు దూరం విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి: సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి ఉద్యోగులు తప్పుకున్నందువల్ల రచ్చబండ కార్యక్రమం జరిపి ప్రజాగ్రహం తగ్గిద్దామని మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సూర్య నారాయణరాజుతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పిచ్చా పాటిగా చర్చించారు. శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుపాను బాధిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆదివా రం సాయంత్రం 5 గంటలకు సీఎం విమానాశ్రయానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణానికి గంటన్నర సమయం ఉండడంతో వీఐపీ లాంజ్‌లోనే ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో వివిధ అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల్లో పార్టీ పట్ల ఆగ్రహం వ్యక్తమవుతున్న విషయం ఆయన అంగీకరించారని తెలిసింది. పరిస్థితులు కుదు ట పడినందువల్ల వచ్చే నెల తొలి లేదా రెండో వారంలో జిల్లాలో రచ్చబండ కార్యక్రమం పెడదామా? అని ఆయన అడిగారు. ఇందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే రచ్చబండ జరిపేస్తే మంచిదని స్పందించగా, మిగిలిన వారు మౌనంగా కూర్చున్నారని సమాచారం. రచ్చబండలో పింఛన్లు, రేషన్ కార్డులు అందించడం వల్ల ప్రజల నుంచి సమైక్యాంధ్ర సెగ ఉండదని సీఎం చెబుతూ, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆరోఖ్యరాజ్‌కు సూచించారు. సమైక్యాంధ్రకు సంబంధించి కొందరు కేంద్ర మంత్రులు రకరకాలుగా మాట్లాడుతున్నా అసెంబ్లీ తీర్మానం అయ్యాక పార్టీ హై కమాండ్ మెత్తబడక తప్పదని ఎమ్మెల్యేలకు సీఎం ధైర్యం చెప్పినట్టు తెలిసింది. పై-లీన్ తుపాను వల్ల శారదా, తాండవ రిజర్వాయర్లకు నష్టం జరిగిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినప్పుడు, ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటని ఆయన ఆరా తీశారు. విశాఖ నగరాానికి తాగునీటి సరఫరా ఎలా ఉందంటూ, నీటి కొరత గురించి కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతానికి తాగునీటి సమస్యేమీ లేదని అధికారులు సమాధానం ఇచ్చారని తెలిసింది. సీఎం పర్యటకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మశ్రీ హాజరు కాలేదు. కె.కోటపాడు మండలంలో సమైక్యాంధ్ర పాదయాత్రలో ఉన్నందువల్లే ఆయన సీఎం పర్యటనకు రాలేదని కాంగ్రెస్ నేతలు చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, ైతె నాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, ద్రోణంరాజు శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య, రమణమూర్తి రాజు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఉదయం సీఎంను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కలెక్టర్ ఆరోఖ్యరాజ్, జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సీఎంను కలిసి ఆయనకు వీడ్కోలు పలికారు. -
సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా నేడు మహిళా పోరు
=నియోజకవర్గ కేంద్రాల్లో మానవహారాలు =వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమైక్యపోరు సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం మహిళా మానవహారం కార్యక్రమాలు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరగనున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల రెండో తేదీ గాంధీ జయంతి నుంచి నవంబర్ ఒకటి ఆంధ్ర అవతరణ దినోత్సవం వరకు నిరసన కార్యక్రమాలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపకల్పన చేశారు. ఆ మేరకు పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో, నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మహిళా మానవహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉదయభాను కార్యకర్తలను కోరారు. ఎడతెగని పోరు... ఇప్పటివరకు పార్టీ చేపట్టిన సమైక్య ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఈ నెల రెండో తేదీ నుంచి అసెంబ్లీ సమన్వయకర్తలు నిరవధిక నిరాహారదీక్షలు చేశారు. వాటిని ప్రభుత్వం భగ్నం చేశాక రిలేదీక్షలు జరిగాయి. ఏడో తేదీన మంత్రులు, కాంగ్రెస్, టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయాలని వారి నివాసాల ఎదుట శాంతియుత ధర్నాలు చేశారు. పదిన అన్ని మండల కేంద్రాల్లో రైతులతో దీక్షలు చేపట్టారు. 17న నియోజకవర్గ కేంద్రాల్లో ఆటో, రిక్షాలతో ర్యాలీలు నిర్వహించారు. అనేకచోట్ల పార్టీ నేతలు స్వయంగా ఆటోలు, రిక్షాలు నడిపి నిరసన తెలిపారు. ఇక 24న అన్ని కేంద్రాల్లో బైక్ ర్యాలీలు చేయాలని నిర్ణయించారు. దాంతోపాటు హైదరాబాద్‌లో 26న పార్టీ నిర్వహించనున్న సమైక్య శంఖారావానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు కార్యకర్తలు, సమైక్యవాదులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సమైక్య శంఖారావానికి తరలిరావాల్సిందిగా కోరుతూ విస్తృత ప్రచారం చేస్తున్నామని కన్వీనర్ సామినేని ఉదయభాను వివరించారు. -
సర్దుబాటు ఇలా..
=33 రోజులు ఆన్ డ్యూటీగానే పరిగణన =ఆదివారాల్లోనూ పాఠశాలల నిర్వహణ =మధ్యాహ్న భోజనం అమలు =ఉపాధ్యాయులంతా హాజరుకావాల్సిందే =విద్యాశాఖ డెరైక్టర్ నుంచి ఉత్తర్వులు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సమ్మెలో భాగంగా కోల్పోయిన పనిదినాలను సర్దుబాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ వాణి మోహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉపాధ్యాయులు సమ్మె చేయగా 33 రోజుల పనిదినాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ 33 రోజులను అక్టోబరు 20 నుంచి మార్చి 23 వరకు సర్దుబాటు చేస్తామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యాశాఖ అధికారులతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో 33 రోజుల పనిదినాలను అక్టోబరు నుంచి మార్చి వరకు వచ్చే ఆదివారాలు, రెండో శనివారం, సంక్రాంతి సెలవుల్లో పనిచేయాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉపాధ్యాయులు 33 రోజుల పనిదినాల పాటు సమైక్యాంధ్ర సమ్మెలో పాల్గొనగా విద్యాశాఖాధికారులకు, ఉపాధ్యాయులకు కుదిరిన ఒప్పందం నేపథ్యంలో వాటిని ఆన్డ్యూటీగానే పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఉపాధ్యాయులకు సమ్మె చేసిన రోజులకు సంబంధించి వేతనం విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొన్న పనిదినాలను ఓడీగా పరిగణిస్తున్నామని, ఈ పని దినాల భర్తీకి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాఠశాలకు హాజరుకావాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాఠశాలలపై నిఘా... ప్రభుత్వం సూచించిన విధంగా సెలవు రోజుల్లో ప్రత్యేక పనిదినాల్లో ఆయా పాఠశాలలపై నిఘా ఉంచుతారని ఏదైనా పాఠశాల పనిచేయకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత లేదని, సమ్మె కాలంలో విధులకు హాజరైన ఉపాధ్యాయులను మళ్లీ పాఠశాలలకు హాజరుకావాలని హుకుం జారీ చేయటం కక్షసాధింపు చర్యేనని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.సత్యనారాయణ విమర్శించారు. సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి నాయకులు ఇచ్చిన జాబితాను కాస్త మార్పుచేసి ప్రభుత్వం ప్రత్యేక పనిదినాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన అన్నారు. ఈ ఉత్తర్వులపై సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తుండగా సమ్మెలో పాల్గొనని ఉపాధ్యాయులు ఆగ్రహంగా ఉన్నారు. సమ్మె కాలంలో పనిచేసిన ఉపాధ్యాయులకు ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందేనని వారు కోరుతున్నారు. ఉత్తర్వులు అమలు చేస్తాం : డీఈవో ప్రభుత్వ ఉత్తర్వులను జిల్లాలో అమలు చేస్తామని, పాఠశాలలు పనిచేస్తుంటే వాటిలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని డీఈవో డి.దేవానందరెడ్డి తెలిపారు. ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఉత్తర్వులపై కొందరు ఉపాధ్యాయులకు అనుమానాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుతామని చెప్పారు. సమ్మె కాలంలో పనిచేసిన ఉపాధ్యాయులు తాము ఈ నెల 20న పాఠశాలకు హాజరుకాబోమని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌ను శనివారం మధ్యాహ్నం కలిసి చెప్పగా పాఠశాలకు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుందని చెప్పినట్లు ఉపాధ్యాయ సంఘ నాయకులు చెబుతున్నారు. పాఠశాలలు పనిచేసే రోజులివీ... ప్రభుత్వం సూచించిన విధంగా ఆయా సెలవు రోజుల్లో పాఠశాలలు జరిగే జాబితా వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబరులో 20, 27 తేదీల్లోని ఆదివారాల్లో, నవంబరులో 3, 10, 17, 24 తేదీల్లోని ఆదివారాల్లో, 9న రెండో శనివారం పాఠశాలలు పనిచేయాల్సి ఉంటుంది. డిసెంబరులో 1, 8, 15, 22, 29 తేదీల్లోని ఆదివారాలు, 14న రెండో శనివారం, జనవరిలో 5, 19, 26 తేదీల్లోని ఆదివారాల్లో, సంక్రాంతి సెలవు దినాలైన 8 నుంచి 12 వరకు, తిరిగి 16, 17 తేదీల్లో పాఠశాలలు పనిచేస్తాయి. ఫిబ్రవరిలో 2, 9, 16, 23 తేదీల్లోని ఆదివారాలు, 8న రెండో శనివారం, మార్చిలో 2, 9, 16, 23 తేదీల్లోని ఆదివారాల్లో, 8న రెండో శనివారాల్లో పాఠశాలలు పనిచేస్తాయి. ముఖ్యమంత్రితో జరిగిన చర్చల ఫలితంగానే సమైక్యాంధ్ర సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా సర్దుబాటు జరిగిందని సమైక్యాంధ్ర పోరాట సమితి రాష్ట్ర కన్వీనరు మత్తి కమలాకరరావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. నేడు పనిచేయనున్న పాఠశాలలు నూజివీడు : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు ఈ నెల 20వ తేదీ ఆదివారం కూడా పనిచేయనున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి డి.దేవానందరెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయులందరూ సమైక్య ఉద్యమంలో భాగంగా సమ్మెలో పాల్గొన్నందున ఆయా పనివేళల భర్తీ కోసం ఈ మేరకు హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులే పనిచేయాలా, సమ్మెలోకి రాని ఉపాధ్యాయులు కూడా పనిచేయాలా అనే వివరణ ఏమీ రాలేదని ఆయన తెలిపారు. -
సమైక్య సమరం
= కొనసాగుతున్న ఉద్యమం = మానవహారాలు, నిరసనలు = నూజివీడులో వైఎస్సార్ సీపీ ఆటోల ప్రదర్శన సమైక్య ఆకాంక్ష జిల్లా వాసుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాలన్నీ సమ్మె విరమించి విధుల్లోకి వెళ్లినా జిల్లాలో వివిధ వర్గాల ప్రజలు సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమైక్య ఉద్యమంలో వైఎస్సార్సీపీ చురుకైన పాత్ర పోషిస్తోంది. సాక్షి, విజయవాడ : జిల్లాలో సమైక్య ఉద్యమం కొనసాగుతోంది. నూజివీడులో వైఎస్సార్సీపీ పిలుపుమేరకు శనివారం 300 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జగ్గయ్యపేట పట్టణంలోని విజ్ఞాన్ విద్యాసంస్థల విద్యార్థులు పలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక కోదాడ రోడ్డులోని రహదారిపై విజ్ఞాన్ స్కూల్ విద్యార్థులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. కైకలూరు పార్టీ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు 74వ రోజుకు చేరాయి. కలిదిండిలో సంతోషపురం గ్రామస్తులు రిలే దీక్షలు చేశారు. ముదినేపల్లిలో రైతు సభ జరిగింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి. నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షల్లో పార్టీ కొమ్మిరెడ్డిపల్లి గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు. చల్లపల్లిలో చేపట్టిన దీక్ష 71వ రోజుకు, మోపిదేవిలో 48, కోడూరులో 46వ రోజుకు చేరుకున్నాయి. నాగాయలంకలో దీక్షలు కొనసాగుతున్నాయి. చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామానికి చెందిన పలు పాఠశాలల స్కూల్ కమిటీ సభ్యులు దీక్షలు చేశారు. నాగాయలంకలో చోడవరం గ్రామ దళితవాడ రైతులు, మోపిదేవిలో చిరువోలులంక, చిరువోలు, మోపిదేవికి చెందిన గ్రామస్తులు, కోడూరులో మారుతీ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు దీక్షలు నిర్వహించారు. గుడివాడ, జగ్గయ్యపేటలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. విజయవాడలో కాంగ్రెస్ నాయకులు నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటుచేశారు. ఈ శిబిరాన్ని ఎంపీ లగడపాటి రాజగోపాల్ సందర్శించి సంఘీభావం తెలిపారు. సోమవారం మరోసారి రాజీనామాలను స్పీకర్‌కు సమర్పిస్తామని, త్వరలో సమైక్యాంధ్ర కోసం సీఎం పర్యటనలు చేస్తారని ఎంపీ చెప్పారు. కపర్ధేశ్వరస్వామికి చిత్తర్వు పూజలు... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా కేంద్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ చిత్తర్వు నాగేశ్వరరావు పామర్రు మండలం కాపవరంలోని కపర్ధేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంటుమిల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు 68వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో మండలంలోని కంచడం, బర్రిపాడు గ్రామాలకు చెందిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలు పాల్గొన్నారు. పెడనలో జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్‌లో శ్రీబొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఒకరోజు పాటు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నూజివీడు చిన్నగాంధీబొమ్మ సెంటరులోని జేఏసీ శిబిరంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 73వ రోజుకు చేరాయి. ఈ శిబిరంలో పట్టణానికి చెందిన యువకులు కూర్చున్నారు. సెయింట్ మేరీస్ హైస్కూల్, నోవా విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు రిలేదీక్షా శిబిరానికి విచ్చేసి దీక్షలో పాల్గొన్నవారికి మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానిక జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలే దీక్షలు శనివారం 54వ రోజుకు చేరాయి. ముసునూరు మండలం యల్లాపురానికి చెందిన పార్టీ నాయకులు దీక్షలో కూర్చున్నారు. ఆగిరిపల్లి బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన దీక్షా శిబిరంలో ఆటోవర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మహిళా కౌలు రైతుల దీక్షలు... పెదపారుపూడిలో గుర్విందగుంట గ్రామానికి చెందిన మహిళా కౌలు రైతులు దీక్ష చేశారు. కలిదిండి సెంటరులో సమైక్యాంధ్రకు మద్దతుగా సంతోషపురం మాజీ సర్పంచ్ కాలవ నల్లయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు రిలే దీక్ష జరిపారు. దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కావూరి, సోనియా, బోత్స డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం డ్వాక్రా మహిళలు, విద్యార్థులు మానవహారం నిర్మించారు. ముదినేపల్లి మండలంలోని వడాలి ప్రాథమిక పాఠశాల-2 ఉపాధ్యాయులు రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. వడాలి-తామరకొల్లు ఆర్అండ్బీ రోడ్డుపై రాస్తారోకో చేశారు. గుడివాడ నెహ్రుచౌక్లో జరుగుతున్న రిలే దీక్షలు 75వ రోజుకు చేరుకున్నాయి. జేఏసీ జిల్లా జాయింట్ కన్వీనర్ మండలి హనుమంతరావు దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. నందివాడ టెలిఫోన్ నగర్ కాలనీలోని సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు శనివారం నాటికి 49వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పోలుకొండ గ్రామ డ్వాక్రా మహిళలు కూర్చున్నారు. -
ఎ‘వరి’కీ చెప్పుకోలేక...
=వ్యాపారుల దగా... రైతుల వేదన =వరి తెగుళ్ల నివారణకు పనికిరాని మందులు =అనవసరమైన ఎరువులు అంటగట్టి మోసం =వ్యవసాయ సిబ్బంది సమ్మెతో డీలర్ల హవా సందట్లో సడేమియా అన్నట్టు.... ఇన్నాళ్లూ సమైక్యాంధ్ర ఉద్యమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొనడంతో ఎరువుల వ్యాపారులు, డీలర్ల ‘పంట’ పండింది. రైతులకు సూచనలు చేసేవారే లేకపోవడంతో ఇష్టారాజ్యమైంది. అవసరమైన మందులే కాదు... అనవసరమైనవీ అంటగట్టి కాసులు దండుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నదాతను నిలువు దోపిడీ చేశారు. విధుల్లో చేరిన ఉద్యోగులు ఇకనైనా వీరి భరతం పట్టాలి. రైతుకు అండగా నిలబడాలి. యలమంచిలి, న్యూస్‌లైన్: ఇన్నాళ్లూ వ్యవసాయ శాఖ సిబ్బంది సమ్మెలో ఉండటంతో ఎరువులు, క్రిమిసంహారక మందులమ్మే వ్యాపారులు, డీలర్లు రైతుల్ని నిలువు దోపిడీ చేశారు. వరి తెగుళ్ల నివారణకు రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేవారే కరువవడంతో అమ్మకాలు పెంచుకోడానికి అవసరం లేని మందులను కూడా విక్రయించారు. వ్యవసాయ శాఖ ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడంతో దుకాణాల తనిఖీ నిలిచిపోయింది. దీంతో డీలర్లు, వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రైతులు ఒక తెగులుకు సంబంధించిన క్రిమిసంహారక మందు అడిగితే, అదొక్కటే పనిచేయదంటూ రెండు మూడు రెండు మూడు తెగుళ్లకు సంబంధించిన మందులు కలిపి ఇచ్చారు. కొందరు డీలర్లు పలు సంస్థల ప్రతినిధులను దుకాణాల వద్దే అందుబాటులో ఉంచారు. రైతులు వచ్చాక వారితోనే మందులు ఎలా పనిచేస్తాయో చెప్పించి విక్రయాలు పెంచుకున్నారు. కొన్ని దుకాణాల్లో పెద్దయెత్తున నకిలీ మందుల విక్రయాలు కూడా జరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ వరినాట్లు ఆఖరులో పడటంతో ఆకుముడత, పొడతెగుళ్లు సోకుతున్నాయి. సాధారణంగా తెగుళ్లు సోకిన వరి నమూనాలను రైతులు వ్యవసాయ శాఖ సిబ్బంది వద్దకు తీసుకెళ్లి ఏ క్రిమిసంహారక మందును పిచికారీ చేయాలో తెలుసుకునేవారు. రైతులకు గ్రామాల్లో ఆదర్శ రైతులు కూడా రైతులకు పూర్తిగా సహకరించేవారు. వరి పంటకు తెగుళ్ల నివారణకు రైతులకు సూచనలు లేకపోవడం వల్ల పెద్దయెత్తున క్రిమిసంహారక మందులు వినియోగిస్తున్నారు. వ్యాపారులు, డీలర్ల లాభాపేక్ష, అవగాహన లేమితో రైతులు పొడతెగులు సోకిన వరిపంటకు ఆకుముడత నివారణ మందులను వినియోగిస్తున్నారు. ఈ విధంగా రైతులు ఎకరా వరిపంటలో తెగుళ్ల నివారణకు రూ.800 నుంచి రూ.1000 వరకు అదనంగా ఖర్చు చేయవలసి వస్తోంది. వ్యవసాయశాఖ సూచనల ప్రకారం ఎకరా వరిపంటలో తెగుళ్ల నివారణకు కేవలం రూ.300 నుంచి రూ.500 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. క్రిమిసంహారక మందులను ఎక్కువగా వినియోగించడం వల్ల పంట దిగుబడి పడిపోవడమే కాకుండా పంట పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆకుముడత తెగులు సోకిన వరిపైనుంచి వెంపలి కంపను ఈడ్చాలని వ్యవసాయశాఖ సిబ్బంది సూచిస్తున్నారు. ఆ తర్వాత 2 మిల్లీలీటర్ల కర్తఫ్ హైడ్రోక్లోరిల్ను లీటరు కలిపి పిచికారీ చేయాలన్నారు. మందు స్ప్రే చేసే సమయంలో ఎరువులను వినియోగించరాదని సూచించారు. పొడతెగులుకు సంబంధించి పొలంలో, గట్లపై గడ్డిని పూర్తిగా తొలగించాలన్నారు. ఈ తెగులు నివారణకు 2 మిల్లీలీటర్ల హెగ్జాకోనెజోల్ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. ఏపీ ఎన్జీవోలు సమ్మె విరమించి శుక్రవారం నుంచి విధుల్లో చేరడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇకనైనా వ్యవసాయ శాఖ సిబ్బంది వ్యాపారులపై నిఘా పెట్టాలని, తమకు సత్వరం వ్యవసాయ సూచనలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
శంఖారావం పూరిద్దాం
=పత్యేక రైళ్లు, బస్సుల్లో హైదరాబాద్‌కు... =పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు =నిర్వహణపై ఉత్తరాంధ్ర జిల్లా నేతల భేటీ సాక్షి, విశాఖపట్నం : సమైక్యాంధ్ర ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 26న తలపెట్టిన సమైక్యాంధ్ర శంఖారావానికి ఉత్తరాంధ్ర జిల్లా నేతలు సన్నద్ధమవుతున్నారు. కార్యక్రమ ఏర్పాట్లపై ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్‌కృష్ణ రంగారావు, శంఖారావ ఉత్తరాంధ్ర సమన్వయకర్త దాడి వీరభద్రరావు నేతృత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్లు, సమన్వయకర్తలు, అనుబంధ సంఘాల కన్వీనర్లు, ఇతర ప్రధాన నేతలతో నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం భేటీ అయ్యారు. ఒక్కో నియోజక వర్గం నుంచి ఎంత మంది బయలుదేరనున్నారు, ప్రయాణ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్నది వైఎస్సార్ సీపీ ఒక్కటే కావడంతో శంఖారావం సభ కు జాతీయస్థాయిలో ప్రాధాన్యం ఏర్పడిందని సుజయ్‌కృష్ణ రంగారావు, దాడి వీరభద్రరావు చెప్పారు. సమావేశానికి ప్ర తి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలి వెళ్లేందుకు నేతలు ఏర్పా టు చేయాలని సూచించారు. విశాఖ అర్బన్, గ్రామీ ణ ప్రాంతం నుంచి ఒక రైలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కలిపి ఒక రైలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అవసరమనుకుంటే అదనపు బోగీలు బుక్ చేస్తామన్నారు. బస్సులు, మినీ బస్సుల్ని ఇప్పటి నుంచే సమాయత్తం చేసే పనిలోపడ్డారు. ఈ నెల 25న సాయంత్రం బయలుదేరి, మరుసటి రోజు ఉదయానికే హైదరాబాద్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు డాక్టర్ కణితి విశ్వనాథం, బగ్గు లక్ష్మణరావు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు డాక్టర్ జహీర్ అహ్మద్, కుంభా రవిబాబు, వరుదు కళ్యాణి, విశాఖ నగర, జిల్లా కన్వీనర్లు వంశీకృష్ణ శ్రీనివాస్, చొక్కాకుల వెంకటరావు, మాజీ మంత్రులు బలిరెడ్డి సత్యారావు, తమ్మినేని సీతారాం, విశాఖ నుంచి పార్టీ సమన్వయకర్తలు కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, కోరాడ రాజబాబు, పెట్ల ఉమాశంకర్ గణేష్, పూడి మంగపతిరావు, బూడి ముత్యాలునాయుడు, ప్రగడ నాగేశ్వరరావు, వంజంగి కాంతమ్మ, సత్యవేణి, గిడ్డి ఈశ్వరి, బలిరెడ్డి సత్యారావు, పార్టీ నేతలు సత్తి రామకృష్ణారెడ్డి, కొయ్య ప్రసాద్‌రెడ్డి, గండి రవికుమార్, పక్కి దివాకర్, పసుపులేటి ఉషాకిరణ్, రవిరెడ్డి, గంపల గిరిధర్, కంపా హనోకు పాల్గొన్నారు. శ్రీకాకుళం నుంచి వై.వి.సూర్యనారాయణ, పి.ఎం.జె.బాబు, గొర్లె కిరణ్, వజ్జి బాబూరావు, విజయనగరం నుంచి ఇ.సుదర్శనరావు, గురాన అయ్యలు, వి.శ్రీనివాసరావు, చినరామునాయుడు, శ్రీవాణి, ప్రసన్నకుమార్, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కార్యాలయాలు కళకళ
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కళకళలాడాయి. సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు 66 రోజుల పాటు చేసిన సమ్మె విరమణ తర్వాత ప్రభుత్వ కార్యాలయాల తాళాలు తెరుచుకున్నాయి. కీలక విభాగాలైన రెవెన్యూ, కార్పొరేషన్, రవాణా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడాయి. మచిలీపట్నం కలెక్టరేట్లోని అన్ని శాఖల కార్యాలయాలూ ఉద్యోగులతో కళకళలాడాయి. కలెక్టర్ కార్యాలయంలోని అన్ని సెక్షన్ల సిబ్బందీ ఉదయం 10 గంటలకే విధులకు హాజరయ్యారు. రెండు నెలల పాటు సిబ్బంది విధులు నిర్వహించకపోవటంతో పేరుకుపోయిన ఫైళ్లలో ముఖ్యమైనవాటిని పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. రెండు నెలల సమ్మె కాలంలో టపాలు కుప్పతెప్పలుగా రావటంతో అటెండర్ల సహాయంతో ఆయా డిపార్టుమెంట్లుగా విడగొట్టి విభాగాధిపతులకు అందజేశారు. విజయవాడ కార్పొరేషన్లో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, అర్బన్ డెవలప్మెంట్, కమ్యూనిటీ, అకౌంట్స్, రెవెన్యూ తదితర విభాగాల ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. ఫైళ్ల బూజు దులిపి పనిబాట పట్టారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో వందల సంఖ్యలో గృహనిర్మాణ అనుమతులు నిలిచిపోయాయి. విజయవాడ, గుడివాడ, నందిగామ, మచిలీపట్నం, ఉయ్యూరు, జగ్గయ్యపేట, నూజివీడు రవాణా కార్యాలయాల్లో రద్దీ అధికంగా కనబడింది. నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల పనులపై ప్రజలు ఎగబడ్డారు. సమ్మె కారణంగా రవాణా శాఖకు రూ.20 నుంచి 25 కోట్ల నష్టం వచ్చినట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సీహెచ్ శివలింగయ్య తెలిపారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించుకుని పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సినవారు, ఫ్యాన్సీ నంబర్లు బుక్‌చేసుకున్నవారు గడువుతీరిన వెంటనే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఒక్క రోజులో 2,500 దరఖాస్తులు వివిధ పనుల నిమిత్తం దాఖలైనట్లు ఆయన వివరించారు. లెసైన్స్‌లు, రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం జనం పెద్ద ఎత్తున తరలివచ్చారని చెప్పారు. గుడివాడలో రెండు నెలల తరువాత కార్యాలయం పనిచేయటంతో ఆన్లైన్ ధ్రువీకరణ పత్రాలు పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నించగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆన్లైన్ సర్వర్లు మొరాయించాయి. బ్యాంకులు బంద్ కావడంతో రిజిస్ట్రేషన్లకు ఆటంకం కలిగింది. దసరా సెలవులు ముగియడంతో విద్యాసంస్థలు కూడా పూర్తిస్థాయిలో పనిచేశాయి. కలెక్టరేట్లోని డీఈవో కార్యాలయం, ఖజానా శాఖ, ఆర్డీవో కార్యాలయం, సంక్షేమ శాఖల కార్యాలయాలు, పౌర సరఫరాల శాఖ కార్యాలయాలు సిబ్బంది విధులకు హాజరయ్యారు. దీంతో ఆయా శాఖల్లో ఉన్న అవసరాల దష్ట్యా ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాలకు విచ్చేశారు. సమ్మె విరమించటంతో ఆయా శాఖల్లో పనులు ఉన్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
యథావిధిగా...
=తాత్కాలికంగా ఉద్యోగుల సమ్మె విరమణ =నేటినుంచి తెరుచుకోనున్న కార్యాలయాలు =కదలనున్న ఫైళ్లు ={పజలకు అందనున్న సేవలు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ఫైళ్లకు కదలిక రానుంది. యథావిధిగా ప్రభుత్వ పనులు జరగనున్నాయి. సమైక్యాంధ్ర కోసం 65 రోజుల నుంచి ఏపీఎన్జీఓలు చేస్తున్న సమ్మెను తాత్కాలికంగా విరమించారు. శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. ఉద్యోగులందరూ తిరిగి విధుల్లో చేరనున్నారు. రాష్ట్ర విభజనపై జూలై 31న సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన వెంటనే సమైక్యాంధ్ర కోసం ప్రజా ఉద్యమం ప్రారంభమైంది. అనంతరం ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏపీఎన్జీఓలు సమ్మె బాట పట్టారు. వీరికి అన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో జిల్లాలో ఉన్న 40 వేల మంది ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఫలితంగా కలెక్టరేట్ నుంచి గ్రామ కార్యాలయాల వరకు అన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వ సేవలన్నీ స్తంభించాయి. ఎప్పుడూ ఆఫీసులకే పరిమితమయ్యే ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం రోడ్ల మీదకొచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. విభిన్న తరహాలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వీరికి జీతాలు రాకపోయినా వెరవకుండా ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. విద్యార్థుల కౌన్సెలింగ్ సమయంలో ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో వారికి అవసరమైన కుల, ఆదాయ, నివాస, ఇతర ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేవారు లేకుండా పోయారు. కానీ ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాలేదు. సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేపడుతున్న ఉద్యోగులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. నేటి నుంచి కార్యకలాపాలు అసెంబ్లీలో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఏపీఎన్జీఓ నాయకులు ప్రకటించారు. దీనికి అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అంగీకారం తెలపడంతో శుక్రవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెరుచుకోనున్నాయి. జిల్లా అధికారుల నుంచి వీఆర్వోల వరకు అందరూ విధుల్లో చేరనున్నారు. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను కార్యాకలాపాలు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వ సేవలు శుక్రవారం నుంచి ప్రజలకు యథావిధిగా అందనున్నాయి. ఈ సమ్మె కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులకు మోక్షం లభించలేదు. కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలతో పాటు, ఇతరత్రా వాటి కోసం ఒక్క అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలోనే సుమారుగా 16 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతీ మండల కార్యాలయంలోను 1500 నుంచి 2 వేల వరకు దరఖాస్తులు ఉన్నాయి. వీటిని వీలైనంత త్వరగా మంజూరు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. పుంజుకోనున్న ఖజానా గత 65 రోజులు ఉద్యోగుల సమ్మె కారణంగా సర్కారు ఖజానాకు తీవ్ర లోటు ఏర్పడింది. ఖజానా శాఖ ఉద్యోగులు కూడా విధులను బహిష్కరించడంతో ఇప్పటి వరకు దాదాపుగా రూ.1500 కోట్లు మేర లావాదేవీలకు బ్రేక్ పడింది. సమ్మెలో లేని అత్యవసర సేవలందించే ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులలో ఒకటైన రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఆదాయం నిలిచిపోయింది. అన్ని రకాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో దాదాపుగా రూ.230 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండిపడింది. శుక్రవారం నుంచి సమ్మె విరమించడంతో తిరిగి ప్రభుత్వ ఖజానా కళకళలాడనుంది. అన్ని రకాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరగనున్నాయి. కలెక్టర్‌ను కలిసిన ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు గురువారం జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లను కలిశాయి. సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు తెలిపాయి. శుక్రవారం నుంచి విధుల్లో చేరుతున్నట్టు నాయకులు కలెక్టర్‌కు చెప్పారు. పరిపాలన, ప్రాధాన్యతాపరమైన పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఉద్యోగ సంఘాల నాయకులకు కలెక్టర్ సూచించారు. తాత్కాలికంగా విరమించాం అసెంబ్లీలో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ఎమ్మెలు హామీ ఇవ్వడంతో అప్పటి వరకు తాత్కాలికంగా సమ్మెను విరమించామని ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగేశ్వరరెడ్డి తెలిపారు. కేంద్రం అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని రాజకీయ నిర్ణయం తీసుకుంటే ఇప్పటికంటే తీవ్రమైన ఉద్యమం చేపడతామన్నారు. ఏపీఎన్జీఓల పిలుపు మేరకు సమ్మెను విరమిస్తున్నామని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కూర్మారావు చెప్పారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టే ప్రతి కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టే సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒత్తిడి చేసేందుకు మళ్లీ సమ్మె చేస్తామని వీఆర్వో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.టి.రామకాసు తెలిపారు. -
లోటస్ పాండ్ లో పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ
-
అమ్మా సోనియా ఆస్తులేమైనా ఉంటే నీ కొడుక్కి ఇచ్చుకో
-
దీక్షాదక్షత
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు చేపట్టిన సమైక్య సత్యాగ్రహాలకు మద్దతు వెల్లువెత్తుతోంది. గాంధీజయంతి రోజున ప్రారంభమైన ఈ దీక్షలు గురువారం రెండో రోజూ కొనసాగాయి. అన్నివర్గాల ప్రజలు దీక్షాధారులను కలిసి సంఘీభావం తెలిపారు. కాగా అవనిగడ్డలో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు యాసం చిట్టిబాబు, గుడివాక శివరావ్; నందిగామలో పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావులు చేస్తున్న నిరవధిక దీక్షలను రాత్రి పోలీసులు భగ్నం చేశారు. మిగతావారి దీక్షలను శుక్రవారం తెల్లవారు జామున భగ్నం చేయవచ్చని సమాచారం. జగ్గయ్యపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, విజయవాడ సెంట్రల్లో పి.గౌతమ్‌రెడ్డి, గన్నవరంలో దుట్టా రవిశంకర్, పెడనలో వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్‌లు దీక్షలను కొనసాగిస్తున్నారు. గొల్లపూడిలో కాజా రాజ్‌కుమార్ గురువారం రిలే దీక్షలో పాల్గొన్నారు. జగ్గయ్యపేటలోని దీక్షా శిబిరంలో సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. ఎంపీ లగడపాటితోపాటు సీమాంధ్రలోని తొమ్మిది మంది కేంద్ర మంత్రులు పదవులకు వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. బందరులో తాజా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని), కేంద్ర పాలకమండలి సభ్యుడు కుక్కల నాగేశ్వరరావు, పలువురు మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, కార్యకర్తలు దీక్ష చేపట్టారు. గుడివాడలో తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్షలో నానితో పాటు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోరువానను సైతం లెక్కచేయకుండా వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు గాంధీ మండపం వద్దకు చేరుకుని జై సమైక్యాంధ్ర. జై జగన్.. నినాదాలతో హోరెత్తించారు. మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నందిగామలో సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు చేస్తున్న నిరవధిక దీక్షకు మద్దతుగా పలు గ్రామాలకు చెందిన 31 మంది అభిమానులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. పామర్రులోని నాలుగు రోడ్ల కూడలిలో రెండో రోజు రిలే నిరాహారదీక్షలను ఉప్పులేటి కల్పన ప్రారంభించారు. ఈ దీక్షలో పమిడిముక్కల మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరువూరులో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు పిడపర్తి లక్ష్మీకుమారి నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు. అవనిగడ్డలో మద్ది వెంకట నారాయణ (చిన్నా), కొండవీటి బాపూజీ, కటికల కిషోర్ (అప్పారావు) నిరవధిక దీక్ష చేస్తుండగా పదిమంది ఒక రోజు దీక్ష చేశారు. మండల యూత్ కన్వీనర్ సింహాద్రి పవన్, రాజనాల బాలాజీ, యాసం మురళి నిరవధిక దీక్ష చేపట్టారు. హనుమాన్‌జంక్షన్‌లో వైఎస్సార్ సీపీ యువజన విభాగం నాయకుడు దుట్టా రవిశంకర్ ఆమరణ నిరాహారదీక్ష కొనసాగుతోంది. ఆయనకు మద్దతుగా ఉంగుటూరు గ్రామానికి చెందిన వెనిగళ్ల రాజా 36 గంటల దీక్షకు కూర్చున్నారు. నూజివీడు జంక్షన్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలు 38వ రోజుకు చేరాయి. కైకలూరులో రెండో రోజు దీక్షలను నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ప్రారంభించారు. పెనమలూరు సెంటర్లో సమన్వయకర్త పడమట సురేష్‌బాబు రెండో రోజు దీక్షల్లో కూర్చున్నారు. విజయవాడ పశ్చిమలో రెండో రోజు దీక్షల్లో 41వ డివిజన్‌కు చెందిన కార్యకర్తలు కూర్చున్నారు. ఈ దీక్షలను పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ప్రారంభించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో బందర్‌రోడ్డులో పార్టీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. -
అయోమయ ‘దేశం’
సాక్షి, చిత్తూరు: రాష్ర్ట విభజన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో తెలుగుతమ్ముళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆయన సొంత జిల్లాలో టీడీపీ శ్రేణులు సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందుకు వెళ్లలేక, అధినేత ఇచ్చిన ‘గడపగడపకు తెలుగుదేశం’ పిలుపును స్వాగతించలేక అయోమయంలో ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇవ్వడంతో పాటు తాజాగా రాజధాని ఏర్పాటుపై ప్రకటనలు చేస్తుంటే ప్రజల్లోకి ఎలా వెళ్లాలని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ అనుభవం సాక్షాత్తు పార్టీ జిల్లా నా యకులకే అంతర్గత సమావేశాల్లో ఎదురవుతోంది. దీం తో వీరు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన రిలే దీక్ష శిబిరాలకే పరిమితమవుతున్నారు. చిత్తూరులో జరుగుతున్న టీడీపీ దీక్షా శిబిరంలో మధ్యాహ్నం తరువాత ముఖ్యనాయకులు ఎవరూ కని పించడంలేదు. చిత్తూరు పట్టణంలో పార్టీ అధ్యక్షుడు జంగాలపల్లి, ఇతర నాయకులు కొద్దిసేపు కూర్చుని వెళ్లిపోతున్నారు. తిరుపతి నియోజకవర్గంలోనూ ఇదే పరి స్థితి. నియోజకవర్గ ఇన్చార్జి చదలవాడ అప్పుడప్పుడు శిబిరం వద్దకు వచ్చి ఉపన్యాసం ఇచ్చి వెళ్లడం మినహా నిర్దిష్టమైన ఆందోళన కార్యక్రమాలు ఇంతవరకు చేపట్టలేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొజ్జల ఉనికి సమైక్యాంధ్రలో అసలు లేదు. సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మేల్యే హేమలత కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇప్పటివరకు పాల్గొన్న దాఖలాలు లేవు. ఈ నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్లు ఇంతవరకు రిలే దీక్షలు చేపట్టిన అనవాళ్లు లేవు. నగరి టీడీపీ ఎమ్మెల్యే పత్రికల్లో రోజూ ఎవరో ఒకరిమీద విమర్శలు గుప్పిం చటం మినహా పుత్తూరు, నగరి పట్టణాల్లో ఇంతవరకు ఆయన స్వయంగా పాల్గొన్న పెద్ద సమైక్యాంధ్ర ఆందోళన కార్యక్రమం ఒక్కటీలేదు. పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. తెలుగు తమ్ముళ్లు సమైక్యాంధ్రపై తమ పార్టీ వాణి అనుకూలమని చెప్పలేని స్థితిలో ఉన్నారు. దీంతో ఎవరూ రోడ్లపైకి వచ్చి సమైక్యవాదులతో కలిసి ధైర్యంగా ఉద్యమాలు చేసే పరిస్థితి కనపడటం లేదు. అన్నిచోట్ల రిలేదీక్ష పేరిట టెంట్లు వేసుకుని కాలం వెళ్లబుచ్చుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గానికి ఇన్చార్జే లేకపోవటంతో ఇక్కడ అసలు సమైక్యాంధ్ర కోసం ఉద్యమించే టీడీపీ నాయకుడు లేడు. కార్యకర్తలు ఎవరికి వారు తమకెందుకులే అన్న ధోరణిలో ఉన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలోనూ టీడీపీ నాయకత్వ లోపం ఉండడంతో సమైక్యాంధ్ర ఉద్యమం గురించి ఇక్కడా మాట్లాడేవారు లేరు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో టీడీపీకి నాయకత్వ లోపం ఉంది. ఇక్కడ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. దీనికి తోడు కార్యకర్తలు సమైక్యాంధ్ర పేరిట జనం వద్దకు వెళ్లేందుకు జంకుతున్నారు. మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో రెండవ శ్రేణి నాయకత్వం ఉన్నా వీరు తమకెందుకులే అన్నట్లు ఉంటున్నారు. ఇంతవరకు విభజనకు వ్యతిరేకంగా పెద్దగా టీడీపీ తరఫున ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు. సీఎం ప్రాతి నిథ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలోనూ టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ కూడా నియోజకవర్గం స్థాయి లో పార్టీ శ్రేణులను ఉద్యమం వైపు నడిపించే నాయకులు లేరు. సమైక్య ఉద్యమంలో ధైర్యం చేసి ముందుకెళ్తే జేఏసీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనల వద్ద టీడీపీ వైఖరి చెప్పాలని నిలదీసే పరిస్థితి ఉంది. దీంతో జేఏసీ దీక్షా శిబిరాల వైపు టీడీపీ నాయకులు అసలు తొంగిచూడడం లేదు. -
రైతన్న కన్నెర్ర
సాక్షి, హనుమాన్‌జంక్షన్ : సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా హనుమాన్‌జంక్షన్ వేదికగా నిర్వహించిన రైతు గర్జన సభ విజయవంతమైంది. రాష్ట్ర విభజనతో రైతులకు జరిగే నష్టాన్ని వివరించేందుకు జిల్లా జేఏసీ చేసిన కృషి పలించింది. రైతులు, రైతు ప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ విద్యుత్, సాగునీరు వంటి రంగాల నిపుణులు పాల్గొని రాష్ట్ర విభజన జరిగితే జరిగే నష్టాలను వివరించి రైతులకు అవగాహన కల్పించారు. సమైక్యాంధ్ర ఉద్యమ సారథులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి దిశనిర్దేశం చేశారు. రాజకీయాల్లో అవకాశవాద కలుపుమొక్కలుగా ఉండే నాయకులను ఏరిపారేయాలని సభ స్పష్టం చేసింది. సమైక్య ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిర్వహిస్తున్న ఉద్యోగులకు అవసరమైతే రైతులే జోలిపట్టి జీతాలు ఇస్తారని పలువురు రైతు ప్రతినిధులు ప్రకటించడం విశేషం. అందరికీ అన్నంపెట్టే రైతు జోలి పట్టకూడదని.. తమ జీతాలు రాకపోయినా, జీవితాలు ఫణంగాపెట్టి అయినా రాష్ట్ర విభజనను అడ్డుకుంటామంటూ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ రైతు గర్జన సభా వేదిక నుంచే రైతులు రంగంలోకి దిగి ఉద్యమాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, మండలం, జిల్లాతో పాటు రాష్ట్రస్థాయికి రైతు కమిటీలను ఏర్పాటు చేసుకుని సమైక్య ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని పలువురు పిలుపునిచ్చారు. రైతు రోడ్డెక్కితే పాలకుల జాతకాలు తిరగబడతాయని, సమైక్యపోరుకు రైతు గర్జనతో ఇప్పుడు నిండుతనం వచ్చిందని పలువురు కితాబిచ్చారు. రాజీనామా చేయని నేతలు ద్రోహులే... తమ పదవులకు రాజీనామా చేయని కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను ద్రోహులుగా తేల్చిన సభ వారికి 2014 ఎన్నికల్లో ఓటు అనే బుల్లెట్‌తో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చింది. వారి పదవులకు రాజీనామా చేసేలా ఒత్తిడి పెంచాలని, వారి ఇళ్ల వద్ద మరోమారు ఆందోళనలు నిర్వహించాలని రైతు గర్జన సభ నిర్ణయించింది. కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ రాజీనామాలు ఆమోదించుకోవడమా? ఆమోదించుకునేలా తాము రంగంలోకి దిగడమా? అనే రెండు ఆప్షన్లు ఇస్తున్నట్టు రైతు గర్జన సభ అల్టిమేటం ఇచ్చింది. పదవుల కోసం ఢిల్లీ అధిష్టానం చాటున నక్కిన కేంద్ర మంత్రులు, ఎంపీలను స్థానిక నియోజకవర్గాల్లో తిరగనీయకుండా అడ్డుకోవాలని రైతు గర్జన సభ పిలుపునిచ్చింది. రాహుల్ కోసం దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టే కాంగ్రెస్ ఆటలు సాగనిచ్చేది లేదని పలువురు వక్తలు హెచ్చరించారు. సమైక్యం కట్టుబడిన నేతలు ఎన్టీఆర్, వైఎస్సార్.. ఎన్టీఆర్, వైఎస్సార్ సమైక్యాంధ్ర కోసం పాటుపడ్డారని పలువురు ప్రతినిధులు కితాబిచ్చారు. కృష్ణా-గోదావరి డెల్టా ఏడారి కాకూడదన్న ఆశయంతో వైఎస్ జలయజ్ఞం చేపట్టారని, దాన్ని అడ్డుకుని కొందరు మనకు అన్యాయం చేస్తున్నారంటూ జలవనరుల నిపుణులు ఉదాహరణలతో వివరించారు. రాష్ట్రం విడిపోతే కృష్ణా-గోదావరి డెల్టా ఏడారిగా మారిపోతుందని, జలయుద్ధాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ పరుచూరి అశోక్‌బాబును పలువురు అభినందనలతో ముంచెత్తారు. కేసీఆర్ కాంగ్రెస్ తయారుచేసిన కలియుగ హంస అని, అందుకే పాలునీళ్లులా కలిసున్న సీమాంధ్ర, తెలంగాణను వేరుచేసే ప్రయత్నం చేస్తున్నాడంటూ అశోక్‌బాబు చెప్పిన కథ అందర్నీ ఆకట్టుకుంది. ఆకట్టుకున్న నినాదాలు.. సభా ప్రాంగణానికి ఆచార్య ఎన్జీరంగా ప్రాంగణంగా నామకరణం చేశారు. సభా వేదికకు సర్ ఆర్ధర్ కాటన్ వేదికగా తీర్చిదిద్దారు. సభా ప్రాంగణంలో జై సమైక్యాంధ్ర, గ్రామ స్వరాజ్యం, జై జవాన్ జైకిసాన్, దేశానికి వెనుముక రైతన్న అనే నినాదాలను ఏర్పాటు చేశారు. ఈ సభలో విద్యార్థులు ప్రదర్శించిన సమైక్యాంధ్ర సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. రైతు గర్జనలో గజల్ శ్రీనివాస్ ఆలపించిన గీతలు అందర్నీ ఆకట్టుకున్నాయి. రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబుతోపాటు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు, వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షుడు కలగ కమలాకరశర్మ, జలవనరుల నిపుణుడు పీఏ రామకృష్ణంరాజు, విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రప్రసాద్, కిసాన్ సేవా అధ్యక్షులు అక్కినేని భవాని ప్రసాద్, రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంవీ సూర్యనారాయణరాజు, మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ, మాదిగ దండోరా నాయకుడు వెంకటేశ్వరరావు, అన్నపూర్ణ తదితరులు రైతులను ఉత్తేజం చేసేలా ప్రసంగించారు. రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ ఉపాధ్యక్షుడు ఎం.సత్యానందం, నీటి సంఘాల అధ్యక్షుల రాష్ట్ర నాయకులు ఆళ్ల వెంకటగోపాలకృష్ణ, రుద్రరాజు పండురాజు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉత్తమరైతు గొర్రిపర్తి నరసింహారాజు యాదవ్, జిల్లా జేఏసీ అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్, జాయింట్ కన్వీనర్ చలసాని ఆంజనేయులు, ఎం.వెంకటేశ్వర్లు, ఎన్ఎస్వీ శర్మ, ఎండీ ప్రసాద్, పి.సత్యనారాయణ, సుంకర సుబాష్‌చంద్రబోస్, గుంపపనేని ఉమా వరప్రసాద్, జి.వెంకటేశ్వరరావు, పీవీ రమణమూర్తి, బి.వెంకటేశ్వరావు, వీరమాచినేని సత్యప్రసాద్, త్రిపురనేని బాబూరావు, మత్తి కమాలకరరావు తదితరులు పాల్గొన్నారు. -
విభజన మనస్తాపంతో రైతు ఆత్మహత్య
కేవీబీపురం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రకటన మ రొకరిని బలిగొంది. పిల్లల భవిష్యత్‌కు ముప్పు తప్ప దని కలత చెంది మండలంలోని మహదేవపురం లో రైతు కృష్ణయ్య(40) ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల కథనం మేరకు... మహదేవపురానికి చెందిన సన్నకారు రైతు కృష్ణయ్యకు భార్య జయంతి, ఇంటర్ చదువుతున్న కూతురు వాణి, పాలిటెక్నిక్ చదువుతున్న కొడుకు ఉమాపతి ఉన్నారు. రెండెకరాల పొలంలో సరిగా పంటలు పండక, గిట్టుబాటు ధర లేక ఇప్పటికే అప్పుల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రకటన చేయడంతో ఆవేదన చెందాడు. రెండు నెలలుగా జరుగుతున్న సమైక్య ఆందోళనల్లో పాల్గొంటున్నాడు. ఆదివారం టీవీ చానళ్లలో ‘‘విభజన తప్పదు.. దాన్ని ఎవరూ ఆపలేరు’’ అన్న కేసీఆర్ ప్రసంగాన్ని విని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తీవ్రంగా మదనపడ్డాడు. పొలానికి నీళ్లు కట్టి వస్తానని వెళ్లి పురుగులమందు తాగాడు. తండ్రి ఇంటికి రాకపోవడంతో సోమవారం ఉదయం ఉమాపతి పొలం వద్దకు వెళ్లి చూశాడు. అప్పటికే కృష్ణయ్య మృతిచెందాడు. సమైక్యాంధ్ర కోసం తపిస్తూ తమ తండ్రి చనిపోయాడని, ఇక తమ చదువులు సాగేదెలా అని ఉమాపతి, వాణి ఆవేదన చెందుతున్నారు. తమకు దిక్కెవరని జయంతి విలపిస్తోంది. కాగా సమైక్యాంధ్ర కోసం ఆత్మత్యాగం చేసుకున్న కృష్ణయ్య మృతదేహాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గవర కృష్ణయ్య, సర్పంచ్ భారతి, టీడీపీ మండల నాయకులు రామాంజులనాయుడు, తొట్టంబేడు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తెరణి ధనుంజయరెడ్డి, జయరాంరెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. -
సమైక్య హోరు
సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో 62వ రోజు సోమవారం జోరుగా సాగింది. పామర్రు మండల సమైక్యాంధ్ర రైతు జేఏసీ ఆధ్వర్యంలో 150 ట్రాక్టర్లతో పామర్రు నుంచి బెజవాడ బెంజిసర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మొవ్వలో జనగళ గర్జన, వీరంకిలాకులో రైతుగర్జన సభలు జరిగాయి. ఏపీ గవ ర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నేతలు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ముట్టడించారు. సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర రైతు జేఏసీ ఆధ్వర్యాన రైతులు, ట్రాక్టర్ యజమానులు పామర్రు నాలుగు రోడ్ల కూడలి నుంచి 150 ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఉయ్యూరు, కంకిపాడుల మీదుగా ఈ ప్రదర్శన బెజవాడ బెంజిసర్కిల్‌కు చేరుకుంది. మండల కేంద్రం మొవ్వలో జరిగిన జనగళగర్జన కార్యక్రమంలో పలువురు నేతలు తమ ఉపన్యాసాల ద్వారా జనంలో ఉత్సాహం నింపారు. తూర్పు కృష్ణా ఎన్జీవోల సంఘం నాయకుడు ఉల్లి కృష్ణ అధ్యక్షత వహించారు. కైకలూరు 16వ వార్డులో మహిళలు భారీగా ర్యాలీ చేసి రోడ్డుపై ఆటలు ఆడారు. మండవల్లి జేఏసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు దీక్షలు చేశారు. కేసీఆర్ మాస్క్‌కు ఫినాయిల్‌తో పళ్ళు తోమి నిరసన తెలిపారు. కలిదిండిలో క్రైస్తవ సోదరులు రిలే దీక్షలు చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై పొయ్యిలు పెట్టి దోసెలు పోశారు. చల్లపల్లిలో సన్‌ఫ్లవర్ విద్యాసంస్థల అధ్యాపకులు, సిబ్బంది దీక్ష చేశారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. అవనిగడ్డలో సుగాలీ సామాజికవర్గానికి చెందిన పురుషులు, మహిళలు దీక్షలో పాల్గొన్నారు. ఘంటసాల జేఏసీ నాయకులు రహదారులు ఊడ్చి నిరసన తెలియజేశారు. నాగాయలంకలో తలగడదీవికి చెందిన మహిళలు దీక్ష చేశారు. జగ్గయ్యపేటలో జేఏసీ నాయకులు ఆటోలను శుభ్రం చేసి, కొబ్బరి బొండాలను కొట్టి నిరసన తెలిపారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసనగా మున్సిపల్ సెంటర్లో సమైక్యవాదులు ఆందోళన చేశారు. పెనుగంచిప్రోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను దంపతులు నిరాహారదీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ వద్ద సోమవారం కార్మికులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. కంకిపాడులో దీక్షల సందర్భంగా కేసీఆర్ చిత్రపటాన్ని ముఖానికి తగిలించుకున్న వేషధారికి మహిళలు చీపుర్లు, వేపమండలతో బడితపూజ చేసి వినూత్న నిరసన చేపట్టారు. అనంతరం భారీ జాతీయ పతాకంతో జాతీయ రహదారిపై ప్రదర్శన చేపట్టి, మానవహారం నిర్వహించారు. నూజివీడు. చిన్నగాంధీబొమ్మ సెంటర్లో రిలేదీక్ష శిబిరంలో సోమవారం పాత్రికేయులు రిలేదీక్షలో పాల్గొన్నారు. బెజవాడలో.. పామర్రు నుంచి వచ్చిన ట్రాక్టర్లను బెంజిసర్కిల్ చుట్టూ ఉంచి ధర్నా చేశారు. ఎన్జీవో అసోసియేషన్ జిల్లా కన్వీనర్ విద్యాసాగర్ సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ గవ ర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీని ముట్టడించారు. భారీ ర్యాలీ నిర్వహించి బెంజిసర్కిల్వద్ద మానవహారం నిర్మించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, 13 జిల్లాల నుంచి వైద్యులు పాల్గొన్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంజిసర్కిల్ నుంచి ఆటోనగర్ పంటకాల్వ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ ఉపాధ్యాయ జేఏసీ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీచర్లు రిలే నిరాహార దీక్షలు జరిపారు. వన్‌టౌన్‌లో ఎయిడెడ్ ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణకు చెందిన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రధాన ద్వారం వద్ద అధ్యాపకులు, సిబ్బంది దోసెలు వేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ ఉపాధ్యాయ జెఏసీ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీచర్లు రిలే నిరాహార దీక్షలు జరిపారు. -
కుమ్మక్కవ్వాల్సిన అవసరం లేదు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కవ్వాల్సిన అవసరం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో నిబద్ధత కలిగిన నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఒక్కరేనన్నారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కరుు ఉంటే చేయని తప్పుకు 16 నెలలు జైలు జీవితాన్ని ఎందుకు గడుపుతారని ప్రశ్నించారు. ఆయన మొదటి నుంచి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంటులో తొలిసారిగా ప్లకార్డు పట్టుకుని వెల్‌లోకి దూసుకుపోరుున విషయూన్ని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆమరణ దీక్ష, షర్మిల బస్సు యాత్ర చేపట్టారని,,చెప్పుకొచ్చారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి జైలు నుంచే నిరాహారదీక్ష చేశారన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీడబ్ల్యూసీ నిర్ణయూనికి ముందే ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చివుండేది కాదన్నారు. జగన్మోహన్రెడ్డి జైలు నుంచి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యరాగాన్ని అందుకున్నారని ఎద్దేవాచేశారు. ఆయన రోజుకోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందన్నారు. అక్టోబర్ 2న అన్ని నియోజకవర్గాల్లో నిరాహారదీక్షలు చేపడతామన్నారు. కాంగ్రెస్‌తో పోస్ట్ అలయన్సూ ఉండదని తెలిపారు. విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయూలని సూచించారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ ఉదయకుమార్, పార్టీ నాయకుడు వై.సురేష్ పాల్గొన్నారు. -
వాడవాడలా ఉద్యమం
సమైక్యాంధ్ర ఉద్యమ కెరటాలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఉద్యమం రోజురోజుకూ తీవ్రమవుతోంది. శనివారం జిల్లాలో పలుచోట్ల నిరసన కారులు ఆందోళనలు చేపట్టారు. అనకాపల్లిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు సమ్మక్క సారక్క పండుగ చేపట్టి నిరసన తెలిపారు. ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ఉద్యోగ,అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యం 500 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. కశింకోట మండలంలో కోలాటం ఆడారు. చోడవరంలో ఉపాధ్యాయులు చీపుళ్లతో రోడ్లు ఊడ్చారు. జి.మాడుగుల, చింతపల్లిలో దీక్షలు కొనసాగుతున్నాయి. నర్సీపట్నంలో ఏపీఎన్జీవో ఎస్టీ వర్గ ఉపాధ్యాయులు రోడ్డుపై థింసా నృత్యం చేశారు. శ్రీకన్య కూడలిలో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించిన దృశ్యమిది. అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్: నిక నెహ్రూచౌక్‌లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారానికి 47వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలను వైఎస్సార్ సీపీ నాయకులు కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) ప్రారంభించారు. దీక్షల్లో గవరపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ఏఎంఏఎల్ కళాశాల అధ్యాపకులు ఎ.జె.వి.ఎన్.రావు, డి.గిరిలక్ష్మి, ఎస్.రమణాజీ, వి.కె.ఎం.సన్యాసిరావు, కరణం నర్సింగరావు, కె.రాజశేఖర్, ఎం.హైమ, ఎన్.వరలక్ష్మి, ఎస్.శాంతిరూప కూర్చున్నారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శిబిరంలో గురజాడ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు తెలుగుతల్లి, భారతమాత, ఖడ్గ బ్రహ్మన, తిక్కన, త్యాగరాజు, వివిధ దేశనాయకుల వేషధారణలు ధరించి పాల్గొన్నారు. కోయదొర వేషధారణలో ఉపాధ్యాయుడు కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్, షిండేలకు జాతకాలు చూస్తూ చేసిన ఏకపాత్రాభినయం ఆలోచింపజేసింది. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జీవో సంఘాల నేతలు పాల్గొన్నారు. ఉద్యమాలు కేంద్రానికి పట్టవా? పాడేరు రూరల్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతంలో చేపడుతున్న ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వానికి పట్టవా అని వైఎస్సార్ సీపీ పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త సీకరి సత్యవాణి ప్రశ్నించారు. మండలంలోని చింతలవీధి మెట్ట వద్ద వైఎస్సార్సీపీ నాయకులు శనివారం సుమారు గంటన్నర సేపు పశువులు కాసి నిరసన తెలియపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ సంక్షోభంతోనే రాష్ట్ర విభజన ప్రక్రియ నిలుపుదల అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీ నామా చేయకుండా డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. ఓ వైపు రాజీనామాలు చేయకుండా, మరో వైపు శాసన సభను సమావేశ పర్చకుండా సీమాంధ్ర ప్రజలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు పాంగి పాండురంగస్వామి, నిక్కుల సింహాచలం, లంకెల విశ్వేశ్వరరావు, ఎం.వి.ఆర్.పాత్రుడు, దిలీప్ పాల్గొన్నారు. కేంద్ర కార్యాలయాల ముట్టడి పాడేరు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పాడేరులో శనివారం సమైక్యవాదులంతా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సేవలను అడ్డుకున్నారు. పట్టణ పరిధిలోని టెలీఫోన్ ఎక్చ్సేంజ్, కాఫీ బోర్డు డీడీ కార్యాలయం, పోస్టాఫీస్, మినుములూరులోని కాఫీ పరిశోధన కార్యాలయం, యూనియన్ బ్యాంకు, స్టేట్‌బ్యాంకు, గ్రామీణ వికాస్ బ్యాంకుల ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ముట్టడించారు. కార్యాలయాలకు దగ్గరుండి తాళాలు వేశారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో ఆయా కార్యాలయాలు హోరెత్తాయి. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రూడి అప్పారావు, కె.గంగన్నపడాల్, రత్నకుమార్, బుక్కా చిట్టిబాబు, రేగం సూర్యనారాయణ , పి.బొంజుబాబు, చిట్టిదొర, జి.వి.వి.ప్రసాద్, ప్రసాద్‌రావు, కె.రామారావు, ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయులంతా పాల్గొన్నారు. సీలేరులో... సమైక్యాంధ్ర ఉద్యమం 60వ రోజుకు చేరుకోవడంతో సీలేరులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను సమైక్యవాదులు శనివారం ముట్టడించారు. టెలీఫోన్ ఎక్స్చేంచ్, పోస్టాఫీస్, బ్యాంకుల సేవలను స్తంభింపజేశారు. రాష్ట్ర విభజనను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి సోనియా, కేసీఆర్‌లకు వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. అనకాపల్లిలో సమ్మక్క, సార క్క జాతర అనకాపల్లి రూరల్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శనివారం అనకాపల్లి నెహ్రూచౌక్ జంక్షన్లో సమ్మక్క, సారక్క జాతర ఘనంగా నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఉపాధ్యాయ జేఏసీ అనకాపల్లి డివిజన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. తాత్కాలికంగా ఆలయాన్ని నిర్మించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సోనియా, కేసీఆర్, కవితల మనస్సు మార్చాలని కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం నెహ్రూచౌక్ జంక్షన్ నుంచి రాజా థియేటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమ్మక్క, సారక్క తాత్కాలిక ఆలయం వద్ద సోనియాగాంధీ వేషధారణలోని వ్యక్తి బరువు బెల్లం తూకం వేశారు. ఆమె రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ కలిసుంటేనే తెలుగుజాతి ఉనికి సాధ్యమవుతుందన్నారు. ప్రాంతీయతత్వం జాతీయసమగ్రతకు ముప్పని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ పరిరక్షణ సమితి సభ్యులు మాదేటి పరమేశ్వరరావు, కె.ఎన్.వి. సత్యనారాయణ, సీలా జగన్నాథరావు, వై.సత్యం పాల్గొన్నారు. -
వేతన యాతన
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఒకటో తారీఖు వస్తోంది... వెళుతోంది. కానీ ఉద్యోగుల జీవితాల్లో మార్పు రావడం లేదు. వారి ఖాతాల్లోకి నెల జీతం జమ కావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. కు టుంబం గడవడం కష్టంగా మారుతోంది. కానీ ఏ ఒక్కరిలో ఉద్యమ వేడి తగ్గలేదు. కడుపు కట్టుకొని సమైక్యాంధ్ర కోసం గట్టి సంకల్పంతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్క ఉద్యోగి జీతాలు రాకపోయినా రాష్ర్ట సమైక్యానికి ఉద్యమిస్తున్నారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత జిల్లాలో ప్రజా ఉద్యమం పెల్లుబికింది. దీంతో గత నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. కనీసం జీతాలకు బిల్లులు కూడా సమర్పించడం లేదు. ఫలితంగా గత నెల జీతం రాలేదు. కనీసం ఈ నెల అయినా వస్తుందంటే ఆ అవకాశం కూడా కనిపించడం లేదు. అక్టోబర్ 1న కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదు. వాస్తవానికి ప్రతి నెలా 23వ తేదీలోగా ఉద్యోగులు వారి జీతాల బిల్లులను ఖజానా శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. కానీ గడువు ముగిసినప్పటికీ ఉద్యోగులెవరూ బిల్లులను ఇవ్వలేదు. అలాగే ఖజానా అధికారులు, సిబ్బంది కూడా సమ్మెలో ఉన్నారు. దీంతో ఉద్యోగులకు జీతాలు వచ్చే అవకాశం లేదు. పండగ చేసుకొనేదెలా.. పండగ మాసంలో కూడా ఉద్యోగులకు జీతాలు లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు అవస్థలు పడుతున్నారు. దసరా, దీపావళి పండగలను చేసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో దాదాపుగా 35 వేల మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వీరంతా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్నారు. గత నెలలో మాదిరిగా పోలీస్, జైలు, కోర్టు, ఫైర్, ఉన్నతాధికారులకు మాత్రం జీతాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన వారికి మాత్రం ఈ పండగలకు కష్టాలు తప్పవు. బ్యాంకుల చేయూత సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్న ఉద్యోగులకు బ్యాంకులు బాసటగా నిలవనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రుణాలు ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. ఒకటిన్నర నెలల నికర జీతం మించకుండా ఓవర్ డ్రాఫ్ట్‌గా ఇవ్వడానికి ఎస్బీఐ మహారాణి పేట బ్రాంచి చీఫ్ మేనేజర్ అంగీకరించారు. 18.5 శాతం వడ్డీతో మంజూరు చేసే ఈ మొత్తాన్ని అయిదారు వాయిదాల్లో నెలవారీగా రికవరీ చేయనున్నారు. ఇది ఉద్యోగులకు కాస్త ఊరట కలిగించనుంది. ఉద్యోగులకు రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఎస్బీఐకి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు యు.కూర్మారావు కృతజ్ఞతలు తెలిపారు. -
వడ్డీ వ్యాపారస్తులదే హవా!
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యం లో జీతాలు రాకపోవడంతో ప్రభుత్యోద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేకపోతున్నారు. ఉద్యమం ప్రారంభమై 50 రోజులు దాటింది. ఉద్యమం ఎప్పుడు ముగుస్తుందో చెప్పడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఏదో విధంగా కుటుంబాలను నెట్టుకొచ్చిన ప్రభుత్వశాఖల్లో పనిచేసే గుమాస్తాలు, అటెండర్లు, స్వీపర్లు రుణాలు ఎక్కడ దొరుకుతాయా? అని ఎదురు చూపులు చూస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వడ్డీవ్యాపారస్తులు తమ హవాను ప్రదర్శిస్తున్నారు. అమాంతం పెంచిన వడ్డీ... ఆర్టీసీ, నగరపాలకసంస్థ, రవాణాశాఖ, రెవెన్యూ తదితర విభాగాల్లో పనిచేసే సిబ్బందికి వడ్డీలకు అప్పులు ఇచ్చేందుకు వడ్డీవ్యాపారస్తులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఆయా కార్యాలయాల వద్దనే వారు మకాం వేసి రుణాలివ్వడం, జీతాలు రాగానే వడ్డీ వసూలు చేయడం చేస్తూ ఉంటారు. తాకట్టు కింద రుణగ్రస్తుడి బ్యాంకు పాస్‌బుక్, ఏటీఎం కార్డులు తీసుకుంటారు. అయితే ప్రస్తుతం సొమ్ము అడిగే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో వీటితో పాటు ఖాళీ ప్రోనోట్స్ మీద సంతకాలు, తోటి ఉద్యోగస్తులతో హామీలు ఇప్పించమని డిమాండ్ చేస్తున్నట్లు ప్రభుత్యోద్యోగులు చెబుతున్నారు. సాధారణంగా నూటికీ మూడు నుంచి నాలుగు రూపాయల వడ్డీ వసూలు చెల్లించేవారమని, ఇప్పుడు రూ. 6 నుంచి రూ.10 వసూలు చేస్తున్నారని నగరపాలకసంస్థకు చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని కార్మికులు కొంతమంది కార్మికులు ‘సాక్షి’ వద్ద వాపోయారు. అదేమని ప్రశ్నిస్తే ‘సమ్మె ఆగిపోయి మీ జీతాలు వచ్చేస్తే మా రుణం తీర్చేస్తారు... అప్పుడు మాకు నష్టమే కదా?’ అని వడ్డీవ్యాపారస్తులంటున్నారని చెబుతున్నారు. ఎప్పుడూ అప్పు తీసుకునేవారికి మాత్రం వడ్డీలో కొంత రాయితీ ఇస్తున్నట్లు సమాచారం. పోలీసుల నిఘా అవసరం... ప్రభుత్యోద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారిని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్న వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల నిఘా అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నగరపాలకసంస్థ, ఆర్టీసీ వంటి వేలాది మంది సిబ్బంది పనిచేసే చోట నిత్యం తిష్ట వేసే వడ్డీవ్యాపారస్తులపై వీరు దృష్టి సారించాల్సి ఉంది. నామమాత్రపు వడ్డీతో రుణాలు ఇప్పించాలని ఉద్యోగస్తులు కోరుతున్నారు. బ్యాంకుల్లో అడ్వాన్సుల కోసం ప్రయత్నాలు.... మరో పదిరోజుల్లో కొత్త నెల వస్తుండటంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ఉపాధ్యాయులు, వివిధ ప్రభుత్వరంగ శాఖలో పనిచేసే గుమాస్తాలు, సూపరింటెండెంట్స్ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతినెలా జీతం వచ్చే బ్యాంకుల్లోనే ఒక నెల జీతం అడ్వాన్స్ ఇవ్వాలని అర్జీలు పెడుతున్నారు. నగరంలోని కొన్ని ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు ఈ విధంగా కోరినట్లు తెలిసింది. బ్యాంకుల నుంచి ఏ విధమైన సానుకూల స్పందన రాలేదు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు రుణాలిచ్చేందుకు సహకరించాలని జేఏసీ నేతలు కోరుతున్నారు. కొంతమంది సిబ్బంది తమ వద్ద ఉన్న బంగారం ఆభరణాలు, ఇతర సేవింగ్ సర్టిఫికెట్లను తనఖా పెట్టి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఒకటే లక్ష్యం...ఒకటే గమ్యం
ఒకటే లక్ష్యం.. ఒకటే గమ్యం.. అదే సమైక్యాంధ్ర.. అంటూ సమైక్యవాదులు ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచుకోవడం కోసం ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. జిల్లాలో 58వ రోజు కూడా వినూత్న నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ మున్సిపాలిటీలో ఇంజనీర్లు 72 గంటల సెలవులోకి వెళ్లారు. సాక్షి, విజయవాడ : సమైక్య ఉద్యమం జిల్లాలో వినూత్న నిరసనలతో హోరెత్తుతోంది. 58వ రోజైన గురువారం పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా ప్రైవేటు బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. విజయవాడలోని అన్ని రైతుబజార్ల సిబ్బంది, రైతులు కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు. కూరగాయల దండలు ధరించి ప్రదర్శన జరిపారు. మైలవరంలోని విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు ప్రధాన రహదారిలో మూడోరోజు ధర్నా నిర్వహించారు. కలిదిండిలో సర్పంచ్ నజీమా ఆధ్వర్యంలో ముస్లింలు రిలే దీక్షలు చేశారు. ఉపాధ్యాయులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. మండవల్లిలో ఆర్ఎంపీ వైద్యులు రిలేదీక్షలు చేశారు. ఉపాధ్యాయులు జలదీక్ష నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచులకు వాయినాలు.. పెనుగంచిప్రోలులో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై బతుకమ్మ ఆటలు, తెలంగాణ ఆడపడుచులకు వాయినాలు అందించారు. గుడివాడ స్థానిక నెహ్రూచౌక్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షల్లో గ్రంథాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. చేపల మార్కెట్లో పనిచేసేవారు రోడ్డుపైనే చేపలు తోమి తమ నిరసన తెలిపారు. పామర్రులో జేఏసీ నాయకులు రహదారుల వెంట భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. అవనిగడ్డలో కొత్తపేట, రామకోటిపురం రైతులు దీక్ష చేపట్టారు. నాగాయలంకలో రైతులు దీక్ష చేపట్టి, ఎడ్లబళ్లతో నిరసన తెలిపారు. పామర్రు నాలుగురోడ్ల కూడలిలో ఆ మండలంలోని రైతులు ట్రాక్టర్లను నిలిపి రహదారులను దిగ్బంధించారు. 2న హనుమాన్‌జంక్షన్‌లో రైతు మహాగర్జన.. రైతుల సమస్యలను వివరించేందుకు హనుమాన్‌జంక్షన్‌లో అక్టోబర్ రెండున రైతు మహాగర్జన నిర్వహిస్తున్నట్లు సమైక్యాంధ్ర జేఏసీ నేత విద్యాసాగర్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో పెడనలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో 18వ వార్డు మహిళలు కూర్చున్నారు. తోట్లవల్లూరులో పొలిటికల్ జేఏసీ నాయకులు మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన తెలిపారు. కూచిపూడిలో హోలీ స్పిరిట్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ ఉపాధ్యాయులు జేఏసీ నేతలతో కలిసి రాస్తారోకోలో పాల్గొన్నారు. మంగళవాయిద్యాలతో భిక్షాటన చేశారు. నూజివీడు మండలం మర్రిబంధంలో ఉపాధ్యాయులు వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. మచిలీపట్నంలో జేఏసీ నాయకులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. నూజివీడులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జంక్షన్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 31వ రోజుకు చేరాయి. కంచికచర్లలో ఎన్జీవోలు, ఉపాధ్యాయ సంఘాలు, ఆర్టీసీ జేఏసీ నాయకులు స్థానిక జాతీయ రహదారిపై ప్రదర్శన, మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు స్థానిక నెహ్రూ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. నందిగామ శివారు అనాసాగరం సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. పలువురు ఉద్యోగులు రోడ్డుపై పడుకుని సమైక్య నినాదాలతో నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై వచ్చే ప్రైవేట్ బస్సులను అడ్డుకుని నిరసన చేపట్టారు. కోత మిషన్ల యజమానుల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి కనకతప్పెట్ల మేళాలతో ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని అన్ని ప్రధాన వీధుల్లో కొనసాగింది. గాంధీ సెంటర్లో మానవహారం ఏర్పాటుచేశారు. జార్జి అనే వృత్తిదారుడు సమైక్యాంధ్రకు మద్దతుగా గుండు గీయించుకుని నిరసన తెలిపాడు. 30 నుంచి సమ్మెలోకి ఇంజనీర్లు.. ఈ నెల 30 అర్ధరాత్రి నుంచి పులిచింతల ప్రాజెక్టు, ఎన్ఎస్పీల ఇంజనీర్లు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. జగ్గయ్యపేటలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగ సంఘాల మహిళా జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై పలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మున్సిపల్ కూడలి వద్ద ప్రధాన రహదారిపై మ్యూజికల్ చైర్స్ తదితర క్రీడలతో నిరసన తెలిపారు. పలువురికి చేతులపై గోరింటాకుతో జై సమైక్యాంధ్ర అని చిత్రీకరించి మహిళలు వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. పెనుగంచిప్రోలులో తెలుగు ప్రజల సంృ్కతిలో భాగమైన బతుకమ్మను ఏర్పాటుచేసి, దానికి సమైక్యాంధ్ర జెండాను ఉంచి స్థానిక పాత సినిమా హాల్ సెంటర్లో పాటలు పాడారు. వత్సవాయి జేఏసీ నాయకులు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. మక్కపేట గ్రామంలో విద్యార్థులు, గ్రామస్తులు కలిసి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మోపిదేవిలో జాతీయ రహదారిపై కార్పెంటర్లు వడ్రంగి పనులు చేపట్టి నిరసన తెలిపారు. వెంకటాపురంలో ప్రధాన రహదారిపై మహిళలు, పిల్లలు గురువారం రాస్తారోకో నిర్వహించారు. వెంకటాపురం 11వ నంబర్ కాలువలో జలదీక్ష చేపట్టి రైతులు నిరసన తెలిపారు. ఇంజనీర్ల రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో మున్సిపల్ ఇంజనీర్లు 72 గంటల సెలవులోకి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు శుక్ర, శనివారాల్లో నిర్వహించనున్నారు. -
దసరా అడ్వాన్స్‌కు బ్రేక్...ఉద్యోగులకు షాక్
సాక్షి, విశాఖపట్నం: ఆర్టీసీ సిబ్బందికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో జీతాల్లేక విలవిల్లాడుతున్న సిబ్బందికి దసరా అడ్వాన్సులిచ్చేది లేదని సంస్థ యాజమాన్యం నిర్ణయించడం ఆ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆర్టీసీ సిబ్బందికి ఏటా దసరా పండుగను పురస్కరించుకుని అడ్వాన్సులిస్తుంటారు. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు సహా ఆఫీస్ సిబ్బందికి రూ.3 వేలు, శ్రామికులకు (దిగువ స్థాయి సిబ్బంది)కి రూ.2వేల చొప్పున అడ్వాన్సులిచ్చి ఆ సొమ్మును పది వాయిదాల్లో వసూలు చేసుకునేలా అప్పట్లో ఒప్పందం జరిగింది. పండుగ ముందు ఇచ్చే ఈ అడ్వాన్సు కోసం ఆర్టీసీ కుటుంబాలు ఎంతో ఆశగా చూస్తుంటాయి. ఈ సారి తమ వద్ద సరిపడా నిధుల్లేవని పేర్కొంటూ అడ్వాన్సులిచ్చేందుకు సంస్థ వెనకడుగు వేయడం సిబ్బందిలో ఆగ్రహం తెప్పిస్తోంది. పండుగలను పురస్కరించుకుని పర్వదినాల్లో అడ్వాన్సులివ్వడం ఆనవాయితీ. ఆగస్టు 12వ తేదీ అర్థరాత్రి నుంచి విశాఖ పరిధిలో సుమారు 5వేల మంది సమైక్యాంధ్ర ఉద్యమంలోకి దిగారు. పనిచేసిన 12 రోజులతో పాటు ఇప్పటివరకూ ఆర్టీసీ వేతనాలివ్వలేదు. నోవర్క్..నో పే అంటూ వస్తోంది. మరోవైపు సంస్థ పరిధిలో ఎంతోమంది సీసీఎస్ (కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ) , ఎస్బీటీ (స్టాఫ్ బెనిఫిట్ ట్రస్ట్) , ఎస్ఆర్బీఎస్ (స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం) వంటి రుణాలు కూడా కొన్నాళ్ల నుంచీ సంస్థ యాజమాన్యం ఇవ్వడం మానేసింది. రుణాలు తిరిగి చెల్లించినా మళ్లీ రుణాలివ్వటానికి యాజమాన్యం ఎందుకు సందేహిస్తోందో అంతుపట్టడం లేదని సిబ్బంది అంటున్నారు. ఆందోళన ఉధృతం చేస్తాం ఆర్టీసీ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. సమ్మె నేపథ్యంలో జీతాలివ్వలేదు. పోనీ అప్పు తీసుకుందామంటే రుణాలిచ్చేది లేదంటోంది. ఇప్పుడు దసరా అడ్వాన్సులూ ఇవ్వకపోతే ఎలా? ఈ విషయమై సంస్థకు బుధవారం సంఘం తరఫున లేఖలిచ్చాం. అడ్వాన్సు ఇచ్చి వాయిదాల చొప్పున మా జీతం నుంచి వసూలు చేసుకునేందుకు కూడా సంస్థ వెనకడుగు వేయడం ఘోరం. సర్క్యులర్ వెనక్కు తీసుకోకపోతే ఈ నెల 27నుంచి అన్ని డిపోల్లోనూ ఆందోళన చేసేందుకు నిర్ణయించాం. -పలిశెట్టి దామోదర్‌రావు, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి, ఎంప్లాయీస్ యూనియన్ -
జగన్‌తోనే సమైక్యాంధ్ర సాధ్యం
నందికొట్కూరుటౌన్,న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సమైక్యాంధ్ర సాధ్యమవుతుందని వ్యవసాయమార్కెట్ యార్డు చైర్మన్ మురళీమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమైక్యవాదానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉండడం ఆనందకరమన్నారు. ఆయన సమైక్య ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తే ప్రతి ఒక్కరూ కదిలివస్తారన్నారు. జగనన్న జైలు నుంచి బెయిల్‌పై వచ్చినప్పటి నుంచి సమైక్యవాదుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. -
నేడు జిల్లా బంద్
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తోంది. ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు సోమవారం నుంచి ప్రయివేట్ విద్యా సంస్థలు మూతపడ్డాయి. మంగళవారం జిల్లా బంద్ జరగనుంది. చిన్న దుకాణాల నుంచి షాపింగ్ మాల్స్ వరకు అన్నీ మూతపడనున్నాయి. జిల్లాలో చిన్న పార్లర్ల నుంచి పెద్ద హోటళ్ల వరకు అన్నీ బంద్ కానున్నాయి. వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నాయి. జిల్లాలో ప్రయివేట్ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించనుంది. ఆర్టీసీ బస్సులు గత నెల 12వ తేదీ నుంచి డిపోలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం జిల్లా ప్రజలంతా ప్రైవేటు వాహనాలు, ఆటోలపైనే ఆధారపడి ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ బంద్‌కు ఆటో కార్మికులు కూడా సంఘీభావం తెలపడంతో జిల్లా వాసులు సొంత వాహనాలు తప్ప బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. సినిమా థియేటర్ల యాజమాన్యాలు కూడా కూడా ఈ బంద్‌లో భాగస్వాములవుతున్నాయి. ఉదయం, మధ్యాహ్నం సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. -
కష్టాల సుడిలో ఆర్టీసీ!
సాక్షి, విశాఖపట్నం: ఆర్టీసీ పరిస్థితి ‘పుండుమీద కారం చల్లడం’ అన్నట్లుంది. ఇప్పటికే నష్టాలతో నడుస్తున్న సంస్థకు సమైక్యాంధ్ర సెగ గుదిబండలా మారింది. సమ్మె కారణంగా విశాఖ రీజియన్‌లో 1060 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 550 మంది ఉద్యోగులు ఉద్యమంలో ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర 13 జిల్లాల్లోని123 డిపోల్లో సుమా రు 70 వేల మంది ఉద్యోగులకు ఇక్కట్లు తప్పవంటున్నారు. ఆర్టీసీ ఆస్తుల్లో అధిక భాగంతోపాటు ప్రధాన వనరులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు మిగి లేది ఏమీ ఉండదని పేర్కొంటూ ఆర్టీసీలోని నాలుగు ప్రధాన సంఘాలు ఉద్యమిస్తున్నా యి. ఆగస్టులో ఉద్యోగులు 12 రోజులు సమ్మె చేశారు. ఆ తర్వాత విధులు బహిష్కరించారు. అంటే దాదాపు 41 రోజులుగా సమ్మె కొనసాగుతోంది. దీంతో ఇప్పటి వరకు జీతాల్లేవు. వేతనాల రూపంలో వీరికి నెలకు రూ.7.5 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో తమ ఉద్యోగులకు జీతం స్థానంలో కనీసం అడ్వాన్స్లైనా చెల్లించాలని ఆర్టీసీ సంఘాలు ఆంధ్రాబ్యాంకు, ఎస్బీఐ, కెనరా బ్యాంకుల వంటి వాటిని కోరుతున్నారు. ఏం చేయాలి? లీటర్ డీజిల్‌పై రూపాయి పెరిగితే దాదాపు రూ.70 కోట్ల అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఆర్టీసీ రూ.6200 కోట్ల అప్పులున్నా యి. రెండుసార్లు టికెట్ ధరలు పెంచడంతో 23 జిల్లాల్లో 1.5 కోట్ల ప్రయాణికులపై ప్రభా వం పడింది. ఈ నేపథ్యంలో విశాఖ పరిధిలో నిత్యం 5 లక్షల మంది ఆర్టీసీ సేవల్ని పొందుతున్నారు. అంతా ప్రత్యామ్నాయాల్ని ఎంచుకుంటున్నారు. ఉద్యోగులు సమ్మె చేయకపోయి నా ఇప్పట్లో ఆర్టీసీ కోలుకునే పరిస్థితిలో లేదు. దీంతో అన్ని విభాగాల మాదిరి ఆర్టీసీని కూడా ప్రభుత్వం తనలో కలిపేసుకుంటేనే భారం తగ్గుతుందని సిబ్బంది చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన కీలక సమావేశం లో మంత్రి బొత్స సత్యనారాయణ,ఎండీ ఎ.కె. ఖాన్లకు ఉద్యోగ సంఘాలు మొరపెట్టుకున్నాయి. జీతాలు ఇవ్వాలన్నా, అప్పులు తీర్చాలన్నా ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థగా మారి తే నే ఇక్కట్లు తీరుతాయని సిబ్బంది చెబుతున్నా రు.ఎన్నికష్టాలెదురైనా విభజనకు అంగీకరించే ది లేదని కార్మికసంఘాలు స్పష్టంచేస్తున్నాయి. సమ్మె కొనసాగిస్తాం ప్రజల శ్రేయస్సు దృష్ట్యా జీతాలు వదులుకునేందుకు సిద్ధమయ్యాం. ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థ చేస్తేనే సిబ్బందికి మనుగడ ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. ఆదివారం కూడా క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఆనం రామనారాయణ, కొండ్రు మురళీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించాం. ఏపీఎన్జీఓలతో కలిపి 1.25 లక్షల మందిని ఆదుకోవాలని కోరాం. దీనిపై స్పందించిన సభ్యులు ప్రత్యేక నోట్ పంపాలని కోరారు. సీఎం దృష్టికి సమస్య తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. - పలిశెట్టి దామోదరరావు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి -
ఉద్యమం.. ఉరకలు
సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో ఉరకలు వేస్తోంది. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు రెచ్చగొట్టేలా ఉండటంతో సమైక్యవాదులు నిరసనల హోరు ఉధృతం చేశారు. జిల్లాలో 54వ రోజు ఉద్యమం సమరస్ఫూర్తితో సాగింది. ఉద్యమంలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 30 వరకు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్‌బాబు ఇచ్చిన పిలుపు మేరకు బంద్ పాటిస్తున్నట్లు సీమాంధ్ర విద్యాసంస్థల జేఏసీ ప్రకటించింది. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగుల జేఏసీ ఈ నెల 26 నుంచి వచ్చేనెల మొదటి తేదీ వరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. మరోవైపు ట్రెజరీ ఉద్యోగులు తమపై వస్తున్న ఒత్తిళ్లకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఎటువంటి ఒత్తిళ్లు తీసుకొచ్చినా బిల్లులు చేయబోమని ట్రెజరీ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. మార్మోగిన సమైక్య రైతు శంఖారావం.. ముదినేపల్లి మండలంలోని బొమ్మినంపాడులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సమైక్య రైతు శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై భారీగా తరలివచ్చారు. విభజన వల్ల రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ మండల కన్వీనర్ నిమ్మగడ్డ భిక్షాలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 47వ రోజుకు చేరాయి. ఉపాధ్యాయులు రోడ్డు ఆటలు ఆడి నిరశనలు తెలిపారు. అవనిడగడ్డలో అశ్వరావుపాలెం రైతులు దీక్ష చే శారు. మైలవరం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షల శిబిరం వద్ద మహిళలు ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని వేసి ముగ్గులతో అలంకరించారు. కురుమద్దాలి ఎస్వీఎస్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రహదారిపై రాస్తారోకో చేశారు. నూజివీడు పట్టణంలోని జంక్షన్ రోడ్డులో దీక్షలు 27వ రోజుకు చేరాయి. నందిగామలో ఉద్యోగులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనాసాగరం వద్ద సుమారు 40 నిమిషాల పాటు రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిపై వరి నాట్లు వేస్తూ నిరసన తెలిపారు. పట్టణానికి చెందిన ముస్లిం యువకుడు షేక్ ఖాజా ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో శునకానికి వినతిపత్రం ఇస్తూ నిరసన తెలిపారు. మచిలీపట్నం కోనేరుసెంటర్‌లో కొనసాగుతున్న రిలేదీక్షలో ఎల్ఐసీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఐస్గడ్డపై గంటసేపు నిరసన.. న్యాయశాఖ జేఏసీ నాయకుడు పీవీ ఫణికుమార్ మచిలీపట్నంలోని జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట ఐస్బ్లాక్పై గంటసేపు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో హనుమాన్‌జంక్షన్‌లో చేపట్టిన రిలేదీక్షలు 30వ రోజుకు చేరాయి. విద్యార్థులు రహదారిపై మానవహారం ఏర్పాటుచేశారు. తిరువూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఎన్జీవోలు, ఉపాధ్యాయులు తిరువూరు జెడ్పీ బాలికోన్నత పాఠశాల ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ, అమరజీవి పొట్టిశ్రీరాములు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాలకు సమైక్యాంధ్ర కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. పెడనలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు 35వ రోజుకు చేరాయి. కైకలూరులో జేఏసీ నాయకులు జాతీయ రహదారిపై చెస్, క్యారమ్స్ ఆటలు ఆడి నిరశన వ్యక్తం చేశారు. పెనుగంచిప్రోలులో వ్యవసాయ మహిళా కూలీలు స్థానిక పాత సినిమా హాల్ సెంటర్లో కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. గుడ్లవల్లేరులో వైఎస్సార్ సీపీ నేత, ఉలవలపూడి గ్రామ సర్పంచి నందమూరి ధనలక్ష్మి నాయకత్వాన పలువురు రిలే దీక్షలకు కూర్చున్నారు. పెడన పట్టణ రజకులు జాతీయ రహదారిపై చాకిరేవు మీద బట్టలు ఉతుకుతూ, వాటిని రోడ్డుపైనే ఆరవేస్తూ నిరసన తెలిపారు. నూజివీడు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీలతో ర్యాలీ నిర్వహించారు. ఉయ్యూరులో క్రైస్తవులు విభజన ఆపాలంటూ ప్రత్యేక పార్ధనలు జరిపారు. జగ్గయ్యపేటలో నారాయణ ఈ టెక్నో స్కూల్విద్యార్థులు 105 మీటర్ల పొడవు ఉన్న జాతీయ జెండాతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుడివాడ పట్టణంలో మునిసిపల్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు రోడ్డుపై పండ్లు అమ్మి నిరసన తెలిపారు. విజయవాడ ఆటోనగర్‌లో ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుచరులు సమైక్యవాదులపై జరిపిన దాడిని ఖండిస్తూ బంద్ కార్యక్రమం జరిగింది. సబ్-కలెక్టర్ కార్యాలయం వద్ద టీచర్ల జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నడిచి నిరశన తెలిపారు. -
బాబు అండదండలతోనే విభజన కుట్ర
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అండదండలతోనే రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు సోనియాగాంధీ కుట్రపన్నుతున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతి తుడా సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నాయకులు చేస్తున్న రిలే దీక్షలకు శనివారం పార్టీ నాయకులు ఆదం రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆటోనగర్నాయకులు శనివారం మద్దతు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి శిబిరం వద్దకు విచ్చేసి వారికి పూల మాలలు వేసి దీక్షలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఆజ్యం పోశారన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కు రాజకీయాలకు సీమాం ధ్రులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా మనే వెన్నుపోటు పోడిచి చంద్రబాబు పదవిలోకి వచ్చారని, నమ్మినవారిని నట్టేట ముంచడం ఆయన నైజంగా మారిందని విమర్శించారు. ఎక్కడ ఆంటోనీ కమిటీ సీమాంధ్రులకు అనుకూలంగా నివేదిక ఇస్తుందేమోనని అర్ధాంతరంగా బస్సు యాత్రను ప క్కనపెట్టి ఢిల్లీకి పరుగులు తీశారన్నారు. దీనికి తోడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బెయిల్ పిటిషన్‌ను అడ్డుకునేందుకు సోనియా కాళ్లను పట్టుకునేందుకు వెళ్లారని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి బయటకు వస్తున్నాడంటే కిరణ్, చంద్రబాబుకు గుండెల్లో దడ మొదలవుతుందన్నారు. రా ష్ట్రాన్ని ముక్కలు చేసే హక్కు సోనియాకు లేదన్నా రు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రకు తాగునీరు, సాగునీరు, విద్యుత్ లేక ఏడారిగా మారే పరిస్థితి దాపురించిదన్నారు. విద్యార్థుకూ నిరాశే ఎదరవుతుందనని తెలిపారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చేతులకు గాజులు తొడుక్కొని ఆడంగుల్లా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. నిజంగా సీమాంధ్ర ప్ర జలపై మమకారం ఉంటే వెంటనే పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. 45 రోజులుగా సమైక్యం కోసం అలుపెరగని ఉద్యమం చేస్తున్నది ఒక్క వైఎస్సార్సీపీయేనని ఆ యన గుర్తుచేశారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, పాలగిరి ప్రతాప్‌రెడ్డి, ఎస్కె.బాబు, కుప్పయ్య, చల్లా, కిట్టు, శంకర్, కైలాసం, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, మాదవనాయుడు, చెంచుయాదవ్, గోపీయాదవ్, తిమ్మారెడ్డి, హర్ష, పుణీత, శారద, మునీశ్వరి, లక్ష్మి పాల్గొన్నారు. -
సమైక్యపోరుకు 40 రోజులు
తిరుపతి, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 40వ రోజుకు చేరుకుంది. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వోద్యోగులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, వ్యాపారులు, కూలీలు, మహిళలు ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. సోమవారం వినాయకచవితి పండుగ ఉండడంతో ఒక వైపు పండుగ ఏర్పాట్లు చేసుకుంటూనే ఆదివారం యథావిధిగా ఉద్యమం కొనసాగించారు. హైదరాబాద్‌లో శనివారం ఏపీఎన్జీవోలు నిర్వహించిన సమైక్య గర్జన (సేవ్ ఆంధ్రప్రదేశ్) సభ విజయవంతమైన నేపథ్యంలో పలు పట్టణాలలో హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన జేఏసీ నాయకులకు ప్రజలు నీరాజనాలు పట్టారు. కొన్నిచోట్ల వినాయక విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి సమైక్యాంధ్రకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మనసు మారేలా చూడాలని మొక్కుకున్నారు. తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ కార్మికులు, ఏపీఎన్జీవోలు, విద్యార్థి జేఏసీ నాయకులు దీక్షలు యథావిధిగా కొనసాగించారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు నడిరోడ్డుపై షామియానా వేసి భక్తి సంగీత విభావరి నిర్వహించి, వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎన్జీవో జేఏసీ నాయకులకు పలమనేరులో అభినందనసభ నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. బెరైడ్డిపల్లెలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వినాయకునికి వినతిపత్ర ం సమర్పించారు. వి.కోటలో జేఏసీ నాయకులు రిలే దీక్షలో పాల్గొన్నారు. పుంగనూరులో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి ఎంబీటీ సర్కిల్లో రోడ్డుపై బైఠాయించారు. మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఏపీఎన్జీవో నాయకులకు తిలకం దిద్ది, సమైక్యాంధ్ర కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. రిలే దీక్షలు యథావిధిగా కొనసాగాయి. పట్టణంలోని రెండు థియేటర్లలో తుఫాన్ సినిమా ప్రదర్శనను నిరసన కారులు అడ్డుకున్నారు. పోస్టర్లను చించేశారు. మదనపల్లెలో ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రిలే దీక్షలు కొనసాగాయి. సాయంత్రం గోల్డన్ వ్యాలీ విద్యార్థులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. చంద్రగిరిలో జేఏసీ దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. సమైక్యవాదులు రోడ్డుపై యోగాసనాలు వేసి నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో ఉపాధ్యాయులు వినాయకుడి గుడిలో పూజలు నిర్వహించి రాష్ట్రం సమైక్యంగా ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. పుత్తూరులో ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. పీలేరులో సమైక్య ఉద్యమం 32వ రోజుకు చేరింది. నిరసనకారులు క్రాస్‌రోడ్‌లో మోకాళ్లపై నిలబడి వెనక్కు నడిచి నిరసన తెలిపారు. చిత్తూరులో క్రైస్తవ సోదరులు మానవహారం ఏర్పాటు చేశారు. విద్యార్థులు, విద్యుత్ ఉద్యోగులు, న్యాయవాదులు, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, మానవహారం ఏర్పాటు చేశారు. -
సీమాంధ్ర రైళ్లకు అదనపు బోగీలు
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో బస్సులు డిపోలకే పరిమితమై, రైళ్లలో రద్దీ పెరగడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసింది. రద్దీ నేపథ్యంలో ఇప్పటికే రెండు విడతలుగా అదనపు బోగీలను ఏర్పాటు చేసిన రైల్వే అధికారులు.. తాజాగా 424 అదనపు బోగీలను ఏర్పాటు చేయటం ద్వారా 30,400 బెర్తులు, సీట్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. వినాయక చవితి నేపథ్యంలో ఆదివారం నుంచే అదనపు బోగీలను అందుబాటులోకి తెస్తున్నట్లు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు. వీటికే అదనపు బోగీలు.. సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌కు 12 నుంచి 20వ తేదీ వరకు, తిరుగుప్రయాణంలో 13 నుంచి 21 తేదీ వరకూ ప్రతీరోజూ.. అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నారు. సికింద్రాబాద్-తిరుపతి బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు 10, 11, 17, 18 తేదీల్లో, తిరుగుప్రయాణంలో 11, 12, 18, 19 తేదీల్లో... కాచిగూడ-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌కు 11, 20 తేదీల్లో, తిరుగుప్రయాణంలో 12, 21 తేదీల్లో... తిరుపతి-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌కు 11, 20 తేదీల్లో, తిరుగుప్రయాణంలో 12, 21 తేదీల్లో అదనపు బోగాలు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు 11, 20 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 12, 21 తేదీల్లో... సికింద్రాబాద్-తిరుపతి సెవన్‌హిల్స్ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు 10, 13, 17 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 13, 16, 20 తేదీల్లో... తిరుపతి-కరీంనగర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు 11, 14, 18 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 12, 15, 19 తేదీల్లో అదనపు బోగీలు వేస్తారు. కాకినాడ-బెంగళూరు శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌కు 11, 20 తేదీల్లో, తిరుగుప్రయాణంలో 12, 21 తేదీల్లో... హైదరాబాద్-త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్‌కు 11, 20 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 13, 22 తేదీల్లో... తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు 11, 20 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 12, 21 తేదీల్లో... కాచిగూడ- చిత్తూరు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు 11, 20 తేదీల్లో, తిరుగుప్రయాణంలో 12, 21 తేదీల్లో... నాందేడ్-ముంబై తపోవన్ ఎక్స్‌ప్రెస్‌కు 11, 20 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 12, 21 తేదీల్లో అదనపు బోగీలు వేస్తారు. గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు 10, 20 తేదీల్లో, తిరుగుప్రయాణంలో 10, 20 తేదీల్లో... కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌కు 10, 20 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 13, 23 తేదీల్లో... చెన్నై ఎగ్మోర్- కాకినాడ సర్కార్ ఎక్స్‌ప్రెస్‌కు 11, 21 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 12, 22 తేదీల్లో... నర్సాపూర్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌కు 10, 20 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 11, 21 తేదీల్లో అదనపు బోగీలను ఏర్పాటు చేస్తారు. నర్సాపూర్- సికింద్రాబాద్ మధ్య రేపు ప్రత్యేక రైలు.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నర్సాపూర్-హైదరాబాద్ మధ్య సోమవారం ప్రత్యేక రైలు నడపనున్నారు. రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరే ఈ రైలు (నెం.07255) మరుసటిరోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
పట్టు సడలని పోరు
తిరుపతి, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు మిన్నంటుతున్నాయి. ఉద్యమం 39వ రోజుకు చేరింది. ఊరూవాడా సమైక్య నినాదాలు హోరెత్తుతున్నాయి. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలతో రహదారులను దిగ్బంధిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు మద్దతుగా పీలేరులో శని వారం సంపూర్ణ బంద్ జరిగింది. వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, పైవేట్ విద్యాసంస్థలు. ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూ తపడ్డాయి. హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదుల దాడిని నిరసిస్తూ పీలేరులో న్యాయవాదులు నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. రాజీవ్ విద్యామిషన్ ఇంజనీరింగ్ సిబ్బంది రిలే నిరాహార దీక్షలు 31వ రోజుకు చేరాయి. జిల్లా భట్రాజుల సంఘం ఆధర్యంలో సుమారు 5 వేలమంది భారీ ర్యాలీ నిర్వహించి వంటావార్పు చేపట్టారు. సమైక్యాంధ్ర నాటికను ప్రదర్శించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రవాసులపై దాడిని నిరసిస్తూ తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. చిత్తూరులో జేఏసీ నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్‌కో ఉద్యోగులు ఈ నెల 12 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ప్రకటించి రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదులపై దాడిని నిరసిస్తూ న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు. చంద్రగిరిలో ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ రిలే నిరాహార దీక్షలు 39వ రోజుకు చేరుకున్నాయి. వ్యవసాయ శాఖ సిబ్బంది రోడ్డుపై మట్టిపోసి వరినాట్లు వేసి వినూత్న తరహాలో నిరసన తెలి పారు. శ్రీకాళహస్తిలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఏపీ సీడ్స్ కూడలిలో ధర్నా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెండ్లిమండపం కూడలి వద్ద రెవెన్యూ సిబ్బంది, బేరివారిమండపం వద్ద ఐకేపీ సంఘాల మహిళల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. బాబూ అగ్రహారం వద్ద ఉపాధ్యాయులు రోడ్డుపై ఆటపాట కార్యక్రమం నిర్వహించారు. పుత్తూరులో ఆర్టీసీ కార్మికులు చెవిలో పూలు పెట్టుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పుత్తూరు, నగరిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ రిలే దీక్షలు కొనసాగాయి. హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదుల దాడిని నిరసిస్తూ పుంగనూరులో న్యాయవాదులు భారీ ర్యాలీ నిర్వహించి గోకుల్ సర్కిల్లో మానవహారం ఏర్పాటుచేసి రాస్తారోకో చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది, జేఏసీ రిలే దీక్షలు కొనసాగాయి. ఉపాధ్యాయులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. మదనపల్లెలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మల్లికార్జున సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. విద్యార్థి జేఏసీ నాయకులు రెండు సినిమా థియేటర్ల వద్ద తుఫాన్ సినిమా వాల్‌పోస్టర్లను ధ్వంసం చేశారు. జేఏసీ రిలే దీక్షలు యథావిధిగా కొనసాగాయి. పలమనేరులో విద్యార్థులు రోడ్డుపై చదువులు సాగించి, సమైక్య నినాదాన్ని రామకోటి తరహాలో రాసి నిరసన తెలిపారు. న్యాయవాదులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. టీడీ పీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. జేఏసీ దీక్షలు కొనసాగాయి. వి.కోటలో 48 గంటల బంద్ కొనసాగింది. ఎలక్ట్రికల్,డిష్ యాంటెన్నా వ్యాపారులు ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేశారు. గంగవరంలో ఉపాధ్యాయులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. బెరైడ్డిపల్లెలో ఉపాధ్యాయ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు కొనసాగాయి. కుప్పం నియోజకవర గం శాంతిపురంలో ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. హైస్కూల్ విద్యార్థులు మానవహారం ఏర్పాటుచేశారు. కుప్పం, శాంతిపురంలో జేఏసీ నిరాహార దీక్షలు కొనసాగాయి. మదనపల్లె రూర ల్, తంబళ్లపల్లె, పూతలపట్టు నియోజకవర్గాల్లో నిరసన కార ్యక్రమాలు జరిగాయి. -
'సేవ్ ఆంధ్రప్రదేశ్'కు సంఘీభావంగా స్తంభించిన వైద్య సేవలు
విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్: ఆంధ్ర వైద్య కళాశాల అనుబంధ ప్రభుత్వ ఆస్పత్రులలో శనివారం ఓపీల్లో వైద్యసేవలు, సాధారణ శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఎన్జీవోలు హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు సంఘీభావంగా వైద్యులు కేజీహెచ్‌తోపాటు విక్టోరియా ప్రసూతి ఆస్పత్రి, ఈఎన్టీ, కంటి, ఛాతి, రాణి చంద్రమణిదేవి, వికలాంగుల ఆస్పత్రుల్లో కేవలం అత్యవసర శస్త్ర చికిత్సలు, ప్రసవాలు మాత్రమే జరిగాయి. ఓపీ చీటీలనిచ్చే కౌంటర్లు తెరుచుకోలేదు. ఓపీ విభాగాలకు వైద్యులు రాకపోవడంతో ఆయా గదుల తాళాలు తీయలేదు. శస్త్ర చికిత్సలకు సంబంధించి ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లలో అత్యవసర శస్త్ర చికిత్సలు మాత్రమే జరిగాయి. అత్యవసర రోగులను క్యాజువాల్టీలో చూశారు. ఆపరేషన్ థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఎలక్టివ్ సర్జరీలు ఏమి జరగలేదు. కేజీహెచ్‌లో ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్, గైనిక్ లేబర్ రూమ్ మినహా అన్ని ఆపరేషన్ థియేటర్లకు తాళాలు వేసి కనిపించాయి. దూరప్రాంతాల నుంచి వచ్చిన రోగులు వైద్యసేవలు అందకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నిరాశతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీశారు. కొంతమంది అత్యవసర వై ద్య విభాగాల ముందు పడిగాపులు కాశారు. వార్డుల్లోనూ వైద్యసేవలకు కొంతమేరకు అంతరాయం కలిగిం ది. యూనిట్‌కు ఒక వైద్యుడు, పీజీలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నాలుగో తరగతి ఉద్యోగులు ఎక్కువమంది విధులకు గైర్హాజరై సమైక్యాంధ్ర నిరసన ధర్నాలో పాల్గొన్నారు. -
తిరుపతిలో భక్తుల ఇక్కట్లు
-
పాతిక దినాలైంది.. పని ముట్టక!!
సార్.. బిజీగా ఉన్నారా? కాసేపు మాట్లాడచ్చా? అంటూ వచ్చాడు మాకు బాగా అలవాటైన ప్లంబర్ శంకర్. చాలారోజులైంది శంకర్, నిన్ను చూసి. లోనికి రా.. చాయ్ తాగుదాం అంటూ పిలిచాను. పర్వాలేదు సార్, ఇక్కడే మాట్లాడదాం అంటూ గుమ్మంలోనే నిలబడిపోయాడు. ఏంటి విశేషాలు శంకర్, పనులు బాగానే నడుస్తున్నాయా అని అడిగేసరికి ఒక్కసారి శంకర్ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. నేనెక్కడ చూస్తానోనని ముఖం పక్కకు తిప్పేసుకుని, గొంతు సరిచేసుకుని మళ్లీ చెప్పాడు. 25 దినాలైంది సార్.. ఒక్క పని ముట్టక. చేతిలో రూపాయి ఆడట్లేదు. ఇంట్లో నల్లలు ఏమైనా రిపేర్లు గిట్ట ఉన్నయేమోనని వచ్చినా సార్ అన్నాడు. నాకు అది పెద్ద షాక్. ఎందుకంటే, ఒకే రోజు సిటీ నాలుగు మూలలా ఎక్కడైనా సరే చిన్న పని ఉన్నా వదిలిపెట్టకుండా వెళ్లి వందో రెండొందల చొప్పున సంపాదించుకుని గానీ రాని మనిషి శంకర్. ఇంట్లో ఏ నల్లా సరిలేకపోయినా, పైపులైన్లు లీకవుతున్నా.. ఎంత చిన్న, పెద్ద సమస్య అయినా సరే ఫోన్ చేస్తే చాలు.. రెక్కలు కట్టుకుని వాలిపోయి, పని పూర్తి చేసి ఆ తర్వాత టైమును బట్టి చాయ్ తాగడమో, మరీ మేం బలవంతపెడితే భోజనం చేయడమో చేసి, పనికి డబ్బులు తీసుకుని వెళ్లేవాడు. సమస్య మళ్లీ రాకుండా చేయడం, రూపాయి దగ్గర రాజీ పడకపోవడం తన నైజం. అలాంటి శంకర్, ఒక్కరోజు కూడా పని చేయకుండా పడుకోని శంకర్.. ఏకంగా 25 రోజుల్నించి పని ముట్టలేదంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. కానీ, ఎదురుగా సజీవ సాక్ష్యం ఉంది. ఎందుకు శంకర్, అంత దారుణంగా ఉందా అని అడిగేసరికి చిల్లుపడ్డ ఆకాశంలా భోరుమన్నాడు. ఎప్పుడూ నవ్వుతూ పనిచేసుకుని, నాలుగు కబుర్లు చెప్పి, చకచకా ఉత్సాహంగా ఉండే శంకర్ అలా బేలగా అయిపోయి కళ్లనీళ్లు కార్చేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇగ నువ్వు లోనికి రా.. అంటూ లోపల కూర్చోబెట్టి, ఇంట్లో శ్రీమతికి చెప్పి వేడివేడి చాయ్ చేయించి ఇచ్చా. వచ్చిన దాదాపు అరగంట తర్వాత అప్పుడు బయటపడ్డాడు. తెలంగాణ గురించి ప్రకటన రాగానే ఇక్కడ ఇళ్లు కట్టించే మేస్త్రీలు దాదాపు అందరూ వాళ్ల సొంతూళ్లు (ఎక్కువగా ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాలు) వెళ్లిపోయారట. నగరంలో నిర్మాణ పనులు చాలావరకు ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆగిపోయాయట. దాంతో శంకర్ లాంటి ప్లంబర్లకే కాదు, ఎలక్ట్రీషియన్లు, సెంట్రింగ్ మేస్త్రీలు, లేబర్.. ఇలా అందరికీ చేతిలో పని లేక దాదాపు నెల రోజుల నుంచి నోట్లోకి నాలుగువేళ్లు కూడా పోవట్లేదు. అన్నీ బాగున్న రోజుల్లో శంకర్ సంపాదన కూడా బాగానే ఉండేది. దాంతో కుటుంబం మొత్తం కలిసి బయటకు వెళ్లాలంటే బాగుంటుందని ఓ కారు కూడా కొన్నాడు. కానీ ఇప్పుడు చేతిలో సంపాదన లేక, ఇంకా దాదాపు 10 నెలల వరకు దానికి వాయిదాలు కట్టాల్సి రావడంతో ఏం చేయాలో తెలియక అతడి పరిస్థితి ఘోరంగా ఉంది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడ ఇళ్లు కట్టాలన్నా చాలావరకు ఆ ప్రాంతానికి చెందిన మేస్త్రీలే వస్తుంటారు. వాళ్ల దగ్గర పనితనం ఉండటం, ముందునుంచి వాళ్లు ఆ పనికి అలవాటు పడి ఉండటంతో.. వీళ్లు కూడా బాగానే ఉందిలే అని మిగిలిన పనులకు పరిమితం అయిపోయారు. పైపెచ్చు, రాష్ట్రం ఏమవుతుందో, ఎన్నాళ్లు ఇక్కడ ఉంటామో, వెళ్లిపోవాల్సి వస్తుందేమోనన్న అయోయమ పరిస్థితి ఉండటంతో ఎవ్వరూ స్థలాలు కొని, ఇళ్లు కట్టించడం లేదా ఇప్పటికే కడుతున్న ఇళ్లు కొనడం లాంటి సాహసాలు చేయలేకపోతున్నారు. దీనికి తోడు సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రాజధాని వస్తుందని, అక్కడ నిర్మాణాలకు డిమాండు ఉంటుందని వార్తలు రావడంతో చాలామంది మేస్త్రీలు అటువైపు వెళ్లిపోయి అక్కడ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఒక్కసారిగా పనులన్నీ ఆగిపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి పనుల కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు వలస వచ్చినవారికి నెలరోజుల నుంచి ఉపాధి లేకుండా పోయింది. హైదరాబాద్ గురించి ఒక్కక్కళ్లూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. మాట్లాడే నాయకులెవ్వరికీ పైసలకు ఫికర్ లేదు సార్. మాలాంటోళ్లకు మాత్రం కూడు దొరకట్లేదు అంటూ శంకర్ లాంటి చాలామంది వాపోతున్నారు. రెండువైపులా నాయకులు ఒకరినొకరు రెచ్చగొట్టేలా మాట్లాడటంతో రోజురోజుకూ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భవన నిర్మాణ రంగంతోపాటు అన్ని రకాల వ్యాపారాలు కూడా కుదేలైపోయాయి. ఇంత చిచ్చు పెట్టిన వాళ్లు మాత్రం రెండువైపులా వినోదం చూస్తూ కాలం గడిపేస్తున్నారు. కలికాలం అంటే ఇదేనేమో!! -
అరగుండు గీయించుకున్న టిడిపి ఎమ్మెల్యే రామారావు
-
జోరు వానలోనూ ఆగని పోరు
సాక్షి నెట్వర్క్: ఎడతెరపి లేని వర్షంలోనూ సమైక్య సెగ ఎగసింది. సీమాంధ్ర జిల్లాల్లో సోమవారం జోరు వానను సైతం లెక్కచేయకుండా సమైక్యవాదులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో వేకువజాము నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉన్నా నిరసనలు పోటెత్తాయి. రాష్ట్రాన్ని విభజిస్తే చూస్తూ ఊరుకోమని సమైక్యవాదులు హెచ్చరించారు. ఏఐసీసీ అధిష్టానం వేర్పాటు ప్రకటన వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, మానవహారాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, వంటావార్పులు, రాస్తారోకోలతో హోరెత్తించారు. సోనియాగాంధీ, కేసీఆర్, బొత్సల దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు సోమవారం కూడా అడుగడుగునా కనిపించాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కటిక యువజన సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మిగనూరులో మాల మహానాడు యూత్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మకు మద్యం బాటిళ్ల దండను వేసి పుర వీధుల్లో ఊరేగించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కేసీఆర్, సోనియగాంధీ దిష్టిబొమ్మలను ఊరేగించి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద దహనం చేశారు. విజయనగరంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స, దిగ్విజయ్ సింగ్, రాహుల్‌గాంధీ, సోనియా గాంధీ, కేసీఆర్ మాస్కులు వేసుకున్న వ్యక్తులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి సీమాంధ్ర ప్రజల చెవిలో పువ్వులు పెట్టినట్లు నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో భవన నిర్మాణ కార్మికులు కేసీఆర్, సోనియాలకు సమాధి కడతాం అంటూ లారీల్లో బొమ్మల్ని ఊరేగించి వినూత్నంగా నిరసన తెలిపారు. చిల్లర వర్తకులు గుర్రాలు, ఒంటెలపై ప్రదర్శనగా వెళ్లి బీచ్‌రోడ్డులోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రైతుబజార్ల బంద్ కృష్ణాజిల్లా వ్యాప్తంగా రైతుబజార్లు మూతపడ్డాయి. ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉన్నా జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. కేబుల్ ఆపరేటర్లు పూర్తిగా వినోద ప్రసారాలను నిలిపివేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి 24 గంటల బంద్ చేపట్టాలని పెట్రోల్‌బంక్‌ల యాజమాన్యాలు నిర్ణయించాయి. నూజివీడులో వీఆర్వోలు భారీ ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేత గౌతంరెడ్డి నేతృత్వంలో విజయవాడలో అర్చకులు సమైక్యాంధ్ర కోసం హోమం నిర్వహించారు. తిరువూరులో వేలాదిమంది విద్యార్థులు, డ్వాక్రా మహిళలు ప్రదర్శన చేపట్టారు. ఎడ్లబండ్ల ర్యాలీ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలులో భారీ ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పాల్గొని రైతుల ఉద్యమానికి ఊతమిచ్చారు. సమైక్యాంధ్ర పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ఏలూరు నగర బంద్ ప్రశాంతంగా జరిగింది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి ఉద్యమానికి మద్దతు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో వంటావార్పు నిర్వహించారు. భీమవరం పరిసర ప్రాంతాలకు చెందిన క్రైస్తవ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించి, ప్రార్థనలు చేపట్టాయి. పాలకొల్లులో రైతు వేదిక ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు సమైక్యాంధ్ర కోరుతూ కదం తొక్కారు. మరో రెండురోజులు ‘తూర్పు’బంద్ తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా సోమవారం బంద్ పాటించారు. మంగళ, బుధవారాలు కూడా బంద్ పాటించాలని జేఏసీలు నిర్ణయించాయి. విద్యా సంస్థలు వరుసగా 12వ రోజు కూడా మూత పడ్డాయి. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. మంత్రి తోట నరసింహం సతీమణి వాణి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరింది. చేనేత కార్మికుల ప్రదర్శన పిఠాపురంలో చేనేత కార్మికుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. తుని, పాయకరావు పేటల్లో రిక్షాపుల్లర్స్ ర్యాలీలు నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన 23 ఐసీడీఎస్ ప్రాజెక్టుల ఉద్యోగులు రాజమండ్రిలో ర్యాలీ చేపట్టారు. వికలాంగుల నిరశన దీక్షలు రాజానగరం సెంటర్లో వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. అనపర్తిలో నాయీ బ్రాహ్మణులు సోనియా గాంధీ, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలతో శవయాత్ర చేసి దేవీచౌక్‌లో దగ్ధం చేశారు. నెల్లూరు జిల్లాలో వర్షాన్ని సైతం లెక్కచేయక జనం రోడ్లమీదకు వచ్చారు. నెల్లూరు నగరంలోని జాతీయ రహదారిపై జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించి హైవేను దిగ్బంధించడంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచి పోయింది. కావలిలో ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి సమైక్య ఉద్యమానికి మద్దతు పలికారు. ప్రకాశం జిల్లాలో సోమవారం వేకువజాము నుంచి జోరున వర్షం పడుతున్నా సమైక్య హోరు మాత్రం కొనసాగింది. పర్చూరులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త గొట్టిపాటి నరసయ్య కుమారుడు భరత్ చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. కనిగిరిలో వైఎస్సార్ సీపీ నాయకుడు రాజాల ఆదిరెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష రెండో రోజుకు చేరింది. కదం తొక్కిన కార్మికులు కర్నూలు నగరంలో వైఎస్సార్సీపీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వేలాదిమంది ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కనిపించడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆదోనిలో విద్యుత్‌శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి సమైక్య ఆందోళనలో పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. నంద్యాలలో రాయలసీమ ఇంజినీరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టగా.. వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. గళార్చనతో నిరసన తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి రాస్తారోకో చేపట్టారు. ఇందిరా మైదానంలో ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో గళార్చన నిర్వహించి ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తిరుపతి జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి ఆధ్వర్యంలో సుమారు 300 మంది మహిళలు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్‌లో కార్మికులు బస్సులను తాడుతో కట్టి లాగి నిరసన తెలిపారు. చిత్తూరులో వైఎస్సార్సీపీ నేత ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో జానపద గేయాలతో ప్రజలను చైతన్య పరచారు. పుంగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో సుమారు 4వేల మంది దళిత, గిరిజనులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గుంటూరు కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ నేతృత్వంలో జోరువర్షాన్ని సైతం లెక్కచేయకుండా గుంటూరులో ఆందోళనలు చేపట్టారు. దుగ్గిరాలలో పసుపు రైతుల నిరసన నేపథ్యంలో యార్డులో వేలం ప్రక్రియను నిలిపివేశారు. 10వేల మందితో సమైక్య మార్చ్ పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం విజయనగరం జిల్లా చీపురుపల్లి కేంద్రంలో సమైక్య నినాదం హోరెత్తింది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలు పదివేలమందికిపైగా చేయి చేయి కలిపి భారీ మార్చ్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యార్ధులు నిరసనప్రదర్శనలు చేపట్టారు. పాలకొండ-విశాఖపట్నం రహదారిలో గోపాలపురం వద్ద , యువజన సంఘాల ప్రతినిధులు నాటుబండ్లు, ట్రాక్టర్ ట్రాలీలు రోడ్డుకు అడ్డంగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. ఎచ్చెర్లలోని బీఆర్‌ఏయూ విద్యార్థులు ఆంటోని కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. ‘అనంత’ 48 గంటల జిల్లా బంద్ విజయవంతం అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 48 గంటల జిల్లా బంద్ విజయవంతమైంది. వైఎస్సార్సీపీతో పాటు టీడీపీ కూడా బంద్‌కు పిలుపునివ్వడంతో సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీవ్రంగా కొనసాగింది. విశాఖ నగరంలోని శ్రీకనకమహాలక్ష్మి దేవస్థానం అధికారులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి జగదాంబ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. 14న విశాఖలో సింహగర్జన 14న ఏయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో సింహగర్జన ఉంటుందని, బీచ్‌రోడ్డులో ఈనెల 18న మిలీనియం మార్చ్ నిర్వహిస్తామని సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ప్రకటించారు. బద్వేలులో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు వైఎస్సార్ జిల్లా బద్వేలులో క్రైస్తవ సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించి నాలుగురోడ్ల కూడలిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని వేడుకున్నారు. కడపలో గెజిటెడ్ అధికారులు సైతం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలియజేశారు. ఇరిగేషన్ ఉద్యోగులు వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టి తమ నిరసనను తెలియజేశారు. ఆర్టీపీపీలో ఉద్యోగులు విధులను బహిష్కరించారు. గడికోట, రవీంద్రనాథ్‌ల ఆమరణ నిరశన సాక్షి, కడప: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి సోమవారం నుంచి వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. వీరివురికి సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చిన జనంతో కలెక్టరేట్ పరిసరప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ జీవితాలను త్యాగం చేసైనా విభజనను అడ్డుకుంటామన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ర్టవ్యాప్తంగా ప్రాంతాలకతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనాన్ని తట్టుకోలేకే విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. దమ్ముంటే కాంగ్రెస్ అధిష్టానం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలే గానీ ఇలా కుట్రలు చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూంటే జనం చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రాయలసీమ వాసి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఈ ప్రాంతం తరఫున ఏ వాదన వినిపించకపోవడం దారుణమన్నారు. తెలంగాణలో కూడా 50 శాతం మంది రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని వారు పేర్కొన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ, రాజ్యాధికారం కోసం కాంగ్రెస్‌పార్టీ తెలుగుజాతిని రెండు ముక్కలుగా చేసేందుకు సిద్ధపడిందని మండిపడ్డారు. విభజన జరిగిన తర్వాత జూరాల ఎత్తుపెంచితే రాయలసీమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే సాగునీటి సమస్యలతో సీమ రైతాంగం అల్లాడిపోతోందని, విభజన జరిగితే ఎడారి కావడం త థ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమరణ నిరాహారదీక్షలో వైసీపీ నేతలు హఫీజుల్లా, పాండురంగారెడ్డి, సంపత్‌లు కూడా కూర్చున్నారు. మరో 12మంది రిలేనిరాహారదీక్షలో కూర్చున్నారు. పగిలిన గుండెలు సాక్షి నెట్వర్క్: సీమాంధ్రలో మృత్యుఘోష ఆగడం లేదు. విభజన వార్తలను తట్టుకోలేక సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో తొమ్మిది మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిన్నసాన గ్రామానికి చెందిన బోనెల వైకుంఠరావు (23) పొక్లెయిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న అతను రాష్ట్రాన్ని విడదీయవద్దని బిగ్గరగా కేకలు వేస్తూ నేలకొరిగిపోయాడు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయిందని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి పంచాయతీ పరిధిలోని కంది శ్రీరామపురంలో జామి వెంకటరావు విభజన వార్తలపై పదిరోజులుగా ఆవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో న్యూస్‌పేపర్ చదువుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలొదిలాడు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక గెడ్డంవారిపేటకు చెందిన కూలీ బూల పల్లయ్య (40) పెద్దకొడుకు వెంకటేష్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాష్ట్రాన్ని విడదీస్తున్నారని మనస్తాపం చెందిన పల్లయ్య హైదరాబాద్ నుంచి సీమాంధ్రులు వెళ్లిపోవలసిందేనని కేసీఆర్ అన్నరోజు నుంచీ మరింత ఆందోళనకు గురయ్యాడని, సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించాడు. అనంతపురం జిల్లా సోమందేపల్లికి చెందిన బాదయ్యపల్లి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం వరిఘేడు గ్రామానికి చెందిన దాసి మత్తయ్య (58) సోమవారం రాత్రి టీవీలో విభజన వార్తలు చూస్తూ కలతచెంది గుండెపోటుతో మరణించగా, దెందులూరుమండలం దోసపాడులో పెనుబోయిన సుబ్బమ్మ (70) విభజన నిర్ణయూన్ని తట్టుకోలేక.. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న తన మనుమడి భవిష్యత్‌పై బెంగపెట్టుకుని సోమవారం గుండె ఆగి మరణించింది.సమైక్యాంధ్ర ఉద్యమాలకు సంబంధించి టీవీల్లో వార్తలు చూస్తూ ఉద్వేగానికి లోనై సోమవారం వైఎస్ఆర్ జిల్లాలో ముగ్గురు గుండె పోటుతో మృతి చెందారు. జమ్మలమడుగు మండలం సిరిగేపల్లిలో బుకే రామదాసు నాయక్ (40) ఆదివారం రాత్రి టీవీ వార్తలు చూస్తూ గుండె నొప్పితో కుప్పకూలి మరణించారు. అట్లూరు క్రాస్‌రోడ్డులోని మద్దూరు కాలనీకి చెందిన నరసింహులు (35) ఎక్కడైనా సమైక్యాంధ్రకు మద్దతుగా ధర్నాలు జరుగుతుంటే వెళ్లేవాడు. సోమవారం రాత్రి టీవీ చూస్తూ గుండె పోటు రావడంతో ఆటోలో కడపకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. రైల్వేకోడూరులోని పారిశుద్ధ్య కాలనీలో సమైక్య ఉద్యమం వార్తలు చూస్తూ సోమవారం ఎన్.మంజుల (35) గుండెపోటుతో మృతిచెందినట్లు సమీప బంధువులు తెలిపారు.