=48 గంటల పాటు రహదారుల దిగ్బంధం విజయవంతం
=స్తంభించిన రాకపోకలు
=నిత్యావసరాలు, అంబులెన్సు,రైతులకు మినహాయింపు
=రెండోరోజూ తిరుమలే శుడికి దిగ్బంధం సెగ
=కదం తొక్కిన వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు
=పలువురు నేతల అరెస్టు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 48 గంటల రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. జిల్లా సరిహద్దుల్లో జాతీయ రహదారులపై కిలోమీటర్ల పొడవునా వాహనాలు బారులు తీరాయి. ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించింది. పార్టీ శ్రేణులు రహదారిపైనే వంటావార్పు చేపట్టాయి. సమైక్య భజనలు చేశాయి. సమైక్యాంధ్ర నినాదాలతో రహదారులు హోరెత్తాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజలు సైతం స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అత్యవసర సేవలకు, రైతుల వాహనాలకు ఆందోళనకారులు మినహాయింపు ఇచ్చి సహకరించారు.
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల రహదారుల దిగ్బంధం రెండో రోజూ విజయవంతమైంది. ఎక్కడి వా హనాలు అక్కడే నిలిచిపోయాయి. జిల్లా సరిహద్దుల్లో వాహనాలు కిలోమీటర్ల పొడవున వాహనాలు బారులు తీరాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వస్తున్న వాహనాలు గంటల తరబడి ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్నారు.
తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహం వద్ద పార్టీ నాయకులు వ ృత్తాకారంలో రోడ్డుపై బైఠాయించడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు బస్సులు దిగి నడుచుకుంటూ వచ్చారు. శ్రీకాళహస్తిలో ఏపీ సీడ్స్ సర్కిల్ నుంచి నె ల్లూరు జిల్లా వైపు నాలుగు కిలోమీటర్ల మేర వా హనాలు నిలిచిపోయాయి. తిరుపతి రోడ్డులో ల్యాంకో ఫ్యాక్టరీ వరకు మరో నాలుగు కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. సమైక్యాం ధ్రను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు కూ డా సహకరించారు.
తిరుమలేశుడికి రెండోరోజూ దిగ్బంధం సెగ
రహదారుల దిగ్బంధంతో రెండోరోజూ తిరుమలేశుడికి సెగ తప్పలేదు. తిరుమలకు వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. గురువారం నేత్రదర్శన సేవలో తమిళనాడు వాసులు ఎక్కువగా పాల్గొంటారు. నగరిలో రోడ్లను దిగ్బం ధించడంతో చెన్నై నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. తమిళనాడు సరిహద్దు ప్రాంతాల వర కు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికు లు రోడ్డు పక్కనే వంటావార్పు చేసుకున్నారు. వేలూరు నుంచి చిత్తూరు మీదుగా తిరుపతి చేరుకునే భక్తులూ రాలేకపోయారు. కుప్పం, మదనపల్లె, పీలేరు మీదుగా చింతామణి, బెంగళూరు లాంటి ప్రాంతాల నుంచి కర్ణాటక భక్తు లు రాలేదు. పలమనేరు, మదనపల్లె ప్రాం తా ల నుంచి తిరుపతికి వచ్చే రైతుల వాహనాలకు, అంబులెన్స్‌లకు మినహాయింపు ఇచ్చారు.
పలువురు వైఎస్‌ఆర్‌సీపీ నేతల అరెస్టు
తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహం వద్ద రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు వరప్రసాదరావు, నగర కన్వీనరు పాలగిరి ప్రతాపరెడ్డి, స్థానిక నాయకుడు దొడ్డారెడ్డి సిద్దారెడ్డిని ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలంటూ పార్టీ నాయకుడు ఎస్‌కే.బా బు నాయకత్వంలో 200 మందికి పైగా కార్యకర్తలు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అరగంట తర్వాత నాయకులను విడుదల చేశారు.
చిత్తూరులో చెన్నై-బెంగళూరు రహదారిని దిగ్బంధించిన పార్టీ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ , మైనారిటీ నాయకుడు సయ్యద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరులో ధర్నాలు, రాస్తారోకోలు, నాలుగు వేల నల్లజెం డాలు, వంద మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి నాయకత్వంలో రహదారులను దిగ్బంధిం చారు. వంద ఆకారంలో కూర్చొని నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో ఏపీ సీడ్స్ సర్కిల్ వద్ద పార్టీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి నాయకత్వంలో ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించారు.
పార్టీ నాయకులు గుమ్మడి బాలకృష్ణయ్య, మిద్దెల హరి, కొట్టెడి మధుసూదన్, లోకేష్ పాల్గొన్నారు. నగరిలో పార్టీ సమన్వయకర్త ఆర్‌కే.రోజా ఆధ్వర్యంలో పుత్తూరు-నారాయణవనం రోడ్డును దిగ్బంధించారు. పార్టీ జి ల్లా కన్వీనర్ నారాయణస్వామి, లక్ష్మీపతి రాజు పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో నా రాయణవనం, పిచ్చాటూరు, కేవీబీపురం, వరదయ్యపాళె ం మండలాల్లో పార్టీ సమన్వయకర్త ఆదిమూలం నేతృత్వంలో రహదారులను దిగ్బంధించారు.
చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి-చిత్తూరు రోడ్డులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో గుమ్మడికాయలకు విభజన ద్రోహుల బొమ్మలను అతికించి, ఉట్లోత్సవం నిర్వహించారు. రంగునీళ్లు చల్లుకుంటూ రహదారులను దిగ్బంధించారు. పీలేరు నియోజకవర్గ సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి పీలేరు-తిరుపతి రోడ్డుపై బైఠాయించారు. పల్లె సర్వీసు బస్సులను మినహాయించి మిగతా వా హనాలను అడ్డుకున్నారు. పుంగనూరులో మా జీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు బెంగళూరు, ఎంబీటీ, తిరుపతి, చింతామణి రోడ్లను దిగ్బంధించారు.
పార్టీ నాయకు లు రెడ్డెప్ప, నాగరాజరెడ్డి, భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో చెట్లను నరికి రోడ్లపై వేశారు. ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. మదనపల్లెలోని మ ద్రాసు-బాంబే ట్రంక్ రోడ్డుపై మైనారిటీ నా యకుడు అక్తర్ అహ్మద్, ఎమ్మెల్సీ తిప్పారెడ్డి నేతృత్వంలో అమ్మచెరువు మిట్ట వద్ద వంటావార్పు నిర్వహించారు. కర్ణాటక సరిహద్దులోని చిత్తిలి గ్రామం వద్ద బెంగళూరు రహదారిలో పార్టీ సమన్వయకర్త షమీమ్ అస్లాం బైఠాయిం చారు. తిరుపతి రోడ్డులో మైనారిటీ నాయకుడు బాబ్‌జాన్ బైఠాయించి, వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వీరి కార్యక్రమాలను భగ్నం చేశారు.
తంబళ్లపల్లె-ములకలచెరువు రోడ్డులో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సూచనల మేరకు పార్టీ కార్యకర్తలు రోడ్డును దిగ్బంధించారు. అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కుప్పం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి నాయకత్వంలో శాంతిపురం వద్ద రహదారిని దిగ్బంధించారు. కుప్పం, రామకుప్పంలో రోడ్ల ను దిగ్బంధించారు. పూతలపట్టులో జిల్లా అధికార ప్రతినిధి తలపులపల్లి బాబురెడ్డి నాయకత్వంలో రంగంపేట క్రాస్ వద్ద రోడ్డు దిగ్బంధం చేశారు. పార్టీ సమన్వయకర్తలు సునీల్‌కుమార్, పూర్ణం, రవిప్రసాద్, మండల కన్వీనర్ రాజరత్నంరెడ్డి పాల్గొన్నారు.