నటి సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం? | Actress Sindhu Menon has attempted suicide | Sakshi
Sakshi News home page

నటి సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం?

Published Sat, Sep 7 2013 3:02 PM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM

నటి సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం?

నటి సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం?

చందమామ, వైశాలి చిత్రాల్లో నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్న దక్షిణాది నటి సింధు మీనన్  గత రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు సమాచారం. అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రభును పెళ్లాడి బెంగుళూరులో స్థిరపడిన సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం వార్త మీడియాలో సంచలనం రేపింది. 
 
సింధు మీనన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించినట్టు వార్తలు అందుతున్నాయి. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మాహత్యాయత్నానికి  పాల్పడినట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో చేర్పించే సమయానికి ఆమె అపస్మారక స్థితిలో ఉంది అని వార్తలు వెలువడ్డాయి. తమిళంలో కాదల్ పుక్కల్, యూత్, ఈరమ్ చిత్రాల్లో సింధు మీనన్ నటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement