=పత్యేక రైళ్లు, బస్సుల్లో హైదరాబాద్‌కు...
=పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు
=నిర్వహణపై ఉత్తరాంధ్ర జిల్లా నేతల భేటీ
సాక్షి, విశాఖపట్నం : సమైక్యాంధ్ర ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26న తలపెట్టిన సమైక్యాంధ్ర శంఖారావానికి ఉత్తరాంధ్ర జిల్లా నేతలు సన్నద్ధమవుతున్నారు. కార్యక్రమ ఏర్పాట్లపై ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్‌కృష్ణ రంగారావు, శంఖారావ ఉత్తరాంధ్ర సమన్వయకర్త దాడి వీరభద్రరావు నేతృత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్లు, సమన్వయకర్తలు, అనుబంధ సంఘాల కన్వీనర్లు, ఇతర ప్రధాన నేతలతో నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం భేటీ అయ్యారు.
ఒక్కో నియోజక వర్గం నుంచి ఎంత మంది బయలుదేరనున్నారు, ప్రయాణ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్నది వైఎస్సార్ సీపీ ఒక్కటే కావడంతో శంఖారావం సభ కు జాతీయస్థాయిలో ప్రాధాన్యం ఏర్పడిందని సుజయ్‌కృష్ణ రంగారావు, దాడి వీరభద్రరావు చెప్పారు. సమావేశానికి ప్ర తి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలి వెళ్లేందుకు నేతలు ఏర్పా టు చేయాలని సూచించారు.
విశాఖ అర్బన్, గ్రామీ ణ ప్రాంతం నుంచి ఒక రైలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కలిపి ఒక రైలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అవసరమనుకుంటే అదనపు బోగీలు బుక్ చేస్తామన్నారు. బస్సులు, మినీ బస్సుల్ని ఇప్పటి నుంచే సమాయత్తం చేసే పనిలోపడ్డారు. ఈ నెల 25న సాయంత్రం బయలుదేరి, మరుసటి రోజు ఉదయానికే హైదరాబాద్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు డాక్టర్ కణితి విశ్వనాథం, బగ్గు లక్ష్మణరావు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు డాక్టర్ జహీర్ అహ్మద్, కుంభా రవిబాబు, వరుదు కళ్యాణి, విశాఖ నగర, జిల్లా కన్వీనర్లు వంశీకృష్ణ శ్రీనివాస్, చొక్కాకుల వెంకటరావు, మాజీ మంత్రులు బలిరెడ్డి సత్యారావు, తమ్మినేని సీతారాం, విశాఖ నుంచి పార్టీ సమన్వయకర్తలు కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, కోరాడ రాజబాబు, పెట్ల ఉమాశంకర్ గణేష్, పూడి మంగపతిరావు, బూడి ముత్యాలునాయుడు, ప్రగడ నాగేశ్వరరావు, వంజంగి కాంతమ్మ, సత్యవేణి, గిడ్డి ఈశ్వరి, బలిరెడ్డి సత్యారావు, పార్టీ నేతలు సత్తి రామకృష్ణారెడ్డి, కొయ్య ప్రసాద్‌రెడ్డి, గండి రవికుమార్, పక్కి దివాకర్, పసుపులేటి ఉషాకిరణ్, రవిరెడ్డి, గంపల గిరిధర్, కంపా హనోకు పాల్గొన్నారు. శ్రీకాకుళం నుంచి వై.వి.సూర్యనారాయణ, పి.ఎం.జె.బాబు, గొర్లె కిరణ్, వజ్జి బాబూరావు, విజయనగరం నుంచి ఇ.సుదర్శనరావు, గురాన అయ్యలు, వి.శ్రీనివాసరావు, చినరామునాయుడు, శ్రీవాణి, ప్రసన్నకుమార్, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.