
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాజకీయ సంస్కారం లేదని, కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మామకే ఆయన వెన్నుపోటు పొడిచి.. టీడీపీని లాక్కున్నారని ప్రముఖ సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు మోహన్‌బాబు అన్నారు. వైఎస్సార్‌సీపీ విజయం కోరుతూ విజయవాడలో ఆయన ఆదివారం రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. రామ్‌గోపాల్‌వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా చూస్తే చంద్రబాబు అసలు స్వరూపం బయటపడుతుందన్నారు. మాట తప్పని వ్యక్తి వైఎస్ జగన్ అని, ఆయనను ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు. చంద్రబాబు కులాలు, మతాలు అంటూ విడగోడతారని, దీనిని ప్రజలంతా గమనించి వైఎస్ జగన్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.