జిల్లా వాసులపై మృత్యువు విలయతాండవం చేసింది. ఒకే రోజు 11మందిని బలితీసుకుంది. బాలుడి పుట్టువెంట్రుకలు సమర్పించేందుకు శ్రీవారి సన్నిధికి కుటుంబమంతా కలిసి కారులో వెళ్తుండగా లారీ రూపంలో కబళించింది. శనివారం తిరుపతి సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. కొల్లూరు మండలం చిలుమూరు లంక వద్ద కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నీట మునిగి ప్రాణాలు విడిచారు.
ఈ రెండు ఘటనలు జిల్లాలో తీవ్ర విషాదం నింపాయి.
విధి వారిని వెక్కిరించింది. దైవదర్శనానికి కారులో వెళుతుండగా కంటైనర్ రూపంలో వుృత్యువు కోరలు చాచింది. ఆరుగురి ప్రాణాలను బలిగొంది. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం సీతారాంపేట వద్ద నెత్తురోడిన రోడ్డు, మాంసపు ముద్దలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు స్థానికులను కలచివేసింది. వుృతులంతా గుంటూరు జిల్లా వాసులు. కాగా వారిలో వుుగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. శనివారం తెల్లవారుతుండగా చోటుచేసుకున్న మృత్యుఘోషతో తీవ్రవిషాదం నెలకొంది.
మరో తొమ్మిది రోజుల్లో ఇంటర్ పరీక్షలు.. అవి పూర్తికాగానే బిడ్డల ఉన్నత భవిష్యత్ కోసం ఏంచేయాలన్న ఆలోచనలతో తలమునకలౌతున్న తల్లిదండ్రులు.. ఇంతలోనే పిడుగులాంటి వార్త వారి గుండెలను చిదిమేసింది. ఏ జరిగిందోనన్న ఆత్రుత...దేవుడా బిడ్డ క్షేమంగా ఉండాలంటూ ఇష్టదైవాన్ని ప్రార్ధిస్తూ కన్నీటి పర్యంతమైన వారికి చివరికి కడుపుకోతే మిగిలింది. ఒకే కళాశాలలో చదువుతున్న ఐదుగురు మిత్రులూ ఒకే సారి మృత్యువాత పడటంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన శనివారం కొల్లూరు మండలం చిలుమూరు లంకలో చోటు చేసుకుంది.
మృత్యుఘోష
Published Sun, Mar 1 2015 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM
Advertisement
Advertisement