
సాక్షి, తిరుపతి : ప్రజల డబ్బు దోచుకున్న చంద్రబాబు.. ఆ డబ్బునంతా తన కొడుకు అకౌంట్‌లో వేసుకుని నికృష్టంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటుడు మోహన్‌బాబు అన్నారు. చంద్రబాబు మోసగాడు కాబట్టే తెలుగుదేశం పార్టీ ఇకపై కనుమరుగువుతందని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తరపున మోహన్‌బాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుచానూరు బహిరంగ సభలో మాట్లాడుతూ.. తాను దాదాపు తొమ్మిది జిల్లాల్లో ప్రచారం చేశానని.. ఇందులో భాగంగా వైఎస్సార్ సీపీకి 130 సీట్లు వస్తాయనే విషయాన్ని గమనించారన్నారు. కాబోయే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని.. ఆయన అధికారం చేపట్టగానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా మంచివారని.. కాబట్టి ఫ్యాను గుర్తుకు ఓటువేసి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని మోహన్‌బాబు ప్రజలను కోరారు.
అందుకు నేను హామీ ఇస్తున్నా..
‘ చంద్రబాబు రోజుకో పార్టీతో సంసారం చేస్తారు. వెనువెంటనే విడాకులు ఇస్తారు. చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి రాత్రి రాత్రే తెలంగాణ నుంచి పారిపోయి వచ్చారు. ఆయనో అక్కుపక్షి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇందుకు పూర్తి భిన్నం. ఆయన జటాయువు లాంటివారు. తాను ప్రకటించిన మేనిఫెస్టోను వైఎస్ జగన్ తప్పకుండా అమలు చేస్తారు. అందుకు నేను హామీ ఇస్తున్నా’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment