సాక్షి, విశాఖపట్నం: ఆర్టీసీ పరిస్థితి ‘పుండుమీద కారం చల్లడం’ అన్నట్లుంది. ఇప్పటికే నష్టాలతో నడుస్తున్న సంస్థకు సమైక్యాంధ్ర సెగ గుదిబండలా మారింది. సమ్మె కారణంగా విశాఖ రీజియన్లో 1060 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 550 మంది ఉద్యోగులు ఉద్యమంలో ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర 13 జిల్లాల్లోని123 డిపోల్లో సుమా రు 70 వేల మంది ఉద్యోగులకు ఇక్కట్లు తప్పవంటున్నారు. ఆర్టీసీ ఆస్తుల్లో అధిక భాగంతోపాటు ప్రధాన వనరులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి.
రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు మిగి లేది ఏమీ ఉండదని పేర్కొంటూ ఆర్టీసీలోని నాలుగు ప్రధాన సంఘాలు ఉద్యమిస్తున్నా యి. ఆగస్టులో ఉద్యోగులు 12 రోజులు సమ్మె చేశారు. ఆ తర్వాత విధులు బహిష్కరించారు. అంటే దాదాపు 41 రోజులుగా సమ్మె కొనసాగుతోంది. దీంతో ఇప్పటి వరకు జీతాల్లేవు. వేతనాల రూపంలో వీరికి నెలకు రూ.7.5 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో తమ ఉద్యోగులకు జీతం స్థానంలో కనీసం అడ్వాన్స్‌లైనా చెల్లించాలని ఆర్టీసీ సంఘాలు ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీఐ, కెనరా బ్యాంకుల వంటి వాటిని కోరుతున్నారు.
ఏం చేయాలి?
లీటర్ డీజిల్‌పై రూపాయి పెరిగితే దాదాపు రూ.70 కోట్ల అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఆర్టీసీ రూ.6200 కోట్ల అప్పులున్నా యి. రెండుసార్లు టికెట్ ధరలు పెంచడంతో 23 జిల్లాల్లో 1.5 కోట్ల ప్రయాణికులపై ప్రభా వం పడింది. ఈ నేపథ్యంలో విశాఖ పరిధిలో నిత్యం 5 లక్షల మంది ఆర్టీసీ సేవల్ని పొందుతున్నారు. అంతా ప్రత్యామ్నాయాల్ని ఎంచుకుంటున్నారు. ఉద్యోగులు సమ్మె చేయకపోయి నా ఇప్పట్లో ఆర్టీసీ కోలుకునే పరిస్థితిలో లేదు. దీంతో అన్ని విభాగాల మాదిరి ఆర్టీసీని కూడా ప్రభుత్వం తనలో కలిపేసుకుంటేనే భారం తగ్గుతుందని సిబ్బంది చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన కీలక సమావేశం లో మంత్రి బొత్స సత్యనారాయణ,ఎండీ ఎ.కె. ఖాన్‌లకు ఉద్యోగ సంఘాలు మొరపెట్టుకున్నాయి. జీతాలు ఇవ్వాలన్నా, అప్పులు తీర్చాలన్నా ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థగా మారి తే నే ఇక్కట్లు తీరుతాయని సిబ్బంది చెబుతున్నా రు.ఎన్నికష్టాలెదురైనా విభజనకు అంగీకరించే ది లేదని కార్మికసంఘాలు స్పష్టంచేస్తున్నాయి.
సమ్మె కొనసాగిస్తాం
ప్రజల శ్రేయస్సు దృష్ట్యా జీతాలు వదులుకునేందుకు సిద్ధమయ్యాం. ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థ చేస్తేనే సిబ్బందికి మనుగడ ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. ఆదివారం కూడా క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఆనం రామనారాయణ, కొండ్రు మురళీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించాం. ఏపీఎన్‌జీఓలతో కలిపి 1.25 లక్షల మందిని ఆదుకోవాలని కోరాం. దీనిపై స్పందించిన సభ్యులు ప్రత్యేక నోట్ పంపాలని కోరారు. సీఎం దృష్టికి సమస్య తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.
- పలిశెట్టి దామోదరరావు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి
కష్టాల సుడిలో ఆర్టీసీ!
Published Mon, Sep 23 2013 3:04 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement
Advertisement