
సింధు మీనన్
సాక్షి, బెంగళూరు: ‘చందమామ’ ఫేం, హీరోయిన్ సింధు మీనన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. నకిలీ పత్రాలు సమర్పించి రుణం పొందడంతో పాటు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు సింధు మీనన్‌తో పాటు ఆమె ముగ్గురు సోదరులపై బెంగళూరు ఆర్‌ఎంసీ యార్డ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
జ్యుబిలెంట్ మోటార్స్ వక్ఫ్ ప్రై.లి. సంస్థ పేరుతో ఆర్‌ఎంసీ యార్డ్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి మీనన్ రూ.36 లక్షలు రుణం తీసుకున్నారు. ఆమె రుణం కోసం సమర్పించిన పత్రాలు నకిలీవని గుర్తించిన బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీనన్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినా.. ఆమె విదేశాల్లో ఉండటంతో వీలుకాలేదు. మీనన్ సోదరుడు కార్తికేయన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment