శంఖారావం సభకు తరలిరండి | Move to Jagan's Samaikya Sankharavam meeting | Sakshi
Sakshi News home page

శంఖారావం సభకు తరలిరండి

Published Thu, Oct 24 2013 2:52 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో ఈ నెల 26న వైఎస్సార్‌సీపీ తలపెట్టిన సమైక్య శంఖారావాన్ని విజయవంతం చేసేందుకు...

విశాఖపట్నం, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో ఈ నెల 26న వైఎస్సార్‌సీపీ తలపెట్టిన సమైక్య శంఖారావాన్ని విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. పార్టీలకతీతంగా నిర్వహించనున్న ఈ సభకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఈ సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్తున్నట్టు పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. పార్టీ రూరల్ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావుతో కలిసి పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ నెల 25న సాయంత్రం విశాఖ నుంచి రెండు రైళ్లు, వంద బస్సులు, వంద కార్లలో తరలి వె ళ్తున్నట్టు ఆయన తెలిపారు. మరికొంతమంది స్వచ్ఛందంగా బయల్దేరుతున్నట్టు చెప్పారు. సమైక్య  శంఖారావం సభకు జిల్లాలో ప్రతి నియోజక వర్గం నుంచి 5 వేల మందికి పైగా సమైక్యవాదులు తరలి వెళ్తున్నట్టు తెలిపారు. ఈ సభకు జిల్లా నుంచి పార్టీ కార్యకర్తలే కాకుండా, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో బయల్దేరుతున్నారన్నారు. ఈ సమావేశంలో ప్రచార కమిటీ కన్వీనర్ జి.రవిరెడ్డి, శంఖారావం విశాఖ పార్లమెంటరీ నియోజక వర్గ కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కంపా హనోకు, బీసీ సెల్ కన్వీనర్ పక్కి దివాకర్, ఐటీ కన్వీనర్ మధుసంపతి పాల్గొన్నారు.

బైక్ ర్యాలీ వాయిదా : సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ ఆధ్వర్యంలో నగరంలో గురువారం నిర్వహించనున్న బైక్ ర్యాలీని భారీ వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. వర్షాలు తగ్గిన వెంటనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement