హైదరాబాద్: సౌదీ అరేబియా పంపిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిదంటూ ఓ మహిళపై బాధితుడు మంగళవారం భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎసైఐ బి. రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... ఫలక్‌నుమా నవాబ్‌సాబ్‌కుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆదిల్, షబానా (30)లు దంపతులు. కాగా షబానా గత కొన్ని నెలలుగా విదేశాలకు పంపిస్తానంటూ పలువురి వద్ద డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడుతుంది.
ఈదిబజార్ కుమ్మర్‌వాడీ ప్రాంతానికి చెందిన మహ్మద్ జాఫర్ (27) సౌదీ అరేబియా వెళ్లేందుకు షబానాను ఆశ్రయించాడు. దీంతో షబానా గతేడాది జూలై 19వ తేదీన జాఫర్ వద్ద రూ.10 వేల నగదు, పాస్‌పోర్టు తీసుకుంది. డబ్బులు తీసుకొని విదేశాలకు పంపకుండా ఇప్పుడు అప్పుడు అంటూ రోజులు దాట వేస్తుంది. రెండుసార్లు విదేశాలకు పంపిస్తానని శంషాబాద్ అంతర్జాతీయ వినామానాశ్రయానికి పిలిపించి తిప్పి పంపిందని పేర్కొన్నాడు. షబానా చేసిన మోసంపై బాధితుడు జాఫర్ మంగళవారం భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళపై చీటింగ్ కేసు నమోదు
Published Tue, Sep 15 2015 9:53 PM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM
Advertisement
Advertisement