
సాక్షి, తిరుపతి : ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేయడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతి తనకు న్యాయం చేయాలంటూ అక్కడే నిద్రమాత్రలు మింగింది. దాంతో కార్యాలయం ఎదుట టెన్షన్ పూరిత వాతావరణం నెలకొంది.
తిరుపతిలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో బాధితురాలను హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌ఎమ్‌ఆర్ గోదావరి డెవలపర్స్‌లో పనిచేస్తున్న విజయ్ కుమార్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను మోసం చేశాడు. అయితే, దీనిపై ఆమె తిరుచానురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం కావాలంటూ ఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చి ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment