Sindhu Menon
-
ఈ టాప్ హీరోయిన్ను గుర్తుపట్టారా? తెలుగులో అదే చివరి చిత్రం!
హీరోల కెరీర్‌కు పెళ్లనేది అడ్డంకే కాదు. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. కొందరు పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తే మరికొందరు కాస్య గ్యాప్ ఇచ్చి రెండో ఇన్నింగ్స్ మొదలుపెడతారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ మాత్రం సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. ఇంతకీ ఆవిడెవరో గుర్తుపట్టారా? ఆమె సింధు మీనన్. కన్నడలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. బోలెడు సినిమాలు భద్రాచలం సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. త్రినేత్రం, శ్రీరామచంద్రులు, ఆడంతే అదో టైప్, ఇన్స్పెక్టర్, వైశాలి ఇలా పలు చిత్రాల్లో నటించింది. తనకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన మూవీ మాత్రం చందమామ. ఈ సినిమాలో తన అల్లరి, అందానికి జనాలు ఫిదా అయిపోయారు. ఈ సినిమా బాగానే వర్కవుట్ అయినా టాలీవుడ్లో ఎక్కువగా అవకాశాలు రాలేదు. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనే సినిమాలు చేసుకుంటూ పోయింది. 2009లో వచ్చిన సిద్ధం తర్వాత తెలుగులో మరే మూవీలోనూ కనిపించలేదు. ఈ బెంగళూరు బ్యూటీ 2010లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రభును పెళ్లాడింది. వీరికి ఇద్దరు కుమారులతోపాటు ఓ కూతురు సంతానం. పెళ్లి తర్వాత ఒకే ఒక్క సినిమాలో కనిపించి వెండితెరకు దూరమైపోయింది. వార్తల్లో.. గతంలో తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచిందీ నటి. బ్యాంకుకు నకిలీ పత్రాలు సమర్పించి రూ.36 లక్షల రుణం తీసుకోవడమే కాకుండా దాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో సింధుపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆ మధ్య అప్పుల బాధతో నటి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు రాగా అవన్నీ ఉట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. View this post on Instagram A post shared by Sindhu Menon Kathikeyan (@sindhu_menon17) చదవండి: ఇది కలకాలం ఉండాలంటూ తాప్సీ పోస్ట్.. పెళ్లి గురించేనా? -
నటి సింధూ మీనన్ సోదరుడిపై కేసు
సాక్షి, కర్ణాటక (యశవంతపుర) : నటి సింధూ మీనన్‌కు కష్టాలు వెంటాడుతున్నాయి. బ్యాంకును మోసగించారని మూడు రోజుల క్రితం నింధూపై కేసు నమోదు చేసిన ఆర్ఎంసీ యార్డు పోలీసులు తాజాగా మంగళవారం ఆమె సోదరుడు మనోజ్కార్తీపై యశ్వంతపుర పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. మనోజ్ కార్తీ, సుధా, రాజశేఖర్‌లు గణేశ్ రావు అనే వ్యక్తికి చెందిన భవనాన్ని లీజ్ తీసుకున్నారు. లీజు పత్రాలను నకిలీ సృష్టించి రుణం కోసం బ్యాంకులో తాకట్టు పెట్టాడు. విషయాన్ని గుర్తించిన భవన యజమాని గణేశ్ రావు యశ్వంతపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
సింధు మీనన్‌పై చీటింగ్ కేసు
సాక్షి, బెంగళూరు: ‘చందమామ’ ఫేం, హీరోయిన్ సింధు మీనన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. నకిలీ పత్రాలు సమర్పించి రుణం పొందడంతో పాటు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు సింధు మీనన్‌తో పాటు ఆమె ముగ్గురు సోదరులపై బెంగళూరు ఆర్ఎంసీ యార్డ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జ్యుబిలెంట్ మోటార్స్ వక్ఫ్ ప్రై.లి. సంస్థ పేరుతో ఆర్ఎంసీ యార్డ్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి మీనన్ రూ.36 లక్షలు రుణం తీసుకున్నారు. ఆమె రుణం కోసం సమర్పించిన పత్రాలు నకిలీవని గుర్తించిన బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీనన్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినా.. ఆమె విదేశాల్లో ఉండటంతో వీలుకాలేదు. మీనన్ సోదరుడు కార్తికేయన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రోడ్డుప్రమాదం.. నటి తల్లికి గాయాలు
సాక్షి, బెంగళూరు: దక్షిణాది నటి సింధుమీనన్ తల్లి శ్రీదేవి గురువారం రోడ్డుప్రమాదానికి గురయ్యారు. స్వల్పంగా గాయపడ్డ శ్రీదేవి స్థానిక రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ వివరాలిలా.. సింధుమీనన్ తల్లి శ్రీదేవి తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు బెంగళూరులోని మత్తికెరె సర్కిల్ వద్ద ఆటో ఎక్కారు. ఇంతలో ఒక క్యాబ్ వేగంగా వచ్చి ఆటోను వెనుకవైపు నుంచి ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న శ్రీదేవి కి గాయాలయ్యాయి. బాధతో విలవిల లాడుతున్న శ్రీదేవిని ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆపేసి క్యాబ్, ఆటో డ్రైవర్లు ఇద్దరు గొడవకు దిగారు. చుట్టూ ఉన్న వారు కూడా బాధితురాలికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇంతలో బాధితురాలు, సింధుమీనన్ తల్లి శ్రీదేవి ఫోన్‌చేసి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న శ్రీదేవి కుమారుడు మనోజ్ ఆమెను స్థానిక రామయ్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ఛాతి భాగంలో బలమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. -
ఆత్మహత్యాయత్నం వార్తను ఖండించిన సింధు మీనన్!
ఆత్మహత్యాయత్నం చేశానంటూ మీడియాలో వచ్చిన రూమర్లను దక్షిణాది నటి సింధూ మీనన్ ఖండించింది. అప్పుల బారి పడిన సింధూమీనన్ ఆత్మహత్యకు ప్రయత్నించారని.. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారని మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు అని సింధు మీనన్ వెల్లడించారు. ఆత్మహత్యకు సంబంధించిన వార్తలన్ని పుకార్లేనని సింధు మీనన్ తెలిపింది. తెలుగులో చందమామ, భద్రాచలం, సిద్ధం చిత్రాల్లో.. తమిళంలో కాదల్ పుక్కల్, యూత్, ఈరమ్ చిత్రాల్లో సింధు మీనన్ నటించింది. -
నటి సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం?
చందమామ, వైశాలి చిత్రాల్లో నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్న దక్షిణాది నటి సింధు మీనన్ గత రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు సమాచారం. అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రభును పెళ్లాడి బెంగుళూరులో స్థిరపడిన సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం వార్త మీడియాలో సంచలనం రేపింది. సింధు మీనన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించినట్టు వార్తలు అందుతున్నాయి. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో చేర్పించే సమయానికి ఆమె అపస్మారక స్థితిలో ఉంది అని వార్తలు వెలువడ్డాయి. తమిళంలో కాదల్ పుక్కల్, యూత్, ఈరమ్ చిత్రాల్లో సింధు మీనన్ నటించింది.