తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అండదండలతోనే రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు సోనియాగాంధీ కుట్రపన్నుతున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతి తుడా సర్కిల్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నాయకులు చేస్తున్న రిలే దీక్షలకు శనివారం పార్టీ నాయకులు ఆదం రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆటోనగర్‌నాయకులు శనివారం మద్దతు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి శిబిరం వద్దకు విచ్చేసి వారికి పూల మాలలు వేసి దీక్షలో పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఆజ్యం పోశారన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కు రాజకీయాలకు సీమాం ధ్రులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా మనే వెన్నుపోటు పోడిచి చంద్రబాబు పదవిలోకి వచ్చారని, నమ్మినవారిని నట్టేట ముంచడం ఆయన నైజంగా మారిందని విమర్శించారు. ఎక్కడ ఆంటోనీ కమిటీ సీమాంధ్రులకు అనుకూలంగా నివేదిక ఇస్తుందేమోనని అర్ధాంతరంగా బస్సు యాత్రను ప క్కనపెట్టి ఢిల్లీకి పరుగులు తీశారన్నారు.
దీనికి తోడు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను అడ్డుకునేందుకు సోనియా కాళ్లను పట్టుకునేందుకు వెళ్లారని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వస్తున్నాడంటే కిరణ్, చంద్రబాబుకు గుండెల్లో దడ మొదలవుతుందన్నారు. రా ష్ట్రాన్ని ముక్కలు చేసే హక్కు సోనియాకు లేదన్నా రు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రకు తాగునీరు, సాగునీరు, విద్యుత్ లేక ఏడారిగా మారే పరిస్థితి దాపురించిదన్నారు. విద్యార్థుకూ నిరాశే ఎదరవుతుందనని తెలిపారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చేతులకు గాజులు తొడుక్కొని ఆడంగుల్లా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు.
నిజంగా సీమాంధ్ర ప్ర జలపై మమకారం ఉంటే వెంటనే పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. 45 రోజులుగా సమైక్యం కోసం అలుపెరగని ఉద్యమం చేస్తున్నది ఒక్క వైఎస్సార్‌సీపీయేనని ఆ యన గుర్తుచేశారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, పాలగిరి ప్రతాప్‌రెడ్డి, ఎస్‌కె.బాబు, కుప్పయ్య, చల్లా, కిట్టు, శంకర్, కైలాసం, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, మాదవనాయుడు, చెంచుయాదవ్, గోపీయాదవ్, తిమ్మారెడ్డి, హర్ష, పుణీత, శారద, మునీశ్వరి, లక్ష్మి పాల్గొన్నారు.
బాబు అండదండలతోనే విభజన కుట్ర
Published Sun, Sep 15 2013 4:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement