cheeting case
-
కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిలిచిన యాంకర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీకపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. భూమి వివాదాన్ని సెటిల్ చేస్తా అంటూ కార్తీకతో పాటు ఆమె అనుచరులు కోటి రూపాయల మోసానికి పాల్పడ్డట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అమీన్పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఓ ప్రైవేట్ కంపెనీకి ఇప్పించేందుకు కార్తీక మధ్యవర్తిత్వం వహించినట్లు బాధితుడు తెలిపారు. తన దగ్గర నుంచి కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. కాగా లండన్‌లో ఆర్కిటెక్చర్ విద్యనభ్యసించిన కత్తి కార్తీక తెలంగాణ ప్రభుత్వంలో పలు ప్రాజెక్టులను సైతం దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె దుబ్బాక ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కేసు వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రఘురామకృష్ణంరాజు: సోదాలపై సీబీఐ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులను మోసగించిన వ్యవహారంపై ఎంపీ రఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలపై గురువారం సీబీఐ మీడియాకు ప్రెస్‌నోట్ విడుదల చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొంది. రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందినట్లు తెలిపింది. నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది. దీనిలో భాగంగానే హైదరాబాద్, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో గురువారం సోదాలు నిర్వహించింది. కంపెనీ కార్యాలయాలు, యజమాని నివాసాలు, ఇతర ప్రదేశాలపై సోదాలు జరిపినట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. (రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు) -
రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు
సాక్షి, హైదరాబాద్ : నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై కేంద్ర దర్యాప్త సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. బ్యాంక్ లోన్ బకాయిలపై కేసు నమోదు చేసిన సీబీఐ గురువారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈనెల 6న హైదరాబాద్, ముంబై సహా 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. రఘురామకృష్ణంరాజు సహా 9 మందిపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టారు. ఇండ్-భారత్ కంపెనీతో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు చేసింది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు సోదాలు కొనసాగాయి. ఈ దాడుల్లో పలు కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఏప్రిల్ 30న బ్యాంక్ లోన్ బకాయిలు పడిన కేసులో సైతం హైదరాబాద్, భీమవరంలోని రఘురామకృష్ణంరాజు కంపెనీల్లో సోదాలు చేపట్టారు. వివిధ ప్రాజెక్ట్‌లకు సంబంధించి రూ.600 కోట్ల మేర ఆయన రుణాలు తీసుకున్నారు. ఇక ఇండ్-భారత్ పవర్ లిమిటెడ్‌కు సంబంధించి రూ.947 కోట్ల మేర బ్యాంకులకు రుణాలు ఎగ్గవేయగా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్ల నుంచి రూ.2655 కోట్ల మేర రఘురామకృష్ణంరాజు లోన్ తీసుకున్నారు. ఈ సోదాల్లో 11 నుంచి 14 సీబీఐ బృందాలు పాల్గొన్నట్టు సమాచారం. బ్యాంకులకు ఎగవేతపై రఘురామకృష్ణంపై సీబీఐ దాడులు ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా సీబీఐ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించింది. -
ప్రేమ పేరుతో వంచన
తెనాలి రూరల్: ప్రేమ పేరుతో మైనర్ బాలికకు దగ్గరైన యువకుడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చిన సంగతి తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికను విచారించగా, దూరపు బంధువైన యువకుడు కారణమని తెలిసింది. పెద్దలకు విషయం తెలుపగా, సదరు యువకుడు పెళ్లికి నిరాకరించాడు. దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి యడ్ల లింగయ్య కాలనీకి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక తల్లిదండ్రులతో కలసి కూలి పనులకు వెళుతుంటుంది. వారికి దూరపు బంధువైన యువకుడు తలవరస విజయబాబు కూడా పనులకు వెళుతూ బాలికతో స్నేహం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటూ దగ్గరయ్యాడు. పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చిన సంగతి తల్లిదండ్రులు శుక్రవారం గుర్తించారు. విచారించగా, విజయబాబు కారణమని తెలిసింది. దీంతో బాలికను వివాహం చేసుకోవాలని పెద్దల సమక్షంలో యువకుడిని అడగ్గా, అతను నిరాకరించాడు. మోసపోయిన బాలిక తల్లిదండ్రులతో కలసి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై ఫోక్సో, అత్యాచారం సెక్షన్ల కింద త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
సౌదీ కరెన్సీ పేరుతో.. సబ్బుబిళ్లలు
రాంగోపాల్‌పేట్ : విదేశీ కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలపై నలుగురు బాధితులు రెండు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పాతబస్తీ సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు అదే ప్రాంతానికి చెందిన కిరాణా షాపు యజమానిని పరిచయం చేసుకుని తమ వద్ద సౌదీ కరెన్సీ ఉందని దానిని మార్చుకుంటే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని చెప్పి ఓ నోటు ఇచ్చారు. సదరు వ్యక్తి ఈ నోటు మార్చుకోగా రూ.2వేలు వచ్చాయి. ఈ విషయాన్ని చికెన్ షాప్‌లో పనిచేసే తన స్నేహితుడైన అజీజ్‌కు చెప్పడంతో అతను తన యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అతను ఈ నెల 13న అజీజ్‌కు రూ.2లక్షలు ఇచ్చి మార్చుకుని రమ్మని చెప్పాడు. దీంతో అజీజ్ ఆర్పీరోడ్‌కు వెళ్లి ముఠా సభ్యులకు రూ.2 లక్షలు ఇవ్వడంతో వారు ఒక ప్యాకెట్‌ను అజీజ్‌కు అందజేశారు. ఆ తర్వాత అతను షాప్‌నకు వచ్చి చూడగా అందులో సబ్బు బిళ్లలు కనిపించడంతో మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో మరో ముగ్గురిని మోసం చేయడంతో బాధితులు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేట్టారు. -
సింధు మీనన్‌పై చీటింగ్ కేసు
సాక్షి, బెంగళూరు: ‘చందమామ’ ఫేం, హీరోయిన్ సింధు మీనన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. నకిలీ పత్రాలు సమర్పించి రుణం పొందడంతో పాటు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు సింధు మీనన్‌తో పాటు ఆమె ముగ్గురు సోదరులపై బెంగళూరు ఆర్ఎంసీ యార్డ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జ్యుబిలెంట్ మోటార్స్ వక్ఫ్ ప్రై.లి. సంస్థ పేరుతో ఆర్ఎంసీ యార్డ్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి మీనన్ రూ.36 లక్షలు రుణం తీసుకున్నారు. ఆమె రుణం కోసం సమర్పించిన పత్రాలు నకిలీవని గుర్తించిన బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీనన్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినా.. ఆమె విదేశాల్లో ఉండటంతో వీలుకాలేదు. మీనన్ సోదరుడు కార్తికేయన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్రేమించిన యువకుడు మోసం చేయడంతో..
-
ప్రేమ.. మోసం.. ఎస్పీ ఆఫీసులో నిద్రమాత్రలు మింగి..
సాక్షి, తిరుపతి : ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేయడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతి తనకు న్యాయం చేయాలంటూ అక్కడే నిద్రమాత్రలు మింగింది. దాంతో కార్యాలయం ఎదుట టెన్షన్ పూరిత వాతావరణం నెలకొంది. తిరుపతిలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో బాధితురాలను హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఎమ్ఆర్ గోదావరి డెవలపర్స్‌లో పనిచేస్తున్న విజయ్ కుమార్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను మోసం చేశాడు. అయితే, దీనిపై ఆమె తిరుచానురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం కావాలంటూ ఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చి ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది. -
ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. లక్షల్లో టోకరా
సాక్షి, నాగోలు: ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. లక్షల్లో నగదు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..గౌరీశంకర్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోర్టు, పలు ప్రభుత్వ కార్యాలయాలలో అటెండర్, ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తానని హస్తినాపురం సెంట్రల్ ఇంద్రప్రస్త కాలనీకి చెందిన జి.చంద్రమోహన్‌తో పాటు మరికొంత మందిని నమ్మించి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. ఉద్యోగం ఇప్పించక పోగా తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు చంద్రమోహన్, సందీప్, హరినాథ్, ఉమామహేందర్, రవికిరణ్, వినోద్‌గౌడ్, సరిత, భవాని, శ్రీనివాస్, శివ, సత్యనారాయణతో పాటు మరికొంత మంది కలిసి ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో గౌరీశంకర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గౌరీశంకర్ సుమారు రూ. 25 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
పక్కా ప్లాన్‌తో..
సాక్షి, కామారెడ్డి: ‘‘దశాబ్ద కాలంగా చిట్టీలు వేస్తున్నాడు.. నమ్మకంగా డబ్బులిస్తున్నాడు.. అతడిని నమ్మి ఫైనాన్స్‌లో పెట్టుబడులు పెట్టాం.. ఇలా ముంచి పారిపోతాడనుకోలేదు’’ అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని రాంమందిర్ రోడ్డులో ఫైనాన్స్ నిర్వహిస్తూ ఇటీవల పారిపోయిన వ్యాపారికి సంబంధించి సోమవారం ‘సాక్షి’లో ‘నట్టేట ముం చేశాడు’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.. ఇది జిల్లాలో సంచలనం సృష్టించింది. విషయం తెలుసుకున్నవారు సదరు వ్యాపారి నిర్వహించిన ఫైనాన్స్‌ల వద్దకు పరుగులు తీశారు. సదరు వ్యాపారి తమతో ఎంతో నమ్మకంగా మెలిగాడని, ఇంత దగా చేస్తాడని అనుకోలేదని ఓ బాధితుడు ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశాడు. ఖరీదైన భవనం.. ఫైనాన్స్‌లో ఉండే డబ్బంతా తన సొంతమే అన్నట్టుగా వ్యవహరించిన సదరు వ్యాపారి.. ఇటీవలే ఖరీదైన భవనం నిర్మించుకున్నాడు. పట్టణంలోని జ్ఞానదీప్ కాలేజీ రోడ్డులో రూ. 16 వేలకు గజం చొప్పున దా దాపు 160 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి, ఆధునిక హంగులతో ఇల్లు కట్టుకున్నాడు. ఇటీవలే గృహప్రవేశం కూడా చేశాడు. ప్రస్తుతం ఇంటి విలువ రూ.70 లక్షల దాకా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇంటిపై కూడా బ్యాం కులో హౌసింగ్ లోన్ తీసుకున్నట్టు సమాచారం. అయితే ఇంటి నిర్మాణానికి వెచ్చించిన డబ్బులు, సొంత అవసరాలకు వాడుకున్న డబ్బులు పెద్ద మొత్తంలో ఉండడంతో డబ్బులను సర్దుబాటు చేయడం ఇబ్బందికరంగా మారడంతోనే పారిపోయేందుకు సిద్ధమై ఉంటాడని పలువురు భావిస్తున్నారు. అందులో భాగంగానే తాను పారిపోయే రోజు వర కు కూడా ఎవరికీ అను మానం రానీయకుం డా మెదిలాడని తెలుస్తోంది. కొత్తగా ఫైనాన్స్‌ల్లో భాగ స్వామ్యం కల్పిస్తానని కొందరి వద్ద డబ్బులు కూడా తీసు కుని వెళ్లినట్టు సమాచారం. అంతటా అదే చర్చ.. కామారెడ్డి పట్టణంలో ఫైనాన్స్ వ్యాపారి పరారీకి సంబంధించిన విషయం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో చాలా మందికి తెలిసింది. కొందరు వ్యాపార భాగస్వాములకు కూడా ఆయన పరారీ సంఘటన తెలియలేదు. మూడు రోజులుగా కనిపించకపోవడంతో ఎటైనా ఊరికి వెళ్లొచ్చని భావించారు. అయితే ఫోన్లు మొత్తం స్విచ్ఆఫ్ చేసి ఉండడం, ఇంటికి, ఫైనాన్స్‌కు తాళాలేసి ఉండడంతో వారు కంగుతిన్నారు. ఈ విషయం ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో అంతటా చర్చ మొదలైంది. ఎవరెవరు ఎంతెంత మోసపోయారో లెక్కలు కట్టుకుంటున్నారు. వ్యాపారి మోసంపై చర్చ జరుగుతోంది. పథకం ప్రకారమే.. ఫైనాన్షియర్ పారిపోయిన తర్వాత మకాం పెట్టేందుకుగాను ముందుగానే ఓ పట్టణంలో ఇళ్లు మా ట్లాడుకున్నట్టు తెలుస్తోంది. వెళ్లేముందు కామారెడ్డి పట్టణంలో ఓ సూపర్‌మార్కెట్‌కు వెళ్లి రెండు మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశాడని తెలిసినవారు చెబుతున్నారు. అలాగే బియ్యం షాపునకు వెళ్లి బియ్యం కొన్నాడని, వాటిని ఎక్కడైతే మకాం పెట్టాలనుకున్నాడో అక్కడికి తరలించాడని తెలుస్తోంది. మూడు జిల్లాలవారు.. పారిపోయిన ఫైనాన్షియర్ నిర్వహిస్తున్న ఫైనాన్స్‌లలో కా మారెడ్డితోపాటు సిరిసిల్ల, నిజా మాబాద్ జిల్లాలకు చెందిన వారు భాగస్వాములుగా ఉన్నారు. ఐదు గ్రూపుల్లో దాదాపు వంద మం ది భాగస్వాములు ఉన్నారని సమాచారం. అందులో సదరు ఫైనాన్షియర్ రక్తసంబంధీకులు, బంధువులు, స్నేహితులు కూడా ఉండడం గమనార్హం. ఓ రిటైర్డ్ టీచర్ రూ. 6 లక్షలు పెట్టినట్టు తెలుస్తోంది. ఓ చిరు వ్యాపారి తాను కష్టపడి జమ చేసుకున్న రూ.2 లక్షలు, మరో వ్యాపా రి రూ.4 లక్షలు, ఇంకో వ్యాపారి రూ. 17.50 లక్షలు, మరొకరు రూ.6.50 లక్షలు ఫైనాన్స్‌లో పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. ఇంకో వ్యాపారి రూ. 10 లక్షలు, ఓ రైతు నెల క్రితమే ఒక షేర్ కింద రూ.2 లక్షలు పెట్టారు. ఇలా దాదాపు వంద మందికిపైగా బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఫైనాన్స్‌లో భాగస్వామ్యం, చిట్టీలకు సంబంధించి దాదాపు రూ. 2.50 కోట్ల దాకా పెట్టు బడులు ఉన్నట్లు సమాచారం. -
చందనా బ్రదర్స్ చైర్మన్ అరెస్టు
హైదరాబాద్: చందనాబ్రదర్స్ చైర్మన్ రామారావు ఓ చీటింగ్ కేసులో అరెస్టు అయ్యారు. బుధవారం ఎస్సార్ నగర్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కాసుల కక్కుర్తితో తనకు తానే బెదిరింపు లేఖ రాసుకొని తాను తీసుకున్న గోతిలో ఆయనే పడ్డాడు. వివరాలు.. గ్యాంగ్‌స్టర్ నయీం పేరుతో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తనయుడు కన్నా ఫణీంద్ర తనను బెదిరిస్తున్నాడని.. చందన బ్రదర్స్ చైర్మన్ రామారావు గతంలో ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేయగా విస్మయకర విషయాలు బయటపడ్డాయి. మంత్రి కుమారుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి తనకు తానే బెదిరింపు లేఖ రాసుకొని రామారావు నాటకాలు ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పక్కా ఆధారాలతో ఆయన మీద చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళపై చీటింగ్ కేసు నమోదు
హైదరాబాద్: సౌదీ అరేబియా పంపిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిదంటూ ఓ మహిళపై బాధితుడు మంగళవారం భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎసైఐ బి. రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... ఫలక్‌నుమా నవాబ్‌సాబ్‌కుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆదిల్, షబానా (30)లు దంపతులు. కాగా షబానా గత కొన్ని నెలలుగా విదేశాలకు పంపిస్తానంటూ పలువురి వద్ద డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడుతుంది. ఈదిబజార్ కుమ్మర్వాడీ ప్రాంతానికి చెందిన మహ్మద్ జాఫర్ (27) సౌదీ అరేబియా వెళ్లేందుకు షబానాను ఆశ్రయించాడు. దీంతో షబానా గతేడాది జూలై 19వ తేదీన జాఫర్ వద్ద రూ.10 వేల నగదు, పాస్‌పోర్టు తీసుకుంది. డబ్బులు తీసుకొని విదేశాలకు పంపకుండా ఇప్పుడు అప్పుడు అంటూ రోజులు దాట వేస్తుంది. రెండుసార్లు విదేశాలకు పంపిస్తానని శంషాబాద్ అంతర్జాతీయ వినామానాశ్రయానికి పిలిపించి తిప్పి పంపిందని పేర్కొన్నాడు. షబానా చేసిన మోసంపై బాధితుడు జాఫర్ మంగళవారం భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.