National roads
-
బడాబాబుల కోసం బంగారు భూముల్లో ..
పెళ్లకూరు మండలం నుంచి నాయుడుపేట మీదుగా పండ్లూరు వరకూ ఆరు లైన్ల బైపాస్ నిర్మిస్తున్నారు. 20 కిలోమీటర్ల మేర అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. అయితే సంపన్నుల కోసం ప్లాన్లు మార్చివేశారు. దీనికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తోడవడంతో పేదల ఇళ్లు, పంటలు పండే బంగారు భూములపై పడ్డారు అధికారులు. రోజురోజుకూ అధికారులు హద్దు లు మార్చేస్తూ పెద్దలకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎనిమిది నెలల క్రితం వేసిన హద్దుల్లో బడాబాబులకు చెందిన భవనాలు, అపార్టుమెంట్లున్నాయి. ప్రస్తుతం వేస్తున్న హద్దుల్లో పంట పొలాలు, బోర్లు, పలు దళిత కాలనీలున్నాయి. కొత్త హద్దులను అడ్డుకుంటూ మాకు చావే శరణ్యం అంటున్నారు పేదలు. అయినా అధికారులకు వీరి గోడు పట్టడంలేదు. నాయుడుపేటటౌన్ (నెల్లూర): కేంద్రం ఇటీవల ఏర్పాటుచేసిన 71వ జాతీయ రహదారిపై రేణిగుంట నుంచి (పూతలపట్టు – నాయుడుపేట) మండల పరిధిలోని నాయుడుపేట పట్టణంలోని జీఎన్టీ రోడ్డు మీదుగా తుమ్మూరు, పండ్లూరు గ్రామం వరకు 16వ నంబరు జాతీయ రహదారిని కలుపుతూ ఆరులైన్ల రోడ్డును నిర్మించాల్సి ఉంది. దీనికితోడు నాయుడుపేట నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి సైతం భూసేకరణ పనులు చేపట్టి ఉన్నారు. ఆరులైన్ల నిర్మాణానికి సంబంధించి ఈ జాతీయ రహదారిపై స్వర్ణముఖి నదిపై చాలా పొడవైన బ్రిడ్జి ఉండటం, అంతేకాకుండా మామిడి కాలువ, రైల్వేగేట్లు తదితరాలు అడ్డంకులుగా ఉండడంతో ఈ ప్రతిపాదనను ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) తిరస్కరించింది. ఎన్హెచ్ఏఐ అధికారులు 2017 సంవత్సరం ఆగస్ట్ 3న కొత్తగా మళ్లీ సర్వే చేపట్టారు. దీంతో నాయుడుపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి జాతీయ రహదారి కూడలి సమీపంలో ఉన్న 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోమతి సర్కిల్ ఆవతల వైపు నుంచి రేణిగుంట వరకు 71వ నంబర్ జాతీయ రహదారిలో ఆరులైన్ల రోడ్డు నిర్మాణానికి హద్దులు ఏర్పాటుచేసి ప్రతిపాదనలు (డీపీఆర్) తయారు చేశారు. 20 కిలోమీటర్లకు సంబంధించిన ఆ రిపోర్టును తిరుపతి డివిజన్‌కు చెందిన అధికారులు కలెక్టర్‌కు అందజేశారు. నాయుడుపేట పట్టణ పరిధిలోని గోమతి సర్కిల్ నుంచి ఎల్ఏ సాగరం సమీప ప్రాంతాల నుంచి ఎల్ఏ సాగరం చెరువు, జువ్వలపాళెం గ్రామ పొలాల మీదుగా 16వ నంబర్ జాతీయ రహదారి కూడలి వరకు ప్రత్యేక సర్వే బృందం హద్దులు నాటారు. ఈ హద్దుల్లో గోమతి సర్కిల్ నుంచి జాతీయ రహదారి కూడలి వరకు అనేక భారీ భవంతులతో పాటు పలు అపార్ట్మెంట్లు సైతం ఉన్నాయి. అందుకు సంబంధించి భూసేకరణకు సైతం శ్రీకారం చేపట్టారు. ఇది అప్పట్లో సంచలనమైంది. అయితే అధికారులు బడాబాబులకు దాసోహమైపోయి హద్దు మార్చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ నేతలు ఒత్తిడి కావడంతో హద్దులు మారిపోతున్నాయి. నిరుపేద రైతులు, దళితులు నివాసం ఉండే ప్రాంతాలు, పచ్చని పంట పొలాల్లో హద్దు నాటుతున్నారు. కొద్దిరోజుల క్రితం జువ్వలపాళెంకు చెందిన దళితులు అధికారులను అడ్డుకున్నారు. అలాగే నాయుడుపేట, పెళ్లకూరు మండలాలకు చెందిన రైతులు సైతం వ్యవసాయ బోర్ల వద్ద ఆందోళనలు చేశారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వ్యవసాయ బోర్లు, బంగారు (వరి, చెరుకు) పండించే భూములను సైతం లాక్కునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రైతులు రెండు పర్యాయాలు కలెక్టర్ కార్యాలయంలో జేసీని కలిసి వినతిపత్రాలు సమర్పించారు కూడా. న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని రైతులు, దళితులు అంటున్నారు. నా దృష్టికి రాలేదు ఎల్‌ఏసాగరం, తదితర ప్రాంతాల్లో రైతుల బోర్లల వద్ద రాళ్లు నాటి విషయమై రైతులు నా దృష్టికి తీసుకురాలేదు. ఆరులైన్ల రోడ్డు కోసం మొదట ఎన్‌హెచ్ అధికారులు సర్వే చేశారు. తర్వాత రెవెన్యూ అధికారుల సర్వే ఉంటుంది. ఏదైనా సమస్యలుంటే పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తా. -ఎం శ్రీదేవి, ఆర్డీఓ నాయుడుపేట దుర్మార్గపు చర్య జాతీయ రహదారిపై ఆరు లైన్ల నిర్మాణానికి కొత్తగా సర్వే చేస్తూ రైతులకు సంబంధించిన వ్యవసాయ బోర్లు, పోలాలతో పాటు దళితులు నివాసాలు సమీపంలో హద్దులు రాళ్లు వేస్తుండటం దారుణం. ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న ఈ స్థలాలను సేకరించి రహదారి నిర్మాణం చేపడితే అందరికీ సమ్మతమే. – తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, నాయుడుపేట ఆత్మహత్యలే శరణ్యం ఎల్ఏ సాగరంలో మాకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయ బోరు ఏర్పాటు చేసుకుని సాగు చేసుకుంటున్నాం. తొలుత చేసిన సర్వేలో కొద్దిపాటి పొలం మాత్రమే పొయింది. తిరిగి నాటుతున్న హద్దుల్లో పొలాలతో పాటు బోర్లు ఉన్నాయి. బోర్లు పోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం. రెవెన్యూ అధికారులు పరిశీలించి న్యాయం చేయాలి. – పుట్ట రాగమ్మ, మహిళ రైతు, తాళ్వాయిపాడు, పెళ్లకూరు మండలం -
డిసెంబర్‌కు సాగర్మాల డీపీఆర్ పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: సాగర్మాల పథకం కింద ఆంధ్రప్రదేశ్ పరిధిలో చేపట్టనున్న ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన డిసెంబర్ నాటికి పూర్తవుతుందని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులు, జల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడికి సోమవారం ఇక్కడ వివరించారు. ఉపరితల రవాణా, జాతీయ రహదారులు, జల రవాణా శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై వెంకయ్య నాయుడు గడ్కరీతో కలసి సమీక్షించారు. సాగరమాల బకింగ్‌హం కాలువ అభివృద్ధి పనులు, జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి, అమరావతి రింగ్‌రోడ్డు నిర్మాణానికి నిధులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సాగరమల, బకింగ్‌హం కాలువ ప్రాజెక్టులకు సూత్రప్రాయ అంగీకారం తెలిపామని, డీపీఆర్ పూర్తయిన వెంటనే తదుపరి చర్యలు చేపడతామని గడ్కరీ వివరించారు. -
టెండర్ తెరవాలంటే ఢిల్లీ వెళ్లాలి!
జాతీయ రహదారుల పనులపై కేంద్రం కొత్త నిర్ణయం రూ.25 కోట్లకు మించిన పనుల వ్యవహారమంతా అక్కడే ఓ దేశం నేత నిర్వాకంతో వచ్చిన చిక్కు జాతీయ రహదారుల పనుల్లో తీవ్ర జాప్యం సాక్షి, హైదరాబాద్: అది ఖమ్మం జిల్లాలో రూ.175 కోట్ల విలువైన పనులతో చేపడుతున్న ప్రాజెక్టు. 221 జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి ప్రతి చిన్నా చితకా వ్యవహారానికి తెలంగాణ జాతీయ రహదారుల విభాగం అధికారులు ఢిల్లీకి పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే ఐదు దఫాలుగా తిరిగి వారు విసిగిపోయారు. టెండర్లు తెరవటం, వాటికి అనుమతులు... ఇలా రకరాలుగా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఢిల్లీ వెళ్లినా సంబంధిత అధికారుల్లో ఆరోజు ఏ ఒక్కరు గైర్హాజరైనా ఆ తంతు వాయిదా... మళ్లీ ఢిల్లీకి పరుగులు. కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందనే సామెతకు అద్దం పట్టే వ్యవహారమిది. జాతీయ రహదారుల పనులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే విషయంలో అధికార వికేంద్రీకరణ కోసం రాష్ట్రాలు పట్టుబడుతున్న తరుణంలో దానికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. రూ.25 కోట్ల కంటే ఎక్కువ విలువైన పనులకు సంబంధించిన టెండర్ల వ్యవహారాలను కేంద్రం తన గుప్పెట్లోకి తీసుకుంది. పనుల్లో జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్రాలకు అధికారాలు బదిలీ కావాలంటూ డిమాండ్ చేస్తున్న తరుణంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జాతీయ రహదారుల పనులు నత్తనడకలా సాగే ప్రమాదం నెలకొంది. విమాన ఖర్చులు, హోటల్ బిల్లులు తడిసి మోపెడు టెండర్ బిడ్ తెరవటం, ఎవాల్యుయేట్ చేయటం, ఫైనాన్షియల్ బిడ్ తెరవటం, ఆమోదం ఇవ్వటం, ఇతర సందేహాల నివృత్తి... ఇలా ఒక్కో పనికోసం రాష్ట్రంలోని జాతీయ రహదారుల విభాగానికి సంబంధించి నలుగురైదుగురు అధికారులు ఢిల్లీకి పరుగుపెట్టాల్సి వస్తోంది. సంబంధిత కార్యక్రమ సమయం దగ్గరపడ్డాక కబురు వస్తుండటంతో విమానంలో వెళ్లాల్సి వస్తోంది. ఆ ఖర్చులతోపాటు హోటల్ బిల్లులు... తడిసిమోపెడవుతున్నాయి. అక్కడి అధికారులకు ఏదైనా ముఖ్యమైన పని పడి ఇది కాస్తా వాయిదా పడితే అప్పటి వరకు ఢిల్లీలోనే మకాం వేయటమో, లేదా వచ్చి మళ్లీ వెళ్లటమో జరిగి ఖర్చు మరింత పెరుగుతోంది. ఇటీవల ఓ పని కోసం ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన వేళ స్థానికంగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికారులు వెళ్లలేకపోయారు. దీంతో ఆ పని కాస్తా వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు రమ్మంటారని ఢిల్లీ అధికారులను అడిగితే... ఇప్పుడే చెప్పలేమని, తమకూ పనులున్నందున ఆలస్యం అవుతుందని సమాధానమిచ్చారు. జాతీయ రహదారులకు సంబంధించిన పనుల్లో 90 శాతం రూ.25 కోట్లకు మించినవే ఉంటున్నందున ఢిల్లీ చక్కర్లు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యమంత్రి దృష్టికి సమస్య ఈ సమస్యపై జాతీయ రహదారుల విభాగం అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో మొరపెట్టుకున్నారు. టెండర్ల వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఢిల్లీకి సంబంధించిన ఎస్ఈ స్థాయిలో రీజినల్ అధికారి ఒకరు ఇక్కడ ఉంటారని, అన్నీ ఆయన సమక్షంలోనే జరుగుతాయని వివరించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఒక రాజకీయ నేత చేసిన తప్పిదాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆ అధికారిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా నిబంధనలను మార్చడం ఇబ్బందిగా ఉందని, దీనివల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని వారు సీఎంతో చెప్పారు. దీనిపై జోక్యం చేసుకుని అధికారాల వికేంద్రీకరణ జరిగేలా చూడాలని కోరారు. ‘దేశం’ నేత నిర్వాకంతోనే... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ‘దేశం’ నేత నిర్వాకంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారికి సంబంధించిన ఓ పని టెండర్‌ను తన అనుచరుడికి కట్టబెట్టే ఉద్డేశంతో ఆ దేశం నేత వైరి కాంట్రాక్టర్‌కు చెందిన ఓ అర్హత పత్రాన్ని మాయం చేయించాడు. ఈ -ప్రొక్యూర్మెంట్ ప్రకారం ఆన్లైన్ దరఖాస్తులో ఆ పత్రం ఉన్నా... తర్వాత సీల్డ్ కవర్ ద్వారా అందించే సమయంలో అది కనిపించలేదు. ఢిల్లీకి సంబంధించిన అధికారి పర్యవేక్షణ ఉన్నా ఈ వ్యవహారం చోటుచేసుకోవటాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించి ఈ నిర్ణయం తీసుకుంది. -
సమైక్య దిగ్బంధం
=48 గంటల పాటు రహదారుల దిగ్బంధం విజయవంతం =స్తంభించిన రాకపోకలు =నిత్యావసరాలు, అంబులెన్సు,రైతులకు మినహాయింపు =రెండోరోజూ తిరుమలే శుడికి దిగ్బంధం సెగ =కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు =పలువురు నేతల అరెస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 48 గంటల రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. జిల్లా సరిహద్దుల్లో జాతీయ రహదారులపై కిలోమీటర్ల పొడవునా వాహనాలు బారులు తీరాయి. ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించింది. పార్టీ శ్రేణులు రహదారిపైనే వంటావార్పు చేపట్టాయి. సమైక్య భజనలు చేశాయి. సమైక్యాంధ్ర నినాదాలతో రహదారులు హోరెత్తాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజలు సైతం స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అత్యవసర సేవలకు, రైతుల వాహనాలకు ఆందోళనకారులు మినహాయింపు ఇచ్చి సహకరించారు. సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల రహదారుల దిగ్బంధం రెండో రోజూ విజయవంతమైంది. ఎక్కడి వా హనాలు అక్కడే నిలిచిపోయాయి. జిల్లా సరిహద్దుల్లో వాహనాలు కిలోమీటర్ల పొడవున వాహనాలు బారులు తీరాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వస్తున్న వాహనాలు గంటల తరబడి ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహం వద్ద పార్టీ నాయకులు వ ృత్తాకారంలో రోడ్డుపై బైఠాయించడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు బస్సులు దిగి నడుచుకుంటూ వచ్చారు. శ్రీకాళహస్తిలో ఏపీ సీడ్స్ సర్కిల్ నుంచి నె ల్లూరు జిల్లా వైపు నాలుగు కిలోమీటర్ల మేర వా హనాలు నిలిచిపోయాయి. తిరుపతి రోడ్డులో ల్యాంకో ఫ్యాక్టరీ వరకు మరో నాలుగు కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. సమైక్యాం ధ్రను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు కూ డా సహకరించారు. తిరుమలేశుడికి రెండోరోజూ దిగ్బంధం సెగ రహదారుల దిగ్బంధంతో రెండోరోజూ తిరుమలేశుడికి సెగ తప్పలేదు. తిరుమలకు వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. గురువారం నేత్రదర్శన సేవలో తమిళనాడు వాసులు ఎక్కువగా పాల్గొంటారు. నగరిలో రోడ్లను దిగ్బం ధించడంతో చెన్నై నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. తమిళనాడు సరిహద్దు ప్రాంతాల వర కు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికు లు రోడ్డు పక్కనే వంటావార్పు చేసుకున్నారు. వేలూరు నుంచి చిత్తూరు మీదుగా తిరుపతి చేరుకునే భక్తులూ రాలేకపోయారు. కుప్పం, మదనపల్లె, పీలేరు మీదుగా చింతామణి, బెంగళూరు లాంటి ప్రాంతాల నుంచి కర్ణాటక భక్తు లు రాలేదు. పలమనేరు, మదనపల్లె ప్రాం తా ల నుంచి తిరుపతికి వచ్చే రైతుల వాహనాలకు, అంబులెన్స్‌లకు మినహాయింపు ఇచ్చారు. పలువురు వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టు తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహం వద్ద రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు వరప్రసాదరావు, నగర కన్వీనరు పాలగిరి ప్రతాపరెడ్డి, స్థానిక నాయకుడు దొడ్డారెడ్డి సిద్దారెడ్డిని ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలంటూ పార్టీ నాయకుడు ఎస్కే.బా బు నాయకత్వంలో 200 మందికి పైగా కార్యకర్తలు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అరగంట తర్వాత నాయకులను విడుదల చేశారు. చిత్తూరులో చెన్నై-బెంగళూరు రహదారిని దిగ్బంధించిన పార్టీ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ , మైనారిటీ నాయకుడు సయ్యద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరులో ధర్నాలు, రాస్తారోకోలు, నాలుగు వేల నల్లజెం డాలు, వంద మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి నాయకత్వంలో రహదారులను దిగ్బంధిం చారు. వంద ఆకారంలో కూర్చొని నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో ఏపీ సీడ్స్ సర్కిల్ వద్ద పార్టీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి నాయకత్వంలో ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నాయకులు గుమ్మడి బాలకృష్ణయ్య, మిద్దెల హరి, కొట్టెడి మధుసూదన్, లోకేష్ పాల్గొన్నారు. నగరిలో పార్టీ సమన్వయకర్త ఆర్కే.రోజా ఆధ్వర్యంలో పుత్తూరు-నారాయణవనం రోడ్డును దిగ్బంధించారు. పార్టీ జి ల్లా కన్వీనర్ నారాయణస్వామి, లక్ష్మీపతి రాజు పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో నా రాయణవనం, పిచ్చాటూరు, కేవీబీపురం, వరదయ్యపాళె ం మండలాల్లో పార్టీ సమన్వయకర్త ఆదిమూలం నేతృత్వంలో రహదారులను దిగ్బంధించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి-చిత్తూరు రోడ్డులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో గుమ్మడికాయలకు విభజన ద్రోహుల బొమ్మలను అతికించి, ఉట్లోత్సవం నిర్వహించారు. రంగునీళ్లు చల్లుకుంటూ రహదారులను దిగ్బంధించారు. పీలేరు నియోజకవర్గ సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి పీలేరు-తిరుపతి రోడ్డుపై బైఠాయించారు. పల్లె సర్వీసు బస్సులను మినహాయించి మిగతా వా హనాలను అడ్డుకున్నారు. పుంగనూరులో మా జీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు బెంగళూరు, ఎంబీటీ, తిరుపతి, చింతామణి రోడ్లను దిగ్బంధించారు. పార్టీ నాయకు లు రెడ్డెప్ప, నాగరాజరెడ్డి, భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో చెట్లను నరికి రోడ్లపై వేశారు. ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. మదనపల్లెలోని మ ద్రాసు-బాంబే ట్రంక్ రోడ్డుపై మైనారిటీ నా యకుడు అక్తర్ అహ్మద్, ఎమ్మెల్సీ తిప్పారెడ్డి నేతృత్వంలో అమ్మచెరువు మిట్ట వద్ద వంటావార్పు నిర్వహించారు. కర్ణాటక సరిహద్దులోని చిత్తిలి గ్రామం వద్ద బెంగళూరు రహదారిలో పార్టీ సమన్వయకర్త షమీమ్ అస్లాం బైఠాయిం చారు. తిరుపతి రోడ్డులో మైనారిటీ నాయకుడు బాబ్జాన్ బైఠాయించి, వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వీరి కార్యక్రమాలను భగ్నం చేశారు. తంబళ్లపల్లె-ములకలచెరువు రోడ్డులో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సూచనల మేరకు పార్టీ కార్యకర్తలు రోడ్డును దిగ్బంధించారు. అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కుప్పం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి నాయకత్వంలో శాంతిపురం వద్ద రహదారిని దిగ్బంధించారు. కుప్పం, రామకుప్పంలో రోడ్ల ను దిగ్బంధించారు. పూతలపట్టులో జిల్లా అధికార ప్రతినిధి తలపులపల్లి బాబురెడ్డి నాయకత్వంలో రంగంపేట క్రాస్ వద్ద రోడ్డు దిగ్బంధం చేశారు. పార్టీ సమన్వయకర్తలు సునీల్‌కుమార్, పూర్ణం, రవిప్రసాద్, మండల కన్వీనర్ రాజరత్నంరెడ్డి పాల్గొన్నారు.