
సాక్షి, తిరుపతి : నగరంలో విషాధం చోటుచేసుకుంది. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఓ తల్లి ఆసుపత్రి ఆవరణంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన గంగాధర్ టీటీడీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా గత కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న గంగాధర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
దీంతో అతన్ని రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన గంగాధర్ తల్లి కుమారి రుయా ఆసుపత్రి ఆవరణంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వామపక్షాలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రుయా ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment